న్యూఢిల్లీ:
IPSA మరియు IMIF నిర్వహించిన పరిశోధనలో ఢిల్లీ లోని ముస్లింలు అన్ని అభివృద్ధి సూచీలలో వెనుకబడి ఉన్నారని మరియు వారి వెనుకబాటుతనం కు ప్రత్యక్షంగా ప్రభుత్వ నిష్క్రియాపరత్వానికి కారణమని గుర్తించింది
గత పదేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ఢిల్లీని పాలిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ‘సబ్కా వికాస్’ వాగ్దానం చేసినప్పటికీ, దేశ రాజధానిలోని ముస్లింల స్థితి చాలా రాష్ట్రాల మాదిరిగానే ఉందని కొత్త పరిశోధన వెల్లడించింది.
దేశ రాజధాని డిల్లి లో ముస్లింలు దాదాపు 16% జనాభాను కలిగి ఉన్నారని అధ్యయనం కనుగొంది, అయితే వివిధ ప్రభుత్వ పథకాలలో ప్రయోజనాలలో వారి వాటా కేవలం 5-7% మాత్రమే. అంతేకాకుండా ముస్లిం అభివృద్ధి పట్ల ప్రభుత్వ సంస్థల దృష్టి తగ్గుతోందని అధ్యయనం వెల్లడించింది
‘ముస్లిమ్స్ ఆఫ్ ఢిల్లీ: ఎ స్టడీ ఆన్ దేర్ సోషియో-ఎకనామిక్ అండ్ పొలిటికల్ స్టేటస్’ పేరుతో రూపొందించిన అధ్యయనాన్ని న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. అధ్యయనాన్ని ఢిల్లీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలసీ స్టడీస్ అండ్ అడ్వకేసీ (IPSA) మరియు ఇండియన్ ముస్లిం ఇంటలెక్చువల్స్ ఫోరమ్ (IMIF) సంయుక్తంగా నిర్వహించాయి.
1)బలహీన వర్గాలు Weaker Sections:
·
డిల్లీ మొత్తం జనాభా లో 83 శాతం, బలహీన వర్గాల జనాభాను ఢిల్లీ NCT కలిగి ఉంది.
·
ఢిల్లీలోని NCTలో మైనారిటీలు (18.22%), SCలు (16.75%) మరియు OBCలు (48%) ఉన్నారు .
·
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం 2013-14 బడ్జెట్లో బలహీన వర్గాలకు బడ్జెట్లో 0.98% కేటాయించగా ఈ ఏడాది 0.60%కి తగ్గించింది.
·
ఇది అన్ని బలహీన వర్గాలలో ప్రధానంగా ముస్లింలను ఎక్కువగా ప్రభావితం చేసింది.
2)వక్ఫ్ భూముల దోపిడి Loot of Waqf Land:
·
ఢిల్లీ వక్ఫ్ బోర్డు (DWB) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 1777 వక్ఫ్ భూములలో 990 ఆస్తులు వ్యక్తులు మరియు సమూహాలచే ఆక్రమణకు గురియ్యాయి. 30% వక్ఫ్ భూములు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA)ఆక్రమణకు గురైనట్లు అధ్యయనం కనుగొంది.
·
250 ఢిల్లీ వక్ఫ్ పబ్లిక్ స్కూల్స్ (DWPS), డిల్లి వక్ఫ్ బోర్డు DWB ద్వారా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
·
కాని ఇప్పటివరకు 2021లో ఒక DWPS అద్దె భవనంలో మాత్రమే స్థాపించబడింది.
3)విద్యా వైకల్యం/Educational Depravity:
·
అనేక విద్యా పారామితులలో ఢిల్లీలోని ముస్లింలు ఇతర సామాజిక-మత వర్గాల (SRCలు) కంటే వెనుకబడి ఉన్నారని అధ్యయనం చెబుతోంది.
·
ముస్లిములు విద్యా పరంగా అనేక అంశాలలో షెడ్యూల్డ్ కులాల కన్నా వెనుకబడి ఉన్నారు.
·
ఢిల్లీలోని వివిధ సామాజిక వర్గాలలో ముఖ్యంగా ముస్లిముల నిరక్షరాస్యుల శాతం అత్యధికంగా (14.79%) ఉంది.
·
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ముస్లింలు 40.82% మరియు గ్రాడ్యుయేషన్ మరియు అంతకు మించి పూర్తి చేసిన ముస్లిములు 13.97% మంది ఉన్నారు.
·
ముస్లిముల విద్యార్హత ఇతర SRCల కంటే తక్కువగా ఉంది.
·
NSSO 75వ రౌండ్ ప్రకారం ముస్లిం మహిళలు, ముస్లిం పురుషుల (15%) కంటే నిరక్షరాస్యులుగా (30%) అధికంగా రెట్టింపు సంఖ్యలో ఉన్నారు.
·
ఢిల్లీలోని 86% మంది పిల్లలు సాధారణంగా గుర్తింపు పొందిన పాఠశాలలో చేరుతున్నారు,
·
గుర్తింపు పొందిన సంస్థకు హాజరుకాని అన్నిసామాజిక వర్గాల విద్యార్థుల శాతం 18% కాగా అది ముస్లిములలో 14% ఉందని నివేదిక పేర్కొంది.
