22 February 2026

ఆర్కాట్ నవాబు కుమారుడు-నవాబ్జాదా మొహమ్మద్ ఆసిఫ్ అలీ Nawabzada Mohammad Asif Ali, the son of the Nawab of Arcot. సల్మాన్ హైదర్

 

వెల్లూరుకు సమీపంలో ఉన్న ఆర్కాట్,  రామనాథపురం జిల్లాలోని ఒక చిన్న పట్టణం. కానీ 17వ శతాబ్దంలో, ఔరంగజేబు తన సైన్యాధిపతులలో ఒకరిని తన ప్రతినిధిగా ఆర్కాట్ ప్రాంతానికి పంపినప్పుడు, అది ప్రస్తుత తమిళనాడు మరియు కర్ణాటక ప్రాంతాలను కలిగి ఉన్న కర్ణాటక ప్రాంతం

1692లో, ఔరంగజేబు మరాఠీలపై సాధించిన విజయానికి ప్రతిఫలంగా ఆర్కాట్‌ కేంద్రం గా  జుల్ఫికర్ ఖాన్‌ను కర్ణాటక మొదటి సుబేదార్‌గా నియమించాడు 

ఢిల్లీలో మొఘలుల పతనం తర్వాత, ఆర్కాట్ సుబా కర్ణాటక సుల్తానేట్ అయింది  మరియు అప్పటి నుండి నవాబును కలిగి ఉన్నది. కానీ 1740లో, మరాఠాలు నవాబులను ఓడించారు. అయితే, బ్రిటిష్ వారి సహాయం తో ఒక దశాబ్దం తర్వాత కర్ణాటక ప్రాంతంలో ఆర్కాట్ నవాబు పాలకులు తమ పాలనను తిరిగి ప్రారంభించారు.

అయితే, రాజ్య సంక్రమణ సిద్ధాంతం doctrine of lapse తో, నవాబ్ పాలకులు ప్రతిదీ కోల్పోయారు, అయితే బ్రిటిష్ రాణి నుండి వారి బిరుదు మరియు పెన్షన్ కొనసాగింపుకు హామీ లభించింది.

ప్రస్తుత ఆర్కాట్ ప్రిన్సు నవాబ్ ముహమ్మద్ అబ్దుల్ అలీ కుమారుడు కాబోయే ఆర్కాట్ ప్రిన్సు Heir apparent నవాబ్జాదా మొహమ్మద్ ఆసిఫ్ అలీ. నవాబ్జాదా మొహమ్మద్ ఆసిఫ్ అలీ సంగీత ప్రియుడు.

ఆర్కాట్ ప్రిన్సు నవాబ్ ముహమ్మద్ అబ్దుల్ అలీ చెన్నై సామాజిక మరియు సాంస్కృతిక జీవితంలో ప్రభావాన్ని కలిగి ఉన్నాడు; ఆర్కాట్ ప్రిన్సు నవాబ్ ముహమ్మద్ అబ్దుల్ అలీ దాతృత్వం మరియు కరుణకు చిహ్నం ఆర్కాట్ ప్యాలెస్ ఆర్కాట్ ఫౌండేషన్ నేతృత్వంలోని మానవతావాద కార్యక్రమాలకు కేంద్రంగా ఉంది.

ఆర్కాట్ ప్రిన్సు తరుపున అతని కుమారుడు నవాబ్ జాదా మొహమ్మద్ ఆసిఫ్ అలీ ఛారిటీ డ్రైవ్‌లు, మతాంతర కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు.మతంతో సంబంధం లేకుండా పేదల కోసం ఆర్కాట్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించబడే అనేక సహాయ కార్యక్రమాలలో నవాబ్ జాదా ఆసిఫ్ అలీ చురుకుగా పాల్గొంటారు. 

నవాబ్ జాదా ఆసిఫ్ అలీ ఆర్కాట్ నవాబ్ కుటుంబ మానవతావాద పనికి ప్రజా ముఖంగా మారారు, సహాయ కార్యక్రమాలలో కనిపించడం, సమాజ సమావేశాలలో మాట్లాడటం మరియు వివిధ మతాల నాయకులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడం చేస్తారు.

నవాబ్ జాదా ఆసిఫ్ అలీ అమీర్ మహల్ సాంస్కృతిక మరియు మతాంతర సమావేశాలను కూడా నిర్వహిస్తాడు. నవాబ్ జాదా ఆసిఫ్ అలీ ఇతర సమాజాల నాయకులతో వ్యక్తిగత సంబంధాన్ని కొనసాగిస్తాడు మరియు మత నాయకులు నిర్వహించే సమావేశాలకు హాజరవుతాడు.

సంగీత ప్రియుడైన నవాబ్ జాదా ఆసిఫ్ అలీ "రాస్తే" అనే సంగీత ఆల్బమ్‌ను రూపొందించారు  మరియు ఆ ఆల్బమ్‌ను విడుదల చేసినది ప్రముఖ సంగీత దర్శకుడు AR రహమాన్.

నవాబ్ జాదా ఆసిఫ్ అలీ తాను స్వరపరిచి పాడిన ‘రాస్తే’, ఆల్బం విభిన్న మార్గాల సామరస్యం మరియు అన్ని మార్గాలు ఒకే గమ్యస్థానానికి దారితీస్తాయనే వాస్తవికతను ప్రతిబింబిస్తుంది.

నవాబ్జాదే ఆసిఫ్ అలీ అనేక పాటలను కంపోజ్ చేశారు  మరియు లక్కీ అలీతో కలిసి పనిచేశారు.. నవాబ్జాదే ఆసిఫ్ అలీ దక్షిణాఫ్రికాలోని తమిళుల కోసం నిర్మించిన తమిళ సినిమాలో SP బాలసుబ్రమణ్యం పాడిన పాటను కూడా కంపోజ్ చేశారు..

నవాబ్జాదే ఆసిఫ్ అలీ ద్వారా  అమీర్ ప్యాలెస్ నుండి వినబడే సంగీత స్వరాలు సామరస్యం మరియు పురోగతి కి చిహ్నాలు.

No comments:

Post a Comment