జెరూసలేం యొక్క పాత క్వార్టర్స్‌లో ప్రఖ్యాత హెరోడ్ గేట్ మరియు అల్-అక్సా మసీదు మధ్య కొద్ది దూరంలో ఒక చిన్న భారతీయ విశ్రాంతి స్థలం/బాబా ఫరీద్లాడ్జ్/ జావియా అల్-హిందీయా (hospice) ఉంది. బాబా ఫరీద్ లాడ్జికి వెళ్లే జెరూసలేం వీధికి 'జావియత్ ఎల్-హునుద్' అనే పేరు ఉంది, దీని అర్థం 'భారతీయ మూల'.
జెరూసలేం యొక్క భారతీయ విశ్రాంతి స్థలం/ బాబా
ఫరీద్ లాడ్జ్/జావియా అల్-హిందీయా గత 800
సంవత్సరాలకు పైగా భారతదేశంతో చెరగని సంభంధం కలిగి ఉంది.
భారతీయ విశ్రాంతి స్థలం/ బాబా ఫరీద్ లాడ్జ్/జావియా అల్-హిందీయా ఆస్తి వక్ఫ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాజమాన్యంలో ఉంది మరియు భారతీయ పౌరసత్వం లేదా వారసత్వం ఉన్న వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. భారతీయ విశ్రాంతి స్థలం/ బాబా ఫరీద్ లాడ్జ్/జావియా అల్-హిందీయా కు విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, న్యూ ఢిల్లీచే గుర్తింపు ఇవ్వబడింది.
అక్టోబర్ 2021లో, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారతదేశం మరియు జెరూసలేం మధ్య 800 సంవత్సరాల అనుబంధాన్ని నొక్కిచెప్పే కొత్త ఫలకాన్ని జావియా అల్-హిందీయాఆవిష్కరించారు.
బాబా ఫరీద్ ఎవరు?
ముల్తాన్ సమీపంలోని కొతేవాల్ గ్రామంలో 1173 CEలో
జన్మించిన బాబా ఫరీద్, కాబూల్ నుండి పంజాబ్‌కు వలస వచ్చిన కుటుంబములో జన్మించారు. బాబా
ఫరీద్ సూఫీ చిస్తీ క్రమాన్ని అనుసరించాడు మరియు పంజాబీలో తన ఆద్యామిక గీతాలు verses
వ్రాసిన మొదటి సూఫీ సాధువులలో ఒకడు. వీటిలో చాలా ఆద్యామిక గీతాలు/శ్లోకాలు సిక్కుల
పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌లో పొందుపరచబడ్డాయి.
పంజాబ్‌కు చెందిన బాబా ఫరీద్ అనే సూఫీ సన్యాసి ఈ ప్రదేశంలో 40 రోజులు ధ్యానంలో గడిపినట్లు కథనం. బాబా ఫరీద్ పంజాబ్‌కు తిరిగి వచ్చినప్పటికీ, మక్కాకు వెళ్లే భారతీయ ముస్లింలు ఈ ప్రదేశంలో ప్రార్థన చేయడానికి జెరూసలేం నగరాన్ని సందర్శించడం ప్రారంభించారు.
కాలక్రమేణా, ఈ ప్రదేశం భారతదేశం నుండి వచ్చే యాత్రికుల కోసం ఒక పుణ్యక్షేత్రంగా మరియు భారతీయ విశ్రాంతి స్థలం/లాడ్జ్/గా రూపాంతరం చెందింది దీనిని జావియా అల్-హిందీయా అని అందురు.
పంజాబ్ మరియు వెలుపల తన ప్రయాణాలలో, బాబా ఫరీద్ జెరూసలేంను సందర్శించాడు, అక్కడ బాబా ఫరీద్ అల్-అక్సా మసీదులో ప్రార్థనలు చేశాడు మరియు భక్తి గీతాలను కంపోజ్ చేశాడు. పాత జెరూసలేం యొక్క వీధులలో ఒకదానిలో ఒక నిరాడంబరమైన లాడ్జ్‌ని బాబా ఫరీద్ కనుగొన్నాడని, దీనిని ముస్లింలు బాబ్-అజ్-జహ్రా అని మరియు క్రైస్తవులు హెరోడ్ గేట్ అని పిలుస్తారు. ఈ లాడ్జ్ లో ఒక సూఫీ ఖాన్ఖా ఉంది. సూఫీ తరికా అనుచరుల కోసం సెమినరీలు మరియు ప్రయాణికుల కోసం ధర్మశాలలు- హెరోడ్ గేట్‌లోని ఒక చిన్న కొండపై ఉన్నాయి.
