ముహమ్మద్ ప్రవక్త(స)
పలికిన ఆశీర్వాద సూక్తి "అల్-ఖల్క్ అయల్ అల్లా"
“మానవాళి మొత్తం, దేవుని కుటుంబం” అని మనకు బోధిస్తుంది. అలాగే "అందరి పట్ల ప్రేమ, ఎవరిపట్ల ద్వేషం లేదు" అనే సూక్తికి ప్రతి రూపం సూఫీ చిష్టీ తరికా.
11వ శతాబ్దపు సూఫీ సెయింట్ హజ్రత్ ఖవాజా
మొయినుదీన్ చిష్టీ గరీబ్ నవాజ్ యొక్క బోధనలను భారత దేశం లోని లక్షలాది మంది ప్రజలు
గత 800 సంవత్సరాల నుండి
అనుసరిస్తున్నారు. హజ్రత్ ఖవాజా మొయినుదీన్ చిష్టీ గరీబ్ నవాజ్ యొక్క సందేశం “అందరి పట్ల షరతులు
లేని ప్రేమ; భిన్నత్వంలో
ఏకత్వం” అనేది భారతదేశం యొక్క గొప్ప ఆధ్యాత్మిక బలాలలో ఒకటి.
భారతీయ ముస్లింల ఆధ్యాత్మిక,
సాంస్కృతిక మరియు మతపరమైన చరిత్రతో పెనవేసుకొన్న ఒక ముఖ్యమైన అంశం సూఫీయిజం. భారతీయ ముస్లింలపై
చెరగని ముద్ర వేయడమే కాకుండా భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించడంలో సూఫీయిజం కీలక
పాత్ర పోషించింది.
సూఫీయిజం భారతదేశంతో సహా
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. భారతీయ ముస్లిం జనాభా పై సూఫీ సెయింట్స్ యొక్క
గొప్ప ప్రభావం కలదు.భారత దేశం లో సూఫీయిజం, ముఖ్యంగా చిష్టీ సూఫీల ప్రభావం భారతదేశంలోని
దాదాపు 80 శాతం మంది
ముస్లిం జనాభాపై ఉంది.
సూఫీయిజం లో ఆధ్యాత్మిక
అభివృద్ధి, దేవుని పట్ల
ప్రేమ మరియు దైవిక లోతైన వ్యక్తిగత అనుభవాన్ని అనుసరించడం జరుగుతుంది. సూఫీ బోధనలు
శాంతి, సామరస్యం, సహనం, మరియు
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే విలువలను ప్రోత్సహిస్తాయి.
అనేక సూఫీ తరిఖాలు ఆధ్యాత్మిక
అభ్యాసాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అజ్మీర్ షరీఫ్‌కు చెందిన హజ్రత్ ఖ్వాజా
మొయినుద్దీన్ చిష్టీ మరియు ఢిల్లీకి చెందిన హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా వంటి ప్రముఖ
సూఫీ సన్యాసులు ప్రేమ, సామరస్యం మరియు
ఐక్యత మరియు భిన్నత్వం యొక్క సందేశం కోసం వివిధ విశ్వాసాల ప్రజలచే గౌరవించబడ్డారు.
భారతదేశం అంతటా ఉన్న సూఫీ పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక సాధన మరియు సాంస్కృతిక
మార్పిడికి ముఖ్యమైన కేంద్రాలుగా కొనసాగుతున్నాయి.
సూఫీ కవిత్వం, సంగీతం మరియు
ధ్యానం భారతీయ సంప్రదాయాలలో అంతర్భాగాలుగా మారాయి. ఇవి భక్తి యొక్క
వ్యక్తీకరణలుగా మరియు ఆధ్యాత్మిక ఉద్ధరణకు వాహనాలుగా ఉపయోగపడుతున్నాయి
భిన్నత్వంలో ఏకత్వాన్ని
పెంపొందించడం, మతపరమైన మరియు
సాంస్కృతిక సరిహద్దులను అధిగమించగల సామర్థ్యం సూఫీయిజం యొక్క విశేషమైన అంశాలలో
ఒకటి. అజ్మీర్ దర్గా షరీఫ్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ మరియు ఢిల్లీకి చెందిన
హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా వంటి సూఫీ సాధువుల దర్గాలు (సూఫీ పుణ్యక్షేత్రాలు)
వివిధ విశ్వాసాల నుండి భక్తులను ఆకర్షించే పవిత్ర స్థలాలుగా మారాయి, సర్వమత
సామరస్యాన్ని మరియు పరస్పర గౌరవాన్ని పెంపొందించాయి.
