8వ శతాబ్దంలో, ముస్లింలు ఉత్తర ఆఫ్రికా నుండి నౌకాయానం చేసి, ఇప్పటి పోర్చుగల్ మరియు స్పెయిన్‌లను తమ ఆధీనంలోకి
తీసుకున్నారు. అరబిక్‌లో అల్-అండలస్ అని పిలువబడే ఈ ప్రాంతం విస్తరిస్తున్న
ఉమయ్యద్ సామ్రాజ్యంలో చేరి ముస్లిం పాలనలో అభివృద్ధి చెందింది. శతాబ్దాలుగా, అల్-అండలస్ ప్రాంతాన్ని మూర్స్ అని పిలువబడే అరబిక్
మాట్లాడే ముస్లింలు పాలించారు.
711లో తారిక్ ఇబ్న్-జియాద్ నేతృత్వంలోని అరబ్ మరియు
అమాజిగ్ సైన్యం ఉత్తర ఆఫ్రికా నుండి జిబ్రాల్టర్ జలసంధిని దాటి ఐబీరియన్
ద్వీపకల్పం యొక్క దక్షిణ భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నప్పుడు జరిగిన మొదటి
విజయం తర్వాత, ముస్లింలు చాలా ప్రాంతాన్ని
జయించగలిగారు. ముస్లింలు ఇప్పుడు పోర్చుగల్ మరియు స్పెయిన్‌గా ఉన్న వాటిలో ఎక్కువ
భాగాన్ని కొన్ని సంవత్సరాలలోనే నియంత్రించగలిగారు.
10వ శతాబ్దం నాటికి, ఐబీరియన్ ద్వీపకల్పంలోని సగం జనాభా ముస్లింలు
అని పరిశోధన సూచించింది.
13వ శతాబ్దంలో ముగిసిన క్రూసేడర్ల సహాయంతో
క్రైస్తవ పాలకులు ఈ అల్-అండలస్ భూభాగాన్ని
విజయవంతంగా "తిరిగి స్వాధీనం చేసుకోవడంreconquest” " జరిగింది."జనాభాలో ఎక్కువ భాగం ఇస్లాం
మతంలోకి మారారు"
15వ మరియు 16వ శతాబ్దాలలో, పోర్చుగీస్ రాజులు ఉత్తర ఆఫ్రికాలోకి
విస్తరించడం కొనసాగించారు, అక్కడ వారు సైనిక స్థావరాలను
స్థాపించి యుద్ధంలో పాల్గొన్నారు. 1578లో మొరాకో పట్టణం క్సార్ ఎల్-కెబిర్ (పోర్చుగీస్‌లో అల్కాసర్ క్విబిర్ అని పిలుస్తారు)లో పోర్చుగీస్
ఘోరమైన ఓటమి వరకు ఇది కొనసాగింది, ఇది ఉత్తర ఆఫ్రికాలో
పోర్చుగల్ విస్తరణ ఆశయాలను అంతం చేసింది.
"మూర్" అనే పదాన్ని సాంప్రదాయకంగా
ఉత్తర ఆఫ్రికాలో అరబిక్ మాట్లాడే ముస్లింలను సూచిస్తున్నప్పటికీ, మూర్ అనే పదం తరచుగా ముస్లింలను విస్తృతంగా
సూచించడానికి ఉపయోగించబడింది.
1249లో, పోర్చుగల్ రాజు అఫోన్సో III అల్గార్వేలోని చివరి ముస్లిం
కోట అయిన ఫారోను స్వాధీనం చేసుకున్నాడు. అక్కడ చాలా మంది ముస్లింలు చంపబడ్డారు, ముస్లింల నియంత్రణలో ఉన్న భూభాగానికి పారిపోయారు
లేదా క్రైస్తవ మతంలోకి మారారు లేదా ముస్లిములను వేరుచేయబడిన segregated పరిసరాల్లో ఉండటానికి
అనుమతించారు.
