జాతీయ కుటుంబ ఆరోగ్య
సర్వే ముస్లిం సంతానోత్పత్తి రేటులో తగ్గుదలని చూపడంతో గత 15 ఏళ్లలో చిన్న
ముస్లిం కుటుంబాల ధోరణి కనిపిస్తోంది.
భారతదేశం చైనాను అధిగమించి
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించడం మరియు భారత దేశం లోని ముస్లిం
కుటుంబాలు కుంచించుకుపోవడం దశాబ్దాల నాటి జనాభా నియంత్రణ కార్యక్రమాల విజయాన్ని
నొక్కి చెబుతుందని మరియు జనాభా స్థిరత్వాన్ని సూచిస్తుందని నిపుణులు తెలిపారు.
భారతదేశం యొక్క రెండవ
అతిపెద్ద మత సంఘం ముస్లింలు మరియు భారత దేశ 1.2 బిలియన్ల జనాభాలో ముస్లిములు 14.2% మంది ఉన్నారు.2011 జనాభా లెక్కల
ప్రకారం భారత దేశం లో హిందువులలో అత్యధికులు 79.8% ఉన్నారు.జనాభా గణన ఆలస్యం అయింది కానీ భారతదేశ
జనాభా 1.42 బిలియన్లకు
చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఇండోనేషియా మరియు పాకిస్తాన్ తర్వాత
దేశంలోని ముస్లిం జనాభా ప్రపంచంలో మూడవ అతిపెద్దది
జాతీయ కుటుంబ
ఆరోగ్య సర్వే రిపోర్ట్ ప్రకారం ముస్లిం సంతానోత్పత్తి రేటు – (స్త్రీకి ఉన్న
పిల్లల సగటు సంఖ్య) - 1992-93లో 4.4 ఉండగా అది 2005-06లో 3.4 కు, 2015-16లో 2.6గా ఉంది
మరియు 2019-21లో 2.4కి పడిపోయింది.
ముస్లిం జనాల రేట్ లో క్షీణత కూడా అత్యంత వేగంగా ఉంది.గత 15 ఏళ్లలో చిన్న
ముస్లిం కుటుంబాల ధోరణి కనిపిస్తుంది.
"ది పాపులేషన్ మిత్
- ఇస్లాం, ఫ్యామిలీ
ప్లానింగ్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా" అనే పుస్తక రచయిత ఎస్.వై. ఖురైషి
మాట్లాడుతూ, ముస్లింలలో
సంతానోత్పత్తి తగ్గుదల హిందూ జాతీయవాద రాజకీయ నాయకుల నుండి తరచుగా వచ్చే విమర్శలకు
మరియు పెరుగుతున్న ముస్లిం జనాభా గురించి
వారు చెప్పే వాదనలకు బిన్నంగా ఉంది.
"ముస్లింలు
హిందువులను అధిగమిస్తున్నారనే ప్రచారం అసంబద్ధం" అని మాజీ టాప్ బ్యూరోక్రాట్ ఖురైషి
అన్నారు. "ముస్లింలు హిందువుల కంటే చాలా వేగంగా కుటుంబ నియంత్రణను
అవలంబిస్తున్నారు.
సంప్రదాయవాదులు ఎక్కువగా
ఉన్న సమాజంలో, కొంతమంది ముస్లిం
పూజారులు లేదా ఇమామ్‌లు మార్పు తీసుకురావడంలో పెద్ద పాత్ర పోషించారు.
భారతదేశంలో అత్యధిక జనాభా
కలిగిన ఉత్తరప్రదేశ్‌లోని లక్నో ఈద్గా ఇమామ్ మౌలానా ఖలీద్ రషీద్ మాట్లాడుతూ, "జనన నియంత్రణ
చర్యలను ఇస్లాం అనుమతించదని ముస్లింలలో ఒక అపోహ ఉంది."కానీ షరియత్
కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడుతుంది. అపోహలను తొలగించడం మా బాధ్యత. మాకు అవగాహన
కార్యక్రమాలు ఉన్నాయి, విజ్ఞప్తులు
చేసాము, అటువంటి సమస్యల పై
షరియత్ చెప్పిన దాని గురించి ప్రసంగాలు
చేసాము."
తక్కువ విద్యావంతులు, నగరాల వెలుపల
నివసిస్తున్న పేద ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికి మరిన్ని చర్యలు
తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్పారు.
తూర్పు రాష్ట్రమైన బీహార్‌లోని
కొన్ని ప్రాంతాలలోని ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలు స్థానిక మసీదుల నాయకులను క్రమం
తప్పకుండా కలుస్తుంటారని మరియు శుక్రవారం ప్రార్థనల తర్వాత పురుషులకు జనన
నియంత్రణను సూచించమని అభ్యర్థిస్తున్నమని చెప్పారు.
"ఇస్లాం ఆరోగ్యకరమైన కుటుంబాలను సమర్ధిస్తుంది
మరియు వారు ఎంత మంది పిల్లలను కలిగి ఉండాలో ప్రజలు నిర్ణయించుకుంటారు" అని
బీహార్‌లోని పేద గ్రామీణ జిల్లా కిషన్‌గంజ్‌లోని అల్ అజార్ మసీదు సంరక్షకుడు
అహ్మద్ దైకుంద్ అన్నారు.
ఈ ప్రాంతంలో జననాల రేటు
ఎక్కువగా ఉన్నప్పటికీ, గతంతో పోలిస్తే
తన తరంలో పిల్లలు తక్కువగా ఉన్నారని అహ్మద్ దైకుంద్ చెప్పారు.
రాయిటర్స్ వార్త సంస్థ ముస్లిం
పురుషులు మరియు మహిళలతో పాటు సంఘ నాయకులు, జనాభా నిపుణులు మరియు ఇస్లామిక్ పండితులతో
మాట్లాడింది. జనన నియంత్రణ మరియు కుటుంబ నియంత్రణ గురించి భారతీయ ముస్లింలలో
అవగాహన గణనీయంగా పెరిగిందని అందరూ అంగీకరించారు.
పేద ముస్లింలలో, ముఖ్యంగా యువ
తరంలో కుటుంబ నియంత్రణ పై అవగాహన ఉందని స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
పూనమ్ ముత్రేజా అన్నారు.
2019-21 నుండి ప్రభుత్వ డేటా ప్రకారం ముస్లిం
సంతానోత్పత్తి రేటు 2.4గా ఉండి హిందూ జనాభా రేటు 1.94 వైపు వేగంగా
పడిపోతుందని కూడా డేటా చూపిస్తుంది
No comments:
Post a Comment