8 September 2021

షేక్ గులాబ్‌- ప్రముఖ బీహార్ స్వతంత్ర సమర యోధుడు. 1857-1920

 

 

 

షేక్ గులాబ్‌ను గుర్తు చేసుకోవడం చాలా ప్రత్యేకమైనది. ఈ నిజమైన దేశభక్తి గల రైతు నాయకుడు తన  దేశం కోసం  మాత్రమే కాకుండా దేశ ప్రజలు మరియు సమాజం కోసం కూడా తన చివరి శ్వాస వరకు పోరాడాడు.

మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ “మహాత్మాగాంధీ” అవ్వడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి పేరు షేక్ గులాబ్, కానీ అతను అజ్ఞాత వ్యక్తిగానే  పరిమితమయ్యాడు. తన జీవితాంతం రైతుల కోసం మరియు వారికి  న్యాయం కోసం పోరాడిన వ్యక్తి ప్రతిఫలంగా అణచివేత మరియు ఉదాసీనత మాత్రమే పొందాడు. షేక్ గులాబ్ చంపారన్ రైతుల బాధను ఒక ఉద్యమం గా ప్రారంభించాడు,

1905 లో బెంగాల్ విభజించబడింది, ప్రస్తుత బీహార్ ఆ సమయంలో బెంగాల్‌లో భాగం అని గమనించాలి.

 షేక్ గులాబ్ చంపారన్ రైతుల సమస్యలకు ప్రచారం కల్పించాడు. చంపారన్ సత్యాగ్రహం ద్వారా గాంధీకి గుర్తింపు వచ్చింది. కానీ షేక్ గులాబ్ యొక్క గుర్తింపు చరిత్ర పుటలలో ఖననం చేయబడింది.

 1857 లో చంపారన్‌లోని సాఠి పోలీసు స్టేషన్‌లోని చంద్‌బర్వ గ్రామంలో జన్మించిన షేక్ గులాబీ రైతు. సాధారణ విద్య మాత్రమె పొందాడు. కాని తెలివితేటలతో పదునుగా ఉన్నాడు మరియు బాల్యం నుండి అతని నరాలలో లో దేశభక్తి ప్రవహిస్తోంది.

గాంధీజీకి ముందు, 1905 నుండి, షేక్ గులాబ్ నాయకత్వంలో, చంపారన్ రైతులు బ్రిటిష్ ఇండిగో (అంటే బ్రిటిష్ భూస్వాములు) కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ పోరాటం లో చంపారన్ రైతులు తీవ్ర దురాగతాలకు గురయ్యారు. ప్లాంటర్స్ అసోసియేషన్ బీహార్ లైట్ హార్స్ Bihar Light Horse అని పిలువబడే వారి స్వంత సైన్యాన్ని కలిగి ఉంది, ఇది రైతులపై క్రూరత్వాలకు ప్రసిద్ధి చెందింది. అణచివేత చర్యల ద్వారా రైతుల పోరాటాలను అణచివేయడానికి బ్రిటిష్ వారు తమ వంతు ప్రయత్నం చేశారు.

 12 సెప్టెంబర్ 1907, షేక్ గులాబ్‌ను ఒక కేసులో అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులో 162 మందిని శిక్షించబడినప్పటికీ జైలు లోపల బ్రిటిష్ వారు అత్యంత కిరాతకంగా షేక్ గులాబ్ ను హింసించారు అని అంటారు

 1907-08లో, సాఠి కోఠి రైతులు  నీలిమందు విత్తడం మానేశారు. చుట్టుపక్కల ప్రజలు కూడా ఒకరి తర్వాత ఒకరు నీలిమందు విత్తడం ఆపడం ప్రారంభించారు. షేక్ గులాబ్ సత్తి కోఠిలో నీలిమందు నాటడాన్ని ఆపడంలో పెద్ద పాత్ర పోషించారు. గులాబ్ తన 60 బిగ్హా భూమిలో నీలిమొక్కను నాటలేదు. అతని ఆదర్శం ప్రజల హృదయాలలో మరింత ధైర్యాన్ని మరియు ఉత్సాహాన్ని నింపింది. షేక్ గులాబ్ వ్యక్తిగతంగా భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నప్పటికి  రైతుల  దృష్టిలో అతని ప్రతిష్ట బాగా పెరిగింది. అతన్ని తమ నిజమైన శ్రేయోభిలాషిగా పరిగణించడం ప్రారంభించాడు.

