27 October 2025

భారతదేశంలో బ్రిటిష్ పాలనను ఎదుర్కోవడంలో సూఫీలు ​​కీలక పాత్ర పోషించారు Sufis Played a Key Role in Fighting the British Rule in India

 

Sufis played a key role in fighting the British rule in India -


బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టిన మొదటి భారతీయ సమూహం సూఫీలు. ప్లాసీ యుద్ధం (1757) జరిగిన రెండు సంవత్సరాలలోపు మకాన్‌పూర్ (యుపి) నుండి వచ్చిన మదరి సూఫీ ఆధ్యాత్మికవేత్త మజ్ను షా అనుచరులు వేలాది మంది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనను ప్రారంభించారు.

సూఫీల ప్రతిఘటన ఉత్తరప్రదేశ్ నుండి నేటి బంగ్లాదేశ్ వరకు వ్యాపించింది. మజ్ను షా సాయుధ సమూహాలకు నాయకత్వం వహించాడు మరియు హిందూ ఆధ్యాత్మికవేత్తలతో సహకరించాడు, ఈ ఉద్యమాన్ని వలసరాజ్యాల రికార్డులలో ఫకీర్-సన్యాసి తిరుగుబాటు అని పిలుస్తారు.

మజ్ను షాకు హమీదుద్దీన్, మూసా షా (1787లో మజ్ను మరణం తర్వాత ఉద్యమానికి నాయకత్వం వహించాడు), ఫరగుల్ షా, చిరాగ్ షా, శోభన్ షా మొదలైన ఇతర సూఫీలు ​​సహాయం చేశారు. సూఫీలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధాలలో రాకెట్లు, రైఫిళ్లు, కత్తులు మరియు ఇతర సాంప్రదాయ ఆయుధాలను ఉపయోగించారు. 1800 వరకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన అనేక మంది అధికారులను వారు చంపారు. ఆ తరువాత, ఉద్యమం తన మార్గాన్ని మార్చుకుంది.

18వ శతాబ్దం చివరిలో, మరాఠాలు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సూఫీ ఆధ్యాత్మికవేత్తలు మరాఠా దళాలలో చేరడం ప్రారంభించారు. బ్రిటిష్ వారితో పోరాడుతున్న టిప్పు సుల్తాన్ తో పాటు మరికొందరు కూడా వారితో పాటు  చేరారు. అంతేకాకుండా, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన భారతీయ సిపాయిలలో ఆంగ్ల వ్యతిరేక భావాలను బోధించడానికి సూఫీలు ​​ప్రజల మద్యలో ప్రచారం లోకి దిగారు.

టిప్పు ఓడిపోయిన తర్వాత, మరాఠాలు యుద్ధాన్ని కొనసాగించడంలో ఆసక్తిని కోల్పోయారు. గతంలో టిప్పుతో ఉన్న నబీ షా మరియు షేక్ ఆడమ్ వంటి సూఫీలు ​​1806 వెల్లూరు తిరుగుబాటులో భారతీయ సిపాయిలకు నాయకత్వం వహించారు. సూఫీల బోధన తిరుగుబాటుదారులను ప్రేరేపించింది; వారు తిరుగుబాటుకు నాయకత్వం వహించారు.

అహ్మదుల్లా షా దేశ దక్షిణ  ప్రాంతంలో చురుకైన సూఫీ. అహ్మదుల్లా షా మరియు ఇతరులు అనేక మంది తమ స్థావరాన్ని దక్షిణ భారతదేశం నుండి ఉత్తరానికి మార్చారు. వీర్ సావర్కర్ ప్రకారం, అహ్మదుల్లా షా 1857లో జరిగిన మొదటి జాతీయ స్వాతంత్ర్య యుద్ధం యొక్క ప్రధాన నాయకులు మరియు ప్రణాళికదారులలో ఒకరు. అహ్మదుల్లా షా గొప్ప యోధుల జనరల్‌గా పరిగణించబడ్డాడు మరియు ఆంగ్లేయుల నుండి భారీ నజరానా  కోసం భారతీయ రాజు చేతిలో ద్రోహంగా చంపబడటానికి ముందు భారతీయులను అనేక విజయాలకు నడిపించాడు.

సూఫీలు ​​కూడా ఝాన్సీ రాణి శిభిరం లో  చేరారు. ఆంగ్ల శిబిరంలో విధ్వంసం సృష్టించిన ఝాన్సీ రాణి యొక్క  ఫిరంగిదళం ను  సూఫీ ఆధ్యాత్మికవేత్తలు నాయకత్వం వహించారు.

ఢిల్లీలోని మరొక ప్రసిద్ధ సూఫీ అల్లామా ఫజల్ ఇ హక్ ఖైరాబాది, ఆయన ఫత్వా-ఇ-జిహాద్ ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలను తిరుగుబాటులోకి తీసుకువచ్చారు. అల్లామా ఫజల్ ఇ హక్ ఖైరాబాది బహదూర్ షా జాఫర్ నేతృత్వంలోని భారత సామ్రాజ్యం కోసం రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తి. ఆ రాజ్యాంగం లో గోవధ నిషేధించబడింది మరియు ఇతర మతపరమైన సమస్యలు పరిష్కరించబడ్డాయి.

బ్రిటిష్ వారితో పూర్తిగా సహకరించకూడదని మరియు వారిని భారతదేశం నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చిన మొదటి వ్యక్తి మరొక సూఫీ పండితుడు షా అబ్దుల్ అజీజ్ డెహ్లావి.

