30 October 2017

ప్రభుత్వ విధానాలు భారతదేశపు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వృద్దుల జనాభా ను, వారి సమస్యలను నిర్లక్షం చేస్తున్నవి.




భారతీయుల్లో ప్రతి పది మంది లో  ఒకరు 60 ఏళ్ళకు పై బడిన వయస్సులో ఉన్నారు. వృద్ధాప్యం వృద్ధులను మాత్రమే ప్రభావితం చేయదు. అది సమాజంలో ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. దానిని ప్రభుత్వ విధానాలు నిర్లక్ష్యం చేస్తున్నవి.

మన దేశం లోని కొన్ని రాష్ట్రాలలో వృద్దాప్యపు పెన్షన్ క్రింద నెలకు 500 ఇస్తున్నారు. ఇది భారత దేశం లో గ్రామీణ ప్రాంతాలలో దారిద్య రేఖ కు దిగువ ఉన్నవారి నెలసరి ఆదాయం లో సగం గా  ఉంది. భారతదేశంలో 100 మిలియన్ వృద్ధులు ఉన్నారు.  భారతదేశంలో వృద్ధుల జనాభా వేగంతో పెరుగుతుంది. 2000 మరియు 2050 ల మధ్య భారతదేశ మొత్తం జనాభా 55% పెరిగే అవకాశం ఉంది, మరియు వారిలో 60+ మరియు 80+ వయస్సు గల వారు ఈ సంఖ్యలో 326% మరియు 700% పెరుగుదలతో ఉన్నారు.

భారతదేశంలో చాలామంది వృద్ధులకి  ప్రభుత్వము నుండి తక్కువగా ఆర్ధిక  సహాయం లబిస్తుంది. సాధారణం గా భారత దేశం లో కుటుంబం వృద్ధుల సంరక్షణ కోసం  సాధారణ ప్రదేశం లాగా చూడబడుతోంది. నేడు చాలామంది వృద్ధులు ఒంటరిగా నివసిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది మహిళలు  మరియు వీరు  నేరాల యొక్క సులభమైన లక్ష్యాలుగా మారుతున్నారు. వృద్దుల కోసం ప్రత్యెక గృహాలు తక్కువ నిర్మించబడినవి  మరియు ప్రభుత్వo తరుపున గృహాలు మరి తక్కువ ఉన్నవి. 

వృద్ధుల సంఖ్య:
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో దాదాపు 9% మంది 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు ఉన్నారు.  ప్రపంచవ్యాప్తంగా 12% మంది ఉన్నారు. 2050 నాటికి, 60 ఏళ్ల వయసున్నవారు  భారతదేశపు జనాభాలో 19% ఉంటారని భావిస్తున్నారు. కేరళ,  గోవా, తమిళనాడు, పంజాబ్, హర్యానా గోవా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఆ రాష్ట్రాల జనాభా లో 10% వృద్దుల జనాభా  కలిగి దేశం లో  ముందు ఉన్నాయి.  మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, అస్సాం వంటి రాష్ట్రాలు వృద్దుల జనాభా తక్కువ శాతం కలిగి ఉన్నవి.  వృద్ధుల సంరక్షణ అనేది రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలలో ఆర్టికల్ 41 ప్రకారం ఉంది.

తక్కువ ఆర్థిక సహాయం:
కొన్ని రాష్ట్రాలలో అతి తక్కువ ఆర్ధిక సహాయం(నెలకు 400 రూపాయలు) ప్రభుత్వం వ్రుద్దాప్యపు పెన్షన్ కింద అందిస్తున్నవి. కాని అది సరిగా రావుట లేదు. 
భారత ప్రభుత్వం 1995 నుండి నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం కింద సామాజిక పెన్షన్లను అందిస్తోంది. 2007 లో ఈ కార్యక్రమాన్ని బిలో పావర్టి లైన్ గృహానికి చెందిన వృద్ధుల కోసం ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం (ఇఇ ఇనోస్) గా తిరిగి ప్రవేశపెట్టారు. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ప్రతి వ్యక్తికి పెన్షన్ 200 రూపాయల చొప్పున 80 ఏళ్ళు లేదా అంతకన్నా  ఎక్కువ వయస్సు ఉన్నవారికి 500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం  అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మొత్తానికి సరిపొయిన మ్యాచింగ్ గ్రాంట్ అందించవలసి ఉంటుంది. 2011 సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ విధానం (IGNOAPS) కింద నెలవారీ పెన్షన్ గా  1,000 రూపాయలు సిఫారసు చేసింది. ఈ విధానం ఇంకా ఖరారు చేయకపోయినప్పటికీ, కొన్ని రాష్ట్రాలు ఈ సిఫారసుకు అనుగుణంగా తమ వంతు ఆర్ధిక  సహకారాన్ని పెంచాయి. అస్సాం, నాగాలాండ్లలో 200, మిజోరంలో  250, బీహార్, గుజరాత్, రూ. 400, రాజస్థాన్, పంజాబ్లలో 500 రూపాయల వరకు ఉంది. అయినప్పటికీ  ఇంకా లక్షల మంది వృద్ద  పౌరులు పేదరికం లో జీవిస్తున్నారు.

