19 October 2023

బలిదానం చేయడానికి ముందు భగత్ సింగ్ జీ తన సహచరులకు రాసిన చివరి లేఖ:

 


స్నేహితులారా!

నాకు కూడా జీవించాలనే కోరిక ఉండడం సహజమే, నేను దానిని దాచి పెట్టను. కానీ నేను ఒక షరతుపై జీవించగలను, నేను బందిఖానాలో లేదా బానిసత్వంలో జీవించకూడదనుకుంటున్నాను.

నా పేరు భారతీయ విప్లవానికి చిహ్నంగా మారింది మరియు విప్లవ౦ యొక్క ఆదర్శాలు మరియు త్యాగాలు నన్ను చాలా ఉన్నతంగా తీర్చిదిద్దాయి- నేను ఇంతకంటే మరింత ఉన్నతంగా ఉండలేను.

ఈరోజు నా బలహీనతలు ప్రజల ముందు లేవు. కాని నేను ఉరి నుండి బయటపడితే, అవి స్పష్టంగా కనిపిస్తాయి మరియు విప్లవం యొక్క చిహ్నం మసకబారుతుంది లేదా తుడిచివేయబడుతుంది. ధైర్యంగా నవ్వుతూ నన్ను ఉరితీస్తే, భారతీయ తల్లులు తమ పిల్లలకు  భగత్ సింగ్ పేరు పెట్టుకొంటారు మరియు దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసే వారి సంఖ్య చాలా పెరుగుతుంది. విప్లవాన్ని ఆపడ౦ సామ్రాజ్యవాదానికి సాధ్యం కాదు.

అవును, నా మనసులో ఒక ఆలోచన వస్తుంది, నేను దేశం మరియు మానవత్వం కోసం నా హృదయంలో ఉన్న కోరికలలో వెయ్యో వంతు కూడా తీర్చలేకపోయాను. నేను స్వేచ్ఛగా మరియు సజీవంగా ఉండగలిగితే, బహుశా వాటిని నెరవేర్చుకునే అవకాశం నాకు లభించి ఉండేది మరియు నా కోరికలను నేను తీర్చుకోగలను.

ఉరి నుండి తప్పించుకోవడానికి నా మనస్సులో ఎప్పుడూ ఎలాంటి ఉద్వేగ౦/టెంప్టేషన్ లేదు. నాకంటే అదృష్టవంతులు ఎవరు ఉంటారు? నా గురించి నేను చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడు అంతిమ పరీక్ష కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. అంతిమ ఘడియకు మరింత దగ్గరవ్వాలని కోరుకుంటున్నాను.

మీ స్నేహితుడు,

భగత్ సింగ్


No comments:

Post a Comment