24 June 2023

సర్తోర్ ఫకీర్ ? -1917 Sartor Faqir? -1917

 

పష్టో Pashto లో "ముల్లా మస్తాన్, ముల్లా మస్తానా, లెవనై ఫకీర్" అని కూడా పిలువబడే సర్తోర్ ఫకీర్ (బేర్ హెడ్) ను బ్రిటిష్ వారు "ది గ్రేట్ ఫకీర్" లేదా "మాడ్ ఫకీర్", "మాడ్ ఫకీర్ ఆఫ్ స్వాత్" లేదా "మాడ్ ముల్లా" అని కూడా పిలుస్తారు. ఖైబర్ పఖ్తుంఖ్వా Khyber Pakhtunkhwa లో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించిన ప్రముఖ వ్యక్తి సర్తోర్ ఫకర్.

సర్తోర్ ఫకీర్ అసలు పేరు సైదుల్లా ఖాన్. సర్తోర్ ఫకీర్ బునెర్ వ్యాలీలోని రేగా బునెర్ గ్రామంలో జన్మించాడు మరియు పష్టూన్స్‌లోని యూసఫ్‌జాయ్ తెగకు చెందిన ఒక శాఖ సభ్యుడు. తన మతపరమైన విద్యను కొనసాగించడానికి, సర్తోర్ ఫకీర్ పది సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్‌లోని మజార్-ఇ-షరీఫ్‌లో ఉండడానికి ముందు భారతదేశం మరియు మధ్య ఆసియా అంతటా పర్యటించాడు. 1895లో, సర్తోర్ ఫకీర్ బునర్‌ Buner కు తిరిగి వచ్చాడు.

నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ (ఖైబర్ పఖ్తుంఖ్వా)పై బ్రిటిష్ ఆక్రమణకు ప్రతిస్పందనగా, డ్యూరాండ్ లైన్ ద్వారా పష్తూన్ భూముల విభజనకు ప్రతిస్పందనగా, సర్తోర్ ఫకీర్ బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జిహాద్ ప్రకటించాడు. సర్తోర్ ఫకీర్ బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ప్రాంతీయ యూసుఫ్జాయ్, మొహమ్మంద్, ఉత్మాన్ఖేల్, బునర్వాల్, స్వాత్ Yusufzai, Mohmand, Uthmankhel, Bunerwal, Swati తెగలకు చెందిన 12,000 మందికి పైగా పష్టూన్ గిరిజన తెగవాసులను సమీకరించాడు మరియు మలాకాండ్ మరియు దిర్‌లోని బ్రిటిష్ సైనికదళాలపై దాడులు ప్రారంభించాడు. బ్రిటీష్ వారు కేవలం మలాకాండ్ Malakand నుండి మాత్రమే కాకుండా పెషావర్ నుండి కూడా తరిమివేయబడతారని సర్తోర్ ఫకీర్ పేర్కొన్నారు.

బ్రిటిష్ సైనిక దళాలతో జరిగిన పోరులో మరణించిన ఫకీర్లందరినీ సర్తోర్ ఫకీర్ సందర్శించినట్లు ఒక నమ్మకం కలదు. సర్తోర్ ఫకీర్ కు అదృశ్య శక్తులు ఉన్నాయని, సర్తోర్ ఫకీర్ స్వాత్ నదిలో రాయి విసిరితే దానితో బ్రిటిష్ సైనికుల తుపాకీలు, బుల్లెట్లు నీరుగా మారుతాయని ఒక నమ్మకం కలదు. తనకు సహాయం చేయడానికి తన పక్కన స్వర్గం నుండి ఒక అదృశ్య సైన్యం ఉందని సర్తోర్ ఫకీర్ ప్రకటించాడు. పై మతపరమైన పిచ్చి ఆలోచనల/నమ్మకాల  వల్ల బ్రిటీష్ వారు సర్తోర్ ఫకీర్ ను పిచ్చి ఫకీర్ Mad faqir మరియు పష్టూన్‌లను లేవనై ఫకర్ Lewanai faqir అని పిలిచేవారు.

సర్తోర్ ఫకీర్, లాండకే నుండి మలకాండ్ మరియు చక్దారా వరకు కవాతు ప్రారంభించాడు. ఎగువ స్వాత్, బునేర్, ఉత్మాన్ ఖేల్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు వేల సంఖ్యలో సర్తోర్ ఫకీర్తో చేరారు. సర్తోర్ ఫకీర్ ఆధ్వర్యంలో 8,000 కంటే ఎక్కువ మంది పష్తున్ గిరిజనులు చక్దారాలో బ్రిటిష్ వారిపై దాడి చేశారు, ఇందులో బ్రిటిష్ వారి ప్రకారం 28 మంది సైనికులు మరణించారు మరియు 178 మంది గాయపడ్డారు, అయితే స్థానిక పష్తూన్‌ల ప్రకారం 100 మందికి పైగా బ్రిటిష్ సైనికులు మరణించారు.

