7 June 2023

1971 వెస్ట్ ఇండీస్ పర్యటనలో వెస్టిండీస్‌ను ఓడించి చరిత్ర సృష్టించడంలో సహాయపడిన హైదరాబాద్ క్రికెట్‌లోని ప్రసిద్ధ ఐదుగురు భారత్‌ ఆటగాళ్ళు Famous Five of Hyderabad cricket helped India defeat West Indies and create history

 

ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో వరల్డ్ టెస్ట్ ఛాoపియన్ షిప్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు పోరుకు సిద్ధమయ్యాయి. జూన్ 7 నుండి 11 వరకు జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ పోటీకి ముందు, టెస్ట్ క్రికెట్‌లో భారతదేశం సాధించిన గొప్ప విజయo(భారత జట్టు కరేబియన్ దీవుల్లో పటిష్టమైన వెస్టిండీస్‌ను ఓడించడం) లో  సహాయపడిన ఐదుగురు ప్రముఖ హైదరాబాదీ ఆటగాళ్ల గురించి తెలుసుకొందాము.

1971లో కొత్త కెప్టెన్ అజిత్ వాడేకర్ నేతృత్వంలోని భారత జట్టు, కరేబియన్ దీవుల్లో పటిష్టమైన వెస్టిండీస్‌ను ఓడించింది. ఆ జట్టులో ఐదుగురు హైదరాబాద్ ఆటగాళ్లు ఉన్నారు మరియు వారు భారతదేశం యొక్క అద్భుతమైన విజయాన్ని సులభతరం చేసారు. నేడు మరియు గతంలో లేని విధంగా భారత జట్టులో ఐదుగురు హైదరాబాదీలు ఉన్నారు.

ఐదుగురు హైదరాబాదీలు ML జైసింహ, సయ్యద్ అబిద్ అలీ, పల్లెమోని కృష్ణమూర్తి, కెనియా జయంతిలాల్ మరియు దేవరాజ్ గోవింద్రాజ్. వీరు  హైదరాబాద్ క్రికెట్‌లో ఫేమస్ ఫైవ్‌గా పిలవబడే వారు 

భారత జట్టుకు జైసింహ సహకారం అపారమైనది ఆటగాడిగా మాత్రమే కాకుండా జైసింహ కెప్టెన్‌కు సలహాదారుగా కూడా. అనేక సందర్భాల్లో జైసింహ  ఉపయోగకరమైన సూచనలతో ముందుకు పోయానని కెప్టెన్ వాడేకర్ అన్నాడు. ఆటను చదవగల జైసింహ  సామర్థ్యం, జైసింహ  ​​ వ్యూహాత్మక భావం మరియు ప్రత్యర్థి లైనప్‌లో బలహీనమైన పాయింట్లను గుర్తించడంలో జైసింహ  సామర్థ్యం భారత జట్టుకు అమూల్యమైన సహాయం.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది మరియు మిగిలిన అన్ని టెస్ట్ మ్యాచ్‌లను డ్రా చేయడం ద్వారా ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది.చివరిదైన ఐదో టెస్టులో వెస్టిండీస్‌కు మ్యాచ్‌ గెలిచే అవకాశం వచ్చింది. నాల్గవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్‌కు విజయానికి 262 పరుగులు మాత్రమే అవసరమవుతాయి మరియు మూడవ స్థానంలో వచ్చిన క్లైవ్ లాయిడ్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. లాయడ్ కి కావలసిందల్లా మరొక ఎండ్ లో నిలకడగా ఆడే బ్యాట్సమన్. లాయిడ్‌ కు స్టాండ్‌ను నాలుగో నంబర్ (రోహన్ కన్హై) లేదా నంబర్ ఐదో (గ్యారీ సోబర్స్) ఇచ్చి ఉంటే అంతా అయిపోయేది.

కానీ ఈ సమయం లో భారత్ కు చెందిన మీడియం ఫేసర్ -అల్ రౌండర్  సయ్యద్ అబిద్ అలీ సరిగ్గా బౌలింగ్ చేస్తూ, బంతిని పిచ్‌పైకి వేగంగా కదుపుతూ, 21 పరుగుల వద్ద రోహన్ కన్హాయిని క్లీన్ బౌల్డ్ చేసినాడు, తరువాత సర్ గ్యారీ సోబర్స్ డకౌట్ అయ్యాడు. ఆడలేని రెండు డెలివరీలతో unplayable deliveries హైదరాబాద్‌కు చెందిన ఆల్ రౌండర్ అబిద్ అలీ వెస్టిండీస్ బ్యాటింగ్ క్రీంను తుడిచిపెట్టాడు. గొప్ప ఫాస్ట్ బౌలర్లు సాధించడం కష్టంగా భావించే పనిని   అబిద్ అలీ చేసి వెస్ట్ ఇండీస్ జట్టును ప్రమాదంలో నెట్టాడు.

