పాట్నాలోని చారిత్రాత్మక ఖుదా బక్ష్ లైబ్రరీలోని కర్జన్ రీడింగ్ రూమ్‌ను ఎలివేటెడ్ రోడ్డు కోసం కూల్చివేయాలన్న ప్రతిపాదనపై ఇటీవలి కాలంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది, ఈ సందర్భంగా నేను మీకు కర్జన్ రీడింగ్ రూమ్ చరిత్రను పరిచయం చేయాలనుకుంటున్నాను.
ఖుదా బక్ష్ లైబ్రరీని
29 అక్టోబర్ 1891న ప్రారంభించినప్పుడు, దీనికి పెద్ద
భవనం లేదు. కానీ ఈ లైబ్రరీకి పుస్తకాల సేకరణలో ఉన్న ఘనమైన కీర్తి
అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్ ను పాట్నాలోని
గంగానది ఒడ్డున ఉన్న ఖుదా బక్ష్ లైబ్రరీని జనవరి 1903లో సందర్శించే
లాగా చేసింది.
లార్డ్ కర్జన్ ఇక్కడ సేకరించిన మాన్యుస్క్రిప్ట్‌లను చూసి ఆకర్షితుడై వాటి పరిరక్షణ మరియు ఖుదాబక్ష్ లైబ్రరీ అభివృద్ధిపై ఆసక్తి చూపాడు. లార్డ్ కర్జన్ ఖుదాబక్ష్ లైబ్రరీ కి నిధులు సమకూర్చాడు. ఈ విషయాన్నీ ఖుదాబక్ష్ ఖాన్ కుమారుడు సలాహుద్దీన్ ఖుదాబక్ష్ 1912లో "మై ఫాదర్: హిజ్ లైఫ్ అండ్ రిమినిసెన్సెస్ My Father : His life and reminiscences "లో ప్రస్తావించాడు.
అప్పటి పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ జె.జి. కమ్మింగ్ స్వయంగా పండితుడు కావడంతో లైబ్రరీ కోసం భూమిని కేటాయించారు; మరియు లైబ్రరీ సుందరీకరణపై వ్యక్తిగత ఆసక్తిని కనబరిచాడు. జె.జి. కమ్మింగ్ రీడింగ్ హాల్‌తో కూడిన అందమైన తోటను కూడా నిర్మించాలని కోరుకున్నాడు; అయితే జె.జి. కమ్మింగ్ పాట్నా నుంచి బదిలీ అయ్యారు. కలకత్తా సెమినరీకి చెందిన డాక్టర్ డెనిసన్ రాస్ పర్యవేక్షణలో రీడింగ్ హాల్ నిర్మాణం ప్రారంభమైంది మరియు డాక్టర్ డెనిసన్ రాస్ లైబ్రరీ పుస్తకాల కేటలాగింగ్‌కు పూర్తి బాధ్యత వహించారు. సలావుద్దీన్ ఖుదా బక్ష్ ప్రకారం,తన తండ్రి ఖుదా బక్ష్ ఖాన్ ఈ రీడింగ్ హాల్ పేరును తన స్నేహితుడు జె.జి. కమ్మింగ్ పేరున పెట్టాలి అనుకొన్నాడు మరియు లైబ్రరీ కమిటీ కూడా అదే చేస్తుంది అని భావించాడు. కానీ రీడింగ్ హాల్ కు కొన్ని అనివార్య బ్యూరోక్రాటిక్ కారణాల వలన ఏకగ్రీవ అభిప్రాయంగా కర్జన్ రీడింగ్ హాల్ అని పేరు పెట్టబడినది.
1876లో తన మరణానికి ముందు, న్యాయవాది ముహమ్మద్ బక్ష్ తన వీలునామాను తన కుమారుడు ఖుదా బక్ష్‌కు అందజేసి, భవిష్యత్తులో ఒక గ్రంథాలయాన్ని సామాన్య ప్రజల కొరకు ఏర్పాటు చేయమని కోరాడు. పై విషయాన్నీ పేర్కొంటూ సెప్టెంబరు 1908లో ఖుదా బక్ష్ ఖాన్‌కు నివాళులర్పిస్తూ యదునాథ్ సర్కార్, మోడరన్ రివ్యూలో రాశాడు.