.1496లో, రాజు మాన్యుయెల్I అందరు యూదులు మరియు ముస్లింలను బహిష్కరించాలని
నిర్ణయించుకున్నాడు, రాజ్యాన్ని ప్రత్యేకంగా
క్రైస్తవులుగా మార్చాడు.గతాన్ని తుడిచిపెట్టే ప్రయత్నంలో, ప్రార్థనా మందిరాలు మరియు మసీదులను నాశనం చేశారు, కాథలిక్ చర్చికి ఇచ్చారు లేదా ప్రైవేట్
నివాసాలుగా మార్చారు.
మతపరమైన మైనారిటీలకు మూడు స్పష్టమైన ఎంపికలు
ఇచ్చినారు - క్రైస్తవ మతంలోకి మారడం, పోర్చుగల్‌ను విడిచిపెట్టడం లేదా మరణశిక్షను
ఎదుర్కోవడం - చాలా మంది ముస్లింలు ఉత్తర ఆఫ్రికాకు పారిపోయారు, అక్కడ వారు స్థానిక జనాభాలో కలిసిపోయారు.
ముస్లిం రాజ్యాల నుండి ప్రతీకారం తీర్చుకుంటామని
రాజు భయపడి ముస్లింలు రాజ్యాన్ని విడిచి వెళ్ళడానికి అనుమతించబడి ఉండవచ్చు, చాలా
మంది ఒట్టోమన్ సామ్రాజ్యానికి పారిపోయారు, అరబిక్ ప్రభావాలు ఇప్పటికీ పోర్చుగీస్ భాషలో
కనిపించడం ఆశ్చర్యకరం కాదు..
పోర్చుగల్‌లో ఇస్లాం ఒక మైనారిటీ మతం, పోర్చుగల్‌లోని చాలా మంది
ముస్లింలు ప్రధాన పట్టణ కేంద్రాలలో, ముఖ్యంగా లిస్బన్ చుట్టూ కేంద్రీకృతమై ఉన్నారు.చారిత్రాత్మకంగా, పోర్చుగల్ 500 సంవత్సరాలకు పైగా ముస్లిం
పాలనలో ఉంది, శాశ్వత సాంస్కృతిక మరియు భాషా
వారసత్వాన్ని కలిగి ఉంది..
నేడు, పోర్చుగల్‌లో
ముస్లిం సమాజం 65,000 మరియు 75,000 మంది మధ్య ఉంటుందని అంచనా
వేయబడింది, ఇది 11 మిలియన్ల జనాభాలో దాదాపు 0.6% నుండి 0.7% వరకు ప్రాతినిధ్యం
వహిస్తుంది. ముస్లింలు ఒకప్పుడు జనాభాలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని
కొద్దిమందికి మాత్రమే తెలుసు
ఆధునిక పోర్చుగల్‌లో ఎక్కువ భాగం 500 సంవత్సరాలకు పైగా ఇస్లామిక్
పాలనలో ఉంది, ఈ కాలాన్ని మూరిష్ గతం అని
పిలుస్తారు.
చారిత్రక ముస్లిం ఉనికి పోర్చుగీస్ భాష మరియు
సంస్కృతిలో శాశ్వత ఆనవాళ్లను మిగిల్చింది.
పోర్చుగల్ యొక్క ఇస్లామిక్ గతంపై పెరుగుతున్న
ఆసక్తి నెమ్మదిగా చారిత్రక పునఃస్థాపనకు మార్గం సుగమం చేస్తోంది
పోర్చుగీస్ భాషలో ఇప్పటికి కొన్ని అరబిక్ పదజాలం
కన్పిస్తుంది. కొన్ని ఆహారానికి సంబంధించినవి, మరికొన్ని నగరాలు లేదా ప్రాంతాలకు సంబంధించినవి.