సూఫీ చిష్టీ తరీకా మాస్టర్స్
ప్రచారం చేసిన షరతులు లేని ప్రేమ, కరుణ మరియు ఐక్యత సందేశం భారతదేశ సామాజిక నిర్మాణాన్ని
బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించింది.చిష్టీ సూఫీ మాస్టర్స్ భారతదేశం అంతటా భిన్నత్వంలో
ఏకత్వానికి బలమైన పునాది వేశారు. `
చిష్టీ సూఫీయిజం
ఇస్లామిక్ మరియు భారతీయ సంప్రదాయాల యొక్క ప్రత్యేకమైన సంశ్లేషణను సృష్టించింది.
భారతదేశంలోని సూఫీ పుణ్యక్షేత్రాలలో పాడే ఖవ్వాలి వంటి ఆధ్యాత్మిక గీతాలు మరియు
సూఫీ సంగీతం, అద్భుతమైన చిష్టీ
వారసత్వం కు ప్రతిబింబం.
సూఫీ సాధువుల కవిత్వం
ప్రధానంగా హిందూ, పర్షియన్, బ్రిజ్ భాష, అవధి, బంగ్లా, మరాఠీ, ఖాదీ బోలి, ఉర్దూ మరియు
పంజాబీ వంటి భాషలలో వ్యక్తీకరించబడింది. ఇది హిందూ మతం మరియు ఇస్లాంలో విశ్వాసం, సంస్కృతి మరియు
భక్తి మధ్య సారూప్యతలను ప్రోత్సహించే సంగీత శైలిగా కూడా ఉద్భవించింది.
సూఫీ మరియు భక్తి కలయిక
యొక్క ఫలితం బౌల్-ఫకిరీ పాటలతో పాటు కీర్తన (బెంగాల్‌లోని వైష్ణవులు అభ్యసించే
భక్తి సంగీతం మరియు ధ్యానం) బెంగాల్ సంగీతంపై తన ముద్ర వేసింది. సూఫీ చిష్తి సంగీత
సాహిత్యం మతపరమైన సరిహద్దులను దాటి వివిధ నేపథ్యాల ప్రజల
హృదయాలను హత్తుకుంటుంది.
చిష్టీ సూఫీ ఆర్డర్
వ్యక్తిగత ఆధ్యాత్మిక అభివృద్ధిపై దృష్టి పెట్టడమే కాకుండా సాంఘిక సంక్షేమం మరియు
మానవాళికి సేవ చేయడంపై గణనీయమైన ప్రాధాన్యతనిచ్చింది. సూఫీ గురువులు మరియు వారి
అనుచరులు ధార్మిక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నారు, ఆసుపత్రులు, అనాథ శరణాలయాలు
మరియు విద్యా కేంద్రాల వంటి సంస్థలను స్థాపించారు.
సూఫీ గురువుల బోధనలు హింస
మరియు అసహనాన్ని తిరస్కరిస్తాయి. ఆధ్యాత్మిక జ్ఞానోదయం యొక్క మార్గాన్ని కోరుకునే వారికి
ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తాయి. సూఫీ దర్గాలు విభిన్న వర్గాల మధ్య
సామరస్యాన్ని ప్రోత్సహిస్తాయి.చిష్టీ సూఫీ మాస్టర్స్ అందరికీ ప్రేమ, శాంతి మరియు
గౌరవం యొక్క విలువలను భోదించారు.
భారతదేశంలోని చిష్టీ సూఫీ
వారసత్వం దేశం యొక్క బహుత్వ నైతికతను కాపాడటంలో మరియు పరస్పర గౌరవం మరియు సహజీవన
వాతావరణాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది.
No comments:
Post a Comment