భారత రాజకీయాల్లో ముస్లిం మహిళలు పితృస్వామ్యం, మత ఛాందసవాదం, మరియు వ్యవస్థాగత బహిష్కరణలతో కూడిన ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, 1952 నుండి లోక్‌సభలో కేవలం 18 మంది మాత్రమే సీట్లు సాధించారు," అని రషీద్ కిద్వాయ్ మరియు అంబర్ కుమార్ ఘోష్ తమ 2025 పుస్తకం 'మిస్సింగ్ ఫ్రమ్ ది హౌస్: ముస్లిం విమెన్ ఇన్ ది లోక్‌సభ'లో పేర్కొన్నారు
భారతదేశంలో ఈ దృగ్విషయం ముస్లిం మహిళలకు మాత్రమే ప్రత్యేకమైనది కాదు. భారతదేశవ్యాప్తంగా మహిళల రాజకీయ ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలలోని శాసనసభలు అధికంగా పురుషాధిక్యతతోనే కొనసాగుతున్నాయి. లింగ సమానత్వంలో తనకున్న పేరు ప్రఖ్యాతుల గురించి గొప్పలు చెప్పుకునే కేరళంలో, రాష్ట్ర శాసనసభలో మహిళల ప్రాతినిధ్యం అత్యంత తక్కువగా కొనసాగుతోంది.
అధిక అక్షరాస్యత రేట్లు, ప్రగతిశీల సామాజిక సూచికలు మరియు సాపేక్షంగా అభివృద్ధి చెందిన మానవ అభివృద్ధి కొలమానాలకు విస్తృతంగా ప్రసిద్ధి చెందిన కేరళ, రాష్ట్ర జనాభాలో సగానికి పైగా మహిళలే ఉన్నారు, మరియు ముఖ్యంగా ముస్లిం మహిళలు గత దశాబ్దాలలో విద్య మరియు సామాజిక చలనశీలతలో గణనీయమైన పురోగతిని సాధించారు. అయినప్పటికీ, వారి జనాభాకు తగినట్లు రాజకీయ ప్రాతినిధ్యంగా లేదు.
కేరళ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయరంగం లో మహిళలు, ముఖ్యంగా ముస్లిం మహిళలు, తమ స్థానాన్ని పదిలపరుచుకోవడానికి తీవ్రంగా పోరాడుతున్నారు.1956లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటైన మొదటి శాసనసభలో ఆరుగురు మహిళా సభ్యులు ఉండేవారు. వారిలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి మరియు ఆ శాసనసభలోని ఏకైక ముస్లిం మహిళ అయిన ఓ. ఆయిషా బీవి ఒకరు. ఆయిషా బీవి ఆ తర్వాత మొదటి డిప్యూటీ స్పీకర్ అయ్యారు—దేశంలో ఇంతటి ఉన్నత రాజ్యాంగ పదవిని ఒక ముస్లిం మహిళ అధిష్టించిన తొలి సందర్భాలలో ఇది ఒకటిగా చెప్పవచ్చు.
అయినప్పటికీ, కేరళ రాష్ట్రంలో దశాబ్దాలుగా, సాధారణంగా మహిళల ప్రాతినిధ్యంలోనూ, ప్రత్యేకంగా ముస్లిం మహిళల ప్రాతినిధ్యంలోనూ ఎటువంటి గణనీయమైన లేదా స్థిరమైన మెరుగుదల నమోదు కాలేదు. పురుషుల కంటే మహిళలే అధిక సంఖ్యలో ఉన్న కేరళంలో, వారి రాజకీయ ప్రాతినిధ్యం ఎన్నడూ 10 శాతానికి చేరలేదు.జనాభాలో సుమారు 13 శాతం ఉన్నప్పటికీ, ముస్లిం మహిళల ప్రాతినిధ్యం ఇంకా తక్కువగా ఉంది.
జనాభాలో దాదాపు 52 శాతం మహిళలు ఉన్న కేరళం రాష్ట్ర శాసనసభలో మహిళల ప్రాతినిధ్యం అత్యంత దారుణంగా ఉంది. 1957లో మొదటి శాసనసభలో ఆరుగురు మహిళా సభ్యులు ఉండగా, 2025 నాటికి ఆ సంఖ్య కేవలం 11కి పడిపోయింది. రాష్ట్ర చరిత్రలో ఏ దశలోనూ మహిళల ప్రాతినిధ్యం 10 శాతం మార్కును దాటలేదు.
కేరళంలో, స్థానిక స్వపరిపాలన సంస్థలలో 50 శాతం సీట్లు మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. కాని కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌లో రెండవ అతిపెద్ద భాగస్వామి అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్), తన చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళా అభ్యర్థులను బరిలోకి దింపింది. "ఇది ఎంతమాత్రం సరిపోకపోయినప్పటికీ, ఇది ఒక మార్పుకు సంకేతం," అని రచయిత్రి, వ్యాఖ్యాత డాక్టర్ ఖదీజా ముంతాజ్ అన్నారు.గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఐయూఎంఎల్ బరిలోకి దింపిన అభ్యర్థులలో ఒకరు దళిత వర్గానికి చెందినవారు కావడం.
ఐయూఎంఎల్ (IUML)కు దాని చరిత్రలో ఎన్నడూ ఒక మహిళా ఎమ్మెల్యే లేరు. మహిళా అభ్యర్థులను నిలబెట్టాలన్న దాని ఇటీవలి నిర్ణయం, ప్రాముఖ్యతను సంతరించుకుంది.
2021 అసెంబ్లీ ఎన్నికలలో కేరళలోని మూడు ప్రధాన కూటములైన ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్, మరియు ఎన్‌డిఎలలో మహిళా అభ్యర్థుల ప్రాతినిధ్యం సుమారు 15 శాతంగా ఉంది. 2026 ఎన్నికల అభ్యర్థుల జాబితాలు ఇప్పుడు దాదాపు ఖరారైనప్పటికీ, ఈ ధోరణిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు.
ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే కేరళ వెనుకబాటుతనం మరింత స్పష్టమవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో 19 మంది మహిళా ఎమ్మెల్యేలు కలరు. అత్యధిక నిష్పత్తిలో మహిళా శాసనసభ్యులు నమోదయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో అధికార ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 294 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏకంగా 52 మంది మహిళా అభ్యర్థులను బరిలోకి దింపింది.
అయితే, లింగ
సమానత్వం, సామాజిక అభివృద్ధిలో తన విజయాల గురించి
తరచుగా గొప్పలు చెప్పుకునే కేరళ సమాన రాజకీయ ప్రాతినిధ్యం అనేది ఒక సుదూర
లక్ష్యంగానే మిగిలిపోయింది. దివంగత చైనా నాయకుడు మావో జెడాంగ్ చెప్పిన
"స్త్రీలు సగం ఆకాశాన్ని మోస్తారు" అనే ప్రసిద్ధ సూక్తికి, రాష్ట్రంలోని రాజకీయ పార్టీల వర్గాల్లో
పెద్దగా ఆదరణ లభించలేదు.
No comments:
Post a Comment