(ఎడమ నుండి కుడికి) అమీన్ మంజిల్‌లో మహారాజా సర్
కిషన్ పెర్షాద్ & నోబెల్ గ్రహీత
రవీంద్రనాథ్ ఠాగూర్‌తో సర్ అమీన్ జంగ్
1933లో హైదరాబాద్ నిజాం ప్రభువు, రవీంద్రనాథ్ ఠాగూర్‌ను హైదరాబాద్‌ను
సందర్శించాల్సిందిగా అధికారికంగా ఆహ్వానించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ నిజాం
ప్రభుత్వ ఉన్నత అధికారులలో ఒకరైన నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ నిజాం ప్రభువు తరుపున పంపిన ఆహ్వానాన్ని సంతోషంగా
అంగీకరించారు.
అంతకు ముందు, నిజాం ప్రభువు మరియు
ప్రసిద్ధ కవి మధ్య పరస్పర గౌరవం మరియు అభిమానం ఏర్పడింది. విద్య అనేది చాలా
ఇష్టమైన విషయం. రవీంద్రనాథ్ టాగోర్ విశ్వభారతి యూనివర్సిటీని కూడా స్థాపించారు.
అనేక విద్యాసంస్థలను స్థాపించినందుకు నిజాంను ఠాగూర్ మెచ్చుకున్నారు.
1921లో స్థాపించబడిన
ఉస్మానియా విశ్వవిద్యాలయం భారత గడ్డపై నిర్మించిన ఏడవ విశ్వవిద్యాలయంగా గుర్తింపు
పొందింది మరియు అనేక మంది ప్రముఖులను తయారు చేసింది.
నిజాం శాంతినికేతన్‌లోని
విశ్వభారతి యూనివర్శిటీలో నిర్మించనున్న హాస్టల్‌కు లక్ష రూపాయల అందమైన గ్రాంట్‌ను
కేటాయించారు.
ఠాగూర్ హైదరాబాద్
వచ్చినప్పుడు నగరంలోని అనేకమంది మేధావులు, ప్రముఖ పౌరులచే అనేక ముషాయిరాలు మరియు సమావేశాలు
నిర్వహించబడినవి మరియు టాగోర్ కు ఘన సన్మానం
జరిగింది. బంజారాహిల్స్‌లోని మెహదీ నవాజ్ జంగ్ నివాసంలో టాగోర్ ను ఉంచారు.
ప్రతిరోజూ ఉదయాన్నే
ఠాగూర్ కొండ ప్రాంతంలోని పరిసరాలను అన్వేషించడానికి కాలినడకన బయలుదేరేవారు.. హైదరాబాద్
యొక్క మంచి వాతావరణం మరియు ప్రశాంతమైన జీవన పరిస్థితులపై ఠాగూర్ ప్రేమను
పెంచుకున్నారు. ఠాగూర్ కాలుష్య రహితంగా ఉన్న బంజారాహిల్స్ ప్రాంతం లో ఇల్లు కట్టుకుని
ఏటా కొన్ని నెలలు హైదరాబాద్‌లో గడపాలని కూడా అనుకున్నారు. కానీ చివరికి, శాంతినికేతన్‌లో పని
వత్తిడి వలన టాగోర్ ఆ ఆలోచనను విరమించుకోవలసి వచ్చింది.
ఒక కథనం ప్రకారం, ఠాగూర్ పర్యటనలో
ఒక చిరస్మరణీయ సంఘటన ఆర్థిక మంత్రి అమీన్ జంగ్ నివాసంలో ఏర్పాటు చేయబడిన ఒక కలయిక.
ఇందులో సరోజినీ నాయుడుతోపాటు ప్రధాన మంత్రి మహారాజా కిషన్ పెర్షాద్ మరియు నగరంలోని ప్రముఖులు పెద్ద సంఖ్యలో
పాల్గొన్నారు.
ఠాగూర్ హైదరాబాదు పర్యటన లో
అందరూ శాంతి, సౌభ్రాతృత్వం, కవిత్వం గురించి
మాత్రమే ఆలోచించారు. 1941లో ఠాగూర్
మరణించినప్పుడు హైదరాబాద్‌పై ప్రేమలో పడి, ఈ నగరంలో ఇల్లు కట్టుకోవాలనుకున్న బెంగాల్
కవికి హైదరాబాద్‌లోని అన్ని వార్తాపత్రికలు సుదీర్ఘ నివాళులర్పించాయి
No comments:
Post a Comment