13 June 2023

సైన్స్‌లో పీహెచ్‌డీ చేసిన మొదటి భారతీయ మహిళ కమలా సోహ్ని

 

చరిత్ర పుటల నుండి:

అది దాదాపు 1933వ సంవత్సరం. ఆ రోజుల్లో స్త్రీ విద్యపై ప్రత్యేక శ్రద్ధ ఉండేది కాదు. అయినప్పటికీ, కమల బొంబాయి విశ్వవిద్యాలయం నుండి B.Sc  పట్టా పొందారు. కమల ప్రధాన సబ్జెక్ట్ కెమిస్ట్రీ మరియు సెకండరీ సబ్జెక్ట్ ఫిజిక్స్. గ్రాడ్యుయేషన్‌లో కమల తన క్లాస్ లో అత్యధిక మార్కులు పొందినది. గ్రాడ్యుయేషన్‌ తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం, కమల ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో రీసెర్చ్ ఫెలోషిప్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నది. కానీ ఇన్‌స్టిట్యూట్ హెడ్ ప్రొఫెసర్, నోబెల్ గ్రహీత డాక్టర్ సీవీ రామన్ మాత్రం కమలా మహిళ అనే కారణంతో దరఖాస్తును తిరస్కరించారు.

రామన్ ప్రకారం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మహిళలకు కాదు, ఆ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పరిశోధనలు చేసేంత సామర్థ్యం మహిళలకు లేదు, వారు పరిశోధన పనిని ముందుకు తీసుకెళ్లలేరు. దీనికి నిరసనగా కమల సత్యాగ్రహానికి కూర్చున్నది. చివరకు కొన్ని షరతులతో కమలను రిసెర్చ్ లో చేర్చుకోవటానికి డాక్టర్ రామన్ ఒప్పుకున్నారు.

ఈ కథ కమలా సోహ్నిది! సైన్స్‌లో పీహెచ్‌డీ చేసిన మొదటి భారతీయ మహిళ కమలా సోహ్ని!

 

No comments:

Post a Comment