ఖుదా బక్ష్ తన తండ్రి న్యాయవాది ముహమ్మద్ బక్ష్ సంకల్పాన్ని నిజం చేయడానికి చాలా కష్టపడ్డాడు మరియు ఆ సమయంలో ఒక సాధారణ న్యాయవాది కోసం 80,000 రూపాయల ఖర్చుతో భవనాన్ని నిర్మించడం సామాన్య విషయం కాదు. రెండు అంతస్తుల భవనం నిర్మించబడింది, ఇందులో అనేక గదులు ఉన్నాయి, ఒక పెద్ద వరండా; ఇది అన్ని గదులకు కనెక్ట్ చేయడానికి ఉపయోగించబడింది, అలాగే దీనికి రెండు వైపుల నుండి మెట్లు ఉన్నాయి. లైబ్రరీ భవనం చాలా అందంగా ఉంది, నేలపై మొజాయిక్ మరియు పాలరాయి పరచబడినది.
1891 అక్టోబరు 29న, ఇక్కడ ఉన్న వ్రాతప్రతులు ఏవీ పాట్నా నుండి వెలుపలకు తీసుకు వెళ్లకూడదనే షరతుతో లైబ్రరీ సాధారణ ప్రజలకు తెరవబడింది. ఆకాలం లో ఇది సామాన్య ప్రజల కోసం ఏర్పాటు అయిన మొదటి లైబ్రరీ అని గుర్తుంచుకోవాలి. అప్పట్లో దీన్ని ఓరియంటల్ పబ్లిక్ లైబ్రరీ అని పిలిచేవారు. కానీ ప్రజలకు అది నచ్చలేదు మరియు ఖుదా బక్ష్ లైబ్రరీగా ప్రసిద్ధి చెందింది.
ఖుదాబక్ష్ లైబ్రరీ వ్యవస్థాపకుడు ఖుదాబక్ష్ ఖాన్, లైబ్రరీ నుండి మాన్యుస్క్రిప్ట్‌లు బయటకు వెళ్లకూడదని నియమం విధించారు. కానీ 60వ దశకంలో, మొఘల్ చక్రవర్తి అక్బర్‌పై డాక్యుమెంటరీ తీయడానికి భారత ప్రభుత్వం లైబ్రరీ ఇంతేజామియా నుండి చాలా అరుదైన మాన్యుస్క్రిప్ట్ 'తారిఖ్ ఇ ఖాందాన్ తైమూరియా तारीख़ ए ख़ानदान तैमुरिया’ 'ని కోరింది. ఆ సమయంలోని లైబ్రరీ డైరెక్టర్ డాక్టర్ ఇక్బాల్ హుస్సేన్, ప్రోటోకాల్‌ను పేర్కొంటూ పంపడానికి నిరాకరించారు. మొదట్లో బీహార్ గవర్నర్ ఈ నిర్ణయంతో ఎకిభవించారు కానీ తర్వాత, ఒత్తిడితో, షఫీ అహ్మద్ మరియు అథర్ షేర్ అనే ఇద్దరు లైబ్రరీ సిబ్బంది పర్యవేక్షణలో 'తారీఖ్-ఎ-ఖాందాన్ తైమూరియా' ను పది రోజుల పాటు ఢిల్లీకి తీసుకెళ్లి, తిరిగి పాట్నాకు తీసుకురావాలని గవర్నర్ ఆలోచన చేశారు. పని అయిపోయింది..