1909 లో, షేక్ గులాబ్ నాయకత్వంలో, రైతులందరూ ఏకమయ్యారు. రైతుల సంఘీభావానికి బ్రిటిష్ నీలి మందు వ్యాపారులు ఆశ్చర్యపోయాడు. షేక్ గులాబ్‌తో సహా రెండు వందల మందికి  సైనికులుగా  ఉద్యోగాలు ఇవ్వడానికి బ్రిటిష్ వారు ప్రలోభాలను ప్రారంభించారు. కాని రైతులు  కానిస్టేబుళ్లు కావడానికి పూర్తిగా నిరాకరించారు. ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఆందోళనకారులందరినీ ప్రభుత్వం విచారించింది. నాయకులందరినీ అరెస్టు చేశారు. రైతుల ఈ పోరాటం తరువాత స్వాతంత్ర్య పోరాటంగా వ్యాపించింది.

రైతుల నిరసన మరియు తిరుగుబాటు జ్వాలలు గ్రామం నుండి గ్రామానికి వ్యాపించడం ప్రారంభించాయి. సత్వారియాకు చెందిన రాజ్‌కుమార్ శుక్లా, సతి గ్రామానికి చెందిన షేక్ గులాబ్ మరియు మథియా గ్రామానికి చెందిన శీతల్ రాయ్ గ్రామ గ్రామానికి పాదయాత్ర చేయడం ప్రారంభించారు, నీలిమందు వ్యాపారుల నిరంకుశత్వాన్ని చేపట్టడానికి రైతులను మేల్కొలిపారు. షేక్ గులాబ్ నాయకత్వంలో, ముస్లిం రైతుల సమావేశం నిర్వహించి, నీలిమందు సాగును నిలిపివేశారు.

 నేడు చంపారన్ ప్రజలు షేక్ గులాబ్‌ను మర్చిపోయారు. నగరంలో అతని పేరు మీద 'గులాబ్ మెమోరియల్ కాలేజ్' ఉంది, కానీ ఇక్కడి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు షేక్ గులాబ్ త్యాగం గురించి తెలియదు.

గులాబ్ మెమోరియల్ కాలేజీ' వ్యవస్థాపకుడు మరియు షేక్ గులాబ్ మనుమలలో ఒకరైన ఫఖ్రే ఆలం, షేక్ గులాబ్‌కు సంబంధించి తాను అనేక లేఖలను ప్రభుత్వాలకు రాశానని చెప్పారు. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూడా ఈ విషయంలో అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఇంత జరిగినప్పటికీ, ఏ ప్రభుత్వం కూడా ఈ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడిని గుర్తుంచుకోలేదు.' అని అంటారు.

 షేక్ గులాబ్ వంటి వారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే షేక్ గులాబ్ లేకుంటే, చంపారన్ సత్యాగ్రహం ఉండేది కాదు మరియు బహుశా గాంధీకి అంత పేరు వచ్చేది కాదు. గాంధీజీకి  ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు రావడానికి షేక్ గులాబ్ ప్రధాన కారకులు .

  ఆధారాలు:

1.www.heritagetimes.in

2.టు సర్కిల్స్ (హిందీ) లో మూలవ్యాస రచయిత న్యాయవాది పర్వేజ్ ఆలమ్, షేక్ గులాబ్ గారి మనవడు. వీరు  ప్రస్తుతం షేక్ గులాబ్‌పై పరిశోధన చేస్తున్నారు. వారు త్వరలో షేక్ గులాబ్ జీవితం పై ఒక పుస్తకాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు

 

 

 

 


 “/>

 

 

 

S. వాజిద్ అలీ S. Wajid Ali 1890-1951

 



S. వాజేద్ అలీ లేదా షేక్ వాజిద్ అలీ (బెంగాలీ: এস ওয়াজেদ আলী; 4 సెప్టెంబర్, 1890 - 10జూన్, 1951) ఒక బెంగాలీ రచయిత, జాతీయవాది మరియు బారిస్టర్. వాజిద్ అలీ 1890 సెప్టెంబర్ 4 న హూగ్లీ జిల్లాలోని జానై మరియు బేగంపూర్ సమీపంలోని బరతాజ్‌పూర్ గ్రామంలో జన్మించారు.

