చాలా మంది అమెరికన్లకు ఉదయం తాము త్రాగే కాఫీ,
తమకు ఒట్టోమన్ సామ్రాజ్యంతో
అనుసంధానిస్తుందని తెలియదు. ఒట్టోమన్ సామ్రాజ్యం, అమెరికా యొక్క ఆధిపత్య క్రైస్తవ మత రూపమైన
ప్రొటెస్టంటిజం పుట్టుకకు సహాయపడిందని లేదా ఒట్టోమన్లు మరియు ఇతర ముస్లింలు
యూరప్ మరియు ఆసియా మధ్య వాణిజ్యంపై పట్టు సాధించడం వల్ల యూరోపియన్ అన్వేషకులు అమెరికాలను
"కనుగొన్నరని" కొద్దిమందికి మాత్రమే తెలుసు.
వాస్తవానికి, చాలా మంది అమెరికన్లకు ఒట్టోమన్ సామ్రాజ్యం గురించి
తెలియదు. అమెరికన్లు మధ్యప్రాచ్యం గురించి
ఆలోచించినప్పుడు, దానిని వారు తరచుగా అమెరికన్ యుద్ధాలకు వేదికగా
మరియు చమురు ప్రాంతంగా మాత్రమే చూస్తారు. కాని అమెరికాకు ఒట్టోమన్ సామ్రాజ్యానికి మరియు దాని సుల్తాన్‌కు కల సంభందం తెలియదు.
ఒట్టోమన్ సామ్రాజ్యం యొక్క తొమ్మిదవ సుల్తాన్ అయిన సెలిమ్ I జీవితం మరియు పాలన దాదాపు ప్రపంచ చరిత్రలో
అత్యంత ఫలవంతమైన అర్ధ శతాబ్దం పైన కొనసాగింది. సుల్తాన్ సెలిమ్ I మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా మరియు కాకసస్‌లో యుద్ధాల ద్వారా
ఒట్టోమన్ భూభాగాన్ని దాదాపు మూడు రెట్లు పెంచాడు. ఇటాలియన్ అన్వేషకుడు క్రిస్టోఫర్
కొలంబస్, జర్మన్ కాథలిక్ పూజారి మార్టిన్ లూథర్, ఇటాలియన్ దౌత్యవేత్త మరియు రాజకీయ తత్వవేత్త
నికోలో మాకియవెల్లి లేదా అతని సమకాలీనుల కంటే, సెలిమ్ I విజయాలు అక్షరాలా ప్రపంచాన్ని మార్చాయి.
1517లో, సెలిమ్ I మరియు అతని సైన్యం ఇస్తాంబుల్ నుండి కైరోకు
కవాతు చేసి, ముస్లిం ప్రపంచంలో తన ప్రధాన ప్రత్యర్థి అయిన
మామ్లుక్ సామ్రాజ్యాన్ని ఓడించాయి. సెలిమ్ I ఏ ఇతర సార్వభౌమాధికారి కంటే ఎక్కువ భూభాగాన్ని
పరిపాలించాడు. మధ్యధరా మరియు భారతదేశం మరియు చైనా మధ్య వాణిజ్య మార్గాలను
ఏకస్వామ్యంగా నియంత్రించాడు మరియు పాత
ప్రపంచంలోని అన్ని ప్రధాన సముద్రాలు మరియు మహాసముద్రాలలో ఓడరేవులను కలిగి ఉన్నాడు.
ముస్లిం ప్రపంచంలో సెలిమ్ I మతపరమైన అధికారం
సాటిలేనిది మరియు సెలిమ్ I అపారమైన వనరులు కలిగిఉన్నాడు.
