28 October 2023

1932 హిందీ బాలీవుడ్ చిత్రం 'ఇంద్రసభ' 72 పాటలతో ప్రపంచ రికార్డు కలిగి ఉంది WORLD RECORD: 1932 Hindi Bollywood Film ‘Indrasabha’ had 72 Songs

 



స్వాతంత్ర్యానికి పూర్వం వచ్చిన బాలీవుడ్ చిత్రం ఇందర్ సభ, 72 పాటలతో  ప్రపంచ రికార్డును కలిగి ఉంది.


భారతీయ సినిమాలో పాట మరియు నృత్యం అంతర్భాగం. పాశ్చాత్య దేశాలలో మ్యూజికల్స్ అనే ప్రత్యేక శైలి ఉన్నప్పటికీ, చాలా భారతీయ సినిమాలు డిఫాల్ట్ మ్యూజికల్‌గా ఉంటాయి. థ్రిల్లర్ అయినా, మర్డర్ మిస్టరీ అయినా, రొమాంటిక్ కామెడీ అయినా లేదా ఫ్యామిలీ డ్రామా అయినా, చాలా భారతీయ చిత్రాలలో పాటలు చోటు చేసుకుంటాయి. ఒక భారతీయ చలనచిత్రం, 72 పాటలతో ప్రపంచ రికార్డును కలిగి ఉంది.

72 పాటలతో బాలీవుడ్ చిత్రం-ఇంద్రసభ

హమ్ ఆప్కే హై కౌన్ 1994లో 14 పాటలతో విజయవంతం కాగా అంతకు ముందు కూడా అనేక హిందీ చలన చిత్రాలలో డజనుకు పైగా పాటలు ఉన్నాయి. చికాగో మరియు మౌలిన్ రూజ్ వంటి హాలీవుడ్ మ్యూజికల్స్ కూడా చాలా పాటలను కలిగి ఉన్నాయి. కాని వాటిని 1932లో ఇందర్ సభ నాటకం ఆధారంగా తీసిన ఇంద్రసభ అనే హిందీ సినిమాతో పోల్చలేము. 3న్నర గంటల ఇంద్రసభ చిత్రం లో మొత్తం 72 పాటలు ఉన్నాయి. ఆలం అరా తర్వాత ఒక సంవత్సరంకు  పౌరాణిక నాటకం ఇంద్రసభ విడుదలైంది. ఇంద్రసభ మొదటి భారతీయ టాకీలలో ఒకటి.

ఇంద్రసభలో 72 పాటలు

ఇంద్రసభ అనేది 19వ శతాబ్దానికి చెందిన ఆఘా హసన్ అమానత్ రచించిన ఇందర్ సభ అనే ఉర్దూ నాటకం కు రూపాంతరం. ఇందర్ సభ అనే ఉర్దూ నాటకాన్ని మొదటిసారిగా మూకీ చిత్రం ఇంద్రసభ గా 1925లో తెరపైకి తెచ్చారు కానీ. అలామ్ అరా భారతదేశంలో టాకీ విప్లవాన్ని తీసుకువచ్చినప్పుడు, మదన్ థియేటర్ ఇంద్రసభ చిత్రాన్ని ధ్వనితో తిరిగి విడుదల చేయాలని నిర్ణయించుకుంది.

1932 విడుదల ఇంద్రసభ చిత్రంలో మాతృక ఉర్దూ నాటకం ఇందర్ సభ లోని   31 గజల్స్, 9 థమ్రీలు, 4 హోలీలు, 15 పాటలు మరియు ఏడు ఇతర సంగీత సంఖ్యలను ఉపయోగించారు. వీటికి తోడూ ఇంద్రసభ టాకీ చిత్రము  కొన్నింటిని అదనంగా జోడించి, మొత్తం 72 పాటలను అందించింది. ఈ ఘనత ఇంద్రసభకు పలు రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించింది.

మూలం: dnaindia.com, అక్టోబర్ 26, 2023

No comments:

Post a Comment