రంజాన్ మాసంలో చాలా మంది ముస్లింలు జకాత్ ఇస్తారు. జకాత్ అనేది ఇస్లాంలో దాతృత్వానికి సంబంధించిన ప్రముఖ అభివ్యక్తి. వార్షిక ఆదాయం లో 2.5% ఒక వ్యక్తి ఇవ్వవలసిన జకాత్ గా లెక్కించబడుతుంది. సాధారణంగా పేదరికంలో ఉన్నవారికి, అభాగ్యులకు ఇవ్వబడే జకాత్ నిధులు గత కొన్ని సంవత్సరాలుగా, జరిమానాలు చెల్లించడానికి డబ్బులేక జైలు శిక్షలు అనుభవవించే ఖైదీలను విడిపించడానికి ఉపయోగించబడుతున్నాయి,
లాభాపేక్ష లేని కొన్ని ఇస్లామిక్ స్వచ్చంద సంస్థలు, దాతల నుండి జకాత్‌ను సేకరిస్తున్నవి మరియు ఖైదీల విడుదలను పొందేందుకు ఈ నిధులను అందిస్తున్నవి.. ఒక స్వచ్చంద సంస్థ ప్రకారం “గత సంవత్సరం నుండి జైలు శిక్షలకు సంబంధించిన 130 జరిమానాలు చెల్లించబడినవి.. అదనంగా, 35 మంది ఖైదీలకు బెయిల్ డబ్బు చెల్లించాము మరియు వారందరు విడుదల చేయబడినారు.
స్వచ్చంద సంస్థలు , ప్రధమంగా చిన్న నేరాలకు పాల్పడిన మొదటిసారి నేరస్థులు మరియు బెయిల్ లేదా జరిమానాలు చెల్లించడానికి కుటుంబం లేదా స్నేహితులు లేని ఖైదీలను గుర్తించును.. సంస్థ లక్ష్యం అందరికీ సహాయం చేయడమే. ఖైదీల విడుదలకు ఫెసిలిటేటర్లుగా కూడా పని చేస్తుంది.
కొందరు పారిశ్రామిక వేత్తలు కూడా జకాత్ నిధులలో కొంత భాగాన్ని ఖైదీల విడుదలకు కేటాయించారు. ఖైదీలను విడుదల చేయడ౦ కూడా ఇస్లాం లో ఒక ముఖ్యమైన చర్యగా పరిగణించబడుతుంది. “సాధారణంగా, ప్రజలు మదర్సాలకు మరియు అవసరమైన వారికి, ముఖ్యంగా పేద బంధువులకు జకాత్ ఇస్తారు. కానీ ఖైదీల విడుదల కు జకాత్ నిధులు ఇవ్వడం లో మంచితనం రెండు రెట్లు ఉంది: ఒకటి మతపరమైన ఆదేశం నెరవేరుతోంది మరియు చాలా అవసరమైన కుటుంబానికి సహాయం చేయబడుతుంది.
ఒక సామాజిక-మత సంస్థ , గత సంవత్సరం నుండి హైదరాబాద్ మరియు చుట్టుపక్కల జైళ్లలో ఉన్న 68 మంది ఖైదీలను విడుదల చేసినది. ఇస్లామిక్ న్యాయశాస్త్ర దృక్కోణం నుండి సమస్యను వివరిస్తూ, "బానిసత్వం అంతం కాకముందు, బానిసలను విడిపించడానికి జకాత్ డబ్బు ఉపయోగించబడింది. లేఖనాలలో దీని వ్యక్తీకరణ ఉంది.
సురక్షిత విడుదలలకు చెల్లించిన
జరిమానాలు ₹500 మరియు
₹5,000 మధ్య
ఉన్నాయి. "ఇది చిన్న మొత్తంలా అనిపించవచ్చు, కానీ పేదలకు, దురదృష్టవశాత్తు చేల్లి౦చలేనివారికి అది
చాలా పెద్ద మొత్తం."
No comments:
Post a Comment