మామ్లుకుల ఓటమి ఆ కాలంలోని రెండు ప్రధాన భౌగోళిక రాజకీయ శక్తులైన ఇస్లాం
మరియు క్రైస్తవ మతం మధ్య ప్రపంచ శక్తి సమతుల్యతను పూర్తిగా మార్చివేసింది. 1517లో, సెలిమ్I ఇస్లాంలోని పవిత్ర
నగరాలైన మక్కా మరియు మదీనాను గెలుచుకున్నాడు, , సెలిమ్I ఆటోమన్ సామ్రాజ్యాన్ని మెజారిటీ క్రైస్తవ జనాభా
నుండి మెజారిటీ ముస్లింలుగా మార్చాడు మరియు సెలిమ్I ని సుల్తాన్ మరియు ఖలీఫ్‌గా, అటోమన్ సామ్రాజ్యానికి ప్రధాన రాజకీయ నాయకుడిగా
మరియు ప్రపంచ ముస్లిం సమాజానికి అధిపతిగా చేశాయి.
ఒట్టోమన్లు మరియు ఇరాన్‌లోని షియా సఫావిద్ పాలకులు 1500లు మరియు 1600లలో యుద్ధం చేశారు,. సెలిమ్ I కాలంలోనే మొదటిసారిగా ఆటోమన్
రాజ్యం ఒక సున్నీ రాజ్యం గా మరియు మరొకటి(ఇరాన్) షియా రాజ్యంగా స్వీయ-గుర్తింపు పొంది
మధ్యప్రాచ్యంలో ఆధిపత్యం కోసం పోరాడినవి.
ఒట్టోమన్ సెలిమ్ I ప్రాదేశిక విస్తరణ క్రైస్తవ
ఐరోపాకు ఆధ్యాత్మిక సవాలును విసిరింది, క్రైస్తవ ఐరోపా శక్తీ విశాలమైన ఒట్టోమన్
ముస్లిం సామ్రాజ్యానికి సరిపోలలేదు. యూరప్ లోని మార్టిన్ లూథర్ వంటి
సంస్కరణవాదులు క్రైస్తవ మతం యొక్క బలహీనత కాథలిక్ చర్చి యొక్క నైతిక దుర్మార్గం
నుండి ఉద్భవించిందని భావించారు. పోప్ యొక్క అవినీతి క్రైస్తవ ఆత్మను లోపలి నుండి
క్షీణింపజేసింది. యూరప్ లో క్రైస్తవ శక్తీ క్షిణించినది.
ఒట్టోమన్ సెలిమ్ I పెరుగుతున్న శక్తీ మార్టిన్ లూథర్
అసమ్మతిని పెంచడానికి తోడ్పడింది. ఒట్టోమన్లకు వ్యతిరేకంగా సైనిక సమీకరణల కారణంగా, కాథలిక్ శక్తులు ప్రారంభ ప్రొటెస్టంట్ కదలికలను అణిచివేయడానికి
అదనపు పోరాట దళాలను పంపకుండా వెనుకాడాయి. ఫలితంగా, మార్టిన్ లూథర్ మరియు అతని మద్దతుదారులు జర్మన్ పట్టణాలలో మరియు తరువాత
ప్రపంచవ్యాప్తంగా ప్రొటెస్టంట్ విశ్వాసాన్ని వ్యాప్తి చేయడానికి పట్టు
సాధించగలిగారు.
ఆర్థికంగా, బలమైన ఒట్టోమన్ సామ్రాజ్యం సెలిమ్ I నాయకత్వ కాలం నుండి 18వ శతాబ్దం ప్రారంభం వరకు ప్రపంచ కాఫీ వాణిజ్యంపై నియంత్రణ సాధించినది.
వాస్తవానికి, యెమెన్‌లోకి చొరబడినప్పుడు ప్రకాశవంతమైన ఎర్రటి
బెర్రీలతో కూడిన కాఫీ మొక్కను మొదట కనుగొన్నది సెలిమ్ సైన్యం.ఈ బెర్రీలతో కాఫీ ఎలా తయారు చేయాలో ఒట్టోమన్లు కనుగొన్నారు
మరియు కాఫీ సరఫరా, వాణిజ్యం పై ప్రపంచ
వ్యాప్తం గా ఏకస్వామ్యం పొందారు..