హేరోదు గేట్ వెనుక ఇరుకైన రాళ్లతో నిండిన సందులు సందడిగా పండ్లు, కిరాణా సామాగ్రి మరియు మొబైల్ ఫోన్‌లు విక్రయించే దుకాణాలతో నిండి ఉన్నాయి. టీ హౌస్‌లో వృద్ధులు కార్డులు ఆడుతున్నారు. సాయుధ ఇజ్రాయెల్ సైనికులు అంతటా మోహరించారు, అయితే విశ్రాంతి స్థలం/లాడ్జ్ యొక్క ఆకుపచ్చ ద్వారాలు గుండా భారతీయ విశ్రాంతి స్థలం/బాబా ఫరీద్ లాడ్జ్ లేదా జావియా అల్-హిందీయా లోకి రాక ప్రశాంతమైన ఒయాసిస్‌లోకి ప్రవేశించినట్లు ఉంటుంది. .
బాబా ఫరీద్ నిష్క్రమణ తరువాత, ఖాన్ఖా భారతదేశం నుండి వచ్చే ప్రయాణికుల కోసం ఒక లాడ్జ్ గా పరిణామం చెందింది, జావియా అల్-హిందీయా అనే పేరు వచ్చింది, దీని అర్థం "హింద్ యొక్క లాడ్జ్". విశేషమేమిటంటే, క్రిస్టియన్ క్రూసేడర్లు, మమ్లుక్స్ మరియు ఒట్టోమన్ పాలకులు సహా చేతులు మారినప్పటికీ, బాబా ఫరీద్ లాడ్జ్ భారతదేశంతో తన అనుబంధాన్ని నిలుపుకుంది.
మధ్యయుగ యాత్రికుడు ఎవ్లియా చెలేబి జావియా అల్-హిందీయా-భారత ధర్మశాల-1671లో జేరుసులెం నగరంలోని అతిపెద్ద జవియాలలో ఒకటిగా వర్ణించాడు. 1824లో ఒట్టోమన్ పరిపాలనలో గులాం మొహమ్మద్ అల్-లాహోరి అనే షేక్ ఆధ్వర్యం లో బాబా ఫరీద్ లాడ్జ్ సౌకర్యాలు విస్తరించబడ్డాయి.
ఒట్టోమన్ పాలనలో, ప్రధానంగా దక్షిణాసియా నుండి వచ్చిన షేక్‌ల ఆధ్వర్యంలో లాడ్జ్ యొక్క ప్రాముఖ్యత కొనసాగింది. అయితే, 1919లో ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం ప్రారంభమైనప్పుడు ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. 1921 నాటికి, జెరూసలేం గ్రాండ్ ముఫ్తీ అమీన్ అల్-హుసైనీ బాధ్యతలు స్వీకరించారు మరియు విస్తృతమైన పునర్నిర్మాణాలు మరియు పునర్నిర్మాణ ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేందుకు, బ్రిటిష్ ఇండియాలోని ముస్లిం రాచరిక రాష్ట్రాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం పోషకుల నుండి గ్రాండ్ ముఫ్తీ మద్దతు కోరారు.
గత 90 సంవత్సరాలకు పైగా, భారతీయ విశ్రాంతి స్థలం/లాడ్జ్ లేదా జావియా అల్-హిందీయా ను అన్సారీ కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. అన్సారీ కుటుంబ సభ్యులమూలాల ఇండియా లోని ఉత్తర ప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో కలవు. అన్సారీ కుటుంబ సభ్యులు స్థానిక పాలస్తీనియన్లను వివాహం చేసుకున్నప్పటికీ, వారందరూ భారతీయ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్నారు మరియు భారతీయ విశ్రాంతి స్థలం/బాబా ఫరీద్ లాడ్జ్ లేదా జావియా అల్-హిందీయా లోని చిన్న మసీదు భారతీయ జెండాతో అలంకరించబడింది.
“ఇది అన్ని మతాల భారతీయ యాత్రికుల కోసం ఒక అతిథి గృహం. శతాబ్దాలుగా, అల్-అక్సా మసీదులో ప్రార్థనలు చేయడానికి జెరూసలేం వచ్చిన భారతీయులకు విశ్రాంతి స్థలంగా ఉంది, ”అని విశ్రాంతి స్థలం/బాబా ఫరీద్ లాడ్జ్ లేదా జావియా అల్-హిందీయా ప్రస్తుత సంరక్షకుడు అన్సారీ చెప్పారు.
