సాధారణంగా మహిళలు తమ కుటుంబo మరియు పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉంటారు, అయినప్పటికీ ముస్లిం స్త్రీలు బయటికి వెళ్లడo లేదా ఉద్యోగాలు చేయడం నిషేధించబడలేదు. స్త్రీ బాధ్యతల్లో ప్రాధాన్యతలు ఉంటాయి. ఈ బాధ్యతలు ఆమె ఉద్యోగానికి హాని కలిగించకపోతే మరియు ఆమె పని ఇస్లామిక్ షరియా మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటే, ఆమె పని చేయడం మంచిది.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కాలంలో స్త్రీలు మసీదుకు వెళ్లేవారు. స్త్రీలు యుద్దరంగం లో ప్రవక్త(స)తో పాటు పాల్గొని యుద్దంలో గాయపడిన వారికి సేవలు చేసేవారు. ప్రవక్త(స) భార్యలు హజ్ మరియు ఉమ్రా కోసం బయలుదేరారు
కుటుంబ జీవితం కోసం మరియు పిల్లలను పెంచడం కోసం స్త్రీలు సృష్టించబడ్డారని మరియు వారి సహజ స్థానం వారి ఇళ్లలో ఉందని మనం ఆలోచించడం అలవాటు చేసుకున్నాము. దివ్య ఖురాన్ లేదా సున్నాలో ఏదీ అటువంటి అభిప్రాయాన్ని లేదా ఊహను స్పష్టంగా సమర్ధించలేదు. ప్రవక్త(స) హదిసులు ప్రవక్త(స) తన భార్యలకు ఇంటిపనిలో సహాయం చేయడం సూచిస్తాయి
ఇంకా దివ్య ఖురాన్ ఆయత్ 4:34లో పురుషులకు స్త్రీలకు గల సంబంధాన్ని వివరించే అరబిక్ పదం "ఖవ్వమ్qawwamun", " అనేది ఎటువంటి ఆధిక్యతను సూచించదు, కానీ "పూర్తిగా శ్రద్ధ వహించడం" అని అర్థం తెల్పుతుంది..ఈ ఆయత్ ఇలా చెబుతుంది : "పురుషులు స్త్రీల పట్ల పూర్తి శ్రద్ధ వహిస్తారు, దేవుడు వారిలో ఒకరికి మరొకరి పై ఆధిక్యతను ఇచ్చి ఉన్నాడు. అదికాక పురుషులు తమ సంపదను ఖర్చు పెట్టారు. ".
ఇస్లాం ప్రకారం విద్యను పొందడంలో స్త్రీకి హక్కు మరియు బాధ్యత ఉంది కాబట్టి, స్త్రీ యొక్క పని హక్కుకు మద్దతు ఇవ్వడం ఆమె వ్యక్తిత్వానికి, సమాజానికి మంచిది మరియు కుటుంబానికి మంచిది. పనిహక్కు సురక్షితంగా ఉండాలి.
మహిళలు ఇంటి లోపల లేదా బయట పని చేయడాన్ని ఇస్లాం ఎప్పుడూ నిషేధించలేదు. ఉదాహరణకి, అల్లాహ్ యొక్క దూత (సల్లల్లాహు అలైహి వసల్లం) భార్యలు ఇంట్లో పని చేసేవారు. ఉదాహరణకు, ఆహారం తయారు చేయడం, ఇళ్లను శుభ్రపరచడం మరియు ప్రవక్త(స) కు సేవ చేయడం మరియు శ్రద్ధ వహించడం వంటి ఇతర ఇంటి పనులతో పాటు దుస్తులకు మరియు ఎండిన చర్మాలకు రంగులు వేసేవారు.
ఇంకా,
ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క సహచరుల భార్యలు తమ
ఇంటి పనులు మరియు ఇతర పనులు చేసేవారు. ఉదాహరణకు,
ప్రవక్త(స) కూమార్తె ఫాతిమా(ర) స్వయంగా
క్వెర్న్ (ధాన్యం కోసం చేతి మిల్లు)/తిరగలి విసిరేవారు.
మహిళలు పనికి వెళ్లడం ఇస్లాంలో నిషేధించబడలేదు, ఎందుకంటే ప్రవక్త(స) జీవితకాలంలో కొంతమంది మహిళలు పనికి వెళ్లేవారు.ఆ మహిళల్లో ఉమ్మ్ అత్తియా- సున్తీ చేయడం, మదీనాలో మరణించిన ఆడవారిని కడగడం మరియు కప్పడం మరియు ఇతర యోధుల కోసం ఆహారం తయారు చేయడంతో పాటుగా యుద్ధభూమిలో గాయపడిన ముస్లిం యోధులకు నర్స్/సేవ మరియు చికిత్స చేసేవారు.
స్త్రీ వివాహం చేసుకున్నా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఇంటి వెలుపల పని చేయడం ఇస్లామిక్ చట్టానికి విరుద్ధం కాదని అనేక ఉదాహరణలు చూపిస్తున్నాయి. అయినప్పటికీ, ఇస్లాం శ్రామిక మహిళలను రక్షించడానికి, వారి భద్రతను నిర్ధారించడానికి మరియు ఏదైనా సంభావ్య ప్రతికూల ప్రభావాలను potential negative effects నివారించడానికి నిర్దిష్ట చట్టాలను ఏర్పాటు చేసింది.
ఇస్లామిక్ పని నియమాలలో ఒకటి స్త్రీలు తమను తాము వదులుగా ఉన్న వస్త్రాలతో కప్పుకోవాలి మరియు హిజాబ్ ధరించాలి. స్త్రీ ఎప్పుడూ చాలా బిగుతుగా లేదా పారదర్శకంగా ఉండే దుస్తులు ధరించి ఇంటి నుండి బయటకు రాకూడదు. మరో మాటలో చెప్పాలంటే, పురుషుడు తన పట్ల లైంగికంగా ఆకర్షితుడయ్యేలా చేసే, పెర్ఫ్యూమ్ లేదా మేకప్‌ని ఉపయోగించడం, లేదా తన 'అవ్రా' (కప్పబడిన భాగాలను) బహిర్గతం చేసేదైని ధరించి బయటకు వెళ్లకూడదు. పనికి వెళుతున్నప్పుడు, ఒక స్త్రీ ఆకర్షణ/టెంప్టేషన్ యొక్క మూలంగా ఉండకూడదు లేదా పనిలో అనుమతించబడిన వ్యక్తులతో తప్ప ఇతర వ్యక్తులతో గుమికూడి ఉండరాదు
అంతేకాకుండా, ఒక స్త్రీ తన శారీరక స్వభావానికి సరిపోయే రకమైన పనిలో(టీచర్, నర్స్, డాక్టర్, కంప్యూటర్
ఆపరేటర్ మొదలగునవి) నిమగ్నమై ఉండాలి మరియు ఇంటి వెలుపల పని చేయడానికి స్త్రీ తన చట్టపరమైన
సంరక్షకుడు లేదా భర్త అనుమతి పొందాలి. అదనంగా, స్త్రీ వివాహిత అయితే ఆమె యొక్క పని ఆమె
భర్త లేదా పిల్లల హక్కుల ఉల్లంఘనకు దారితీయకుండా చూసుకోవాలి.
No comments:
Post a Comment