10 May 2023

బాక్సింగ్‌లో గొప్ప మరియు విశిష్ట లక్షణాలలో మిన్న ముహమ్మద్ అలీ Muhammad Ali is The Greatest in boxing and abundance of unique traits

 



అమెరికా లోని కెంటుకీ రాష్ట్రము లోని ఓహియో నది పక్కన గల ఒక చిన్న పట్టణం లూయిస్ విల్లెలో కాసియస్ మార్సెల్లస్ క్లే (Cassius Marcellus Clay) గా జనవరి 17, 1942 న జన్మించిన ముహమ్మద్ అలీ ప్రపంచ హెవీవెయిట్ టైటిల్‌ను మూడుసార్లు గెలుచుకున్న మొదటి వ్యక్తి.

1960 లో రోమ్ ఒలింపిక్స్‌ లో ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకోవడంతో పాటు ముహమ్మద్ అలీ మూడుసార్లు ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్‌ అయ్యాడు.

“ది గ్రేటెస్ట్” అనేది ముహమ్మద్ అలీ బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న రోజుల్లో తనకు తానుగా పెట్టుకున్న పేరు. సంవత్సరాలు గడిచేకొద్దీ అలీ మానసికంగా పరిపక్వం చెందాడు, కాని ప్రజలు ముహమ్మద్  ఆలీని గొప్పవాడు/“ది గ్రేటెస్ట్”  అని పిలుస్తూనే ఉన్నారు. ముహమ్మద్ అలీ బాక్సింగ్ రింగ్ లోపల మరియు వెలుపల ప్రదర్శించిన అనేక ప్రత్యేక లక్షణాల వలన అతనిలాంటి వారు ఎవరూ లేరనే వాస్తవాన్ని అందరు అంగీకరిస్తారు.

ముహమ్మద్ అలీ చాలా ధైర్యంగల వ్యక్తి. ప్రతి బాక్సర్‌కు ధైర్యం ఉండాలి. కానీ ముహమ్మద్ అలీ ధైర్యం బాక్సింగ్ రింగ్ పరిమితులను మించిపోయింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ప్రభుత్వo యొక్క విధానాలతో తాను విభేదిస్తున్నానని బహిరంగంగా చెప్పడానికి ఏ వ్యక్తికైనా ఎంత ధైర్యం ఉండాలో ఊహించండి. చాలా కొద్ది మంది క్రీడాకారులు మాత్రమే దీన్ని చేయగలరు. పైగా ఒక నల్లజాతి వ్యక్తి నుండి వచ్చిన ఈ మాటలు,ఈ వైఖరి శ్వేతజాతీయులకు కోపం తెప్పించింది. US ప్రభుత్వం కూడా ఈ నల్లజాతి క్రీడాకారుడికి వ్యతిరేకంగా తన బలం  ఉపయోగించాలని నిశ్చయించుకుంది.

US పరిపాలన నిబంధనలను మార్చి ముహమ్మద్ అలీ బాక్సింగ్ టైటిల్‌ను తొలగించి ముహమ్మద్ అలీ ని జైలుకు పంపేలా చూసింది. అయితే ఈ దౌర్జన్యం ముందు తలవంచేందుకు ముహమ్మద్ అలీ నిరాకరించాడు. ఐదేళ్లపాటు కోర్టుల్లో ఒంటరి పోరాటం చేసి చివరకు విజయం సాధించాడు. ముహమ్మద్ అలీ రింగ్ లో తన బాక్సింగ్ ప్రత్యర్థులను పడగొట్టినట్లే, USA ప్రభుత్వాన్ని కూడా ఓడించాడు. ఆపై USA ప్రభుత్వo తన నుండి తీసివేసిన కిరీటాన్ని తిరిగి పొందేందుకు తిరిగి బాక్సింగ్ బరిలోకి దిగాడు.

ముహమ్మద్ అలీ కూతురు లైలా అలీ మహిళా బాక్సర్ కూడా. ముహమ్మద్ అలీ మరొక కుమార్తె హనా అలీ, తన తండ్రి ముహమ్మద్ అలీ పై “ది గ్రేటెస్ట్”  అనే ఒక పుస్తకాన్ని వ్రాశారు. అందులో హనా అలీ, ప్రజల దృష్టికి ఎన్నడూ కనిపించని ఛాంపియన్  యొక్క అంతరంగాన్ని చిత్రీకరించింది. ముహమ్మద్ అలీ, తండ్రి మరియు భర్తగా ఎలా ఉన్నారు?అనేది రాసింది.