సుప్రీం కోర్టులో కొనసాగుతున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PILపిఐఎల్) నెలకు రూ 2,000 చొప్పున వృద్దాప్యపు పెన్షన్  కోరుతుంది. ఈక్విటీ స్టడీస్ సెంటర్ ఫర్ సోషల్-ఎకనమిక్ అడ్వకేసీ గ్రూప్ నిర్వహించిన ఒక సర్వే ఓల్డ్ ఏజ్  పెన్షన్ లబ్ధిదారులకు 1,600 రూపాయల నుంచి 2,000 రూపాయలు సరిపోతుందని తెలిపింది. 2013 లో హెల్ప్అజ్ ఇండియా-రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జర్నల్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో భారతీయ వృద్ధులలో 90% మందికి రూ 2,000 నుండి పెన్షన్ అందించడం ద్వారా  GDP లో 1.81% ఖర్చు అవుతుంది. రూ. 1,000 పెన్షన్ అందిస్తే GDP లో 1% కంటే తక్కువ ఖర్చు అవుతుంది. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ వెబ్ సైట్ ప్రకారం, లక్షలాది మంది వృద్ధులకి  ఓల్డ్ ఏజ్ పెన్షన్ అందుతుంది.

పెన్షన్లు, సేవల  యాక్సెస్ కష్టం Pensions, services difficult to access
పెన్షన్ మొత్తం  చిన్నదిగా ఉండటమే దాని కఠిన ప్రక్రియలు మరియు పక్షపాత కఠినమైన సిబ్బందితో పెన్షన్ దారులు   పోరాడాలి. వయస్సు, లోకల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ పొందుట కష్టం గా ఉంది. కొన్ని చోట్ల ప్రేవేట్ వృద్ద శరణాలయాలు స్థల కొరతను,  నీటి కొరతను, అంబులెన్సుల కొరతను  ఎదుర్కొంటున్నవి. వృద్ధులను  ఉత్పాదక జనాభాలో భాగంగా చూడలేరు.  ఇంకా వృద్ధుల సంరక్షణ  ఇప్పటికీ కుటుంబ బాధ్యతగా భావిస్తారు. ఈ రకమైన ఆలోచన ప్రబుత్వ విధాన నిర్ణయం మరియు విధాన జోక్యాన్ని ప్రభావితం చేస్తుంది. "

ఎక్కువ మంది వృద్ధులు ఒంటరిగా నివసిస్తున్నారు
ఒంటరిగా నివసించే వృద్దులపై ఆత్యాచారాలు, నేరాలు, హింసలు  పెరిగినవి.2014 నుండి భారతదేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తన వార్షిక ప్రచురణలో 'క్రైమ్ ఎగైనెస్ట్ సేనియర్ సిటిజన్స్ ' అనే ప్రత్యేక ప్రత్యేక అధ్యాయాన్ని ప్రారంభించింది. రెండు సంవత్సరాల్లో నేరాల సంఖ్య 9.7% పెరిగింది. దానికి సంభందిoచిన డేటా అందుబాటులో ఉంది.  2014 లో భారత శిక్షాస్మృతి చట్టం కింద 18,714 కేసులు నమోదయ్యాయి. ఇవి  2015 నాటికి 20,532 కు పెరిగాయి.  మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో నేరాలు సంభవించాయి. తరువాత స్థానం లో  మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు  ఉన్నవి.  డేటా మ్యాపింగ్ దేశంలోని దక్షిణ ప్రాంతాలలో వృద్ధులకు వ్యతిరేకంగా అధిక నేరాలు జరుగుతున్నాయని తెల్పుతుంది.  డిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక శాతం నేరాలు నమోదయ్యాయి.

