డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్(1908-2008) ఈజిప్షియన్ ఇంజనీర్ మరియు ఆర్కిటెక్ట్. డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్ గురించి అంతగా తెలియదు, ఎప్పుడు ప్రజల దృష్టికి దూరంగా ఉండటానికి ఇష్టపడతాడు.
డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్ ఈజిప్టు చరిత్రలో బాకలారియేట్ (సర్టిఫికేట్) పొందిన అతి పిన్న వయస్కుడు. ఈజిప్టు రాయల్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చేరిన అతి పిన్న వయస్కుడు మరియు దాని నుండి గ్రాడ్యుయేట్ చేసిన అతి పిన్న వయస్కుడు. డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో మూడు డాక్టరల్ డిగ్రీలు పొందేందుకు ఐరోపాకు పంపబడిన అతి పిన్న వయస్కుడు.
డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్, ఈజిప్ట్ రాజు నుండి "నైలు" కర్చీఫ్ మరియు "ఇనుము" ర్యాంక్ పొందిన అతి పిన్న వయస్కుడు. మక్కా మరియు మదీనా మసీదుల (హరమైన్/Haramain) విస్తరణ ప్రాజెక్ట్ యొక్క ప్రణాళిక మరియు అమలుకు బాధ్యత వహించిన మొదటి ఇంజనీర్.
సౌదీ కింగ్ ఫహద్ మరియు బిన్ లాడెన్ కంపెనీ వద్దనుండి మక్కా మరియు మదీనా మసీదుల (హరమైన్/Haramain) విస్తరణ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ డిజైన్ మరియు ఆర్కిటెక్చరల్ పర్యవేక్షణ కోసం ఎటువంటి రుసుము/ఫీజును స్వీకరించడానికి డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్ నిరాకరించాడు.
"రెండు పవిత్ర మసీదులలో (నా పని కోసం) నేను డబ్బును ఎందుకు స్వీకరించాలి, నేను అల్లాను (తీర్పు రోజున?) ఎలా ఎదుర్కోవాలి"అని డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్ అన్నాడు.
డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్ 44సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్నాడు. డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్, భార్య ఒక కొడుకుకు జన్మనిచ్చింది మరియు మరణించింది. డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్ అప్పటి నుండి ఒంటరిగా ఉన్నాడు మరియు చనిపోయే వరకు అల్లాను ఆరాధించడానికి తన సమయాన్ని వెచ్చించాడు.
డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్ మీడియా, కీర్తి మరియు డబ్బుకు దూరంగా రెండు పవిత్ర మసీదుల సేవలో గడిపిననాడు. డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్ "తవాఫ్" చేసే వారి కోసం హరమ్ మసీదు యొక్క అంతస్తును పాలరాయి తో కవర్ చేయాలనుకున్నాడు. ఈ పాలరాయి గ్రీస్‌లోని ఒక చిన్న పర్వతంలో మాత్రమే దొరుకుతుంది.
డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్ పాలరాయి కోసం గ్రీస్‌కు వెళ్లాడు మరియు హరామ్ (మార్బ్లింగ్) కోసం దాదాపు సరిపోయేంత (సగం పర్వతం అంత)పాలరాయి కొనుగోలు చేసే ఒప్పందంపై సంతకం చేసి మక్కాకు తిరిగి వెళ్ళాడు. తెల్లని పాలరాయి మక్కాకు వచ్చింది మరియు మక్కాలోని పవిత్ర మసీదు నేలపై పాలరాయి పరచడం పూర్తయింది.
15 సంవత్సరాల తర్వాత, సౌదీ ప్రభుత్వం మదీనాలోని పవిత్ర మసీదులో కూడా అలాంటి తెల్లని మార్బుల్‌ను పరచమని డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్ ని కోరింది.
