ఇస్లామిక్ స్వర్ణయుగం లో అనేక మంది ముస్లిం శాస్త్రవేత్తలు సైన్స్, వైద్యం, న్యాయశాస్త్రం, ఖగోళ శాస్త్రం మరియు గణితం వంటి రంగాలలో గణనీయమైన
కృషి చేశారు, వీరిలో బాగ్దాద్‌కు చెందిన 10వ శతాబ్దపు ముస్లిం గణిత శాస్త్రజ్ఞురాలు సుతయ్తా
అల్-మహామాలి గొప్ప ముస్లిం మహిళా గణిత
శాస్త్రజ్ఞురాలు.
బీజగణితం, వంశావళి genealogy (ఫరాయిద్Fara'id) మరియు న్యాయశాస్త్రంలో ప్రత్యేకమైన
జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా సుతయ్తా అల్-మహామాలి అనేక గణిత సమస్యలకు
పరిష్కారాలను కనుగొంది. సుతయ్తా అల్-మహామాలి మొదటి ఇస్లామిక్ మహిళా గణిత
శాస్త్రజ్ఞురాలిగా ఘనత పొందింది.
సుతయ్తా అల్-మహామాలి 9వ శతాబ్దం చివరిలో లేదా
10వ శతాబ్దం ప్రారంభంలో జన్మించినది. సుతయ్తా అల్-మహామాలి
కుటుంబం బాగ్దాద్‌లోని ఒక ప్రతిష్టాత్మక పండితుల కుటుంబం, సుతయ్తా అల్-మహామాలి తండ్రి అబూ అబ్దుల్లా అల్-హుస్సేన్ న్యాయమూర్తి మరియు మామ
హదీస్ పండితుడు.
సుతయ్త అల్-మహామాలి తండ్రి అబూ అబ్దుల్లా అల్-హుస్సేన్ ఒక ప్రసిద్ధ
న్యాయమూర్తి. సుతయ్త అల్-మహామాలి తండ్రి ఇస్లామిక్ న్యాయశాస్త్రంపై ‘కితాబ్ ఫి
అల్-ఫిఖ్, సలాత్ అల్-ఇదైన్ Kitab fi al-Fiqh, Salat al-Idain’ వంటి అనేక పుస్తకాలు రాశారు.
సుతయ్త అల్-మహామాలి మతపరమైన విద్య, గణిత విద్య అబ్యసించినది. సుతయ్త అల్-మహామాలి తండ్రి సుతయ్త కోసం చాలా మంది ప్రసిద్ధ ఉపాధ్యాయులను నియమించారు, వారిలో ప్రముఖులు అబూ హంజా బి. ఖాసిం, ఉమర్ బి. అబ్దుల్-అజీజ్ అల్-హషిమి, ఇస్మాయిల్ బి. అల్-అబ్బాస్ అల్-వర్రాక్ మరియు అబ్దుల్-అల్-గఫిర్ బి. సలామా అల్-హోమ్సి.
సుతయ్త అల్-మహామాలి తండ్రి తన కుమార్తెకు ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు అల్
ఖ్వారిజ్మి రాసిన "ది కాంపెండియస్ బుక్ ఆన్ కాలిక్యులేషన్ బై కంప్లీషన్ అండ్
బ్యాలెన్సింగ్ The Compendious Book
on Calculation by Completion and Balancing " పుస్తకం యొక్క కాపీని ఇచ్చారు. సుతయ్త అల్-మహామాలి ఆ పుస్తకం ద్వారా
గణిత సమస్యలను అధ్యయనం చేయడం మరియు పరిష్కరించడం ప్రారంభించినది..
అల్ ఖ్వారిజ్మి పుస్తకం నుండి సుతయ్త అల్-మహామాలి సమస్యలను
పరిష్కరించడమే కాకుండా, సమస్యల కు సాధారణ
పరిష్కారాలను కూడా చూపింది. సంక్లిష్ట వారసత్వ వివాదాలను పరిష్కరించడానికి మరియు సుతయ్త
అల్-మహామాలి ఇస్లామిక్ చట్టం ప్రకారం సంపద యొక్క న్యాయమైన పంపిణీని
నిర్ధారించడానికి సుతయ్త తన గణిత జ్ఞానాన్ని ఉపయోగించారు. సుతయ్త అల్-మహామాలికు కల విలువైన జ్ఞానం అనేక సంక్లిష్ట సమస్యలను
పరిష్కరించడంలో సహాయపడినది.
సుతయ్త అల్-మహామాలి వారసత్వ గణితం, ఘన సమీకరణాలు మరియు బీజగణిత సిద్ధాంతాలలో నిపుణురాలు. సుతయ్త అల్-మహామాలి తన సమయం మరియు శక్తినంతా గణితానికి, ముఖ్యంగా వారసత్వ గణితానికి అంకితం చేసింది.
సుతయ్త అల్-మహామాలి గణిత రంగంలోనే కాక ఇస్లామిక్ చట్టంలో కూడా నిపుణురాలు. సుతయ్త అల్-మహామాలి
న్యాయవేత్త, గుర్తింపు పొందిన ముఫ్తీ కూడా. ముఫ్తీగా
చట్టపరమైన అభిప్రాయాలను జారీ చేసింది. గణితం మరియు న్యాయ శాస్త్రాన్ని మిళితం
చేసింది.సుతయ్త అల్-మహామాలి న్యాయశాస్త్రం మరియు పవిత్ర గ్రంథాల పై వివరణ ఇచ్చేది.
సుతయ్త అల్-మహామాలి 10వ శతాబ్దంలోనే
జ్ఞానాన్ని సంపాదించారు,. సుతయ్త సూచనలు మరియు
తీర్మానాలు ఇప్పటికీ గణిత సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించబడుతున్నాయి. సుతయ్త అల్-మహామాలి
అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తి. సుతయ్త అల్-మహామాలి బీజగణితం మరియు వంశావళిgenera విస్తరించింది. సుతయ్త అల్-మహామాలి సహకారాన్ని విస్మరించలేము.
"నేడు, పశ్చిమ దేశాలలో, సుతయ్త అల్-మహామాలి "పునరుజ్జీవన మహిళ" అని పిలుస్తారు,
సుతయ్త అల్-మహామాలి 987లో మరణించారని
నమ్ముతారు
No comments:
Post a Comment