 

వాజేద్ అలీ ప్రాధమిక విద్య 'గ్రామీణ మదరసా' లేదా పాఠశాలలో ప్రారంభమైంది. 1897 లో ఏడు సంవత్సరాల వయస్సులో వాజేద్ అలీ మొదటి వివాహం, ఆరు నెలల కజిన్ అయేషాతో జరిగింది.  1898 లోవాజేద్ అలీ షిల్లాంగ్‌లోని ఆంగ్ల మాధ్యమం మోఖర్ Mokhar పాఠశాలలో చేరాడు, తరువాత వాజేద్ అలీ అలిఘర్ MAYO కళాశాలకు వెళ్లాడు, అక్కడ అతను అత్యంత ప్రతిభ కల/మెరిటోరియస్ విద్యార్థిగా గుర్తింపు పొందాడు.

 

వాజేద్ అలీ 1910లో అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయ్యాడు.  తదుపరి విద్య కోసం మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభానికి కొన్ని సంవత్సరాల ముందు లండన్ వెళ్లాడు. వాజేద్ అలీ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం యొక్క లా స్కూల్లో చేరాడు, అక్కడ నుండి BA మరియు బారిస్టర్-ఎట్-లా డిగ్రీలు పొందాడు.

 

కేంబ్రిడ్జ్‌లో ఉన్నప్పుడు, వాజేద్ అలీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు మరియు అతనికి బ్రిస్టల్‌కు చెందిన మిస్ ఎలియనోర్ సాక్స్‌బీ వైద్య సపర్యలు చేసేది. క్రమంగా వారి మద్య అనుభందం పెరిగినది, ఇది మొదటి భార్య అయేషా బేగం తో విడాకులు మరియు మిస్ ఎలియనోర్ సాక్స్‌బీ తో వివాహానికి దారి తీసింది.

 

1915 లో ఎస్. వాజేద్ అలీ కలకత్తా హైకోర్టులో లా ప్రాక్టీస్ ప్రారంభించి 1922 వరకు కొనసాగించారు.ఆతరువాత ఎస్. వాజేద్ అలీ సమకాలీన సమాజం గురించి లోతైన అధ్యయనాలలో మునిగిపోయాడు మరియు ఆనాటి ఉన్నత సాహిత్య ప్రపంచంలో పాల్గొన్నాడు. బెంగాలీలో రాయడం ప్రారంభించాడు మరియు సాహిత్య వృత్తిని ప్రారంభించాడు;

 

1923లో, ఎస్. వాజేద్ అలీ కలకత్తా యొక్క మూడవ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్‌గా నియమించబడ్డాడు. ఈ కాలంలోనే సాహిత్య రచన ఆరంభించాడు. గద్యం, సింబాలిజం, కథ-రచన, అనువాదం, ప్రయాణ కథనాలు మొదలైన రంగాలలో అత్యున్నత సృజనాత్మకతను ప్రదర్శించాడు. 1928 లో ఎస్. వాజేద్ అలీకి  ఎలియనోర్ సాక్స్‌బీ (నెల్లీ) కి మద్య విడాకులు జరిగినవి.

 

కుటుంబ జీవితంలో ఒంటరితనానికి గురైన ఎస్. వాజేద్ అలీ, ఉద్యోగ విధులు, సాహిత్య కార్యకలాపాలు, వివిధ సంఘాలు మరియు సంస్థల ఛైర్మన్‌షిప్‌లు మొదలైన కార్యకలాపాలతో తనకాలం  గడప సాగాడు. ఆ సమయం లో వాజేద్ అలీకి ఒక బర్మీస్ మహిళా పరిచయం అయింది తరువాత ఆమె అతని జీవిత భాగస్వామిని  శ్రీమతి బద్రున్నెస్సా అలీ Badrunnessa Ali గా మారింది. రెండు సంవత్సరాల తరువాత, 26 అక్టోబర్ 1931, శ్రీమతి బద్రున్నెస్సా అలీ తన ఏకైక సంతానం పుట్టిన ఒక రోజు తర్వాత మరణించినది.. నవజాత శిశువు షేక్ బద్రుద్దీన్ అలీ  యొక్క సంరక్షణ కోసం ఒక ఆంగ్ల నర్సును నియమించారు.

