నవాబ్ అబ్దుల్ లతీఫ్ ఖాన్
బహదూర్ (1828–1893)
19వ శతాబ్దపు బెంగాల్‌లో ఒక మార్గదర్శక
విద్యావేత్త మరియు సంఘ కార్యకర్త. బెంగాల్ ప్రాంతంలో ఆయనను తరచుగా "ముస్లిం
పునరుజ్జీవన పితామహుడు" అని పిలుస్తారు.
ఆధునిక
పూర్వ భారతదేశంలోని బెంగాల్‌లో, 1828లో ఒక ఉన్నత ముస్లిం
కుటుంబంలో జన్మించిన అబ్దుల్ లతీఫ్ మొదట ఇస్లామిక్ పాఠశాలలో విద్యనభ్యసించారు. తరువాత
పాశ్చాత్య విద్యా అబ్యసించారు. అబ్దుల్ లతీఫ్ వలస పరిపాలనలో ఉన్నతాధికారిగా, బ్రిటిష్ పరిపాలకులకు మరియు భారత ఉపఖండంలో
నివసిస్తున్న ముస్లిం ప్రజలకు మధ్య అనధికారిక సంధానకర్తగా వ్యవహరించారు.
1857 తిరుగుబాటు తర్వాత భారతీయ
ముస్లిం సమాజంలో సంక్షోభo తలెత్తినది. 1857 తిరుగుబాటు తర్వాత భారతీయ, ముస్లింలపై గణనీయమైన ఆంక్షలు ఉండేవి, బ్రిటిష్ వారు ముస్లింలను అనుమానంతో చూశారు. అధికార
భాషగా ఉన్న పర్షియన్ స్థానంలో ఆంగ్లం వచ్చింది.
ఇటువంటి
పరిస్థితులలో అబ్దుల్ లతీఫ్ భారతీయ ముస్లింల మధ్య మతం, రాజకీయాలు, విద్య మరియు కలిసి జీవించే
భావనను పునర్నిర్వచించడం ద్వారా ఒక నూతన శకానికి నాంది పలికే ప్రక్రియలను
ప్రారంభించారు.
బ్రిటిష్ పాలనలో సమాజ పురోగతి, సాంప్రదాయ విద్యతో పాటు ఆధునిక పాశ్చాత్య విద్యను స్వీకరించడంపై ఆధారపడి
ఉందని గుర్తించిన తొలి ముస్లిం నాయకులలో అబ్దుల్ లతీఫ్ ఒకరు.
అబ్దుల్
లతీఫ్ ముస్లిం సమాజపు ఆలోచనా విధానాన్ని మార్చడంపై దృష్టి సారించిన ఒక లోతైన
ఆలోచనాపరుడు.అబ్దుల్ లతీఫ్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఘర్షణ వైఖరులను నివారించే
ఒక సమతుల్యతను సాధించారు. సామాజిక, విద్యా, మరియు మేధోపరమైన సంస్కరణలలో నిమగ్నమయ్యారు ఆధునిక
విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం, మరియు భారతదేశంలోని ముస్లింల
సంస్కరణలో పట్ల ఆసక్తి ఆయన్ను భారతీయ
ముస్లిము నాయక అగ్రగాములలో ఒకరిగా నిలబెట్టాయి.
ఉపాధి మరియు సామాజిక పురోగతి
సాధించడానికి ఆంగ్లం మరియు పాశ్చాత్య శాస్త్రాలను నేర్చుకోవడం అత్యవసరం అని సనాతన
ముస్లిం సమాజాన్ని ఒప్పించడానికి అబ్దుల్
లతీఫ్ అవిశ్రాంతంగా కృషి చేశారు.
1863లో లతీఫ్ స్థాపించిన మహమ్మదీయ
సాహిత్య సంఘం మేధోపరమైన చర్చలకు ఒక కీలక వేదికగా మరియు భారతదేశవ్యాప్తంగా ఇలాంటి
సంస్థలకు మార్గదర్శిగా నిలిచింది. విద్యాపరమైన మరియు సామాజిక సమస్యలను
పరిష్కరించడం ద్వారా బ్రిటిష్ పరిపాలన మరియు ముస్లిం సమాజం మధ్య ఉన్న అంతరాన్ని
తగ్గించడమే మహమ్మదీయ సాహిత్య సంఘం లక్ష్యం.
