17 November 2025

యావన్ మత్స్ లేదా షాంగా బీబీ: కాశ్మీర్‌కు చెందిన సూఫీ సెయింట్ Yawan Mats or Shanga Bibi: A sufi Saint of Kashmir

 

1400ల ప్రాంతంలో కాశ్మీర్‌ను పాలించిన రాజు సికందర్ షా మిరి ఆస్థానంలో చాలా మంది ఆస్థాన నృత్యకారులు ఉన్నారు. ఈ నృత్యకారులలో "యావన్ మాట్స్" అనే చాలా అందమైన నృత్యకారిణి కూడా ఉంది, "యావన్ మాట్స్" తన అందానికి ప్రసిద్ధి చెందింది.

ఒక సారి రాజు సికందర్ షా మిరి రాజ్యం లోని కొంతమంది అవిశ్వాసులు  ముస్లిం సూఫీ సాధువు షేక్ నూర్-ఉద్-దిన్ నూరానీ (నుండ్ రిషి అని కూడా పిలుస్తారు) ను శారీరకం గా ప్రలోభ పెట్టడానికి  షేక్ నూర్-ఉద్-దిన్ నూరానీ వద్దకి యవాన్ మత్స్‌ను పంపాలని ప్లాన్ చేశారు.

యావాన్ మత్స్ అవిశ్వాసుల సూచనలను అంగీకరించి షేక్ నూర్-ఉద్-దిన్ నూరానీ వద్దకు అతని శిష్యురాలు గా వెళ్ళింది.యావాన్ మత్స్ తన అందంతో నూర్-ఉద్-దిన్ వలీ సాహిబ్‌ను వలలో వేసుకోవడానికి చాలా ప్రయత్నించింది. కానీ అది జరగలేదు. ఇది యావన్ మత్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆధ్యాత్మికత మరియు సూఫీయిజం యొక్క శక్తి తన అందం మరియు యవ్వనం కంటే చాలా గొప్పదని యావాన్ మత్స్ గ్రహించింది. యావన్ మత్స్ సూఫీ మతం యొక్క గొప్ప శక్తిని గ్రహించారు.

షేక్ నూర్-ఉద్-దిన్ వలీ సాహిబ్ తన సూఫీ కవితలలో ఒకదానిలో, "పాయెఖ్ పయాస్ యావన్ మత్సీ" (యావన్ మత్స్, మీరు ఒక రోజు పశ్చాత్తాపపడతారు) అని రాశారు.

యావన్ మత్స్ అప్పుడు ప్రాపంచిక జీవితంపై భ్రమలు వదిలి  నిజమైన హృదయంతో, షేక్ నూర్-ఉద్-దిన్ సాహిబ్ శిష్యురాలిగా మారాలని ప్రతిజ్ఞ చేసింది. యావన్ మత్స్ తరువాతి జీవితంలో యావన్ మత్స్ పేరుతో కాకుండా "షాంగా బీబీ" పేరుతో పిలువబడింది.

"షాంగా బీబీ" తన జీవితాంతం సూఫీయిజం ప్రచారకురాలిగా మరియు షేక్ నూర్-ఉద్-దిన్ యొక్క నిజమైన శిష్యురాలిగా కొనసాగింది. “షాంగా బీబీ” సూఫీ  విశ్వాసాన్ని ప్రచారం చేసింది మరియు విముక్తిని పొందింది.నూర్-ఉద్-దిన్ వలీ సాహిబ్ సమాధి యొక్క ఏకైక మహిళా సంరక్షకురాలు కూడా “షాంగా బీబీ”.

యావన్ మాట్స్ ప్రపంచ భ్రాంతి నుండి బయటపడినప్పుడు, గౌరవనీయమైన వ్యక్తి “షాంగా బీబీ” గా మారింది. కాశ్మీర్‌లోని చరారి షరీఫ్‌లోని షేక్ నూరుద్దీన్ సమాధి దగ్గర షాంగా బీబీ ఖననం చేయబడింది.

 

No comments:

Post a Comment