27 February 2026

ఖాదిర్ బక్ష్ రిండ్ బలోచ్1841 — 1887) June 1887 లేదా కడు మక్రాని 19వ శతాబ్దపు విప్లవకారుడు

 


ఖాదిర్ బక్ష్ రిండ్ బలూచ్ (కడు మక్రానిగా ప్రసిద్ధి చెందారు; సుమారు 1841 — 5 జూన్ 1887) 19వ శతాబ్దపు భారతీయ విప్లవకారుడు, ఖాదిర్ బక్ష్ ప్రధానంగా గుజరాత్‌లోని కథియవార్ ప్రాంతంలో పనిచేశాడు కానీ మక్రాన్‌ (బలూచిస్తాన్) లో పుట్టి పెరిగాడు. పేద దిగువ తరగతి వారి హక్కులకు అనుకూలంగా గుజరాత్‌లోని ఉన్నత తరగతి వారి పాలనను మరియు బ్రిటిష్ పాలనను వ్యతిరేకించడం మరియు ప్రతిఘటించడంలో ఖాదిర్ బక్ష్ ప్రసిద్ధి చెందారు.

కడు మక్రాని (ఖాదిర్ బక్ష్ రిండ్ బలూచ్) తన జన్మస్థలం మక్రాన్ నుండి గుజరాత్‌లోని జునాగఢ్ సమీపంలోని వాడల్‌కు తన తెగతో వలస వచ్చాడు. 19వ శతాబ్దం మధ్యకాలంలో. మక్రానీ మరియు అతని తెగ వ్యక్తులు  భూభాగాలు మరియు వనరుల కోసం పోరాడారు, ప్రతిగా కథియవార్ రాచరిక రాష్ట్రాల పాలకుల నుండి కప్పం అందుకున్నారు. ఇది బ్రిటిష్ వలస అధికారులను కలవరపెట్టింది, బ్రిటిష్ వారు కడు మక్రాని తెగను నిరాయుధులను చేయాలని ప్రయత్నించారు;

1881లో రిజిస్ట్రేషన్ మరియు జనాభా లెక్కల నెపంతో వలస ప్రభుత్వ సామాజిక కార్యకర్తలు తమ ఇళ్లలోకి ప్రవేశించడాన్ని కడు మక్రానీ మరియు అతని తెగ తిరస్కరించి బ్రిటిష్ వారికి వ్యతిరేకం గా తిరుగుబాటు చేసింది. పౌర మద్దతుతో కడు మక్రానీ యొక్క చిన్న సైన్యం బ్రిటిష్ సైన్యంతో ఘర్షణకు దిగి వారిలో  అనేక మంది ప్రాణనష్టానికి గురిచేసింది. కడు మక్రానీ ఆంగ్లేయుల ముక్కులు కోసేవాడు మరియు 100 మంది యూరోపియన్లను అలాగే శిక్షించినాడు. బ్రిటిష్ సైన్యం కడు మక్రానీ పట్టుకున్నందుకు రూ. 1,000/- బహుమతి మరియు 20 ఎకరాల (81,000 మీ2) భూమి బహుమతిని ప్రకటించారు.

ఏప్రిల్ 1887లో, కథియవార్‌లో పోలీసుల అరెస్టును నివారించడానికి కడు మక్రానీ తన తెగలోని మిగిలిన వారితో కలిసి అహ్మదాబాద్‌కు, ఆపై సింధ్‌కు తరలివెళ్లాడు. ఒక ఒంటెల కాపరి కడు మక్రానీ ని  మక్రాన్‌కు తీసుకెళ్లడానికి అంగీకరించాడు, కానీ వాస్తవానికి , ఒంటెల కాపరి కడు మక్రానీకి ద్రోహం చేసి, బహుమతికి బదులుగా చంపాలని ప్లాన్ చేశాడు; అయితే, ఒంటెల కాపరి కడు మక్రానీపై దాడి చేసినప్పుడు, కడు మక్రానీ అతన్ని చంపి పారిపోయాడు. చివరకు అనేక ప్రయత్నాల తరువాత ఏప్రిల్ 20న కడుమక్రానీ బంధించబడినాడు. ఒక చిన్న విచారణ తర్వాత, కడు మక్రానీ కి మరణశిక్ష విధించబడింది.

కడు  మక్రానీని జూన్ 5, 1887న కరాచీ సెంట్రల్ జైలులో ఉరితీశారు. కడు మక్రానీ ను మేవా షా స్మశానవాటికలో ఖననం చేశారు.

లెగసె:

·       మన్హర్ రాస్కపూర్ దర్శకత్వం వహించిన 1960 గుజరాతీ చిత్రం కడు మక్రానీలో అరవింద్ పాండ్యా ప్రధాన పాత్రలో నటించారు.

·       కడు మక్రానీ చిత్రాన్ని 1973లో గుజరాతీలో మను దేశాయ్ పునర్నిర్మించారు.

·       1966లో, కడు మక్రానీ జీవితం ఆధారంగా పాకిస్తానీ చిత్రం జాగ్ ఉతా ఇన్సాన్ నిర్మించబడింది.

No comments:

Post a Comment