ఓల్డ్ ఏజ్  వయసు సులభంగా నేరాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది, ప్రత్యేకంగా ఒక వ్యక్తి మాత్రమే ఒంటరిగా నివసిoచటం.  జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని 240 మిలియన్ కుటుంబాలలో 4% మంది ఒకే వ్యక్తిని కలిగి ఉన్నారు. ఇందులో సగం (48%) లో, వ్యక్తి వయస్సు 60 సంవత్సరాలు లేదా ఎక్కువ. తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లలో, ఈ సంఖ్య వరుసగా 63% మరియు 62% కంటే ఎక్కువ. ఇంకా ఒంటరి వృద్ధులలో 73% మంది మహిళలు. దక్షిణ కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మరియు పుదుచ్చేరి కేంద్ర ప్రాంతంలోని ఒక-వ్యక్తి గృహాలలోని వృద్ధులలో, మహిళలు 81% గా  ఉన్నారు.

కుటుంబాలు సాంప్రదాయకంగా తమ వృద్ధుల పట్ల  శ్రద్ధ వహించాలని భావిస్తున్నప్పటికీ, 2014 లో వృద్ధుల హింస  (abuse) పై  హెల్ప్ ఏజ్ ఇండియా చేసిన  సర్వే లో కొంతమంది వృద్దులు హింసను ఎదుర్కొంటున్నారని నివేదించింది. వారిలో చాలా మంది వారి కుటుంబాలతో నివసించారు మరియు కోడలు  మరియు కొడుకు వారిని హింసిస్తున్నారు. పంజాబ్ వంటి ప్రగతిశీల రాష్ట్రంలో కూడా వృద్ధుల పట్ల పెద్ద నిర్లక్ష్యం ఉంది. వృద్దుల పట్ల నిర్లక్షం, హింస ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారింది. "

వృద్దులకు సహాయ నివాస గృహాలు
వృద్ధులకు నివాస గృహాలు ఏర్పరచడం ఒక సమస్య.  ప్రతి జిల్లాలో "వదిలివేయబడిన సీనియర్ పౌరుల కోసం సహాయక సౌకర్యాలతో గృహాలను ఏర్పాటు చేయడాన్ని అందుకు తగిన బడ్జెట్ ఏర్పాటు చేయడాన్ని  2011 నాటి జాతీయ పథకo సిఫార్సు చేసింది.

సోషల్ జస్టిస్ మంత్రిత్వ శాఖ యొక్క తాజా సమాచార విశ్లేషణ ప్రకారం, 500  ప్రాజెక్టులకు  (ఓల్డ్ ఏజ్  గృహాలు / డే కేర్ సెంటర్లు / రెస్పెక్ట్ కేర్ హొమ్స్ మాత్రమే) మంత్రిత్వ శాఖ అనుమతించినది. అవి భారతదేశంలోని 700 కు పైగా జిల్లాలలో విస్తరించినవి. 2012-13 నుంచి 2015-16 వరకు నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో, కేంద్ర ప్రభుత్వం ఓల్డ్ ఏజ్ గృహాలకు మద్దతుగా అన్ని రాష్ట్రాల్లో రు. 47 కోట్లకు పైగా విడుదల చేసింది. కొన్ని సంవత్సరాల్లో, ప్రతి గృహానికి  రూ .400,000 లేదా నెలకు రూ. 33,000 ఇచ్చింది.  ఇది  బస, ఆహారం మరియు ఇతర సౌకర్యాల కోసం ఉపయోగపడుతుంది.

ఇందులో అధిక భాగం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలోని  ఓల్డ్ ఏజ్ గృహాలకు వినియోగించు కొన్నవి. ఈ  నాలుగు రాష్ట్రాలు దేశంలోణి  60+ జనాభాలో ఐదవ (21 శాతం) మందిని కలిగి ఉన్నారు. అతిపెద్ద వయస్సు ఉన్న వృద్ధులతో ఉన్న రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ (15%) మరియు మహారాష్ట్ర (11%), వరుసగా 3% మరియు 6% నిధులు  పొందినవి. ఈ డబ్బును సరిగా ఉపయోగించబడలేదు. పైగా ప్రైవేట్ ఓల్డ్ ఏజ్  గృహాలు పట్టణాలలో చాలా దూరంగా ఉన్నాయి.

లోక్ సభ లో  (పార్లమెంటు దిగువ సభ) వృద్దుల సమస్య పై  చర్చ మూడు లేదా నాలుగు పాయింట్లకు మాత్రమే పరిమితం చేయబడింది - IGNOAPS మీద మరియు వృద్ధుల కోసం సమగ్ర కార్యక్రమం, ఓల్డ్ ఏజ్  గృహాలు, రోజు-సంరక్షణ (డే కెర్)  కేంద్రాలు, మొదలైన వాటి నిర్వహణ. ఓల్డ్ ఏజ్ సమస్య యొక్క తీవ్రతను గుర్తిస్తూ మరియు విధాన పరిష్కారాలను కనుగొనడంతో ఏదైనా మార్పు ప్రారంభమవుతుంది.