షా అబ్దుల్ అజీజ్ డెహ్లావి 1803లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశాడు, ఇది విస్తృతమైన ప్రజా ప్రతిఘటనను ప్రోత్సహించింది. స్వాతంత్ర్య పోరాటంలో ముస్లిం ఉలేమాకు 1803నాటి  షా అబ్దుల్ అజీజ్ డెహ్లావి ఫత్వా ఒక మార్గదర్శిగా పనిచేసింది. షా అబ్దుల్ అజీజ్ శిష్యుడు సయ్యద్ అహ్మద్ షహీద్ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా హోల్కర్లతో కలిసి సైన్యాన్ని నడిపించాడు.

హాజీ షరియతుల్లా బ్రిటిష్ అధికారాన్ని మరియు సంబంధిత సామాజిక మరియు మతపరమైన అణచివేతను వ్యతిరేకించడానికి బెంగాల్‌లో ఫరైజీ ఉద్యమాన్ని నిర్వహించాడు.

సయ్యద్ అహ్మద్ బరేల్వి మరియు టిటు మీర్‌ అనుచరులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనకు నాయకత్వం వహించారు, టిటు మీర్ బెంగాల్‌లో బ్రిటిష్ నియంత్రణను నిరోధించడానికి "వెదురు కోట"ను నిర్మించడంలో ప్రసిద్ధి చెందాడు.

షా వాలియుల్లా మరియు షా అబ్దుల్ అజీజ్ వారసుడు హాజీ ఇమ్దాదుల్లా ముహాజీర్ మక్కీ 1857లో తిరుగుబాటు సమయంలో షామ్లీ మరియు ముజఫర్‌నగర్‌లలో సైన్యాన్ని నడిపించాడు. హాజీ ఇమ్దాదుల్లా ముహాజీర్ మక్కీ కొన్ని నెలల పాటు షామ్లీని విజయవంతంగా విముక్తి చేసి అక్కడ జాతీయవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.

తరువాతి కాలంలో, సింధ్ నుండి వచ్చిన సూఫీలు ​​భారత స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.   మొదటి ప్రపంచ యుద్ధంలో సిల్క్ లెటర్ ఉద్యమం యొక్క ముఖ్యమైన కుట్రదారులలో పీర్ జండేవాల రషీదుల్లా Pir Jhandewala Rashidullah ఒకరు. సిల్క్ లెటర్ ఉద్యమం ఉద్యమం రాజా మహేంద్ర ప్రతాప్, మౌలానా ఉబైదుల్లా సింధీ మరియు బర్కతుల్లా నేతృత్వంలో ప్రవాసంలో జాతీయవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

పీర్ జండేవాల రషీదుల్లా తమ్ముడు మీర్ మహబూబ్, జలియన్ వాలా బాగ్ ఊచకోత తర్వాత ఉద్యమంలో మొదటగా అరెస్టు చేయబడ్డాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టాడని అతనిపై అభియోగం మోపబడింది.

భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ సింధ్‌లోని లువారీ పీర్‌ను సందర్శించారు. అక్కడ గాంధీజీ కి సహాయం అందించబడింది. బహిష్కరణ మరియు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించమని పీర్ గాంధీజీ ని  కోరాడని బ్రిటిష్ వారు విశ్వసించారు.

1930ల చివరలో, పగారో పీర్ బ్రిటిష్ వారితో పోరాడటానికి వేలాది మంది సైన్యాన్ని సమీకరించాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, జర్మనీ మరియు ఇటలీ తో పగారో పీర్ కు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయి. తరువాత పగారో పీర్ ను 1943లో బంధించి ఉరిశిక్ష విధించి చంపారు. పగారో పీర్ అనుచరులు 1946 వరకు తమ ఆయుధాలను దించలేదు..

 అదే సమయంలో వజీరిస్తాన్‌లో ఐపికి చెందిన ఫకీర్ కూడా తన సైన్యంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. మిలన్ హౌనర్ ఇలా వ్రాశాడు, “(సుభాష్ చంద్ర) బోస్ బెర్లిన్‌కు వచ్చిన వెంటనే సమర్పించిన తన సమగ్ర 'అక్ష రాజ్యాలు మరియు భారతదేశం మధ్య సహకార ప్రణాళిక'లో గిరిజన భూభాగానికి ఒక ముఖ్యమైన పాత్రను అప్పగించాడు. ఐపికి చెందిన ఫకీర్ నిర్వహించిన దాడులు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా విధ్వంసాన్ని జరపడానికి ఒక  పథకంలో భాగం కానున్నాయి.”

1922లో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నివేదిక ఇలా పేర్కొంది, "దర్గా (అజ్మీర్ షరీఫ్) నిస్సందేహంగా ప్రమాద కేంద్రంగా ఉంది”. జాతీయవాదాన్ని బోధించడానికి వార్షిక ఉర్స్ ఉపయోగించబడ్డాయి మరియు 1920లలో దాని సంరక్షకులు బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా పోరాడటానికి ఒక సాయుధ సమూహాన్ని ఏర్పాటు చేశారు.

బహదూర్ షా జాఫర్ చిష్టి సిల్సిలా పట్ల పూర్తి భక్తి కలిగిన సూఫీ అని మరియు టిప్పు సుల్తాన్‌కు మదారిస్ నుండి వచ్చిన ఒక సూఫీ ఆధ్యాత్మిక గురువు ఉన్నాడని మనం మర్చిపోకూడదు.

రాజకీయ సంక్షోభ సమయాల్లో సూఫీలు ​​ప్రజలను నడిపిస్తారు మరియు వారి నాయకత్వం దేశం కసం యుద్ధభూమిలో పాల్గొంది.

 

No comments:

Post a Comment