14 March 2026

స్పెయిన్ యొక్క 1,000 సంవత్సరాల పురాతన మసీదు అండలూసియా ఇస్లామిక్ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది Spain's 1,000-year-old mosque reflects Andalusia’s Islamic heritage

 

A general view of the Almonaster la Real Mosque in southern Spain. (Shutterstock Photo)

ముస్లిం స్పానిష్  చరిత్రలో ఒక అద్భుతమైన జ్ఞాపకం:



దక్షిణ నైరుతి స్పెయిన్‌లోని ఒక కొండపై ఉన్న 1,000 సంవత్సరాల పురాతన అల్మోనాస్టర్ లా రియల్ మసీదు Almonaster la Real Mosque యూరప్‌లోని పురాతన గ్రామీణ మసీదులలో ఒకటిగా నిలుస్తుంది, ఇది అండలూసియా వారసత్వాన్ని తెలుపుతుంది.

అండలూసియాలో ముస్లిం పాలన(711-1492) లో తొమ్మిదవ మరియు 10వ శతాబ్దాలలో నిర్మించబడిన అల్మోనాస్టర్ లా రియల్ మసీదు దాదాపు పూర్తిగా చెక్కుచెదరకుండా ఉంది. అండలూసియా యొక్క అత్యంత ప్రభావవంతమైన పాలకులలో ఒకరైన అబ్దుల్-రెహ్మాన్III పాలనలో దీనిని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. నేడు, ఇది స్పెయిన్‌లోని ఏకైక గ్రామీణ మసీదుగా పరిగణించబడుతుంది, నేటికి ఇది ఎక్కువగా దాని అసలు డిజైన్ లోనే  ఉంది.

13వ శతాబ్దంలో అల్మోనాస్టర్ పట్టణాన్ని క్రైస్తవ దళాలు స్వాధీనం చేసుకునే ముందు అల్మోనాస్టర్ లా రియల్ మసీదు దాదాపు నాలుగు శతాబ్దాల పాటు ముస్లిం సమాజానికి సేవ చేసింది. అల్మోనాస్టర్ లా రియల్ మసీదు భవనం దెబ్బతిని, తరువాత చర్చిగా మార్చబడినప్పటికీ, దాని ఇస్లామిక్ గతం యొక్క అనేక ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. నేడు, ఇది ఒక ప్రధాన సాంస్కృతిక మైలురాయిగా మరియు ఈ ప్రాంతంలోని అత్యంత విలువైన చారిత్రక ప్రదేశాలలో ఒకటిగా నిలుస్తోంది.

హుయెల్వా Huelva ప్రావిన్స్ లో  ఉన్న సుమారు 1,000 మంది జనాభా కలిగిన అల్మోనాస్టర్ లా రియల్ అనే చిన్న పట్టణం పైన ఉన్న మసీదు సహజ ఉద్యానవన ప్రకృతి దృశ్యాన్ని కలిగి ఉంది. ప్రదేశం సందర్శకులకు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల యొక్క అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది మరియు చరిత్రకారులు మరియు తరచూ ఆధునిక ముస్లిం సందర్శకులు దీనిని దర్శిస్తూ ఉంటారు.

అల్మోనాస్టర్ లా రియల్ మసీదు భవనం మంచి వాతావరణాన్ని కలిగి సందర్శకులకు ఆహ్లాదాన్ని కల్గిస్తుంది.మసీదు ప్రవేశ ద్వారం దగ్గర, వెయ్యి సంవత్సరాల నాటి శాసనం మసీదు స్తంభాలలో ఒకదానిపై కనిపిస్తుంది. అరబిక్ పదబంధం ఇలా ఉంది: “లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మద్ రసూలుల్లాహ్,” “దేవుడు తప్ప వేరే దేవుడు లేడు మరియు ముహమ్మద్ దేవుని దూత.”