వివిధ నిపుణులు ప్రకారం జీవించడానికి వృద్ధులకు  ఒక మంచి మరియు వాస్తవిక పెన్షన్ అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.వృద్ధ పౌరుల భద్రత కోసం, విస్తృతమైన కమ్యూనిటీ మరియు చట్ట పరిరక్షణ సంస్థల  సహాయం తో ప్రయత్నించాలి: ఐక్యరాజ్యసమితి జనాభా నిధి ఈ విషయం లో గృహ-ఆధారిత కేర్ ప్రొవైడర్ల యొక్క వ్యవస్థను భారతదేశం సృష్టించాలని కోరింది.  వృద్ధులకు సహాయక పరికరాలను విస్తృతంగా అందించాలని కోరింది.  వృద్ధులని చూసే కుటుంబ సభ్యులకు రాయితీలు ఇవ్వాలి. పని, ఉద్యోగం వంటి విషయాలలో వెసులు బాటు కల్పించాలి అంది


15 గురు ప్రసిద్ధ ముస్లిం (అరబ్ & పర్షియన ) శాస్త్రవేత్తలు మరియు వారి ఆవిష్కరణలు (15 Famous Muslim (Arab & Persian) Scientists and their Inventions)




అరబ్బులు, పెర్షియన్లు మరియు తుర్క్స్ అయిన ముస్లిం శాస్త్రవేత్తలు మరియు ఆవిష్కర్తలు మధ్యయుగం లోని యురోపియన్ల కన్నా వందల సంవత్సరాలు ముందు ఉన్నారు. వారు అరిస్టాటిల్ తత్వశాస్త్రం మరియు నియో-ప్లాటోనిస్టులు, యుక్లిడ్, ఆర్కిమెడిస్, టోలెమి మరియు ఇతరుల నుండి ప్రభావాన్నిపొందారు. అసంఖ్యాక ఆవిష్కరణలు చేసి మెడిసిన్, శస్త్రచికిత్స, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, తత్వశాస్త్రం, జ్యోతిషశాస్త్రం, జ్యామితి మరియు అనేక ఇతర రంగాల పై ముస్లింలు లెక్కలేనన్ని పుస్తకాలు వ్రాశారు.
.నేటి ఈ వ్యాసం అత్యంత ప్రసిద్ధ ముస్లిం శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు మరియు వారి అద్భుతమైన ఆవిష్కరణలను చర్చిస్తుంది.
1.     అబూ నసర్ అల్-ఫరాబి. (872 - 950)(Abu Nasr Al-Farabi (872 – 950)
 ఇతడిని  ఆల్ఫారబియస్ అని కూడా పిలుస్తారు. అరబ్ శాస్త్రవేత్త మరియు తత్వవేత్త మరియు  మధ్యయుగ ప్రముఖ ఆలోచనాపరులలో ఒకరిగా పరిగణించారు.
2.     అల్-బత్తని (858 - 929)(Al-Battani (858 – 929)
ఇతడిని ఆల్బాటియస్ అని కూడా పిలుస్తారు. ఇతను  అరబ్ గణిత శాస్త్రజ్ఞుడు, మరియు ఖగోళ  శాస్త్రవేత్త. ఇతడు  సంవత్సరం యొక్క ఖచ్చితమైన కాలమానం ను మరియు వివిధ రుతువుల కాల మానాలను  లేక్కించాడు.
3.     ఇబ్న్ సిన (980 - 1037) (Ibn Sina (980 – 1037)
అవిసెన్నా అని కూడా పిలుస్తారు. అరిస్టాటిల్ తత్వశాస్త్రం మరియు వైద్యo పై  తన రచనలకు ప్రసిద్ది చెందిన పర్షియన్ వేదాంతవేత్త మరియు శాస్త్రవేత్త.
4.ఇబ్న్ బటుట (1304 - 1369)Ibn Battuta (1304 – 1369)

ఇతడిని షామ్స్-ఉద్దిన్ అని కూడా పిలుస్తారు.చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రయాణ పుస్తకాల్లో  ఒకతైన రిహ్లా వ్రాసిన అరబ్ యాత్రికుడు మరియు పండితుడు.
5.ఇబ్న్ రష్ద్ (1126 - 1198)ఇబ్న్ Ibn Rushd (1126 – 1198)
ఇతనిని అవేరోస్ అని కూడా పిలుస్తారు. అరటి తత్వవేత్త మరియు పండితుడు అరిస్టాటిల్ యొక్క రచనలలో చాలా భాగం మరియు ప్లాటో రిపబ్లిక్ పై సారాంశాలను మరియు వ్యాఖ్యానాలను సృష్టించాడు.
6.ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్-ఖ్వారిజ్మి (780 - 850) Muhammad ibn Musa Al-Khwarizmi (780 – 850)

