5 March 2024

ఉత్తర భారతదేశ ముస్లింలు, దక్షిణాది ముస్లిముల కంటే ఉన్నత విద్యలో నమోదులో వెనుకబడి ఉన్నారు .Enrolment into Higher Education Among Muslims Falls, North India Lags Behind the South

 

యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ మరియు ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ డేటా ఆధారంగా 'స్టేట్ ఆఫ్ ముస్లిం ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా' స్టడీని మాజీ ప్రొఫెసర్ అరుణ్ సి మెహతా సంకలనం చేసి విశ్లేషించారు.

భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోని ముస్లిములతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల ముస్లిం కమ్యూనిటీలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్యలో ఎక్కువుగా నమోదు అయ్యారు.

నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ & అడ్మినిస్ట్రేషన్ (NIEPA)లో ఎడ్యుకేషనల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (EMIS)కి అధిపతిగా ఉన్న మాజీ ప్రొఫెసర్ అరుణ్ సి మెహతా సంకలనం చేసి విశ్లేషించిన స్టేట్ ఆఫ్ ముస్లిం ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాఅనే అధ్యయనంలో ఇది పేర్కొనబడింది..

కేంద్ర విద్యాశాఖ పర్యవేక్షణలో ఉన్న యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (UDISE ప్లస్) నుండి 2020-21 మరియు 2021-22 డేటా ఆధారంగా - అతిపెద్ద పాఠశాల విద్యా డేటాబేస్ - మరియు 2020-21 డేటా ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్‌పై ఆల్ ఇండియా సర్వే ( AISHE) నుండి డేటా తీసుకోబడినది.




దక్షిణాది రాష్ట్రాలు, UTలలో ముస్లిం విద్య;

 

·       దక్షిణ భారత రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో (UTs) 2016-17లో 17,39,218 మంది ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్యలో చేరారు,

·       2019-20 నాటికి వారి సంఖ్య 21,00,860కి పెరిగింది.

·       అయితే, తరువాతి సంవత్సరం (20-21) లో 8.53% క్షీణత ఉంది, ఉన్నత విద్యలో ముస్లింల నమోదు సంఖ్య 19,21,713గా ఉంది  అనగా  1,79,147 మంది విద్యార్థుల తగ్గుదల.కన్పించినది.

·       18 మరియు 23 సంవత్సరాల మధ్య ముస్లిం విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (GER) జాతీయ సగటు 8.41%.

·       ముస్లిం మహిళలు 9.43% మరియు పురుషులు (8.44%) అధిక GERతో మెరుగైన పనితీరు కనబరుస్తున్నారు.

·       ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు మరియు తెలంగాణ మొదలగు ఏడు దక్షిణాది రాష్ట్రాలు  మరియు UTలలోని ముస్లిం విద్యార్థుల GER సాధారణంగా ఎక్కువగా ఉంది.

·       అధ్యయనం ప్రకారం తెలుగు రాష్ట్రమైన తెలంగాణ దాదాపు 34% GERతో అగ్రస్థానంలో ఉంది,

·       తమిళనాడు 28% వద్ద ఉంది.కేరళ 20% వద్ద ఉంది. కర్ణాటక, 15.78% వద్ద ఉంది. ఆంధ్ర ప్రదేశ్ కేవలం 10% ముస్లిం విద్యార్ధులు కళాశాలకు వెళుతున్నారు.

దక్షిణ ప్రాంతంలోని UTల విషయానికి వస్తే,

·       పుదుచ్చేరిలో 25% కంటే ఎక్కువ మంది ముస్లిం విద్యార్థులు ఉన్నత చదువుల్లో చేరారు,

·       లక్షద్వీప్‌లో 4% కంటే తక్కువ మంది ముస్లిం విద్యార్థులు ఉన్నత చదువుల్లో చేరారు.

దక్షిణాది మరియు దక్షిణ  UTలలోని  ముస్లిం మహిళలGER 25% కంటే ఎక్కువ గా ఉంది. ఇది మగవారి కంటే 10 శాతం ఎక్కువగా ఉంది.



హిందీ ప్రాంతాలలో In Hindi states

హిందీ ప్రాంతాలలో  కనీసం తొమ్మిది రాష్ట్రాలు మరియు ఒక UT - ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ మరియు ఢిల్లీ ఉన్నాయి.

·       అధ్యయనం ప్రకారం, అక్కడ  సగటున దాదాపు 7% మంది ముస్లిం విద్యార్థులు ఉన్నత చదువులలో చేరారు. ఇది దక్షిణాది ముస్లిం విద్యార్ధుల కంటే 12 శాతం తక్కువ.

·       ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ముస్లిం విద్యార్థులలో జార్ఖండ్‌లో అత్యధిక౦గా (దాదాపు 15%)గా  తర్వాత ఉత్తరాఖండ్ (12.48%) ఉంది.

·       హిందీ రాష్ట్రాల్లో కాలేజీలో చేరిన ముస్లిం మహిళా విద్యార్థుల శాతం  13% గా ఉంది.

·       జాతీయ రాజధాని ఢిల్లీ లో కాలేజీలో చేరిన ముస్లిం మహిళా విద్యార్థుల శాతం 7.09% ఉంది. ఛత్తీస్‌గఢ్ (7%) గా. మధ్యప్రదేశ్ 6.57% గా ఉంది.

