రాంచీ:
నిర్భయ కేసు తర్వాత మహిళల భద్రతా సమస్యలను పరిష్కరించడానికి 2013లో జార్ఖండ్‌లో పింక్ ఆటో పథకాన్ని ప్రారంభించారు. మహిళలకు ఉపాధి కల్పించడం ద్వారా వారికి సాధికారత కల్పించడం దీని లక్ష్యం మరియు వాహనాల్లో పానిక్ బటన్లు మరియు GPS వ్యవస్థ వంటి లక్షణాలు ఉన్నాయి. ప్రభుత్వం రెండు వందల ఆటోలను ప్రారంభించింది, కొంతమంది మహిళలు డ్రైవర్స్ గా నియమింపబడ్డారు, మహిళలు లబించనప్పుడు పురుషులను డ్రైవర్లుగా నియమించారు.
పింక్ ఆటోలలో తాము సురక్షితంగా ఉన్నట్లు మహిళా ప్రయాణికులు చెబుతున్నారు. ముఖ్యంగా చీకటి పడిన తర్వాత మహిళలు ముఖ్యంగా కళాశాల విద్యార్థినిలు పింక్ ఆటోలలో ప్రయాణించడానికి ఇష్టపడతారు. కళాశాల విద్యార్థినిలు మహిళా డ్రైవర్‌తో ప్రయాణించినప్పుడు వారి తల్లిదండ్రులు ఉపశమనం పొందుతారు. తరచుగా ప్రయాణించే మహిళలు పింక్ ఆటోను మహిళలతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.
అయితే పింక్ ఆటో డ్రైవర్స్ కొన్ని సమస్యలు
ఎదుర్కొంటున్నారు. వారికి సరియిన సౌకర్యాలతో కూడిన విశ్రాంతి స్థలం లేదు. స్త్రీ డ్రైవర్లు
రోడ్డుపై పురుషుల నుండి వేధింపులను ఎదుర్కొంటున్నారు.
మహిళా డ్రైవర్స్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే వాష్‌రూమ్ లేకపోవడం. కొన్ని
ప్రాంతాలలో మహిళా ఆటో డ్రైవర్లలకు యూనియన్
లేదు. లోపాలు ఉన్నప్పటికీ,
మహిళా డ్రైవర్లు ఆశతో కొనసాగుతున్నారు.
No comments:
Post a Comment