బేగం జాఫర్ అలీ 1901లో కాశ్మీర్‌లో
జన్మించారు. బేగం జాఫర్ అలీ తండ్రి ఖాన్ బహదూర్ అగా సయ్యద్ హుస్సేన్, మహారాజా హరి సింగ్ పాలనలో న్యాయ మరియు హోం
మంత్రిగా పనిచేశారు.బేగం జాఫర్ అలీ తల్లి సయ్యదా సకీనా సదాత్, ఇరానియన్ వ్యాపార కుటుంబం నుండి వచ్చారు.
బేగం జాఫర్ అలీ ఇంటివద్దనే పాశ్చాత్య విద్య, మతపరమైన విద్యపొందినది.1917లో, బేగం అలీ తన బంధువు ఆఘా
జాఫర్ అలీ కిజిల్‌బాష్‌ను వివాహం చేసుకుంది. వివాహం తరువాత ముగ్గురు కుమారులు
కలిగినారు.
బేగం జాఫర్ అలీ 1930లో మెట్రిక్యులేషన్
పరీక్షలో ఉత్తీర్ణురాలై బంగారు పతకం పొందినది. కాశ్మీర్‌లో మెట్రిక్యులేషన్
పరీక్షలో ఉత్తీర్ణురాలైన మొదటి మహిళగా బేగం జాఫర్ అలీ నిలిచింది.
బేగం జాఫర్ అలీ 1925లో శ్రీనగర్‌లోని
గర్ల్స్ మిషన్ హై స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా తన కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ, 1938లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
బేగం జాఫర్ అలీ బాలికల విద్యను ప్రోత్సహించినది. ఆ సమయంలో, కాశ్మీర్ లోయలో బాలికల విద్య శాతం చాలా
తక్కువగా ఉంది. బేగం జాఫర్ అలీ అలీ కాశ్మీర్ లోయలోని ఇళ్లను సందర్శించడం మరియు
ప్రజలు తమ బాలికలను విద్యను అభ్యసించమని ప్రోత్సహించడం ప్రారంభించారు.బేగం జాఫర్
అలీ తమ బాలికలను పాఠశాలకు పంపమని ప్రజలను ఒప్పించేది. బేగం జాఫర్ అలీ ప్రయత్నాల
ద్వారా ప్రభావితమై, అనేక కుటుంబాలు తమ బాలికలను పాఠశాలకు పంపడం
ప్రారంభించాయి.
సామాజిక కార్యకర్తగా పేరు తెచ్చుకున్న బేగం జాఫర్ అలీ, అనేక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయురాలిగా కూడా
పనిచేశారు.తరువాత బేగం జాఫర్ అలీ కాశ్మీర్‌లోని పాఠశాలల ఇన్‌స్పెక్టర్‌గా
నియమితులయ్యారు. ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న కాలంలో, బేగం జాఫర్ అలీ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది.
కాశ్మీర్ మహారాణి తారా దేవి మద్దతుతో బేగం అలీ టీచర్స్ క్లబ్‌ను
స్థాపించారు. మహిళల హక్కులు మరియు ఇతర ముఖ్యమైన అంశాలను చర్చించడానికి
కార్యక్రమాలు మరియు బహిరంగ సమావేశాలను నిర్వహించడం, కాశ్మీరీ మహిళల జీవితాలను మెరుగుపరచడానికి మరియు పాల్గొనడానికి కేంద్ర
వేదికను అందించడం వంటి కొన్ని ముఖ్యమైన లక్ష్యాలను క్లబ్ కలిగి ఉంది.బేగం అలీ ఈ
క్లబ్‌కు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పదవీ విరమణ తర్వాత, ఆమె సలహా బోర్డులో ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. బేగం జాఫర్ అలీ కాశ్మీర్‌లోని
అణగారిన వర్గాల మహిళల కోసం ఒక సాంకేతిక శిక్షణా కేంద్రాన్ని స్థాపించారు.
బేగం జాఫర్ అలీ 1977 నుండి 1982 వరకు శాసనసభ సభ్యురాలిగా ఉన్నారు.శాసనసభ
సభ్యురాలిగా ఉన్నప్పుడు, బేగం జాఫర్ అలీ మహిళా
విముక్తి మరియు సామాజిక సమస్యలలో మెరుగుదల తీసుకురావడానికి ప్రయత్నించారు. మహిళల
అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారు.
విద్య, సామాజిక సేవ, మహిళా విముక్తి మరియు సాధికారత రంగాలలో బేగం జాఫర్ అలీ చేసిన ప్రశంసనీయమైన
కృషికి 1987లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ
లభించింది.
బేగం జాఫర్ అలీ 1999లో 99 సంవత్సరాల వయసులో మరణించారు.
No comments:
Post a Comment