1932 డిసెంబరులో 'గులిస్తాన్' అనే పత్రిక స్థాపన S. వాజేద్ అలీ జీవితంలో ముఖ్యమైన అధ్యాయం. గులిస్తాన్ పత్రిక ముఖ్య ఉద్దేశం 'హిందూ-ముస్లిం ఐక్యతకు మార్గదర్శకత్వం' వహించడం. కాజీ నజ్రుల్ ఇస్లాం, డాక్టర్. మొహమద్ షహిదుల్లా, కవిశేఖర్  కాళిదాస్ రే, బరింద్రనాథ్ ఘోష్, బుద్ధా దేవ్ బసు, నిర్మల్ దాస్, అనురూప దేవి,  ప్రభావతి దేవి  సరస్వతి, హుమాయున్ కబీర్, కామ్రేడ్ అబ్దుల్ అజీజ్ , ఫణీంద్రనాథ్ ముఖోపాధ్యాయ్, ధరాజ్ భట్టాచార్య, సౌరమోహన్ ముఖోపాధ్యాయ్, అబ్బాసుద్దీన్ అహ్మద్ మొదలగు సమకాలిన అగ్రశ్రేణి రచయితలు ఈ పత్రికలో రచనలు చేసేవారు.

'గులిస్తాన్' మ్యాగజైన్ వ్యవస్థాపకుడిగా కాకుండా, ఎస్. వాజేద్ అలీ 'బులెటిన్ ఆఫ్ ది ఇండియన్ రేషనలిస్టిక్ సొసైటీ'.అనే ఆంగ్ల భాష పత్రిక ప్రచురణకర్త మరియు సంపాదకుడు కూడా:

31 అక్టోబర్ 1945, S. వాజేద్ అలీ మూడవ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ గా రిటైర్ అయ్యారు మరియు తన సొంత  న్యాయవాద వృత్తిని పున:ప్రారంభించారు.

ఎస్. వాజేద్ అలీ ప్రత్యేకమైన ఆలోచనాత్మక స్వభావం, విలక్షణమైన వ్యక్తిత్వం, కలిగిన మృదువైన వ్యక్తి.

1949 మధ్యలో, ఎస్. వాజేద్ అలీ' సెరిబ్రల్ థ్రోంబోసిస్'తో బాధపడ్డాడు.అతని శరీరం యొక్క ఒక వైపు పక్షవాతానికి గురైంది. చివరగా, జూన్ 10, 1951 న మరణించారు (వయస్సు 60)కలకత్తాలోని గోబ్రా స్మశానవాటికలో అతని చివరి భార్య శ్రీమతి బద్రున్నెస్సా అలీ సమాధి పక్కన ఖననం చేయబడ్డారు,

.

ఎస్. వాజేద్ అలీ' రచనలు-లెగసె:

·       ఎస్. వాజేద్ అలీ రాసిన ' మొదటి బంగ్లా వ్యాసం 'ఒటిటర్ బోజా'Otiter Bojha' ' -1919 లో ప్రచురించబడింది

·       ఎస్. వాజేద్ అలీ రాసిన ' చిన్న కథ 'రాజా' - 1925 లో ప్రచురించబడింది

·       ఎస్. వాజేద్ అలీ' 'బొంగియో ముషోల్మాన్ షాహిత్య షామిటీ'Bongio Musholman Shahitya Shamity' ' –కు 1925లో  ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు

·       ఎస్. వాజేద్ అలీ' 'బొంగియో ముషోల్మాన్ షాహిత్య షామిటీ'లో అధ్యక్ష పాత్రను పోషించాడు మరియు ఐదవ వార్షిక సమావేశంలో అధ్యక్ష ప్రసంగాన్ని ఇచ్చాడు.. -1925

·       31 జూలై- 'బొంగియో ముషోల్మాన్ షాహిత్య సమితి' సాధారణ సమావేశంలో పాల్గొని 'టొరునర్ కాజ్' పేపర్ చదివారు.. -1926

·       డిసెంబర్. 'బొంగియో ముషోల్మాన్ షాహిత్య సమితి' అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. - 1926

·       'గుల్-దస్తా' -1927

·       డిసెంబర్- నజ్రుల్ ఇస్లాం నేషనల్ రిసెప్షన్ కమిటీ ఛైర్మన్ గా, కలకత్తాలోని ఆల్బర్ట్ హాల్‌లో స్వాగత ప్రసంగాన్ని సమర్పించారు. -1929

·       'డోర్బెషర్ దోవా'Dorbesher Doa '- 1931

·       డిసెంబర్- ఎస్. వాజేద్ అలీ 'పయనీర్ ఇలస్ట్రేటెడ్ మ్యాగజైన్ ఆఫ్ హిందూ-ముస్లిం ఐక్యత'- 'గులిస్తాన్' ప్రచురించారు. -1932

·       ఫిబ్రవరి-సిరాజ్‌గోంజ్ లో  'ఆల్-బెంగాల్ ప్రైమరీ టీచర్ అసోసియేషన్' కాన్ఫరెన్స్ కు అద్యక్షత వహించారు.. – 1935

·       జూలై., 'తాజ్‌పూర్ Tajpur  ఇనిస్టిట్యూట్' మొదటి వార్షికోత్సవం కు హాజరై అద్యక్ష ఉపన్యాసం ఇచ్చారు..