ఇబెరియాలో ముస్లిం పాలన పతనం తర్వాత, కాథలిక్ చక్రవర్తులు మసీదును చర్చిగా మార్చారని, చెప్పబడుతుంది

అండలూసియా ఇస్లామిక్ ప్రభావానికి బాగాలోనయ్యింది స్పానిష్ నిఘంటువులో  దాదాపు 10% పదాలు అరబిక్ మూలానికి చెందినవి. స్పెయిన్‌లోని అనేక స్థల పేర్లు కూడా ముస్లిం వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి,  వాటిలో సెవిల్లె, కార్డోబా, గ్రెనడా, టోలెడో మరియు గ్వాడల్క్వివిర్ నది కూడా ఉన్నాయి.

ఆధునిక స్పానిష్ ఇంటిపేర్లు కూడా అరబిక్ మూలాలను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు, ప్రపంచ నంబర్ 1 టెన్నిస్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ ఇంటిపేరు “చెర్రీ” అనే అర్థం వచ్చే అరబిక్ పదం నుండి ఉద్భవించింది. The word for "cherry" in Arabic is karaz (Arabic: كرز) In Arabic, "al-karaz" (الكرز) translates literally to "the cherry". The term is composed of the definite article "al-" (the) and "karaz" (cherry)

స్పెయిన్ సాధారణంగా దాని ఇస్లామిక్-యుగ చరిత్రను సానుకూల దృక్పథంతో చూస్తుందని, అరబిక్-ఉత్పన్నమైన పేర్లు ఇటీవల ఫ్యాషన్‌గా మారాయి.  

అల్మోనాస్టర్ లా రియల్ నివాసితులకు, మసీదు ఒక కేంద్ర సమావేశ స్థలంగా మిగిలిపోయింది.ప్రతి సంవత్సరం 100,000 కంటే ఎక్కువ మంది పర్యాటకులు శతాబ్దాల నాటి అల్మోనాస్టర్ లా రియల్ మసీదును సందర్శిస్తారు.

అల్మోనాస్టర్ లా రియల్ మసీదు ప్రదేశం ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది అల్మోనాస్టర్ లా రియల్ మసీదు భవనంలో సాధారణ మతపరమైన సేవలను నిర్వహించనప్పటికీ, ముస్లిం సందర్శకులు అక్కడ ప్రార్థన చేయడానికి స్వాగతం ఉంది. పండుగ సమయంలో, ముస్లిం సందర్శకులు తరచుగా మసీదులో సామూహిక ప్రార్థనల కోసం గుమిగూడతారు

గత 25 సంవత్సరాలుగా, అల్మోనాస్టర్ లా రియల్ పట్టణం ప్రతి అక్టోబర్‌లో వార్షిక ఇస్లామిక్ సంస్కృతి సమావేశం (జోర్నాదాస్ డి కల్చురా ఇస్లామికా)ను కూడా నిర్వహిస్తోంది. గ్రెనడా, సెవిల్లె మరియు మాడ్రిడ్ వంటి నగరాల నుండి పండితులు మరియు నిపుణులు ఉపన్యాసాలు మరియు సెమినార్లు ఇస్తారు, సంగీతం, మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.

 

గమనిక:

అండలూసియా: ఇస్లామిక్ పరిపాలన(8-14శతాబ్దాల) లో స్పెయిన్ పేరు.

ఐబీరియన్ ద్వీపకల్పం (Iberian Peninsula):ఇది నైరుతి ఐరోపాలో ఉన్న ఒక భౌగోళిక ప్రాంతం. 

ఇందులోని దేశాలు: ఇందులోప్రధానంగా స్పెయిన్ మరియు పోర్చుగల్ దేశాలు ఉన్నాయి. వీటితో పాటు అండోరా, జిబ్రాల్టర్ మరియు ఫ్రాన్స్‌లోని కొన్ని భాగాలు కూడా ఈ ద్వీపకల్పంలో భాగమే.ఈ ప్రాంతం లో గతం లో ముస్లిం పాలన జరిగింది.

 

No comments:

Post a Comment