7 October 2023

దుర్గా భాభి: స్వాతంత్ర్య సమరయోధురాలు Durga Bhabhi: Freedom fighter

 


లాహోర్ కుట్ర కేసులో చాలా మంది విప్లవకారులను అరెస్టు చేసిన తర్వాత మరియు భగవతి చరణ్ పరారీలో ఉన్నప్పుడు అరెస్టయిన విప్లవకారులతో  సంబంధాలను దుర్గాభాబీ చూసుకున్నది. విప్లవకారులందరు, అతిథులుగా జీవించడానికి దుర్గాభాబీ ఇల్లు ఒక సెరాయ్‌గా మారింది. దుర్గా దేవి వోహ్రా లేదా దుర్గా భాభిగా ప్రసిద్ధి చెందిన దుర్గావతి దేవి పాత్రను గుర్తు చేసుకుంటూ విప్లవకారుడు మరియు దుర్గా భాభి సన్నిహిత మిత్రులలో ఒకరైన రామ్ చంద్ర ఈ మాటలు రాశారు :

భారత స్వాతంత్ర్య పోరాటంలో దుర్గా భాభి ఆకాశంలో ప్రకాశవంతమైన శుక్ర నక్షత్రం(Venus) వంటిది.. చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ (HSRA) యొక్క ప్రముఖ విప్లవకారుడిని వివాహం చేసుకున్న దుర్గా భాభి విప్లవకారులకు గూఢచారిగా పనిచేశారు మరియు బ్రిటిష్ సంస్థలపై దాడులకు నాయకత్వం వహించారు. 

భగత్ సింగ్ గురించి దాదాపు ప్రతి భారతీయుడికి తెలుసు మరియు లాలా లజపత్ రాయ్ హత్యకు ప్రతీకారంగా భగత్ సింగ్ బ్రిటిష్ అధికారిని చంపాడు. భగత్ సింగ్ మరియు అతని ఇతర సహచరులు అరెస్టు నుండి తప్పించుకునేలా చూసింది దుర్గా భాభి.

విప్లవకారుడు రామ్ చంద్ర ఇలా వ్రాశాడు, “హత్య తర్వాత, భగవతీ చరణ్, దుర్గాభాభి వద్ద అత్యవసర పరిస్థితి కోసం వదిలిపెట్టిన ఐదు వందల రూపాయలు తీసుకోబడ్డాయి మరియు విప్లవ కారుల ప్రయాణాలకు ఏర్పాట్లు చేయబడ్డాయి. రాత్రి పూట భగత్ సింగ్, సుఖ్ దేవ్ మరియు రాజ్ గురు భగవతి చరణ్ ఇంటికి వచ్చారు. దుర్గా దేవి వారికి మంచి విందు వండి వడ్డించారువారు రాత్రి ఇంట్లో పడుకుని ఉదయం కలకత్తా మెయిల్  ద్వారా  లాహోర్ నుండి బయలుదేరారు.. భగత్ సింగ్, దుర్గా భాభి మరియు ఆమె 2 ఏళ్ల కుమారుడు సాచి ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో సాహిబ్, మేమ్ మరియు వారి కొడుకుగా ఉన్నారు. రాజ్‌గురు థర్డ్ క్లాస్ సర్వెంట్స్ కంపార్ట్‌మెంట్‌లో కూర్చుని లక్నోలో దిగిపోయాడు. భగత్ సింగ్, దుర్గా భాభి మరియు ఆమె 2 ఏళ్ల కుమారుడు కలకత్తా చేరుకున్నారు, అక్కడ వారికి భగవతి చరణ్ మరియు సుశీల స్వాగతం పలికారు. భగత్ సింగ్‌తో కలకత్తాకు మెమ్ సాహిబ్‌గా రావడంలో తన భార్య యొక్క సాహసోపేతమైన చర్యకు భగవతీ చరణ్  సంతోషించాడు.