సెలిమ్ I
శక్తి చాలా గొప్పగా నిరూపించబడింది మరియు అతని ప్రభావం యూరప్ మరియు
మధ్యప్రాచ్యానికి మించి, అట్లాంటిక్ మీదుగా ఉత్తర అమెరికా వరకు
చేరుకుంది. 1517లో, సెలిమ్
I తన ఒట్టోమన్ దళాలను కైరోను
జయించడానికి కవాతు చేసిన కొన్ని వారాలలోపు, మొదటి
యూరోపియన్లు మెక్సికోలో అడుగుపెట్టారు. ఉప్పెనలు swells యూరోపియన్ల ను యుకాటన్ ద్వీపకల్పం వైపు నెట్టివేస్తుండగా, క్యూబా నుండి ప్రయాణించిన మూడు
స్పానిష్ నౌకలు దూరంలో ఒక గొప్ప మాయన్ నగరాన్ని చూశాయి, ఈ నగరం నేటి కాన్‌కున్ సమీపంలోని కేప్
కాటోచే. అయితే, 1517లో, స్పెయిన్
దేశస్థులు దీనిని ఎల్ గ్రాన్ కైరో, ది
గ్రేట్ కైరో అని నామకరణం చేశారు.
శతాబ్దాలుగా, కైరో
ఉత్తర ఆఫ్రికా మరియు ఐబీరియన్ ద్వీపకల్పంలోని స్పానిష్ స్థావరాలను జయించడానికి నౌకలను
పంపింది. క్రైస్తవులను బంధించి ఖైదు చేసింది మరియు యూరోపియన్ రాజధానులకు బెదిరింపులు
పంపింది. కైరో, పవిత్ర జెరూసలేంను
నియంత్రించింది మరియు యూరోపియన్లు భారతదేశం మరియు చైనాతో వ్యాపారం చేయకుండా
నిరోధించింది.
విస్తారమైన
మాయన్ నగరాన్ని జయించడం, స్పష్టంగా స్పానిష్ వారికి ఒక పెద్ద విజయం
అయినప్పటికీ, వారు సెలిమ్I ముస్లిం పలుకుబడి శక్తికి సరిపోలలేదు. కరేబియన్‌లో
కూడా, క్రైస్తవులు ఒట్టోమన్ దయ్యాల(ముస్లిములు) ఆక్రమణలో ఉన్నారు.
క్రైస్తవులు అమెరికాలు అడుగుపెట్టాక ముందే అమెరికాలో ముస్లిములు ఉన్నారు అని
చరిత్రకారుల అభిప్రాయం.
ఆరు శతాబ్దాలకు పైగా పాలన తర్వాత, సెలిమ్ I పాలన నుండి మొదటి ప్రపంచ యుద్ధంలో సెలిమ్
I మరణం వరకు ఒట్టోమన్లు ప్రపంచ
వేదికపై కేంద్ర ఆటగాళ్లుగా కొనసాగారు. 19వ
శతాబ్దంలో యూరోపియన్ శక్తులు చరిత్ర నుండి ఒట్టోమన్లను తొలగించారు.
“కొత్త
ప్రపంచం” లో మరియు ప్రపంచవ్యాప్తంగా సెలిమ్ I
కారణంగా, ఒట్టోమన్లు ఎక్కువ అధికారాన్ని కలిగి
ఉన్నారు, ఎక్కువ భూభాగాన్ని నియంత్రించారు, ఎక్కువ మందిని పాలించారు మరియు ప్రపంచాన్ని
దాదాపు అన్ని ఇతర రాజ్యాల కంటే ఎక్కువ కాలం ప్రభావంతం చేసారు.
ఇస్లాం, పశ్చిమ దేశాల చరిత్ర మరియు సంస్కృతిలో అంతర్భాగం
మరియు గతంలో నిర్మాణాత్మక శక్తిగా ఉంది. అంతిమంగా అమెరికా, ప్రొటెస్టంటిజం మరియు కాఫీ అన్నీ
ముస్లిం చరిత్రను కలిగి ఉన్నాయి.
మూలం: ది వాషింగ్టన్ పోస్ట్
No comments:
Post a Comment