·        బీహార్, ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్లో వరుసగా  ఉన్నాయి, వరుసగా 6.13%, 5.43% మరియు 5.08%  ముస్లింవిద్యార్థులు కనీసం గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు ఉన్నత చదువులు చదువుతున్నారు.

·       హర్యానా కేవలం 4.49%తో, హిందీ  రాష్ట్రాలలో అట్టడుగున ఉంది

 

 సామాజిక-ఆర్థిక సూచికలలో వ్యత్యాసం:

 

ప్రొఫెసర్ జియావుద్దీన్ ప్రకారం దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు మరియు హిందీ ప్రాంతానికి  చెందిన విద్యార్థులలో సామాజిక-ఆర్థిక సూచికలలో తీవ్ర వ్యత్యాసం ఉంది.

  ‘‘తలసరి ఆదాయంలో గానీ, దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిలో గానీ దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. రిజర్వేషన్ విధానాలు "అట్టడుగు మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థుల నమోదును పెంచడానికి ప్రవేశపెట్టబడ్డాయి"

 

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా సోషియాలజీ ప్రొఫెసర్ ఇంతియాజ్ అహ్మద్ దక్షిణాది రాష్ట్రాలు మైనారిటీ వర్గాల పట్ల మరింత సహనంతో మరియు కలుపుకొని పోతున్నాయని అన్నారు.

 

ఇతర ఆందోళనలు

 

ప్రొఫెసర్ జియావుద్దీన్ భారతదేశంలో ముస్లిముల  ఉన్నత చదువులలో మొత్తం తక్కువ GER కు కారణం ", బ్యాంకులు ముస్లిం సమాజానికి పెద్దగా మద్దతు ఇవ్వవు" అని పేర్కొన్నారు.

 

భారతదేశంలో ఎక్కువ మంది ముస్లింలు తక్కువ-ఆదాయ వర్గాలకు చెందినవారు మరియు వారికి పెద్దగా ఆస్తులు లేవు.ఆర్ధిక పరిస్థితుల వలన . ముస్లిములు ఉన్నత చదువుల్లో చేరడం తగ్గిపోయింది’’ అని అన్నారు.

 

తెలంగాణలో ముస్లింల సామాజిక-ఆర్థిక మరియు విద్యా స్థితిగతులపై జి సుధీర్ కమిషన్ 2016 నివేదికను ఉటంకిస్తూ, ఉన్నత విద్యను అభ్యసించే ముస్లింలకు ఆర్థిక సహాయం అందించడంలో బ్యాంకులు వెనుకాడడం వారి వెనుకబాటుతనాన్ని గుణించిందని అన్నారు .సుధీర్‌ కమిషన్‌, సచ్చార్‌ కమిటీ నివేదికల్లో ఈ విషయాన్ని ఎత్తిచూపారు’’ అని జియావుద్దీన్‌ పేర్కొన్నారు.

 



·       దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా కర్ణాటక, కేరళ, తెలంగాణలో ప్రైవేట్ విద్యాసంస్థలు పెరుగుతున్నాయి. ఆర్ధిక కారణాల వలన ప్రాథమిక విద్య తర్వాత ముస్లిములలో  డ్రాపౌట్‌లు పెరుగుతున్నాయి.  

·       అధ్యయనం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో కర్ణాటక మరియు కేరళ కంటే ఎక్కువ మంది ముస్లిం విద్యార్థులు సెకండరీ విద్య తర్వాత ఆపివేసినట్లు  ఉంది.

·       హిందీ  రాష్ట్రాలలో, బీహార్ మరియు జార్ఖండ్ మాత్రమే 20 శాతానికి పైగా పాఠశాల డ్రాపౌట్‌లను నమోదు చేసినవి. తర్వాత వరుసగా రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.

·       2022లో, కేంద్ర ప్రభుత్వం 2022-23 విద్యా సంవత్సరం నుండి మైనారిటీ విద్యార్థుల కోసం ఉద్దేశించిన మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ (MANF)ని రద్దు చేయాలని నిర్ణయించింది.

 

సిఫార్సులు:

 

·       అధ్యయనం ప్రకారం, ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం ఉన్నత విద్యతో ముడిపడి ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొంది.

·       ముస్లిం విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా స్కాలర్‌షిప్‌లు, గ్రాంట్లు మరియు విద్యా రుణాలు వారిని ఉన్నత చదువులు చదివేందుకు ప్రోత్సహిస్తాయి.

·       ముస్లిం విద్యార్థులకు  స్కాలర్‌షిప్‌లు మరియు గ్రాంట్‌ల సంఖ్యను పెంచడం కూడా వారిని ప్రోత్సహించి ఉన్నత విద్యను పొందేందుకు వీలు కల్పిస్తుంది.

·       నమోదును ప్రోత్సహించడంలో ఈ ఆర్థిక సహాయాలు గణనీయమైన మార్పును కలిగిస్తాయి.

·       అధ్యయనం ప్రకారం, గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాల్లోని ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా చూసుకోవడం చాలా అవసరం.

·       ఈ ప్రాంతాల్లో మరిన్ని పాఠశాలలు మరియు విద్యా సౌకర్యాలను నెలకొల్పడం మరియు వాటి మౌలిక సదుపాయాలు మరియు బోధనా ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా విద్యార్థులు ఉన్నత విద్యకు పురోగమించే అవకాశాన్ని పెంచవచ్చని పేర్కొంది.

 

No comments:

Post a Comment