అరబిక్ “ఇన్షాల్లా” ను పోర్చగిస్ బాషలో “ఆక్సాలా”
(ఓషల్లా అని ఉచ్ఛరిస్తారు) రెండింటి అర్థం “దేవుడు కోరుకుంటే”.
పండితులు అరబిక్ నుండి ఉద్భవించిన పోర్చుగీస్
పదాల జాబితాను రూపొందించారు. 2013లో అరబిక్ మూలాలతో 19,000 కంటే ఎక్కువ పోర్చుగీస్
పదాలు మరియు వ్యక్తీకరణలతో కూడిన నిఘంటువు ప్రచురించబడింది.
కవిత్వం మరియు భాష నుండి సంగీతం, కార్పెట్-నేత మరియు పేస్ట్రీలు, మినార్ ఆకారపు చిమ్నీల వరకు ముస్లిం వారసత్వం ను
పదిలం చేసే ప్రయత్నాలను యునెస్కో 2008లో షార్జా ప్రైజ్ ఫర్ అరబ్ కల్చర్‌తో
గుర్తించింది.
ముస్లింలు వదిలిపెట్టిన వారసత్వం విస్తృతమైనది, పోర్చుగీస్ సామ్రాజ్యం అరబ్బులు అభివృద్ధి చేసిన
నావిగేషనల్ సైన్సెస్‌పై ఆధారపడి ఉంది వాస్కో డా గామా కూడా భారతదేశానికి
చేరుకోవడానికి ముస్లిం నావికులను ఆశ్రయించాడని నమ్ముతారు.
పోర్చుగల్‌లో ఇస్లామిక్ వారసత్వాన్ని గ్రహించే
విధానాన్ని మార్చడానికి ఎక్కువగా దోహదపడింది కవిత్వంతోనే. అండలస్ కాలం నుండి
అరబిక్ కవిత్వాన్ని పోర్చుగీస్‌లోకి అనువదించడం ద్వారా, సెవిల్లె చివరి ముస్లిం పాలకుడు మరియు అత్యంత
ప్రసిద్ధ అండలూసియన్ కవులలో ఒకరైన అల్-ముతామిద్ వంటి కవులు "స్థానిక"
కవులుగా పిలువబడుతున్నారు. లిస్బన్‌లోని నేషనల్ లైబ్రరీలో అల్వెస్ మరియు
అల్-ముతమిద్ ఇద్దరి రచనలను జరుపుకునేందుకు ఒక ప్రదర్శన జరిగింది.
ఇస్లాం ప్రభావం ఎక్కువగా కనిపించే ప్రాంతంలో పోర్చుగీస్ గుర్తింపు మరియు
వారసత్వం యొక్క పునాది అంశంగా ఇస్లామిక్ గతాన్ని పునరుద్ధరించడం అనే మార్గదర్శక
ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది.
కొన్ని ఇస్లామిక్ స్మారక చిహ్నాలు మిగిలి
ఉన్నప్పటికీ, సాంస్కృతిక వారసత్వ ప్రభావం
వాస్తుశిల్పంలో కనిపిస్తుంది, పూర్వ
మసీదుల పునాదులపై అనేక చారిత్రక భవనాలు నిర్మించబడ్డాయి.
మధ్యధరా సముద్ర ప్రాంతాలలో జరిపిన తవ్వకాలలో గుర్రపునాడా తోరణాలు, వాల్ట్ ఇంటీరియర్ మరియు మిహ్రాబ్ ఉన్న మసీదు కనుగొన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మసీదులు మరియు ప్రార్థన
గదుల సంఖ్య పెరుగుతూ ముస్లిం సమాజం మరింత వ్యవస్థీకృతంగా మరియు దృశ్యమానంగా
మారుతోంది.
ఇస్లాం శతాబ్దాల వాణిజ్య మరియు ఆర్థిక సంబంధాల
ద్వారా ఈ ప్రాంతం అంతటా వ్యాపించిందని చరిత్రకారులు భావిస్తున్నారు.
No comments:
Post a Comment