6 October 2023

ఇరాన్ లో జైలు శిక్ష అనుభవిస్తున్న హక్కుల కార్యకర్త నర్గేస్ మొహమ్మది 2023 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు Iran’s jailed rights advocate Narges Mohammadi wins 2023 Nobel Peace Prize

 


 

ఇరాన్‌లో 'మహిళలపై అణచివేతకు' వ్యతిరేకంగా చేసిన పోరాటానికి నర్గేస్ మొహమ్మది గౌరవించబడ్డారు.

జైలులో ఉన్న ఇరాన్ మహిళా హక్కుల కార్యకర్త  నర్గేస్ మొహమ్మది, ఇరాన్‌లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా చేసిన సాహసోపేతమైన పోరాటం మరియు సామాజిక సంస్కరణ కోసం చేసిన అవిశ్రాంత పోరాటానికి గాను 2023 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు.

కటకటాల వెనుక ఉండగా, "మానవ హక్కులు మరియు అందరికీ స్వేచ్ఛను పెంపొందించడానికి" నర్గేస్ మొహమ్మది చేసిన ప్రయత్నాలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతిని అందజేసినట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ తెలిపింది.

 "ఇరాన్ పాలనా యంత్రాంగం, నర్గేస్ మొహమ్మది ని13 సార్లు అరెస్టు చేసింది, ఐదుసార్లు దోషిగా నిర్ధారించింది మరియు మొత్తం 31 సంవత్సరాల జైలు శిక్ష మరియు 154 కొరడా దెబ్బలు విధించింది, ”అని నార్వేజియన్ నోబెల్ కమిటీ ఒక ప్రకటన లో తెలిపింది.

నర్గేస్ మహమ్మదీ, 51, మహిళల హక్కులు మరియు మరణశిక్ష రద్దు కోసం ప్రచారం చేసిన ఇరాన్ యొక్క ప్రముఖ మానవ హక్కుల కార్యకర్తలలో ఒకరు.

ఫ్రంట్ లైన్ డిఫెండర్స్ హక్కుల సంస్థ ప్రకారం, నర్గేస్ మహమ్మదీ ప్రస్తుతం టెహ్రాన్ ఎవిన్ జైలులో దాదాపు 12 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తోంది, మహమ్మదీపై ఇరాన్ దేశానికి వ్యతిరేకం గా దుష్ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

 2003 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిన్ ఎబాడి నేతృత్వంలోని ప్రభుత్వేతర సంస్థ డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్‌కు నర్గేస్ మొహమ్మదీ డిప్యూటీ హెడ్.

 నర్గేస్ మొహమ్మదీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం మరియు సమానత్వం కోసం ప్రయత్నించడం జైలులో ఉన్నప్పటికీ ఆగదని అన్నారు..

"మహిళల విముక్తి వరకు అణచివేత మత ప్రభుత్వం యొక్క కనికరంలేని వివక్ష, దౌర్జన్యం మరియు లింగ-ఆధారిత అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాను" అని నర్గేస్ మొహమ్మదీ పేర్కొన్నారు.

నోబెల్ గుర్తింపు మార్పు కోసం ఇరానియన్ల నిరసనలు మరింత బలంగా మరియు మరింత వ్యవస్థీకృతం చేస్తుందని ఆశిస్తున్నాను. విజయం దగ్గర పడింది. అని నర్గేస్ మొహమ్మదీఅన్నారు.

ఇరాన్‌కు చెందిన నర్గేస్ మొహమ్మదీ నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు .ఇది చాలా ముఖ్యమైన బహుమతి, మానవ హక్కుల రక్షకులు, ప్రత్యేకించి ఇరాన్‌లోని మహిళా హక్కుల రక్షకులు సాధించిన విజయo౦. అని ఓస్లోలోని పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ హెన్రిక్ ఉర్డాల్, అన్నారు.

122 ఏళ్ల చరిత్ర గలిగిన  నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న 19వ మహిళ నర్గేస్ మొహమ్మది.

నార్వేజియన్ నోబెల్ కమిటీ 259 వ్యక్తులు మరియు 92 సంస్థలతో సహా 351 మంది అభ్యర్థుల నుండి ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన శాంతి బహుమతికి ఈ సంవత్సరం విజేతను ఎంపిక చేసింది.

నర్గేస్ మొహమ్మదీ సోదరుడు నోబెల్ శాంతి బహుమతి " నర్గేస్ మొహమ్మదీ పట్ల  చాల గౌరవం " అని చెప్పాడు.

గత సంవత్సరం, నోబెల్ శాంతి బహుమతి బెలారస్ మానవ హక్కుల సమర్ధకుడు అలెస్ బిలియాట్స్కీ, రష్యన్ మానవ హక్కుల గ్రూప్ మెమోరియల్ మరియు ఉక్రేనియన్ మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కు వచ్చింది.

నోబెల్ బహుమతుల్లో శాంతి బహుమతి స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో కాకుండా నార్వే రాజధాని ఓస్లోలో మాత్రమే ఇవ్వబడుతుంది.

గత వారం రోజులుగా మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్ బహుమతులు ప్రకటించారు. ఆర్థిక శాస్త్రానికి తుది బహుమతిని ప్రకటించనున్నారు. ఈ సంవత్సరం, ప్రతి విభాగంలో బహుమతులు 11 మిలియన్ క్రోనా ($990,000) విలువైనవి

ఈ సంవత్సరం, నోబెల్ శాంతి బహుమతికి 351 మంది అభ్యర్థులు ఉన్నారు

శాంతి బహుమతితో పాటు నగదు మొత్తం ఈ సంవత్సరం సుమారు $11 మిలియన్‌ క్రోనా కు చేరుకుంది.

విజేతలు 18 క్యారెట్ల బంగారు పతకం మరియు డిప్లొమా పొందుతారు..

No comments:

Post a Comment