చాలా మంది చరిత్రకారులు మరియు ఇస్లామిక్
పండితులు ఇండోనేషియాలో ఇస్లాంను అరబ్బులు కాకుండా భారతీయులు వ్యాప్తి చేశారని
నమ్ముతారు. ఇందుకు ప్రధాన ఆధారం జావా మరియు సుమత్రాలలో సుల్తాన్ మాలిక్ అల్-సలేహ్
వంటి సూఫీ సన్యాసుల సమాధులు ఉండటం,
ఇవి భారతదేశంలోని గుజరాత్‌లో కనిపించే సూఫీ
సన్యాసుల సమాదులతో సారూప్యతలను కలిగి ఉన్నాయి. ప్రసిద్ధ డచ్ పండితుడు స్నౌక్
హుర్గ్రోంజే గుజరాతీ ముస్లింల అనేక ఆచారాలు ఇండోనేషియా ముస్లింలలో కనిపించే
ఆచారాలను పోలి ఉన్నాయని వాదిస్తున్నారు.
మధ్యయుగo లో
సుమత్రాకు చేరుకున్న తొలి ముస్లింలు గుజరాత్ మరియు మలబార్ నుండి వచ్చారని
నమ్ముతారు. అలాగే, మాలిక్ అల్-సలేహ్ సమాధి వద్ద
ఉపయోగించిన సమాధి రాయి గుజరాత్‌లోని కాంబే నుండి వచ్చిందని కూడా చెప్పబడింది.
ఆధునిక యూరోపియన్ ఎథెనోగ్రాఫర్లు మరియు చరిత్రకారులు చాలా మంది ఇస్లాం గుజరాత్ ద్వారా ఇండోనేషియాకు చేరుకుందని పేర్కొన్నప్పటికీ చాలా మంది అరబ్ పండితులు ఇస్లాం నేరుగా అరబ్ నుండి చేరుకుందని పేర్కొన్నారు.
ఒక ప్రసిద్ధ సిద్ధాంతం ప్రకారం, 13వ శతాబ్దంలో సూరత్ (గుజరాత్)లోని రాండేర్‌కు
చెందిన సూఫీ మతస్థుడు షేక్ రాండేరి ఇండోనేషియాకు ప్రయాణించి ఇస్లాంను అక్కడికి
తీసుకువచ్చాడు. ఇబ్న్ బటుటా కూడా ఈ ప్రాంతంలోని ఇస్లాం మతానికి భారతదేశంలో తాను చూసిన ఇస్లాం తో
అనేక సారూప్యతలు ఉన్నాయని పేర్కొన్నాడు. సముదేర పసాయి (సుమాత్ర) పాలకుడు
భారతదేశంలో కనిపించే ఆచారాలతో తన మతపరమైన విధులను నిర్వర్తించిన ముస్లిం అని
అభిప్రాయ పడినాడు..
ఇండోనేషియాలో ఇస్లాం బలం ద్వారా వ్యాప్తి చెందలేదు. ఇండోనేషియాలో సూఫీలు గురువులుగా, వ్యాపారులు మరియు రాజకీయ నాయకులుగా వచ్చారు. సూఫీలు తమ మతపరమైన ఆలోచనలను ఇండోనేషియాలో గతంలో ఉన్న నమ్మకాలకు అనుగుణంగా ఉండే రూపంలో తెలియజేసారు.
సూఫీలు దేవుని వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవంపై ప్రాధ్యాన్యత ఇచ్చారు. ఇండోనేషియా ఇస్లాం తరచుగా సహజంగా మితవాదంగా చిత్రీకరించబడింది, అదే సమయంలో ఆధ్యాత్మిక సూఫీయిజం దాని సంప్రదాయాలను రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించినది.
సూఫీ మిషనరీలతో పాటు, భారతదేశంలోని పశ్చిమ తీరాల నుండి వచ్చిన వ్యాపారులు మధ్యయుగ కాలంలో జావా మరియు సుమత్రాతో వ్యాపారం చేసారు.. వారి ప్రభావం తో పెద్ద సంఖ్యలో వ్యాపారులు, ధనిక ప్రభువులు మరియు పాలకవర్గం ఇస్లాంలోకి మారడానికి దారితీసింది. ఇది నెమ్మదిగా శతాబ్దాలుగా ద్వీపసమూహంలో ముస్లిం జనాభాను విస్తరించింది.
ఇండోనేషియా ఇస్లాం, భారతదేశంలో లాగే, సమకాలీకరణ, సహనం మరియు సహజీవనాన్ని నమ్ముతుంది. స్వతంత్ర మత గుర్తింపును
ఉంచుకుంటూనే సాంస్కృతిక సంశ్లేషణను కనుగొంటాము. ఇండోనేషియా లోని ముస్లిం ప్రజలు, ప్రార్థనలు
చేస్తారు, ఉపవాసం ఉంటారు, భక్తితో హజ్ కోసం ప్రయాణిస్తారు
మరియు హిందువులు, బౌద్ధులు పంచుకునే ఇండోనేషియా సంస్కృతిని స్వీకరిస్తారు.
No comments:
Post a Comment