ఇద్దరు కరేబియన్ లెజెండ్‌లు అవుట్ అవటాన్ని మరొక ఎండ్ నుండి క్లైవ్ లాయిడ్ షాక్ తో చూసాడు. వారు అవుట్ అవట్టాన్ని లాయిడ్ నమ్మలేకపోయాడు. అబిద్ అలీ  పడగొట్టిన రెండు కీలక వికెట్ల తో మ్యాచ్ డ్రాగా ముగిసింది మరియు భారత జట్టు కరేబియన్ భూమిలో వెస్ట్ ఇండీస్ పై  సీరిస్ గెలిచింది. ఈ సిరిస్ భారత జట్టు తన చరిత్రలో సాధించిన  గొప్ప విజయాలలో ఒకటిగా జరుపుకునేలా చేసింది.

భారత వికెట్ కీపర్ పి. కృష్ణమూర్తి కింగ్‌స్టన్‌లో జరిగిన మొదటి టెస్టులో ఆల్ రౌండర్ గ్యారీ సోబర్స్‌ను 93 పరుగుల వద్ద ఏకనాథ్ సోల్కర్ బౌలింగ్‌లో అవుట్ చేయడానికి మంచి క్యాచ్ తీసుకున్నాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున మొత్తం 11 స్లాట్‌లలో/స్థానాలలో  బ్యాటింగ్ చేయడం p.కృష్ణమూర్తి ప్రత్యేకత. p.కృష్ణమూర్తి ఓపెనర్‌గా మరియు పదకొండో నంబర్ బ్యాటర్‌గా సెంచరీ భాగస్వామ్య బ్యాటింగ్‌  కల ఏకైక బ్యాట్స్‌మన్. ఇది సులభంగా పునరావృతం చేయలేని ఘనత.

హైదరాబాద్‌కు చెందిన కెనియా జయంతిలాల్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. జయంతిలాల్ పుల్ షాట్‌ బాగా ఆడతాడు మరియు మంచి డిఫెన్స్‌ను కలిగి ఉన్నాడు. కానీ టెస్టు క్రికెట్‌లో ఒకే ఒక్క అవకాశం లభించడం జయంతిలాల్ కి  దురదృష్టం. సునీల్ గవాస్కర్ ఒక ఓపెనర్ గా ఉన్నాడు భారతదేశంలోని ఇతర ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లందరూ మిగిలిన ఒక్క ఓపెనింగ్ బ్యాట్ మాన్ స్థానం కోసం పోరాడవలసి ఉంటుంది. దురదృష్టవశాత్తూ జయంతీలాల్‌కు బీసీసీఐలో గాడ్‌ఫాదర్‌లు లేరు.

జట్టులోని మరో హైదరాబాదీ సీమ్ బౌలర్ దేవరాజ్ గోవింద్ రాజ్. పేస్ బౌలర్‌గా గోవింద్‌రాజ్ ని  ఎలా ఉపయోగించాలో తెలిసిన ML జైసింహ నాయకత్వంలోని  హైదరాబాద్‌ జట్టు లో పేస్ బౌలర్‌గా గోవింద్ రాజ్  కెరీర్ పైకి ఎగబాకింది.

కరీబియన్స్‌లో గోవింద్‌రాజ్‌కు ఫస్ట్‌ క్లాస్ గేమ్‌లలో మాత్రమే అవకాశం కల్పించారు. స్థానిక జట్లతో జరిగిన ఒక మ్యాచ్‌లో, గ్యారీ సోబర్స్ ని కూడా గోవింద్‌రాజ్‌ తన బౌలింగ్‌తో బాగా ఆకట్టుకున్నాడు. ఒక విలువైన ఫాస్ట్ బౌలర్‌గా గోవింద్‌రాజ్‌ ఉనికి జట్టు సభ్యుల మనోధైర్యాన్ని పెంచింది మరియు కరేబియన్ పర్యటన అంతటా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది


No comments:

Post a Comment