భగత్ సింగ్ మరియు B. K. దత్ ద్వారా శాసనసభలో బాంబులు విసిరే పథకంలో దుర్గాభాభి భాగం. భగత్ సింగ్ మరియు ఇతర విప్లవకారులను అరెస్టు చేసిన తర్వాత మరియు భగవతి చరణ్ అరెస్టును తప్పించుకోవడానికి పరారీ అయిన తర్వాత దుర్గా భాభి సందేశాలను పంపడానికి, స్వీకరించడానికి విప్లవకారుల పోస్ట్ బాక్స్‌గా మారింది. దుర్గా భాభి డిఫెన్స్ లాయర్లతో కూడా సంప్రదింపులు జరిపింది  మరియు విప్లవకారులను నుండి సమాచారం స్వీకరించింది మరియు వారి ప్రత్యుత్తరాలు మరియు సందేశాలను డిఫెన్స్ న్యాయవాదులకు తెలియజేసింది.

భగవతి చరణ్ మరియు దుర్గా భాభి, భగత్ సింగ్‌ను కోర్టుకు తీసుకెళ్ళే పోలీసు వ్యాన్‌పై బాంబు దాడి చేసి భగత్ సింగ్ ను  విడిపించడానికి ప్లాన్ చేశారు. దురదృష్టవశాత్తు, 28 మే 1930న ట్రైల్స్ సమయంలో బాంబు పేలడంతో భగవతి చరణ్ మరణించినాడు.. దుర్గా భాభి భర్త మరణించిన తర్వాత మరింత నిర్భయ విప్లవకారిణిగా మారింది. దుర్గా భాభి మాటల్లోనే, "నాకు విప్లవాత్మకమైన పనిలో పూర్తి భాగస్వామ్యం కావాలని నేను (చంద్రశేఖర్) ఆజాద్‌తో చెప్పాను."

దుర్గా భాభి చురుకుగా విప్లవకారుల కోసం ఆయుధాలను స్మగ్లింగ్ చేయడం, బురఖా లో ఉన్న భగత్ సింగ్‌ను మరియు జైలులో ఉన్న ఇతర విప్లవకారులను కలుసుకోవడం మరియు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సందేశాలను పంపడం చేసేది

అక్టోబరు 1930లో భగత్ సింగ్‌కు మరణశిక్ష విధించబడింది. దుర్గా భాభి 'ప్రతీకారం' చేయాలని నిర్ణయించుకుంది మరియు పంజాబ్ గవర్నర్‌పై దాడి చేయాలని నిర్ణయించుకుంది. K Maclean కే.మక్లీన్  ఇలా వ్రాశాడు, “అయితే మలబార్‌లో గవర్నర్ ఉంటున్న ఇంటి చుట్టూ భద్రత ఉన్నందున వారు బదులుగా పోలీస్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు మరియు చివరకు లామింగ్టన్ రోడ్‌లోని పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడిన ఇద్దరు బ్రిటీషర్లను  చూశారు

దుర్గా దేవి ప్రకారం, పృథ్వీ సింగ్ షూట్!అని అరిచాడు మరియు వారిద్దరూ కలిసి కాల్పులు జరిపారు; మూడు లేదా నాలుగు సార్లు కాల్పులు జరిపినారు. ఒక విప్లవ మహిళ ఇద్దరు యూరోపియన్లను కాల్చిచంపడం "ఒక మహిళ తీవ్రవాదానికి  మొదటి ఉదాహరణ" అని ప్రెస్ ప్రకటించింది.

పోలీసులు దుర్గా దేవి ను అరెస్టు చేయలేకపోయారు మరియు దుర్గా దేవి, భగత్ సింగ్‌కు మద్దతుగా ప్రచారం చేసింది. గాంధీ-ఇర్విన్ ఒప్పందం ప్రకారం భగత్ సింగ్ విడుదలను ఒక షరతుగా పెట్టమని ఒప్పించేందుకు దుర్గాభాభి మహాత్మా గాంధీని మరియు ఇతర కాంగ్రెస్ నాయకులను కలిశారు.

దుర్గా భాభిని 1932లో పోలీసులు అరెస్టు చేసి సాధారణ క్షమాభిక్షతో విడుదల చేశారు. దుర్గా భాభి కాంగ్రెస్ కార్యకర్తగా స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా ఉంటూ తర్వాత పాఠశాలలో బోధించారు.

No comments:

Post a Comment