·       -1935 మే - 'బొంగియో ముషోల్మాన్ షాహిత్య సమితి' 6 వ సాహిత్య సమావేశానికి అధ్యక్షుడిగా హాజరయ్యారు మరియు థీమ్ ప్రసంగాన్ని అందించారు.

·       'బొంగియో ముషోల్మాన్ షాహిత్య సమితి' 'గ్రంథాలయ కమిటీ' ఉపాధ్యక్షుడు మరియు  సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. -1939

·       'గ్రెనడార్ శేష్బీర్'Granada'r Sheshbir' – 1941'

·       'జిబోనర్ శిల్పో'Jiboner Shilpo''- 1941

·       'ప్రాచ్యా ఓ ప్రతిచ్యా'Prachya o Pratichya''- 1943

·       'వోబిస్‌వాటర్ బంగాలీ' 'Vobiswater bangalee'-1943

·       'అఖిలస్సాం బంగ్లా లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ కాన్ఫరెన్స్' అధ్యక్షుడిగా హాజరై థీమ్ ప్రసంగాన్ని అందించారు. - 1943

·       'బాద్షాహి గోల్పో'Badshahi ' -1944

·       'గోల్పెర్ మోజ్లిస్'Golper Mojlis'' -1944

·       'అమర్ మసీదు`_1944 వీక్లీ బంగాలిలో ఎమ్. సలావుద్దీన్ (1912_72) చే ఎడిట్ చేయబడినది.  

 

 

 

 

1 September 2021

లెజెండరీ షెహనాయ్ మాస్ట్రో భారతరత్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ Legendary Shehnai Maestro Bharat Ratna Ustad Bismillah Khan

 



ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ (21 మార్చి 1913 - 21 ఆగస్టు 2006) భారతదేశం గర్వించదగిన రత్నం. సాంప్రదాయ వేడుకలలో ప్రధానంగా జానపద వాయిద్యంగా షెహనాయ్ ప్రాముఖ్యత కలిగి ఉండగా, బిస్మిల్లా ఖాన్ దాని స్థాయిని పెంచి  దానిని కచేరీ వేదికపైకి తీసుకురావడం విశేషం.


షెహనాయ్ మాస్ట్రో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ భారతరత్న పురస్కార గ్రహీత మరియు భారతరత్నతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్ వంటి నాలుగు అగ్ర పౌర పురస్కారాలను కూడా అందుకున్నారు.

 

21మార్చి 1913 న బీహార్‌లోని డుమ్రాన్‌లో జన్మించిన బిస్మిల్లా ఖాన్, పైగంబర్ ఖాన్ మరియు మిత్తాన్ దంపతులకు రెండవ కుమారుడు. బిస్మిల్లా ఖాన్ కుటుంబానికి సంగీత నేపథ్యం ఉంది మరియు అతని పూర్వీకులు భోజ్‌పూర్ సంస్థానంలో సంగీతకారులు. బిస్మిల్లా ఖాన్ అసలు పేరు ఖమరుద్దీన్. అతని అన్నయ పేరు షంసుద్దీన్. కాని తాత రసూల్ బక్ష్ ఖాన్ అతడిని "బిస్మిల్లా" అని పిలిచేవాడు  ​​ అందువల్ల అతను బిస్మిల్లా ఖాన్ గా పిలువబడ్డాడు. బిస్మిల్లా ఖాన్ తండ్రి డుమ్రాన్ మహారాజా కేశవ్ ప్రసాద్ సింగ్ ఆస్థానంలో షెహనాయ్ వాద్యకారుడు.

