6 June 2023

ఆల్-వుమెన్స్ సూఫియానా గ్రూప్ all-women’s Sufiyana Group

 

ఆధ్యాత్మికవేత్తలు మరియు దైవిక అన్వేషకులచే(సూఫీలు) ప్రతిపాదింపబడిన కాశ్మీర్ యొక్క సాంప్రదాయిక సూఫీయానా సంగీతం పై ఎల్లప్పుడూ పురుషులు  ఆధిపత్యం చెలాయిoచేవారు. కాని దీనికి బిన్నంగా జనాదరణ పొందిన సూఫియానా సంగీత రంగంలో కొంతమంది యువ కాశ్మీరీ యువతులు ప్రవేశించి ఒక సంగీత బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఐదేళ్ల క్రితం, ఉత్తర కాశ్మీర్ లోని  ఇర్ఫానా అనే యువతి ఒక మహిళల సూఫియానా  సంగీత బృందాన్ని ఏర్పాటుచేసింది. ఇర్ఫానా సంతూర్ ప్లేయర్ అయిన తన తండ్రి వద్ద ఇంట్లో సూఫీ సంగీత కళను అబ్యసించినది.

ఇర్ఫానా మరియు ఆమె చెల్లెళ్లు ఇంట్లో సంప్రదాయ రాగాలతో సూఫీ కలాం (కవిత్వం) పాడటం ప్రారంభించడంతో, పరిసరాల్లోని అమ్మాయిలు కూడా ఆసక్తి కనబరిచి సూఫియానా సంగీతం నేర్చుకోసాగారు.

ఇర్ఫానా ఐదుగురు యువతులతో సూఫియానా గ్రూప్ ఏర్పాటు చేసి అనేక సామాజిక కార్యక్రమాలలో సూఫియానా సంగీత కచేరీలు నిర్వహించసాగింది.

సూఫియానా గ్రూప్‌లోని సభ్యులందరూ పేదలు మరియు వారి సూఫియానా  సంగీత   బృందానికి ప్రభుత్వం లేదా ఏ పెద్ద ఎన్జీవో సహాయం లబించలేదు. వారు స్వయంగా కచేరీలు నిర్వహించి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో  సంగీత వాయిద్యాలను కొనుగోలు చేసారు.

సూఫియానా సంగీత  బృందానికి నేతృత్వం వహిస్తున్న ఇర్ఫానా యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్‌లో సంగీత విభాగంలో చదువుతున్నారు. సూఫియానా సంగీత బృందం మొదట్లో  ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రజలు యువతుల చొరవను ప్రశంసించారు.

సూఫియానా గ్రూపులోని యువతులందరికీ ఇర్ఫానా తండ్రి మహమ్మద్ యూసుఫ్ శిక్షణ ఇస్తున్నారు. యూసుఫ్ సూఫీ సంగీతంలోని వివిధ అంశాలను యువతులకు పరిచయం చేశాడు మరియు దాని నియమాలు మరియు నిబంధనల గురించి వారికి అవగాహన కల్పించాడు.

సూఫియానా బృందం కాశ్మీర్ వెలుపల కూడా ప్రదర్శన ఇచ్చింది. ప్రజలు వారి సంగీతాన్ని మెచ్చుకున్నారు. ఈ బృందం అనేక అవార్డులను పొందినది. BBC మరియు వాయిస్ ఆఫ్ అమెరికాతో సహా జాతీయ మరియు అంతర్జాతీయ మీడియా మహిళల సూఫియానా సంగీత సమూహ కార్యక్రమాలను ప్రసారం చేసినవి.

No comments:

Post a Comment