5 October 2025

అల్ షిఫా బింత్ అబ్దుల్లా: విద్య, వైద్యం మరియు పాలనలో మార్గదర్శకురాలు Al Shifa Bint Abdullah: A Trailblazer in Education, Medicine, and Governance

 

అల్ షిఫా బింత్ అబ్దుల్లాను ఇస్లామిక్ చరిత్రలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మొదటి మహిళా వైద్యురాలు, మొదటి మహిళా ఆర్థిక మంత్రి.

అల్-షిఫా బింత్ అబ్దుల్లా తండ్రి అబ్దుల్లా ఇబ్న్ అబ్ద్ షమ్స్ మరియు తల్లి ఫాతిమా బింత్ వాహ్బ్. అల్-షిఫా మక్కాలోని ఒక ఉన్నత ఖురైష్ తెగకు చెందినది. అల్ షిఫా, అబూ హత్మా ఇబ్న్ హుధైఫాను వివాహం చేసుకుంది, వారికి ఇద్దరు కుమారులు సులేమాన్ మరియు మస్రూక్ ఉన్నారు.

అల్ షిఫా పదునైన తెలివితేటలు కలిగిన మహిళ అల్ షిఫా విద్యతో పాటు కాలిగ్రఫీ, రుక్యా (సహజ వైద్యం) కళను అబ్యసించినది.

ఇస్లాంను అంగీకరించిన మొదటి వ్యక్తులలో అల్ షిఫా ఒకరు. ఇస్లాంను స్వీకరించిన తరువాత, ప్రవక్త ముహమ్మద్ (స) మదీనాకు వలస వెళ్ళినప్పుడు, అల్ షిఫా కూడా ప్రవక్త(స) తో పాటు హిజ్ర చేసింది.

ఇస్లాంలో విద్య ఎల్లప్పుడూ ఊన్నథ స్థానం ఇవ్వబడినది. ఇస్లామిక్ విశ్వాసం ప్రకారం, "ఒక ముస్లిం జ్ఞానాన్ని పొందినప్పుడు, అతను దానిని తన తోటి ముస్లింకు బోధించడం ఉత్తమ దానధర్మం."(సునన్ ఇబ్న్ మాజా)

అరేబియాలో చదవడం మరియు వ్రాయడం తెలిసిన కొద్దిమంది అక్షరాస్యులలో అల్ షిఫా ఒకరు. అల్ షిఫా తన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుని ప్రజలకు విద్యను అందించేది. అల్ షిఫా వద్ద విద్యను అభ్యసించిన వారిలో హఫ్సా బింట్ ఉమర్-(ప్రవక్త ముహమ్మద్ (స) భార్య) కూడాఉన్నారు.

అల్ షిఫా బింట్ అబ్దుల్లా ప్రకృతి వైద్యం తెలిసిన వ్యక్తి. అల్ షిఫా బింత్ అబ్దుల్లా తన ప్రకృతి వైద్య పరిజ్ఞానం ఆధారంగా ఏ వ్యాధికైనా చికిత్స చేయగలిగింది. చికిత్స మరియు వైద్య పరిజ్ఞానం పట్ల అల్ షిఫా బింట్ అబ్దుల్లాకున్న అంకితభావం కారణంగా, "అల్ షిఫా" అనే బిరుదును పొందిన మహిళ అయ్యింది. అల్ షిఫా బింట్ అబ్దుల్లా తరువాత ఇరాక్‌లోని బాస్రాలో ఆరోగ్యం మరియు భద్రత అధిపతి అయ్యారు.

మదీనాలో నివసిస్తున్నప్పుడు, అల్ షిఫా బింట్ అబ్దుల్లా ఇస్లామిక్ చట్టం మరియు ఇస్లామిక్ వ్యవహారాలను లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభించింది. ప్రవక్త ముహమ్మద్ (స) తరచుగా అల్ షిఫా బింట్ అబ్దుల్లా సందర్శించేవారు మరియు అనేక విషయాలపై లోతైన చర్చలు జరిపేవారు. అల్ షిఫా బింట్ అబ్దుల్లాకు వ్యాపార విషయాలపై కూడా చాలా లోతైన అవగాహన ఉంది మరియు వ్యాపార విషయాలను ప్రవక్త(స) తో చర్చించేవారు.

ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ ఖలీఫా అయినప్పుడు, అల్ షిఫా యొక్క నిర్వహణ నైపుణ్యాలు మరియు వ్యాపార విషయాలపై అవగాహనకు ముగ్ధుడై మదీనాలో ఆర్థిక వ్యవస్థను నిర్వహించే బాధ్యతను అల్ షిఫా కు అప్పగించారు. ఆ విధంగా అల్ షిఫా ఉమర్ అల్ ఖత్తాబ్ చేత అధికారిక నియామకం పొందిన మొదటి మహిళా అధికారి అయ్యారు.అల్ షిఫా మదీనా మార్కెట్ అధికారి మరియు కంట్రోలర్‌గా నియమించబడినది..

అల్ షిఫా నిజానికి మహిళా సాధికారతకు అత్యంత ప్రామాణికమైన ఉదాహరణ. అల్ షిఫా మహిళల నైపుణ్యం మరియు జ్ఞానం ఏ విధంగానూ తక్కువ కాదని నిరూపించింది.

No comments:

Post a Comment