భారతదేశంలో మొఘల్
సామ్రాజ్య స్థాపకుడు బాబర్ చిన్న కుమార్తె యువరాణి గుల్బదన్. యువరాణి గుల్బదన్
సరిగ్గా 500 సంవత్సరాల
క్రితం 1523లో జన్మించింది.
చిన్నప్పటి నుండి, గుల్బదన్ తెలివైన
అమ్మాయి.బాబర్ నామా, హుమయున్ నామా గ్రంధాల ద్వారా గుల్బదన్ జీవితచరిత్రను
తెలుసుకోవచ్చు.
గుల్బదన్ చిన్న అమ్మాయిగా
ఉన్నప్పుడు, గుల్బదన్ తండ్రి
జహీరుద్దీన్ మహ్మద్ బాబర్ కాబూల్‌లో పాలించేవాడు. అప్పటికి మొఘల్ రాజవంశం
భారతదేశంలో స్థాపించబడలేదు. చిన్నతనంలో గుల్బదన్ తన సోదరులు మరియు సోదరీమణులతో
ఆడుకునేది. గుల్బదన్ సోదరులలో హుమాయున్, కమ్రాన్, అస్కారీ మరియు హిందాల్ ఉన్నారు మరియు గుల్బదన్ కు
ముగ్గురు సోదరీమణులు కూడా కలరు.
గుల్బదన్ చిన్నతనం లో బొమ్మలతో
ఆదుకొనేది. గుల్బదన్ ఆడుకొనే బొమ్మలలో గుర్రపు
సైనికులు, ఆర్చర్స్, రైతులు మరియు
ఇతరుల చిన్న విగ్రహాలు చెక్కతో తయారు చేయబడి రంగులలో పెయింట్ చేయబడ్డాయి. రాజకుటుంబానికి
చెందిన పిల్లలు బొమ్మలతో ఊహాత్మక యుద్ధాలు చేసేవారు. అప్పటి రోజులలో గాలిపటాలు
ఎగురవేయడం మరొక సరదా కార్యకలాపం. గుల్బదన్ కు తన తండ్రి బాబర్ కు చెందిన కోటలోని ఎత్తైన ప్రాకారాల నుండి
గాలిపటాలు ఎగురవేయడం చాలా ఆనందంగా, సరదాగా ఉండేది.
బాబర్ తరచుగా రోజులు
మరియు నెలల పాటు తన కోట నుండి దూరంగా ఉండేవాడు. బాబర్ యుద్ధాలు చేయకపోతే, వేటకు
వెళ్లేవాడు. చిన్న గుల్బాదన్ తన బాబాను(తండ్రిని) అమితంగా ప్రేమిoచేది. తన తండ్రి
ఒక ముఖ్యమైన వ్యక్తి అని మరియు అందరిచే గౌరవించబడే వ్యక్తి అని గుల్బదన్ గర్వపడేది.
కోట ఎగువ ప్రాకారాల నుండి గుల్బదన్ కొన్నిసార్లు పొలాల్లో చాలా దూరంగా ధూళి మేఘాలను
చూసెది. ఈ దృశ్యం గుల్బదన్ను ఉత్తేజపరుస్తుంది. దాని అర్థం గుర్రపు సైనికులు
సమీపిస్తున్నారని. బహుశా తన తండ్రి తిరిగి వస్తున్నాడు లేదా కనీసం తన తండ్రి నుండి ఒక దూత ఉత్తరం తీసుకుని
వస్తున్నాడు అని అర్ధం.
గుల్బదన్ బాల్యంలోని ఈ
ప్రశాంతమైన మరియు సంతోషకరమైన జీవితం బాబర్ మరణించడంతో ముగిసింది. అప్పటికి కుటుంబo
భారతదేశంలోనే ఉంది. హుమాయున్, బాబర్ కంటే బలమైన మరియు నిర్ణయాత్మక నాయకుడు కానందున
కుటుంబానికి కష్టకాలం వచ్చింది.
షేర్ షా, హుమాయున్ కు
మద్య జరిగిన యుద్ధం లో అత్యంత దారుణం జరిగింది. షేర్ షా సేనలు మరియు మొఘల్ దళం
మధ్య జరిగిన ఒక సైనిక సంఘర్షణ లో లో మొఘల్ రాజపరివారం యుద్ధం నుంచి వెనుదిరిగి
పోయేటప్పుడు (ఇందులో రాజ కుటుంబానికి చెందిన స్త్రీలు మరియు పిల్లలు కూడా ఉన్నారు) నదిని దాటటం లో రాజకుటుంబం లోని అనేక మంది
సబ్యులు తమ ప్రాణాలు కోల్పోయారు. వారిలో యువరాణి అక్వికా కూడా ఒకటి మరియు అక్వికా మృతదేహం కనుగొనబడలేదు. మొత్తం మొఘల్
రాజ కుటుంబo దుఃఖంలో మునిగిపోయారు.
చాలా సంవత్సరాల తర్వాత
గుల్బదన్ పెద్దదైనప్పుడు,
గుల్బదన్ మేనల్లుడు
చక్రవర్తి అక్బర్, గుల్బదన్ ను ఆమె తండ్రి
బాబర్ మరియు సోదరుడు హుమాయూన్ జీవిత చరిత్రను వ్రాయమని సూచించాడు. గుల్బదన్ కు
అక్బర్ అంతపురం/జెనానా లో గొప్ప ప్రభావo కలదు మరియు అక్బర్ మరియు అతని తల్లి ఇద్దరూ గుల్బదన్ చే
ఎంతోగా ప్రేమించబడ్డారు. గుల్బదన్ రాసిన హుమాయున్
జీవిత చరిత్ర తర్వాత ప్రసిద్ధ సాహిత్య రచనగా మారింది.
గుల్బదన్ విద్యావంతురాలు, ధర్మాత్మురాలు
మరియు సంస్కారవంతమైన మహిళ. గుల్బదన్ కు చదవడం అంటే ఇష్టం మరియు గుల్బదన్ తన సోదరుడు
హుమాయున్ మరియు మేనల్లుడు అక్బర్‌ల విశ్వాసాలను పొందినది. గుల్బదన్ చేతితో వ్రాసిన
హుమాయున్ జీవిత చరిత్ర హుమాయున్ నామా యొక్క మాన్యుస్క్రిప్ట్ కాపీ లండన్‌లోని
బ్రిటిష్ లైబ్రరీలో కలదు.
No comments:
Post a Comment