22 November 2025

బహుముఖ ప్రజ్ఞావంతుడు (న్యాయవాది. ఉపాధ్యాయుడు. పండితుడు. జర్నలిస్ట్. శాసనసభ్యుడు. పరోపకారి. జాతి నిర్మాత)బెoగాల్‌కు చెందిన నవాబ్ సయ్యద్ షంసుల్ హుడా(1862-1922) Lawyer. Teacher. Scholar. Journalist. Legislator. Philanthropist. Nation-builder of Bengal-Nawab Syed Shamsul Huda(1862-1922)

 

 

 

బెంగాల్ యొక్క అత్యంత అద్భుతమైన కుమారులలో ఒకరు, భారతదేశంలో విద్య, రాజకీయాలు, జర్నలిజం మరియు చట్టాన్ని ప్రభావితం చేసిన నవాబ్ సయ్యద్ షంసుల్ హుడా 1862లో బ్రహ్మన్‌బారియా జిల్లాలోని (ఇప్పుడు బంగ్లాదేశ్) గోకర్ణ అనే గ్రామంలో ఒక గౌరవనీయమైన జమీందార్ కుటుంబంలో జన్మించారు.

సయ్యద్ షంసుల్ హుడా తండ్రి సయ్యద్ షా రియాజతుల్లా, క్లాసికల్ పెర్షియన్ మరియు అరబిక్ భాషలలో పండితుడు మరియు బెంగాల్ పర్షియన్ వారపత్రిక ‘దుర్బీన్‌’ సంపాదకుడు.

సయ్యద్ షంసుల్ హుడా హుగ్లీ కళాశాల మరియు ప్రెసిడెన్సీ కళాశాల (ఇప్పుడు ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం)లలో చదువుకున్నారు, 1886లో బార్ ఎట్ లా మరియు 1889లో పర్షియన్ భాషలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు.

బారిష్టర్ గా ప్రాక్టిస్ చేసే ముందు, సయ్యద్ షంసుల్ హుడా కలకత్తా మదర్సాలో (ఇప్పుడు అలియా విశ్వవిద్యాలయం) అరబిక్ మరియు పర్షియన్ భాషల ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశారు. 1887లో కలకత్తా హైకోర్టు బార్‌లో చేరారు

సయ్యద్ షంసుల్ హుడా 1902లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఠాగూర్ న్యాయశాస్త్ర ప్రొఫెసర్‌షిప్‌ను పొందారు. సయ్యద్ షంసుల్ హుడా ప్రసిద్ధ ఉపన్యాస శ్రేణి, "ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రైమ్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా Principles of Crimes in British India ", వలసవాద నేర చట్టం యొక్క పదునైన మరియు ఆలోచనాత్మక విశ్లేషణను అందించిందిఈ ఉపన్యాసాలు ఆ కాలపు న్యాయ పండితులకు ఒక ముఖ్యమైన రెఫెరెన్స్ గా మారాయి.

ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో, బెంగాల్ ముస్లిం సమాజం విద్యా వెనుకబాటుతనం మరియు సామాజిక స్తబ్దత ఎదుర్కొంటున్నది. అటువంటి పరిస్థితులలో సయ్యద్ షంసుల్ హుడా బెంగాల్ ముస్లిం పునరుజ్జీవన ఉద్యమంలో ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా నిలిచారు.

జర్నలిస్ట్ గా సయ్యద్ షంసుల్ హుడా సామాజిక సంస్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో “సుధాకర్” అనే బెంగాలీ వార్తాపత్రికను స్థాపించారు. మరొక బెంగాలీ ప్రచురణ అయిన ‘మిహిర్-ఓ-సుధాకర్’ హక్కులను కొనుగోలు చేశారు. మరియు భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం వ్యక్తి  ప్రచురించే ఆంగ్ల వారపత్రిక ‘ది ముహమ్మదన్ అబ్జర్వర్‌’కు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేశారు.

1904లో, సయ్యద్ షంసుల్ హుడా రాజ్‌షాహిలో జరిగిన ప్రాంతీయ ముహమ్మదన్ విద్యా సమావేశానికి అధ్యక్షత వహించారు, ముస్లిం కుటుంబాలు ఆధునిక విద్యను స్వీకరించాలని కోరారు.

1908లో తూర్పు బెంగాల్ మరియు అస్సాం శాసనసభలో సబ్యత్వం తో హుడా రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. ఒక సంవత్సరం తరువాత, ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో సబ్యుడయ్యారు.

1912 లో, సయ్యద్ షంసుల్ హుడా ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అధ్యక్షుడయ్యారు.

1912 లో సయ్యద్ షంసుల్ హుడా గవర్నర్ కార్యనిర్వాహక మండలికి నియమించబడిన మొదటి బెంగాలీ ముస్లిం అయ్యారు.  తరువాతి ఐదు సంవత్సరాలలో, సయ్యద్ షంసుల్ హుడా విద్య, ప్రజా సంక్షేమం మరియు పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన విధానాలపై ప్రభావవంతంగా పనిచేశారు.

బ్రిటిష్ ప్రభుత్వం సయ్యద్ షంసుల్ హుడా సేవను గుర్తించి 1913లో నవాబ్ బిరుదును ఇచ్చి, 1916లో నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ (KCIE) బిరుదును ప్రదానం చేసింది.

1917 నుండి 1921 వరకు, సయ్యద్ షంసుల్ హుడా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 1921లో, సయ్యద్ షంసుల్ హుడా బెంగాల్ శాసన మండలికి మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

సయ్యద్ షంసుల్ హుడా బెంగాల్ మరియు అస్సాం అంతటా పాఠశాలలు, కళాశాలలు మరియు ధార్మిక సంస్థలను స్థాపించి మద్దతు ఇచ్చాడు.

బహుముఖ ప్రజ్ఞావంతుడు అయిన సర్ సయ్యద్ షంసుల్ హుడా 14 అక్టోబర్ 1922న మరణించారు. సర్ సయ్యద్ షంసుల్ హుడా ను పార్క్ సర్కస్ సమీపంలోని తిల్జాలా ముస్లిం ఖబ్రిస్తాన్ (గతంలో తిల్జోలా మున్సిపల్ స్మశానవాటిక) వద్ద ఖననం చేశారు, ఈ ప్రాంతం ఇప్పుడు "షంసుల్ హుడా రోడ్" గా పిలువబడుతుంది.

 

No comments:

Post a Comment