·
విద్యాసంస్థ దూరం మరియు పెరుగుతున్న విద్య వ్యయం ముస్లిం పిల్లల ప్రవేశంలో ఇబ్బందులను సూచిస్తుంది.
·
మొత్తం ముస్లిం విద్యార్థులలో కేవలం 13.84% మంది మాత్రమే స్కాలర్షిప్ సదుపాయాన్ని పొందారని గుర్తించబడింది.
4)ముస్లిం ప్రాంతాల్లో సరిపోని పాఠశాలలుInadequate Schools in Muslim Areas:
·
ఢిల్లీ ఎన్సిటిలో ఒక్కో వార్డుకు సగటున 10 పాఠశాలలు ఉండగా, ముస్లిం ఏకాగ్రత వార్డులలోMCD సగటున 4 ప్రభుత్వ పాఠశాలలు కలిపి ఉన్నాయి.
·
డిల్లి లోని MCDలో పాఠశాలల పంపిణీ తగినంతగా లేదని అధ్యయనం పేర్కొంది. .
5)ఉర్దూ క్షినత Poor State of Urdu:
·
ఢిల్లీ యొక్క రెండవ అధికార భాషగా ఉర్దూ ఉన్నప్పటికీ, ఉర్దూ మాట్లాడేవారు, పరిపాలనలో ఉర్దూ సిబ్బంది, ఉర్దూ పాఠశాలలు, ఉర్దూ ఉపాధ్యాయులు మరియు ఉర్దూ నేర్చుకునే విద్యార్థుల సంఖ్య పరంగా డిల్లీ తిరోగమనం లో ఉంది.
·
ఢిల్లీలో ఉర్దూ మాట్లాడేవారి శాతం 2001లో 5.91% నుండి 2011లో 5.17%కి తగ్గింది.
·
మాతృభాషలో బోధన సమస్య ఉన్నంత కాలం, ముస్లిం విద్యార్థుల్లో 0.35% మాత్రమే ఉర్దూను బోధనా మాధ్యమంగా ఎంచుకున్నారు.
· ఆంగ్ల మీడియం పాఠశాలల్లో 54.44% మరియు హిందీ మీడియం పాఠశాలల్లో 45.21% ముస్లిం విద్యార్థులు చేరారు..
6)ఉపాధి సమస్యలుEmployment Woes:
·
ఢిల్లీలోని శ్రామిక శక్తిలో దాదాపు 8.6% మంది నిరుద్యోగులుగా ఉండగా, ముస్లిములలో ఈ సంఖ్య 11.8%.
·
మహమ్మారి తర్వాత పరిస్థితి మరియు పర్యవసానంగా లాక్డౌన్ వారి ఉపాధి పరిస్థితిని మరింత దిగజారిందని అధ్యయనం పేర్కొంది.
·
ముస్లింల పని భాగస్వామ్య రేటు work participation rate (43.8%), ఢిల్లీ సగటు (43.3%) కంటే కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ, వారు ఎక్కువగా తక్కువ జీతం ఇచ్చే ఉద్యోగాలు మరియు వ్యాపారాలలో నిమగ్నమై ఉన్నారని నివేదిక వెల్లడిస్తుంది.
· ఢిల్లీలోని ఇతర మతపరమైన మైనారిటీలతో(87%), పోలిస్తే స్థానిక ముస్లింలు సాధారణ/జీతం తీసుకునే పనులలో తక్కువగా (43%), కనిపిస్తారు.ఇది ఇతర మతపరమైన మైనారిటిలలో/ORMలో సగం మరియు హిందువుల కంటే 24 శాతం తక్కువ (67%)గా ఉంది..
7)అధిక తల్లి మరణాల రేటుHigh Mother
Mortality Rate:
·
విద్యలాగే,
ఆరోగ్య సూచీలలో కూడా ముస్లింలు వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తోంది.
·
ఢిల్లీలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో మెరుగుదల మరియు మొహల్లా క్లినిక్‌ల విస్తరణ వంటి పెద్ద వాదనలు ఉన్నప్పటికీ
ముస్లిం తల్లి మరణాల రేటు (MMR), 2015లో 37 నుండి 2020లో 54కి పెరిగింది.
· ఇతరులతో 8.2%.పోలిస్తే సంస్థాగత డెలివరీ ముస్లిములలో అత్యధికం (13.7%)
8)తక్కువ రాజకీయ ప్రాతినిధ్యంLow Political Representation:
·
“ఢిల్లీలో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య దాదాపు 5.5%
వద్ద స్థిరంగా ఉంది, అయితే ముస్లిం జనాభా సంఖ్య దానికి మూడు రెట్లు ఉంది. MCDలో ప్రాతినిధ్యం ఇంకా తక్కువగా ఉంది” అని నివేదిక పేర్కొంది.
·
ముస్లిమేతరలు మెజారిటీగా ఉన్న స్థానాల నుండి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముస్లిం అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వడానికి చాలా రాజకీయ పార్టీలు విముఖంగా కనిపిస్తున్నాయి.
-ఇండియా టుమారో,మే 2, 2023 సౌజన్యం తో
No comments:
Post a Comment