6 February 2026

గొప్ప ఆకలి సమయంలో ఐరిష్ వారికి ఉదారంగా టర్కిష్ సహాయం చేసిన కథ Tale of Generous Turkish Aid to the Irish during the Great Hunger

 

 

 

ఐర్లాండ్ లో సంభవించిన గొప్ప ఆకలి Great Hunger సమయంలో ఒక మిలియన్ మంది మరణించినారు  మరియు ఒక మిలియన్ మంది సామూహిక వలసలను ఎదుర్కొంటున్న సమయంలో, ఒట్టోమన్ సుల్తాన్, ఖలీఫా అబ్దుల్-మాజిద్I, ఐర్లాండ్ రైతులకు సహాయం చేయడానికి £10,000 పంపాలనే తన ఉద్దేశ్యాన్ని ప్రకటించాడని కథ చెబుతుంది. అయితే, విక్టోరియా రాణి జోక్యం చేసుకుని సుల్తాన్‌ను £1,000 మాత్రమే పంపమని అభ్యర్థించింది, ఎందుకంటే విక్టోరియా రాణి స్వయంగా £2,000 మాత్రమే పంపింది.

దీంతో సుల్తాన్ £1,000 మాత్రమే పంపాడు, కానీ ఒట్టోమన్ సుల్తాన్ రహస్యంగా ఐదు ఓడల నిండా ఆహారాన్ని కూడా పంపాడు. ఇంగ్లీష్ వారు ఓడలను అడ్డుకోవడానికి ప్రయత్నించాయి, కానీ ఆహారం డ్రోగెడా నౌకాశ్రయానికి చేరుకుంది మరియు ఒట్టోమన్ నావికులు దానిని అక్కడే వదిలేశారు. ఒట్టోమన్ సుల్తాన్ ఐరిష్ వారికి ప్రతిజ్ఞ చేసిన ఆ £10,000 విలువ ఈ రోజు దాదాపు £800,000 ($1.7 మిలియన్లు) అవుతుంది.

ఒట్టోమన్ సుల్తాన్ చేసిన సహాయం కు కృతజ్ఞతగా, డ్రోగెడా పట్టణం ఒట్టోమన్ నక్షత్రం మరియు చంద్రవంకను దాని కోటు అఫ్ అరమ్స్ coat of arms లో చేర్చింది, దీనిని నేటికీ డ్రోగెడా యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ ఉపయోగిస్తోంది.

ఈ సంఘటన కొన్నిసార్లు జేమ్స్ జాయిస్ యులిస్సెస్ వంటి సాహిత్యంలో ప్రస్తావించబడింది మరియు ఐరిష్ నివాసితులు సుల్తాన్‌కు పంపిన కృతజ్ఞతా లేఖలో ప్రముఖంగా గుర్తించబడింది.ఇది ఒక అద్భుతమైన కథ.

ఈ దాతృత్వ చర్య చుట్టూ "కరువు Famine " అనే ఒక చలన  చిత్రం నిర్మించబడింది. ఆ సమయంలో ఒట్టోమన్ సామ్రాజ్యం అపారమైన అంతర్గత ఇబ్బందులను ఎదుర్కొంటోంది, కానీ సుల్తాన్ ఖలీఫా అబ్దుల్-మాజిద్ ఐర్లాండ్‌లోని ఆకలితో ఉన్న పురుషులు మరియు మహిళలకు సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. రెండు విభిన్న సంస్కృతుల మధ్య స్నేహం ఏర్పడింది. "కరువు Famine "  చిత్రంలో ఒక టర్కిష్ నావికుడు ఒక ఐరిష్ వ్యవసాయ అమ్మాయిని కలుస్తాడు మరియు ఆమె "తన భావోద్వేగాలతో నలిగిపోతుంది" అని కనుగొంటుంది.

"కరువు Famine " చిత్రం  2016లో విడుదల అయినది మరియు దీనిని టిప్పరరీలో జన్మించిన స్క్రీన్ రైటర్ నోరినా మాకీ Norina Mackey తో కలిసి ఒమర్ సరికాయ Omer Sarikaya రచన మరియు దర్శకత్వం వహించారు."కరువు Famine " కథను పరిశోధించడానికి సరికాయ రెండు సంవత్సరాలు గడిపాడు మరియు దానిని పెద్ద తెరపైకి తీసుకురావాలని నిశ్చయించుకున్నాడు. ఈ సినిమా నుండి వచ్చే లాభాలలో ఎక్కువ భాగాన్ని UNICEFకి విరాళంగా ఇస్తానని కూడా సరికాయ అన్నారు.

ప్రస్తుతం 50 మిలియన్ల మంది ఐరిష్ అమెరికన్లు ఉన్నారని అంచనా, వీరిలో చాలామంది 1800లలో ఐర్లాండ్ లో కరువుల వినాశనం నుండి తప్పించుకోవడానికి అమెరికాకు వచ్చిన కుటుంబాల నుండి వచ్చారు."

కరువు Famine” చలన చిత్ర చిత్రీకరణ 2015 వేసవిలో ఐర్లాండ్, ఇంగ్లాండ్ మరియు టర్కీలో జరిగింది.

 

No comments:

Post a Comment