ప్రవక్త (స) యొక్క మసీదులో కూడా అదే పాలరాయి మార్బుల్ పరచమని సౌది రాజు అడిగినప్పుడు, డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్ చాలా గందరగోళానికి గురిఅయ్యాడు. ఆ రకమైన పాలరాయి కేవలం గ్రీస్లోనే లబిస్తుంది మరియు ఇప్పటికే పాలరాయి పర్వతం సగం ఖాళి అయింది మిగతా పాలరాయి అందుబాటులో ఉందొ లేదో తెలియదు. వెంటనే డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్ గ్రీస్ వెళ్లి కంపెనీ సీఈవోను కలిశాడు, ఇంకా పాలరాయి ఎంత మిగిలి ఉందని అడిగాడు?.
15 ఏళ్ల క్రితం మీరు వెళ్లిన వెంటనే మిగతా పాలరాయిని విక్రయించారని సీఈవో చెప్పారు. అదివిన్న డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్ చాలా బాధపడ్డాడు.భారమైన హృదయంతో డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్ బయటకు వచ్చి పాలరాతి కంపెనీ ఆఫీస్ సెక్రటరీని కలసి మిగిలిన మార్బుల్/పాలరాయిని ఎవరు కొనుగోలు చేశారో పాత రికార్డ్లు చూసి తెలపమని అడిగాడు. డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్ అభ్యర్థన మేరకు,ఆఫీస్ సెక్రటరీ పురాతన రికార్డులను వెతుకుతానని హామీ ఇచ్చింది.
మరుసటి రోజు, విమానాశ్రయానికి బయలుదేరడానికి కొన్ని గంటల ముందు, డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్ కు సెక్రటరీ నుండి ఫోన్ కాల్ వచ్చింది. సెక్రటరీ మిగిలిన మార్బుల్ కొన్న కంపెనీ అడ్రస్ ఇచ్చింది..
ఒక అద్బుతం జరిగిoది.
మార్బుల్‌ని కొనుగోలు చేసిన కంపెనీ సౌదీ కంపెనీ అని తెలుసుకున్న క్షణంలో తన గుండె దడదడలాడిపోయిందని డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్ చెప్పారు. డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్ అదే రోజు సౌదీ అరేబియాకు వెళ్లి, నేరుగా మార్బుల్ కొనుగోలు చేసిన కంపెనీ కార్యాలయానికి వెళ్లి మేనేజింగ్ డైరెక్టర్‌ను కలిశారు మరియు చాలా సంవత్సరాల క్రితం గ్రీస్‌లో కొనుగోలు చేసిన మార్బుల్‌ను ఏమి చేసారని అడిగారు. నాకు గుర్తు లేదు అని మేనేజింగ్ డైరెక్టర్ చెప్పాడు.
మేనేజింగ్ డైరెక్టర్ తన కంపెనీ గిడ్డంగిని సంప్రదించి, గ్రీస్ నుండి వచ్చిన తెల్లని పాలరాయి గురించి అడిగాడు. పాలరాయి మొత్తం పరిమాణం అందుబాటులో ఉందని వారు చెప్పారు.డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్ పసిపాపలా ఏడవడం మొదలుపెట్టి, మేనేజింగ్ డైరెక్టర్ కి కథ మొత్తం చెప్పాడు.
డా. ముహమ్మద్ కమల్ ఇస్మాయీల్ మేనేజింగ్ డైరెక్టర్ కి బ్లాంక్ చెక్ ఇచ్చి తనకు కావాల్సిన మొత్తాన్ని రాసుకోమని కోరాడు. హోలీ ప్రవక్త మసీదు కోసం మార్బుల్/పాలరాయి, అని తెలుసుకున్న మేనేజింగ్ డైరెక్టర్ “నేను ఒక్క రియాల్ కూడా అంగీకరించను అని చెప్పాడు.అల్లా నన్ను ఈ పాలరాయిని కొని మరచిపోయేలా చేసాడు” అని అన్నాడు.
పాలరాయి మదీనాలోని ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క మసీదు కోసం ఉపయోగించబడింది.
"జన్నా"లో అత్యున్నత స్థానం డా. ముహమ్మద్
కమల్ ఇస్మాయీల్ కు ఇచ్చి అల్లాహ్ ఆశీర్వదిoచుగాక!
– అమీన్
No comments:
Post a Comment