తయ్యబా బేగం
బిల్‌గ్రామీగా పేరుగాంచిన తయ్యబా బేగం ఉత్తరప్రదేశ్ లోని బిలగ్రాంలో 18, డిసెంబర్ 1873న అబ్బాసీ బేగం బిల్గ్రామి మరియు
ఇమాద్-ఉల్-ముల్క్ సయ్యద్ హుస్సేన్ దంపతులకు జన్మించారు. తయ్యబా బేగం
బిల్‌గ్రామీ తండ్రి హైదరాబాదులో రాష్ట్ర కేంద్ర గ్రంథాలయ స్థాపకుడైన
ఇమాదుల్ ముల్క్ సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ. తయ్యబా బేగం
బిల్‌గ్రామీ హైదరాబాదు హైదెరాబాద్ లో విద్యనబ్యాసించినది. తరువాత సామాజిక
కార్యక్రమాలలో ఆసక్తి చూపి సంఘ సంస్కర్త గా మారింది..
హైదరాబాదులో
పెరుగుతున్నప్పుడు, తయ్యబా బేగం,
సరోజినీ నాయుడుతో కలిసి పాఠశాలలో చదివారు. తయ్యబా బేగం తన పాఠశాల విద్య తరువాత, 1894లో
మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది మరియు మొట్టమొదటి
ముస్లిం మహిళ గ్రాడ్యుయేట్ అయింది. తయేబా బేగం ఇంగ్లీష్, ఉర్దూ, అరబిక్ మరియు
పర్షియన్‌లలో నిపుణురాలు.
.తయ్యబా బేగం
ప్రసిద్ధ వైద్యుడు ఖదివే జంగ్
బహాదుర్ (మిర్జా కరీంఖాన్) ను పెళ్ళిచేసుకుంది తదుపరి తయేబా బేగం ఖేదీవ్ జంగ్ గా పిలబడినది.
తయేబా బేగం ప్రసిద్ధ
మహిళా సంఘ సంస్కర్త, రచయిత్రి, సామాజిక సేవకురాలు. తయ్యబా బేగం మహిళా విద్యాసమర్ధకురాలు.
బేగం ఖేదీవ్ జంగ్ తన జీవితకాలంలో మహిళలందరికీ విద్య కోసం గట్టిగా వాదించారు. తయ్యబా
బేగం హైదరాబాద్‌లో బాలికల కోసం ఎనిమిది పాఠశాలలను ఏర్పాటు చేసింది. సామాజిక
కార్యకర్తగా, తయ్యబా బేగం బ్రహ్మసమాజంలో
వార్షిక మహిళా సదస్సుకు అధ్యక్షత వహించారు. బేగం రోకేయా సఖావత్ హుస్సేన్
ప్రారంభించిన అంజుమన్-ఎ-ఖవాతిన్-ఎ-ఇస్లామ్‌కు అధ్యక్షురాలు అయినది.
తయ్యబా బేగం అంజుమన్-ఏ-ఖవాతీన్
అనే జాతీయ మహిళా సంస్థను స్థాపించి ముస్లిం మహిళల
అభ్యుదయానికి కృషిచేసింది
1907లో, సరోజినీ
నాయుడు మరియు లేడీ అమీనా హైదరీ వంటి మహిళలతో కలిసి తయ్యబా బేగం హైదరాబాద్‌లో
మహబూబియా బాలికల పాఠశాలను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ నిజాంను ఒప్పించడంలో
ముఖ్యమైన పాత్ర పోషించారు.
తయ్యబా బేగం,
లేడీ హైదరీ కలిసి అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు. లేడీ హైదరీ క్లబ్‌ను
కూడా ప్రారంభించారు. లేడీ హైదరీ క్లబ్ పేదల కోసం ఒక పాఠశాలను నిర్వహించడంతోపాటు
వారి కోసం ఒక లైబ్రరీని నడుపుతోంది.
1908లో మహా
మూసీ వరద సమయంలో, తయ్యబా బేగం మరియు
లేడీ హైదరీ నష్టపోయిన వారిని ఆదుకోవడానికి సహాయక చర్యలను చేపట్టారు..
తయ్యబా బేగం ఇండియన్
మ్యాగజైన్, లండన్‌తో
జానపద కథలను వ్రాసి ప్రచురించారు. 1905 సంవత్సరంలో, తయ్యబా బేగం అన్వారీ బేగం అనే నవల రాయడం
ముగించింది, ఇది మొదట
1909లో ప్రచురించబడింది. అయితే, ఆమె రచన యొక్క అధికారిక ప్రచురణ 1922లో తయ్యబా బేగం మరణానంతరం
జరిగింది. తయ్యబా బేగం భారతీయ జానపద పాటలపై కూడా పనిచేసినట్లు తెలిసింది.
హైదరాబాద్‌లోని
అనేక మంది మహిళలు తయ్యబా బేగం నుండి ప్రేరణ పొందారు. సుఘ్రా హుమాయున్ మీర్జా హైదరాబాద్‌లో సఫ్దరియా
పాఠశాలను స్థాపించారు.
తయ్యబా
బేగం మరణించి ఒక శతాబ్దం గడిచినా, మూసీ వరదల సమయంలో తయ్యబా బేగం చేసిన సహాయక చర్యలు మరియు
యువతుల కోసం ఆమె స్థాపించిన విద్యాసంస్థల కోసం హైదరాబాద్ ప్రజలు తయ్యబా బేగం ను
గుర్తుంచుకుంటారు.
తయ్యబా బేగం బిల్‌గ్రామీ01-o06-1921లో
మరణించారు.
No comments:
Post a Comment