నేర్చుకుంటున్నా, బోధించినా, ముస్లిం
సమాజం ఉన్నత విద్యలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలతో సహా అన్ని వర్గాల
కంటే వెనుకబడి ఉంది. ఈ విషయాలు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో
నిర్వహించిన తాజా ఆల్ ఇండియా సర్వే ఆన్ ఎడ్యుకేషన్‌లో వెల్లడైనవి.
AISHE సర్వే 2020-21 రిపోర్ట్
ముస్లిం సమాజ విద్య సంభంద దుర్భరమైన
చిత్రాన్ని అందిస్తుంది.
·
2019-20తో పోలిస్తే,ఉన్నత
విద్యలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు
ఇతర వెనుకబడిన తరగతుల (OBC) నమోదులు వరుసగా 4.2%, 11.9%
మరియు 4% మెరుగుపడిన సమయంలో, ముస్లిం సమాజ నమోదు 8%
తగ్గింది అనగా సుమారు 1,79,000 మంది విద్యార్థులు మాత్రమే నమోదు అయ్యారు.
·
ముస్లిం విద్యార్ధుల
విషయo లో ఉత్తర ప్రదేశ్ (36%), జమ్మూ మరియు కాశ్మీర్
(26%), మహారాష్ట్ర
(8.5%) మరియు తమిళనాడు (8.1%) నుండి అత్యంత తీవ్రమైన క్షీణత నమోదైంది.
·
ఢిల్లీలో, ప్రతి
ఐదుగురు ముస్లిం విద్యార్ధులలో ఒకరు సీనియర్
స్కూల్ సర్టిఫికేట్ పరీక్షను పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్య కోసం నమోదు
చేసుకోవడంలో విఫలమయ్యాడు.
·
అదేవిధంగా, ఉత్తరప్రదేశ్‌లో, జనాభాలో
దాదాపు 20% ముస్లింలు ఉన్నారు, రాష్ట్రంలో కళాశాలల సంఖ్య
గణనీయంగా పెరిగినప్పటికీ, ఉన్నత విద్య కోసం ముస్లిం
విద్యార్ధుల నమోదు కేవలం 4.5% మాత్రమే.
· అయితే కేరళలో
మాత్రం 43% ముస్లింలు ఉన్నత విద్య కోసం ఎన్రోల్
అవుతున్నారు.
·
దేశంలోని ఉన్నత విద్యలో
మొత్తం నమోదులో OBC కమ్యూనిటీ
36% నమోదు, ఎస్సీలు 14% నమోదు అయ్యారు.
· OBC
మరియు ఎస్సీలు కలసి విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో దాదాపు 50% సీట్లను కలిగి
ఉన్నారు.
·
ముస్లిం సమాజం దేశ జనాభాలో
14% కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఉన్నత విద్య నమోదులో కేవలం 4.6% నమోదు కలిగి
ఉన్నది.
·
ముస్లింలు మరియు ఇతర
మైనారిటీలు మగ విద్యార్థుల కంటే ఎక్కువ మంది విద్యార్థినులను కలిగి ఉన్నారు.
·
ఉన్నత విద్యాసంస్థల్లో
ముస్లిం ఉపాధ్యాయులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నారు.
·
అఖిల భారత స్థాయిలో, మొత్తం
ఉపాధ్యాయులలో 56% మంది జనరల్ కేటగిరీకి చెందిన ఉపాధ్యాయులు ఉన్నారు. OBC, SC మరియు ST ఉపాధ్యాయులు
వరుసగా మరో 32%, 9%
మరియు 2.5% ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయులలో ముస్లింలు కేవలం 5.6% మాత్రమే
ఉన్నారు.
·
లింగం పరంగా 100 మంది
ఉపాధ్యాయులకు 75 మంది మహిళా
ఉపాధ్యాయులు ఉన్నారు.
·
ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు
చెందిన మహిళా ఉపాధ్యాయులు, ముస్లిం మహిళా ఉపాధ్యాయుల కంటే ఎక్కువుగా ఉన్నారు.
· 71% మహిళా OBC టీచర్లు మరియు 75% మహిళా ST టీచర్లు ఉండగా, ప్రతి 100 మంది ముస్లిం
ఉపాధ్యాయులకు 59 మంది మహిళా
ముస్లిం ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు.
·
అదేవిధంగా, బోధనేతర
సిబ్బందిలో 100 మంది పురుషులకు 85 మంది మైనారిటీలు
కాని మహిళా బోధనేతర సిబ్బంది కలరు.
· బోధనేతర
సిబ్బందిలో ముస్లింల వాటా 100 మంది పురుషులకు 34 మంది మహిళలతో
అత్యల్పంగా ఉంది.
· AISHE సర్వే ప్రకారం, ఉన్నత విద్యలో మహిళా
విద్యార్థుల సంఖ్య 48.67% కాగా పురుషుల విద్యార్థుల నమోదు 51.33%.
·
ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ముస్లిం
విద్యార్థులకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మౌలానా ఆజాద్ ఫెలోషిప్‌ను రద్దు
చేసిన ఐదు నెలల తర్వాత సర్వే ఫలితాలు వెలువడ్డాయి.
-ది హిందూ పత్రిక సౌజన్యం
తో
No comments:
Post a Comment