మలాకంద్ మరియు చక్దారా దళంపై దాడులు కేవలం స్థానికంగా జరిగిన చిన్నపాటి అలజడి ఫలితంగా జరగలేదని, బ్రిటిష్ సైన్యాన్ని భారత దేశం నుండి తరిమికొట్టేందుకు ఉమ్మడి గిరిజనులు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని భారత ప్రభుత్వానికి తెలియగానే, మలాకంద్ ను బలోపేతం చేయడానికి బ్రిటిష్ వారు వెంటనే చర్యలు తీసుకున్నారు. సర్తోర్ ఫకీర్ అద్వర్యం లోని దళం లో  పెరుగుతున్న పష్టున్ గిరిజనులను అణిచివేసేందుకు, డివిజనల్ దళాలతో కూడిన రెండు బ్రిగేడ్‌లతో కూడిన ఫీల్డ్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి.

 సర్తోర్ ఫకీర్-బ్రిటిష్ దళాలకు మద్య జరిగిన పోరులో ఇరువైపులా చాలా మంది యోధులు చనిపోయారు. స్వాత్ లోయలో లాండకే Landakay సమీపంలోని కోటహ్ మరియు నవే కలే Kotah and Naway Kalay వద్ద జరిగిన పోరాటo లో మరణించిన లెఫ్టినెంట్-కల్నల్ ఆడమ్స్ మరియు విస్కౌంట్ ఫిన్‌కాజిల్‌కు కు బ్రిటిష్ ప్రభుత్వం అత్యున్నత సైనిక పతకo విక్టోరియా క్రాస్  ఇచ్చింది మరియు మరో ఐదుగురికి ఆర్డర్ ఆఫ్ మెరిట్ లభించింది. మలాకాండ్ ముట్టడి పై విన్‌స్టన్ చర్చిల్‌ బ్రిటిష్ వార్తాపత్రికలో కథనాలను వ్రాసాడు, ఈ కథనాలు చర్చిల్ ప్రచురించిన పుస్తకం, ది స్టోరీ ఆఫ్ ది మలాకండ్ ఫీల్డ్ ఫోర్స్‌”లో సంకలనం చేయబడ్డాయి.

 తర్వాత దిర్ నవాబు dir of nawab, అబ్దుల్లా ఖాన్ ఆఫ్ రోబాట్ robat ఆధ్వర్యంలో నవాబ్ అఫ్ దిర్ నవాబు dir of nawab సర్తోర్ ఫకీర్‌కు వ్యతిరేకంగా మారి మరియు సర్తోర్ ఫకీర్‌ దళాలపై దాడి చేసి సర్తోర్ ఫకీర్‌ ప్రారంభించిన  ఉద్యమాన్ని బలహీనపరిచాడు. దీంతో సర్తోర్ ఫకీర్‌  కలత చెందాడు. బ్రిటీష్ వారు సర్తోర్ ఫకీర్‌కు వ్యతిరేకంగా విభజించి పాలించే వ్యూహాన్ని ఉపయోగించారు మరియు సర్తోర్ ఫకీర్‌ నుండి తదుపరి దాడులను ఆపడానికి బ్రిటిష్ వారు సర్తోర్  ఫకీర్‌ను ఖైబర్ పఖ్తుంఖ్వా Khyber Pakhtunkhwa ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి అనుమతించకుండా నవాబ్ ఆఫ్ దిర్‌తో ఒప్పందాలు చేసుకున్నారు.

బ్రిటీష్ అధికారులు మెక్‌మహిన్ మరియు రామ్‌సే ప్రకారం, " సర్తోర్ ఫకీర్‌ భారత దేశ వాయువ్య సరిహద్దులలో కఠినమైన పోరాటాన్ని చేసాడు.. సర్తోర్ ఫకీర్‌ ఉద్యమం ఆ ప్రాంత యోధులలో స్వేచ్ఛ మరియు జిహాదీని సజీవంగా ఉంచిందని చెప్పవచ్చు.

భారత దేశ వాయువ్య ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన వర్గాల స్వయంప్రతిపత్తి మరియు స్వాతంత్య్రాన్ని రక్షించడం సర్తోర్ ఫకీర్‌ యొక్క ప్రాథమిక లక్ష్యం. బ్రిటీష్ సామ్రాజ్యం గిరిజన భూములను ఆక్రమించడాన్ని సర్తోర్ ఫకీర్‌ తీవ్రంగా వ్యతిరేకించాడు మరియు బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వివిధ గిరిజన సమూహాలను ఏకం చేయడానికి ప్రయత్నించాడు. బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడేలా వారిని ప్రేరేపించి గిరిజన సంఘాలకు ఆశాకిరణంగా నిలిచాడు.

 

సర్తోర్ ఫకీర్‌ 1917లో ఫతేపూర్ స్వాత్‌లో మరణించాడు.

 

.

No comments:

Post a Comment