అల్గోరిట్మి లేదా అల్గారిజిన్ అని కూడా పిలుస్తారు. అతని రచనలు హిందూ-అరబిక్ అంకెలు మరియు బీజగణిత విధానాలను యూరోపియన్ గణిత శాస్త్రంలోకి పరిచయం చేశాయి.
7. ఒమర్ ఖయ్యం (1048 - 1131)(Omar Khayyam (1048 – 1131)
పెర్షియన్ గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రవేత్త మరియు కవి. శాస్త్రీయ ఆవిష్కరణలు  మరియు రుబాయ్యాత్  ("క్వాట్రైన్స్") లకు ప్రసిద్ధి.
8.థిబిట్ ఇబ్న్ ఖురా (826 - 901)(Thabit ibn Qurra (826 – 901)

ఇతనిని తేబిట్ అని పిలుస్తారు. అరబ్ గణిత శాస్త్రజ్ఞుడు, వైద్యుడు మరియు ఖగోళవేత్త; టోలెమిక్ వ్యవస్థ యొక్క మొట్టమొదటి సంస్కర్త మరియు స్టాటిక్స్ వ్యవస్థాపకుడు.
9.అబు బక్ర్ అల్-రజి (865 - 925)(Abu Bakr Al-Razi (865 – 925)
రాజేస్ అని కూడా పిలుస్తారు. పెర్షియన్ రసవాది మరియు తత్వవేత్త, చరిత్రలో గొప్ప వైద్యులలో ఒకరు.
10. జబీర్ ఇబ్న్ హైయాన్ (722 - 804)Jabir Ibn Haiyan (722 – 804)
గెబెర్ అని కూడా పిలుస్తారు. రసవాదం మరియు లోహాశాస్త్రంపై తన అత్యంత ప్రభావవంతమైన రచనలకు ప్రసిద్ది చెందినాడు.  అరబ్ రసాయన శాస్త్రం యొక్క పితామహుడు. .
11. ఇబ్న్ ఇషాక్ అల్-కిండి (801 - 873)(Ibn Ishaq Al-Kindi (801 – 873)

అల్ కిన్డుస్  అని కూడా పిలుస్తారు. అరబ్ తత్వవేత్త మరియు శాస్త్రవేత్త, ముస్లిం పర్పెపెటరి తత్వవేత్తలలో మొదటివాడు
12. ఇబ్న్ అల్-హేథం (965 - 1040)(Ibn Al-Haytham (965 – 1040)

అల్హజీన్ అని కూడా పిలుస్తారు. అరబ్ ఖగోళ శాస్త్రజ్ఞుడు మరియు గణిత శాస్త్రజ్ఞుడు.  ఆప్టిక్స్ సూత్రాలకు మరియు అతని శాస్త్రీయ ప్రయోగాలలో   తన ముఖ్యమైన రచనలకు ప్రసిద్ధి చెందారు.
13. ఇబ్న్ జుహ్ర్ (1091 - 1161)Ibn Zuhr (1091 – 1161)
అవెంజోజార్ అని కూడా పిలుస్తారు. అరబ్ వైద్యుడు మరియు శస్త్రవైద్యుడు. అతడి ప్రభావవంతమైన పుస్తకం “అల్-టైయిసర్ ఫిల్-ముదావత్ వాల్-తడ్బీర్” (బుక్ ఆఫ్ సింప్లిఫికేషన్ థెరపీటిక్స్ అండ్ డైట్) కు ప్రసిద్ది.
14. ఇబ్న్ ఖాల్దున్ (1332 - 1406)(Ibn Khaldun (1332 – 1406)
అరబ్ చరిత్రకారుడు మరియు హిస్తోగ్రాఫర్ ఆధునిక చరిత్ర, సామాజిక శాస్త్రం మరియు ఆర్థికశాస్త్రం యొక్క పూర్వీకునిగా  పరిగణించబడుతున్నాడు.
15. ఇబ్న్ అల్-బైటర్ (1197 - 1248)(Ibn Al-Baitar (1197 – 1248)


అరబ్ శాస్త్రవేత్త, వృక్షశాస్త్రజ్ఞుడు మరియు వైద్యుడు. మధ్య యుగంలో ఇస్లామిక్ వైద్యులు చేసిన ఆవిష్కరణలను క్రమపద్ధతిలో నమోదు చేశాడు.