ఖుదా బక్ష్ లైబ్రరీ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఇక్బాల్ హుస్సేన్ తన 'దస్తాన్ మేరీ' పుస్తకంలో జ్ఞాపకాలు రాస్తూ జనవరి 1934లో బీహార్‌లో చాలా ప్రమాదకరమైన భూకంపం సంభవించి, చాలా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది అని పేర్కొన్నారు.. ఖుదా బక్ష్ లైబ్రరీ భవనం కూడా దెబ్బతిన్నది కాని భవనం పై భాగాల్లో పుస్తకాలు ఉంచకపోవడంతో భవనం దెబ్బతిన్నా పుస్తకాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. బిహార్ ప్రభుత్వం లైబ్రరీ భవనం పైభాగాన్ని పూర్తిగా కూల్చివేయాలని ఆదేశించింది. ఈ సమయంలో అల్మిరాతో పాటు కింది అంతస్తులో ఉంచిన పుస్తకాలన్నీ బీహార్ యంగ్ మెన్ ఇనిస్టిట్యూట్ ప్రక్కనే ఉన్న భవనంలో ఉంచబడ్డాయి. కొద్దిరోజుల తర్వాత గ్రంథాలయానికి కొత్త భవనం నిర్మించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని బాధ్యతను పాట్నా డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కరీం సాహెబ్‌కు అప్పగించారు.
ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఆధారంగా చక్కటి మ్యాప్ తయారు చేసి ఖుదాబక్ష్ లైబ్రరీకి పునాది వేశారు. ఎరుపు మరియు గోధుమ రంగు రాళ్ళు దిగుమతి చేయబడ్డాయి మరియు వాటిని చెక్కడానికి రాజస్థాన్ నుండి కళాకారులు వచ్చారు. ఏడాదిలో భవనం పూర్తి కాగానే బీహార్ గవర్నర్ స్వయంగా వచ్చి పరిశీలించారు. పుస్తకాలు ఉంచడానికి లైబ్రరీలోని అల్మారాలు కలకత్తా నుండి తెప్పించారు. ఖుదాబక్ష్ లైబ్రరీ యొక్క ఎరుపు రంగు భవనం చాలా అందంగా కనిపించింది. దీంతో ఖుదాబక్ష్ లైబ్రరీ కొత్త భవనానికి మారింది.
కొన్ని సంవత్సరాలు గడిచాయి. రెండవ యుద్ధం ప్రారంభమైనది. పాట్నా వైమానిక దాడులకు గురయ్యే ప్రమాదం ఉంది, ఎరుపు రంగు చాలా దూరం నుండి కనిపిస్తుంది, కాబట్టి ఖుదాబక్ష్ లైబ్రరీ త్వరగా గోధుమ రంగుతో పెయింట్ చేయబడింది. త్వరత్వరగా అన్ని అరుదైన పుస్తకాలను పాట్నాకు దూరంగా వివిధ ప్రాంతాలకు మార్చారు. రెండోవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత, అన్ని పుస్తకాలను పాట్నాకు తిరిగి తీసుకువచ్చి ఖుదాబక్ష్ లైబ్రరీకి మార్చారు.
మొత్తంమీద, ఖాన్ బహదూర్ జస్టిస్ ఖుదాబక్ష్ ఖాన్ జీవితకాలంలో నిర్మించబడిన ఖుదాబక్ష్ లైబ్రరీకి సమీపంలో ఈ రోజు కర్జన్ హాల్ మాత్రమే భవన వారసత్వంగా మిగిలిపోయింది. నేడు, ఖాన్ బహదూర్ ఖుదా బక్ష్ ఖాన్ సమాధి కూడా ఈ కర్జన్ రీడింగ్ హాల్ పక్కనే ఉంది, ఇక్కడ వందలాది మంది పిల్లలు చదువుకోవడానికి వస్తారు.
ఖుదా బక్ష్ ఖాన్ 2 ఆగస్టు 1842న ఛప్రాలో జన్మించాడు మరియు 1908 ఆగస్టు 3న పాట్నాలో మరణించాడు. ఖుదా బక్ష్ ఖాన్ ను ఖుదా బక్ష్ గ్రంథాలయ ప్రాంగణంలో ఖననం చేశారు.
No comments:
Post a Comment