బిస్మిల్లా ఖాన్ నిగర్వి, నిరాడంబరుడు. బిస్మిల్లా ఖాన్ సంపద మరియు ఇతర భౌతిక ఆస్తులను కూడబెట్టుకోలేదు మరియు పవిత్ర నగరం బెనారస్‌లో సామన్యుల మద్య  నివసించాడు. బిస్మిల్లా ఖాన్ వారణాసి నగరంపై ప్రేమను కలిగి ఉన్నాడు, మరియు యుఎస్‌లో స్థిరపడటానికి శాశ్వత వీసా ప్రతిపాదనను తిరస్కరించాడు.

బిస్మిల్లా ఖాన్ గురువు అతని మేనమామ అలీ బక్ష్ 'విలయతు', ప్రఖ్యాత షెహనాయ్ వాద్య విద్వాసుడు.  బిస్మిల్లా ఖాన్ మతపరంగా షెహనాయిని అభ్యసించాడు మరియు చాలా తక్కువ సమయంలో పరిపూర్ణతను సాధించాడు. షెహనాయ్‌ని అత్యంత ప్రసిద్ధ శాస్త్రీయ సంగీత వాయిద్యాలలో ఒకటిగా చేసిన ఘనత బిస్మిల్లా ఖాన్ కు దక్కింది.

కలకత్తాలో జరిగిన ఆల్ ఇండియా మ్యూజిక్ కాన్ఫరెన్స్ (1937) లో అతని కచేరీ షెహనాయ్‌ని వెలుగులోకి తెచ్చింది మరియు సంగీత ప్రియులచే ఎంతో ప్రశంసించబడింది. స్వాతంత్య్రానంతర కాలంలో షెహనాయ్ పై నిపుణత  సాధించాడు మరియు శాస్త్రీయ సంగీతం యొక్క వారసత్వాన్ని సజీవంగా ఉంచాడు. ప్రపంచం నశించినా సంగీతం మనుగడ సాగిస్తుందని ఎప్పుడూ నమ్మే  బిస్మిల్లా ఖాన్ నిజంగా స్వచ్ఛమైన కళాకారుడు అని పిలవవచ్చు. బిస్మిల్లా ఖాన్ హిందూ-ముస్లిం ఐక్యతను విశ్వసించాడు మరియు తన సంగీతం ద్వారా సోదర సందేశాన్ని వ్యాప్తి చేశాడు. సంగీతానికి కులం లేదని బిస్మిల్లా ఖాన్ ఎప్పుడూ ప్రకటించేవారు.

1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా బిస్మిల్లా ఖాన్  ఢిల్లీలోని ఎర్రకోటలో  షెహనాయ్ దర్శన ఇచ్చాడు మరియు ప్రతి సంవత్సరం ఆగస్టు 15 న భారత ప్రధాని ఎర్రకోట నుండి తన ప్రసంగం చేసిన వెంటనే షెహనాయ్ కచేరి చేసేవాడు.. బిస్మిల్లా ఖాన్ అనేక దేశాలలో షెహనాయ్ కచేరీలు నిర్వహించారు మరియు అక్కడ అతనికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిస్మిల్లా ఖాన్ ఆఫ్ఘనిస్తాన్, యుఎస్ఎ, కెనడా, బంగ్లాదేశ్, యూరప్, ఇరాన్, ఇరాక్, పశ్చిమ ఆఫ్రికా, జపాన్ మరియు హాంకాంగ్‌లో షెహనాయ్ ప్రదర్శన ఇచ్చారు. బిస్మిల్లా ఖాన్ తన షెహనాయ్‌తో ప్రత్యేక బంధాన్ని ఏర్పర్చుకున్నారు  మరియు భార్య మరణించిన తరువాత షెహనాయ్ ని  "బేగం" అని ముద్దుగా పిలిచేవారు..

21ఆగస్టు 2006, 90 సంవత్సరాల వయస్సులో, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కు భారత సైన్యం 21 గన్ సెల్యూట్ ఇచ్చింది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షెహనాయ్,  వారితో పాటు సమాధిలో ఖననం చేయబడినది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ మరణ దినాన్ని జాతీయ సంతాప దినంగా పిలుస్తారు.

ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఘనమైన వారసత్వం కలవారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఎల్లప్పుడూ మన హృదయాలలో స్ఫూర్తిగా ఉంటారు, భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అందించిన సహకారం మరువలేనిది మరియు భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఒక గుర్తుగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు.

ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ మరణ వార్షికోత్సవం సందర్భంగా, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం మరియు అందరు గొప్ప నివాళులు అర్పిస్తారు  మరియు భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఆయన చేసిన కృషికి చాలా కృతజ్ఞతలు  తెలుపుతారు..