26 May 2023

ఇస్లాంలో కుమార్తెల హక్కులు మరియు విధులు Rights and duties of daughters in Islam

 


ఆడపిల్ల లేదా కుమార్తె,  అల్లాహ్ యొక్క ఆశీర్వాదం లేదా అనుగ్రహం.

ఇస్లాం ప్రవేశానికి ముందు అరబ్బులు తమ బాలికల పట్ల భయంకరంగా ప్రవర్తించారు. కూతురు పుట్టడం ఒక అరబ్ తండ్రి అవమానంగా భావించాడు. అవమానాన్ని బరించలేక ఆకాలం నాటి  అరబ్బులు తమ కుమార్తెలను సజీవంగా పాతిపెట్టారు. అరబ్ ప్రజలు తమ కుమార్తెల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించే సమయంలో ఇస్లాం ఉద్భవించింది. అజ్ఞానాన్ని,  చీకటిని అంతం చేసింది మరియు అక్క-చెల్లిళ్ళకు, కుమార్తెలు, భార్యలు మరియు నవజాత ఆడశిశువులకు హక్కులను మంజూరు చేసింది.

అల్లాహ్  అర్హులైన వారికి మాత్రమే ఆడపిల్లలను అనుగ్రహిస్తాడు అని చాటింది..

ఇస్లాం ఆడపిల్లలకు గొప్ప గౌరవం ఇచ్చింది.

ఇస్లాం స్త్రీకి/కుమార్తెకు కూడా పురుషునికి/కొడుకుకి ఇచ్చే స్వేచ్ఛను ఇస్తుంది.

వాటిలో కొన్ని:

ఇస్లాం ఆడపిల్లలకు మగపిల్లలతో సమానంగా విద్య మరియు పని చేసే హక్కును ఇచ్చింది.

కుమార్తెకు తన కోరిక ప్రకారం ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కును ఇస్లాం ఇచ్చింది.

ఇస్లాం కుమార్తెకు తండ్రి ఆస్తిలో  హక్కు కల్పించింది.

తండ్రి ఆస్తిలో కుమార్తె వాటా, కుమారుడి వాటాలో సగం.

ఇస్లాం కుమార్తేకు  'ఖులా' హక్కును ఇచ్చింది –కుమార్తె తన భర్తతో సంతృప్తి చెందకపోతే తన వివాహ ఒప్పందాన్ని రద్దు చేస్తుంది.

తనను లైంగికంగా వేధించిన లేదా అవమానించిన వ్యక్తిపై దావా వేసే హక్కు ఇస్లాం కుమార్తెకు  ఇచ్చింది.

ఇస్లాం స్త్రీకి మగవాడితో లేదా తోడూలేకుండా  సంతోషంగా జీవించే హక్కును ఇచ్చింది. మగవాడు ఆమెకు సర్వస్వం కాదు.

ఇస్లాం స్త్రీకి తన అభిప్రాయాలను, ఆలోచనలను ప్రజల ముందు మాట్లాడే హక్కును ఇచ్చింది.

ఇస్లాం స్త్రీకి ప్రపంచ శక్తిగా ఉండే హక్కును ఇచ్చింది మరియు స్త్రీ లేకుండా పురుషుడు ఏమీ లేడని వివరించింది.

ఒక కుమార్తె ఎల్లప్పుడూ తండ్రి కుటుంబానికి చెందినది. వివాహం ఈ బంధాన్ని విచ్ఛిన్నం చేయదు.

కుమార్తెలను సంరక్షించడం, వారికి చదువు చెప్పించడం, వారికి పెళ్లి చేయడం , రేపటి మెరుగైన జీవితం కోసం శిక్షణ ఇవ్వడం వంటివన్నీ కుమార్తెల పట్ల తల్లిదండ్రుల బాధ్యత కిందకే వస్తాయి.

సమాజంలో సురక్షితంగా జీవించడానికి తనని తాను సరిగ్గా తీర్చిదిద్దుకోవలసిన అవసరం లేదా బాధ్యత కుమార్తెకు ఉంది.

కుమార్తె తన గౌరవాన్ని మరియు తన కుటుంబం యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలి.

కుమార్తె  తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

పెళ్లయ్యాక తన భర్తకు విధేయత చూపాలి.

మహ్రం కానివారి విషయంలో స్త్రీ తప్పనిసరిగా పరిమితుల్లో ఉండాలి.

హదీసు:

అనస్ ప్రకారం ప్రవక్త(స) ఇలా అన్నారు. ఇద్దరు కూతుళ్లను వారి యుక్తవయస్సు వచ్చేవరకు పెంచే వాడు ఇలా స్వర్గంలో నాతో ఉంటాడుఅంటూ తన రెండు వేళ్ల మధ్య కాస్త గ్యాప్‌తో చూపించి సామీప్యానికి ప్రతీకగా నిలిచారు.. -(ముస్లిం).

ముస్లిం సమాజం లో "కూతుళ్లు వారసత్వ ఆస్తిని  పొందరు" అని సూచించే ఒక  దురాచారం ఉంది కాని ఇది నిజం కాదు మరియు ఇస్లాం బోధనలకు విరుద్ధం. కుమార్తెలను సమానంగా చూడాలి, లేదా ఒకరి కంటే ఎక్కువ మంది కుమార్తెలు ఉంటే, వారికి వారసత్వ ఆస్తిలో మూడింట రెండు వంతులు అందజేయాలి. ఇది ఇస్లామిక్ చట్టానికి అనుగుణంగా ఉంది మరియు ప్రతిచోటా ముస్లింలు ఈ భావనను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం

సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దివ్య ఖురాన్‌లో ఇలా చెప్పాడు: ఆకాశాలు మరియు భూమిపై ఆధిపత్యం అల్లాహ్‌కు చెందినది; అతను కోరుకున్నది సృష్టిస్తాడు. అతను కోరుకున్న వారికి ఆడ [పిల్లలను] ఇస్తాడు మరియు అతను కోరిన వారికి మగపిల్లలను ఇస్తాడు. లేదా అతను వారిని మగ మరియు ఆడగా చేస్తాడు మరియు అతను కోరుకున్న వారిని వంధ్యత్వం చేస్తాడు. వాస్తవానికి, అతను ఎరిగినవాడు మరియు సమర్థుడు” (ఖురాన్, 42:49-50).

పవిత్ర ఖురాన్ యొక్క ఈ ఆయత్  సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తాను ఎవరికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో దానిని ఇచ్చే హక్కు లేదా సంకల్పం కలిగి ఉన్నాడని తెలియజేస్తుంది. అల్లాహ్ ఒక్కడే, అతడు తన అంతిమ జ్ఞానం ఆధారంగా, తను కోరుకున్న వారికి కుమారులు మరియు కుమార్తెలను ఇస్తాడు. అల్లాహ్ తను కోరుకున్న వారికి మాత్రమే కొడుకులను మరియు తను కోరుకున్న వారికి మాత్రమే కుమార్తెలను ఇస్తాడు.

కాబట్టి మీకు ఒక కుమార్తె ఉన్నప్పుడు కలత చెందకుండా సంతోషంగా ఉండండి మరియు ఈ ఆనందాన్ని కుటుంబ సభ్యులు మరియు స్నేహితులందరితో పంచుకోండి.

కుమార్తెలు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ఆశీర్వాదం/వరం..

No comments:

Post a Comment