న్యూఢిల్లీ:
విద్యావేత్తలు సామ్ అషర్, కృతార్థ్ ఝా, అంజలి అదుకియా, పాల్ నోవోసాద్
మరియు బ్రాండన్ టాన్ చేసిన పరిశోధనలో భారతదేశంలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో
నివాసాల విభజన లేదా సమాజం ఆధారంగా వేరు
చేయబడిన జీవనం లోతుగా పాతుకుపోయిందని
కనుగొన్నారు.
నగరాలు అన్ని వర్గాలకి మరింత
సమానమైన ప్రదేశాలుగా more equitable spaces తరచుగా
విశ్వసించబడుతున్నప్పటికీ, భారతీయ నగరాల్లో కులం మరియు మతం రెండింటిపై
ఆధారపడిన విభజన USలో జాతిపరమైన విభజనతో సమానంగా ఉందని వారు కనుగొన్నారు.
పరిశోధకుల డేటా ప్రకారం, భారతదేశంలో 26% ముస్లింలు 80% కంటే ఎక్కువ
ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు మరియు 17% షెడ్యూల్డ్
కులాలు 80% కంటే ఎక్కువ SC జనాభా ఉన్న
ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
పట్టణ మరియు గ్రామీణ
ప్రాంతాల్లో ఎస్సీల సేగ్రిగేషణ్/ విభజన/segregation సమానంగా ఎక్కువగా ఉండగా, పట్టణ
ప్రాంతాల్లో ముస్లింల సేగ్రిగేషణ్/విభజన segregation ఎక్కువగా ఉందని
పరిశోధకులు కనుగొన్నారు.
ఈ నివాస సేగ్రిగేషణ్/విభజనలు సామాజిక వ్యవస్థలోని విభజనలను సూచించడమే కాకుండా, ముస్లింలు మరియు
ఎస్సీల ఎక్కువుగా ఉన్న పరిసరాల్లో ప్రభుత్వం అందించే ప్రజా సేవలు తక్కువగా
ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు.
అన్ని నగరాల్లోని సెకండరీ పాఠశాలలు, క్లినిక్‌లు
మరియు ఆసుపత్రులు, విద్యుత్, నీరు మరియు మురుగునీటి పారుదల వ్యవస్థ ఇతర వర్గాల పొరుగు ప్రాంతాల కంటే ఎస్సీ మరియు
ముస్లిం పరిసరాల్లో అధ్వాన్నంగా ఉన్నాయి. పట్టణ ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే
మినహాయింపు ఉంది, ఇవి పట్టణ SC పరిసరాల్లో సర్వసాధారణం more common (కానీ గ్రామీణ SC పరిసరాల్లో మరియు
పట్టణ మరియు గ్రామీణ ముస్లిం పరిసరాల్లో తక్కువ సాధారణం less common). ఈ రకమైన తేడాలు
కొలవగల దాదాపు ప్రతి సేవకు వర్తిస్తుంది అని పరిశోధకులు కనుగొన్నారు.
"తక్కువ ముస్లిం
మరియు ఎస్సీ వాటా ఉన్న సగటు పట్టణ పరిసరాల్లో, యువకులు సగటున 9.2 సంవత్సరాల
పాఠశాల విద్యను పొందుతున్నారు. అదే నగరంలో, 100% SC వాటా ఉన్న
పరిసరాల్లో, సగటు వ్యక్తి 1.6 సంవత్సరాల
తక్కువ విద్యను పొందుతాడు, ”అని అధ్యయనం కనుగొంది.
ముస్లిం పరిసరాల్లోని
పిల్లలు మరింత అధ్వాన్నంగా ఉన్నారు, నాన్-మార్జినలైజ్డ్ పరిసరాల్లోని పిల్లల కంటే 2.2 సంవత్సరాల
తక్కువ పాఠశాల విద్యను పొందుతున్నారు మరియు ఇది కొనసాగుతుంది
అని పరిశోధకులు కనుగొన్నారు.
అట్టడుగు వర్గాలు marginalised groups మెజారిటీగా ఉన్న
పరిసరాల్లో, నివాసితులందరూ residents ప్రజా సేవల
కొరతతో lack of public services బాధపడుతున్నారు.
"మెజారిటీ SC మరియు మెజారిటీ
ముస్లింలు ఉన్న పొరుగు ప్రాంతాలలో, SCలు మరియు ముస్లింలు మాత్రమే కాకుండా అన్ని
సామాజిక సమూహాలు విద్య పరంగా అధ్వాన్నంగా ఉన్నాయి" అని అధ్యయనం పేర్కొంది.
ఈ అధ్యయనం 2011-13 నాటి డేటా
ఆధారంగా రూపొందించబడింది. ఫలితాలు ఏ నిర్దిష్ట ప్రభుత్వం యొక్క నిర్దిష్ట
విధానాలకు ఆపాదించబడవు.
-ది వైర్ సౌజన్యం తో
No comments:
Post a Comment