చిన్నప్పుడు పాలు త్రాగే వయస్సు లో అమ్మ ఒడి లో ఉన్న ముహమ్మద్ అలీ ఆటగా  తన అమ్మ మొఖం మీద పంచ్ చేస్తే  ఆమె దంతాలు కదిలి పోయాట!

“ది గ్రేటెస్ట్”  బాక్సర్ ముహమ్మద్ అలీ  ప్రసిద్ద మాట "సీతాకోకచిలుక లాగా తేలుతూ, తేనెటీగ లాగా కుట్టండి .. కళ్ళు చూడలేనివి  చేతులు కొట్టలేవు.

ముహమ్మద్ అలీకి స్వీట్ అంటే చాలా ఇష్టం తరచూ స్వీట్‌ పాకేట్లతో ఇంటికి వచ్చేవాడని హనా రాసింది. బాక్సింగ్ పోటీకి రెండు, మూడు నెలల ముందు ప్రాక్టీస్ మోడ్ లోకి వెళ్లడానికి  ముందు ముహమ్మద్ అలీ స్వీట్లు తినడం మానేసేవాడు.

ముహమ్మద్ అలీ చాలా జనాదరణ పొందిన వ్యక్తి మరియు ముహమ్మద్ అలీ ఇంటికి తరచుగా వచ్చే స్నేహితులు చాలా మంది ఉన్నారు. వారిలో చాలా మంది ప్రసిద్ధ హాలీవుడ్ సెలబ్రిటీలు, నటులు జాన్ ట్రావోల్టా, సిల్వెస్టర్ స్టాలోన్, క్లింట్ ఈస్ట్‌వుడ్, విల్ స్మిత్, గాయకులు క్రిస్ క్రిస్టోఫర్సన్ మరియు లియోనెల్ రిచీ మరియు అనేక మంది ఉన్నారు. ముహమ్మద్ అలీ ఇంటికి సందర్శకులు లేని రోజు లేదు.

 ముహమ్మద్ అలీ దాదాపు ప్రతిరోజూ కొత్త స్నేహితులను చేసుకుంటాడు. సమయం గడపడానికి మార్గంగా, అలీ టెలిఫోన్ డైరెక్టరీని తీసుకొని ఏదైనా ఒక యాదృచ్ఛిక నంబర్‌కు కాల్ చేస్తాడు. అవతలి వ్యక్తి ఫోన్ తీసుకుంటాడు మరియు ముహమ్మద్ అలీ అతనికి గుడ్ మార్నింగ్ విష్ చేస్తాడు. అవతలి వ్యక్తి ఆశ్చర్యపడి ఎవరు పిలుస్తున్నారు అని అడిగారు. దానికి ముహమ్మద్ అలీ “ప్రపంచ ఛాంపియన్” అని బదులు ఇచ్చేవాడు! ఇది తెలియని వ్యక్తి తన జీవితాంతం గుర్తుంచుకునే టెలిఫోన్ కాల్ అవుతుంది. ముహమ్మద్ అలీ అన్ని వర్గాల ప్రజలచే అమితమైన ప్రేమను పొందడంలో ఆశ్చర్యం లేదు. ప్రపంచంలోని సుదూర మూలల్లో ఉన్న ప్రజలకు USA లేదా రష్యా అధ్యక్షుడు ఎవరో తెలియకపోవచ్చు, కానీ మహమ్మద్ అలీ“ది గ్రేటెస్ట్”  ఎవరో వారికి తెలుసు.

ముహమ్మద్ అలీ  యువకుడిగా ఉన్నప్పుడు, విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు, విమాన ప్రయాణం లో ఒక సారి ముహమ్మద్ అలీ  సీటు బెల్ట్ ధరించడానికి నిరాకరించాడు. ఎయిర్ హోస్టెస్ అలీ ని సీట్ బెల్ట్ పెట్టుమని కోరినప్పుడు ముహమ్మద్ అలీ ఇలా సమాధానమిచ్చాడు: "సూపర్‌మ్యాన్‌కు సీట్ బెల్ట్ అవసరం లేదు." "అసలు సూపర్‌మ్యాన్‌కు ఎగరడానికి విమానం అవసరం లేదు" అని ఎయిర్ హోస్టెస్ తిరుగు సమాధానం ఇచ్చింది. వెంటనే ముహమ్మద్ అలీ నిశ్శబ్దంగా బెల్ట్‌ను పెట్టుకున్నాడు.