అబ్దుల్
లతీఫ్ ఆధునికమైన, ఆంగ్ల-ఆధారిత విద్యా వ్యవస్థను సమర్థించారు.. 1866లో (కలకత్తాలో) దారుల్ ఉలూమ్‌ను స్థాపించడం ద్వారా, 19వ శతాబ్దం చివరి దశాబ్దంలో ఆధునిక విద్యను
ప్రోత్సహించాలని భావించారు.
ముస్లింలు
ఎలాంటి విద్యను పొందినప్పటికీ తమ విశ్వాసాన్ని ఆచరించడానికి వీలు కలుగుతుందని అబ్దుల్
లతీఫ్ భావించారు.ముస్లిములు ప్రపంచంలోని నూతన జ్ఞానాన్ని, అభివృద్ధి చెందుతున్న శాస్త్రాలను పూర్తిగా
స్వీకరించాలి. ముస్లిములు సమాజంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలలో చురుకుగా
పాల్గొనాలి
అబ్దుల్
లతీఫ్ తన కార్యకలాపాలను ఎక్కువగా బెంగాల్‌లో కేంద్రీకరించారు. అబ్దుల్ లతీఫ్ ముస్లిం
ఆధునికవాద ఉద్యమ ప్రారంభకులు అని అనవచ్చు కలకత్తా లో గల హిందూ
కళాశాలను ప్రెసిడెన్సీ కళాశాలగా (ప్రస్తుతం ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం)
మార్చడంలో అబ్దుల్ లతీఫ్ ఆయన కీలక పాత్ర పోషించారు, మరియు అది అన్ని వర్గాల విద్యార్థులకు
అందుబాటులో ఉండేలా చూశారు.
అబ్దుల్
లతీఫ్ బోధనలు ముఖ్యంగా బెంగాల్‌లో, ప్రతిభావంతులైన అనేక మంది
ముస్లిం యువకులు ఆధునిక పాఠశాలల్లో చేరడానికి ప్రధాన కారకం అయినాయి.
హాజీ ముహమ్మద్ మోసిన్
ఎండోమెంట్‌ను ఉపయోగించి విద్యాసంస్థలను మరియు స్కాలర్‌షిప్ పథకాలను స్థాపించడంలో అబ్దుల్ లతీఫ్ కీలక పాత్ర పోషించారు, ఇవి నేటికీ విద్యార్థులకు ప్రయోజనం
చేకూరుస్తున్నాయి.
అబ్దుల్
లతీఫ్ -సామాజిక మరియు న్యాయ సంస్కరణలు:
డిప్యూటీ మేజిస్ట్రేట్‌గా
పనిచేస్తున్నప్పుడు, అబ్దుల్ లతీఫ్ ఇండిగో తిరుగుబాటులో ముందుగా చొరవ తీసుకున్నారు, దీని ఫలితంగా రైతాంగ రైతులను దోపిడీ నుండి రక్షించడానికి 1860లో ఇండిగో కమిషన్ ఏర్పడింది.
బెంగాల్ శాసన మండలికి (1862) నియమితులైన మొదటి ముస్లిం అబ్దుల్
లతీఫ్ మరియు శాంతి న్యాయమూర్తిగా (జస్టిస్ ఆఫ్ ది
పీస్) పనిచేశారు.
ముస్లింల పురోగతిపై అబ్దుల్ లతీఫ్ దృష్టి సారించినప్పటికీ, అబ్దుల్ లతీఫ్ విశాల దృక్పథానికి మరియు సామాజిక ఐక్యత కోసం చేసిన కృషికి గాను హిందూ మరియు
యూరోపియన్ వర్గాల వారు అబ్దుల్
లతీఫ్ ను ఎంతగానో గౌరవించారు.
అబ్దుల్
లతీఫ్ పొందిన బిరుదులు మరియు గుర్తింపులు:
Ø 1877 లో బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఖాన్ బహదూర్, 1880లో నవాబ్ మరియు 1887లో నవాబ్ బహదూర్ బిరుదు పొందారు.
Ø అబ్దుల్ లతీఫ్ టర్కీ ప్రభుత్వం నుండి మజేదీ పురస్కారం పొందారు.
No comments:
Post a Comment