బాబా ఫరీద్ భారతదేశం నుండి ఇక్కడకు వచ్చారు మరియు 40 రోజులు ఈ ప్రదేశంలో ఉండి, ధ్యానం చేస్తూ మరియు అల్-అక్సా మసీదుకు సమీపంలో ఉన్నారు. ఇది భారతీయ విశ్రాంతి స్థలం/బాబా ఫరీద్ లాడ్జ్ లేదా జావియా అల్-హిందీయా కు నాంది మరియు అప్పటి నుండి, భారతీయులు సంవత్సరాల తరబడి ఇక్కడకు వస్తారు మరియు వారు బాబా ఫరీద్ బస చేసిన ప్రదేశ సమీపంలోనే ఉంటారు., ” అని అన్సారీ చెప్పారు.
శతాబ్దాలుగా, కొంతమంది భారతీయ యాత్రికులు ఈ ప్రాంతంలో భూమిని కొనుగోలు చేశారు మరియు వారు వెళ్ళటప్పుడు దానిని భారతీయ విశ్రాంతి స్థలం/బాబా ఫరీద్ లాడ్జ్ లేదా జావియా అల్-హిందీయా కు విరాళంగా ఇచ్చారు. దీనితో భారతీయ విశ్రాంతి స్థలం/లాడ్జ్ లేదా జావియా అల్-హిందీయా విస్తీర్ణం దాదాపు 7,000 చదరపు మీటర్లకు పెరిగింది.
జెరూసలేం లోని భారతీయ విశ్రాంతి స్థలం/బాబా ఫరీద్ లాడ్జ్ లేదా జావియా అల్-హిందీయా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది.. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మరియు ఒట్టోమన్ సామ్రాజ్యం ముగింపు తర్వాత, భారతీయ విశ్రాంతి స్థలం/బాబా ఫరీద్ లాడ్జ్ లేదా జావియా అల్-హిందీయా వైభవం క్షీణించింది
ఆ సమయంలో అరబ్ జాతీయవాది మొహమ్మద్ అమీన్ అల్-హుస్సేనీ నేతృత్వంలోని జెరూసలేం యొక్క సుప్రీం ముస్లిం కౌన్సిల్, భారతీయ విశ్రాంతి స్థలం/బాబా ఫరీద్ లాడ్జ్ లేదా జావియా అల్-హిందీయా అభివృద్ధి కోసం ఎవరినైనా నామినేట్ చేయడానికి బ్రిటిష్ ఇండియా ఖిలాఫత్ ఉద్యమం వైపు సహాయం కోసం చూపింది.
1924లో, నజీర్ అన్సారీ తాత, ఖిలాఫత్ కమిటి ప్రముఖుడైన షేక్ నజీర్ హసన్ అన్సారీ భారతీయ విశ్రాంతి స్థలం/బాబా ఫరీద్ లాడ్జ్ లేదా జావియా అల్-హిందీయా బాధ్యతలు చేపట్టేందుకు జెరూసలేం వెళ్లేందుకు ఎంపికయ్యారు. షేక్ నజీర్ హసన్ అన్సారీ హైదరాబాద్‌తో సహా బ్రిటిష్ ఇండియాలోని అనేక ముస్లిం రాజ్యాల పాలకులను భారతీయ విశ్రాంతి స్థలం/లాడ్జ్ లేదా జావియా అల్-హిందీయాను పునరుద్ధరించడానికి మరియు నిర్వహించడానికి విరాళాలు ఇవ్వడానికి ఒప్పించాడు.
చాలా మంది భారతీయులు 1930లు మరియు 1940లలో ఇస్లాంలోని మూడవ పవిత్ర స్థలమైన అల్-అక్సా మసీదులో ప్రార్థన చేసేందుకు జెరూసలేంకు వెళ్లారు. భారతీయు యాత్రికులు చాలామంది భారతీయ విశ్రాంతి స్థలం/బాబా ఫరీద్ లాడ్జ్ లేదా జావియా అల్-హిందీయా లో ఉన్నారు. కానీ రెండవ ప్రపంచ యుద్ధం మరియు ఇజ్రాయెల్ కొత్త రాజ్యం ఏర్పడటంతో భారతీయ యాత్రికుల ప్రవాహం తగ్గిపోయింది.
చాలా సంవత్సరాల పాటు భారతీయ విశ్రాంతి స్థలం/బాబా ఫరీద్ లాడ్జ్ లేదా జావియా అల్-హిందీయా బ్రిటిష్ సైన్యం యొక్క భారతీయ 4వ పదాతిదళ విభాగానికి శిబిరంగా మారింది. 1948 మొదటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో, భారతీయ విశ్రాంతి స్థలం/బాబా ఫరీద్లాడ్జ్ లేదా జావియా అల్-హిందీయా షెల్లింగ్‌తో దెబ్బతింది మరియు తరువాత జావియా అల్-హిందీయా నిరాశ్రయులైన పాలస్తీనియన్లకు ఆశ్రయంగా పనిచేసింది.
భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, నజీర్ అన్సారీ ఈజిప్టులోని భారతీయ రాయబార కార్యాలయం నుండి బాబా ఫరీద్ లాడ్జికి అధికారిక గుర్తింపును పొందారు. 1952లో, ముహమ్మద్ మునీర్ అన్సారీ (నజీర్ హసన్ అన్సారీ మరియు అతని పాలస్తీనియన్ భార్య ముసర్రా కుమారుడు) భారతీయ విశ్రాంతి స్థలం/లాడ్జ్ లేదా జావియా అల్-హిందీయా సంరక్షక బాధ్యతలు స్వీకరించారు.
15 సంవత్సరాల తర్వాత,1967 ఆరు రోజుల యుద్ధంలో భారతీయ విశ్రాంతి స్థలం/బాబా ఫరీద్ లాడ్జ్ లేదా జావియా అల్-హిందీయా మళ్లీ దెబ్బతింది. మునీర్ అన్సారీ తల్లి, సోదరి మరియు ముగ్గురు వ్యక్తులు భారతీయ విశ్రాంతి స్థలం/బాబా ఫరీద్ లాడ్జ్ లేదా జావియా అల్-హిందీయా కు ఇజ్రాయెల్ షెల్స్ తాకడంతో మరణించారు.
విస్తారమైన నష్టం జరిగినప్పటికీ, మునీర్ అన్సారీ భారతీయ విశ్రాంతి స్థలం/బాబా ఫరీద్ లాడ్జ్ లేదా జావియా అల్-హిందీయా ను పునర్నిర్మించారు మరియు ఇప్పటికీ జెరూసలేంకు ప్రయాణించే కొద్దిమంది భారతీయ యాత్రికుల కోసం ఇది తెరిచి ఉండేలా చూసుకున్నారు.
ఒకప్పుడు జెరూసలేంలో ఇలాంటి విశ్రాంతి స్థలం/లాడ్జ్ చాలా
ఉన్నాయి. కానీ ఇది సమస్యాత్మకమైన ప్రదేశం మరియు అటువంటి ప్రదేశాలను నిర్వహించడం
మరియు రక్షించడం కష్టం. ఒకదాని తర్వాత ఒకటి, మిగిలినవన్నీ మూసివేయబడ్డాయి, ”అని మునీర్
అన్సారీ తండ్రి నజీర్ అన్సారీ చెప్పారు.
షేక్ మహ్మద్ మునీర్ అన్సారీ 2011లో,
ప్రవాసీ
భారతీయ సమ్మాన్ (ఓవర్సీస్ ఇండియన్ అవార్డు)తో సత్కరించబడినాడు.,.
జెరుసులెం ప్రాంతంలో గందరగోళం ఉన్నప్పటికీ, జావియా అల్-హిందీయా/బాబా ఫరీద్ లాడ్జిలో రెండు భారతీయ జెండాలు సగర్వంగా ఎగురుతూనే ఉన్నాయి. ప్రతి ఆగస్టు 15న, అన్సారీలు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జెరుసులెం లో జరుపుతారు. “సారే జహాన్ సే అచ్చా, హిందుస్థాన్ హమారా.”అని సగర్వం గా పలుకుతారు.
ఇప్పటికీ బాగా పని చేస్తున్న మరియు చెక్కుచెదరకుండా ఉన్న ఏకైక లాడ్జ్ భారతీయ విశ్రాంతి స్థలం/బాబా ఫరీద్ లాడ్జ్ లేదా జావియా అల్-హిందీయా. జావియా అల్-హిందీయా లో ఆరు గదులు ఉన్నాయి, అవి 15 మందికి వసతిని కల్పిస్తాయి భారతీయ విశ్రాంతి స్థలం/బాబా ఫరీద్ లాడ్జ్ లేదా జావియా అల్-హిందీయా లో ఆరు అతిథి గదులు, ఒక చిన్న మసీదు, ఒక లైబ్రరీ, డైనింగ్ హాల్ మరియు వంటగది ఉన్నాయి. హాస్టల్ అందించిన సామాగ్రి మరియు సామగ్రిని ఉపయోగించుకుని, వారి స్వంత వంట మరియు లాండ్రీని జాగ్రత్తగా చూసుకోవాలని అతిథులు కోరబడతారు.
అన్సారీ కుటుంబం జెరూసలెంలో భారత ఆతిథ్యం,
మరియు
ఔనత్యాన్ని జావియా
అల్-హిందీయా కొనసాగిస్తుంది.
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్,హిందూస్తాన్ టైమ్స్
సౌజన్యం తో
.
No comments:
Post a Comment