ముహమ్మద్ అలీ రెండుసార్లు భారతదేశాన్ని సందర్శించారు. ఒకానొక సందర్భంలో బాలీవుడ్ ఫంక్షన్‌లో అవార్డులు ఇవ్వమని ఆహ్వానించారు. ముహమ్మద్ అలీ, అమితాబ్ బచ్చన్, రేఖ మరియు పలువురు నటులు మరియు దర్శకులను కలిశాడు.

మరో సారి భారత పర్యటన చేసి ప్రధాని ఇందిరాగాంధీని “ది గ్రేటెస్ట్” ముహమ్మద్ అలీ కలిశారు. ముహమ్మద్ అలీ ఇప్పటికే భారత ప్రధాని గురించి విన్నాడు మరియు ముహమ్మద్ అలీ ఇందిరాగాంధీ అభిమాని. ముహమ్మద్ అలీ, ప్రధాని ఇందిరాగాంధీతో ఇలా అన్నాడు: "నువ్వే గొప్పవాడివి“You are the Greatest.”." ఇందిరా గాంధీ చిరునవ్వుతో ముహమ్మద్ అలీకి శుభాకాంక్షలకు తెలిపి “ది గ్రేటెస్ట్ ఛాంప్‌”ను భారతదేశానికి స్వాగతించింది.

తరువాతి జీవితంలో, భయంకరమైన పార్కిన్సన్స్ వ్యాధితో  ముహమ్మద్ అలీ భాదపడ్డాడు. ముహమ్మద్ అలీ చివరికి 3 జూన్ 2016న మరణించాడు. ముహమ్మద్ అలీ కుమార్తె హనా, ముహమ్మద్  అలీ మరణ పరిస్థితులను వివరించింది. డాడీ ఎప్పటిలాగే మధ్యాహ్నం నిద్రపోయాడు. కానీ ఒత్తిడికి గురైన అతని అవయవాలు విఫలం కావడం ప్రారంభించాయి మరియు ఆ తర్వాత అతను(అలీ) స్వర్గంలో లేచాడు.

ముహమ్మద్ అలీ మరణించిన తర్వాత, జనాజా (భూమిపై నిష్క్రమించిన ఆత్మ యొక్క చివరి ప్రార్థన) సభకు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో సహా పలువురు విఐపిలు హాజరయ్యారు. బరాక్ ఒబామా, హిల్లరీ మరియు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మరియు UK మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ వంటి రాజకీయ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. హాలీవుడ్ నటుడు విల్ స్మిత్, బాక్సర్లు లెనాక్స్ లూయిస్, లారీ హోమ్స్ మరియు మైక్ టైసన్‌తో సహా అలీ యొక్క అనేక మంది అభిమానులు మరియు స్నేహితులు వచ్చారు.

ముహమ్మద్  అలీ మెమోరియల్‌ సర్విస్ ను ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ టెలివిజన్ వీక్షకులు వీక్షించారు. ఇది నిజంగా అద్భుతమైన శకానికి ముగింపు.

బాక్సర్  ముహమ్మద్ అలీ జన్మస్థలం అయిన అమెరికా లోని కెంటుకీ రాష్ట్రము లోని లూయిస్ విల్లెలోగల ఇంటర్నేషల్ ఎయిర్-పోర్ట్ కు “లూయిస్ విల్లె ముహమ్మద్ అలీ ఇంటర్నేషల్ ఎయిర్-పోర్ట్” అని నామకరణం చేసి అమెరికా ప్రభుత్వం “గ్రేటెస్ట్ చాంపియన్” ను సత్కరించినది.

ముహమ్మద్ అలీ ఇప్పటివరకు జన్మించిన గొప్ప బాక్సర్‌. గొప్ప హెవీవెయిట్ బాక్సర్ అయిన మహమ్మద్  అలీని ప్రపంచం ఎన్నటికి మరచిపోదు.

ముహమ్మద్ అలీ కి ఘనమైన నివాళి మరియు శుభాకాంక్షలు.

 

.

 

 

 

No comments:

Post a Comment