9 May 2023

ఉన్నత విద్యలో ముస్లింలు Muslims in higher education

 



2006లో సమర్పించిన సచార్ కమిటీ నివేదిక (SCR) విద్యారంగంలో ముస్లింల పరిస్థితి దేశంలోని అత్యంత వెనుకబడిన వర్గాలతో కన్నా  అధ్వాన్నంగా ఉందని తెలియజేసింది.

ఇటీవల విడుదల చేసిన ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదిక ప్రకారం

·       2020–21 లో ఉన్నత విద్యలో దళితులు, ఆదివాసీలు మరియు OBCల నమోదు,  2019-20తో పోలిస్తే వరుసగా 4.2 శాతం, 11.9 శాతం మరియు 4 శాతం పెరిగింది.

·       అగ్ర కులాల నమోదు రేటు  2019-20 తో పోలిస్తే 2020–21 లో అత్యధిక వృద్ధి రేటు తో 13.6 శాతం గా ఉంది.

·       కాని 2019-20 తో పోలిస్తే 2020–21 లో ముస్లిం విద్యార్థుల నమోదు 8 శాతం తగ్గింది - అంటే 1,79,147 మంది విద్యార్థులు.

 

రాష్ట్రాల విషయానికి వస్తే

·       ముస్లిం విద్యార్ధుల మొత్తం క్షీణతలో యూపీ వాటా 36 శాతం, జమ్మూ కాశ్మీర్ 26 శాతం, ఆ తర్వాత మహారాష్ట్ర (8.5 శాతం), తమిళనాడు (8.1 శాతం), గుజరాత్ (6.1 శాతం), బీహార్ (5.7 శాతం) శాతం) మరియు కర్ణాటక (3.7 శాతం).

·       తమిళనాడులో తప్ప, అన్నిచోట్ల ముస్లింలు ఉన్నత విద్య నమోదులో పూర్తిగా క్షీణిత చూపారు.

·       పడిపోతున్న ముస్లిం ఉన్నత విద్యా నమోదును డేటా సూచిస్తుంది. ఈ స్థాయి సంపూర్ణ క్షీణత ఈ మధ్య కాలంలో ఏ వర్గానికీ జరగలేదు

·       ముస్లిం జనాభాలో ఎక్కువ వాటా ఉన్న రాష్ట్రాలు క్షీణతలో ఎక్కువ వాటాను కలిగి ఉండగా, చిన్న రాష్ట్రాలు కూడా ఇలాంటి ధోరణులను చూపుతున్నాయి. ఉదాహరణకు, 2019-20 - 2020-21 మధ్య, ఢిల్లీ తన ముస్లిం విద్యార్థులలో 20 శాతం మందిని కోల్పోగా, J&K 36 శాతం కోల్పోయింది.

·       ఉన్నత విద్యలో మొత్తం నమోదులో OBCలు 36 శాతం ఉంటే, దళితులు 14.2 శాతం మరియు ఆదివాసీలు 5.8 శాతం ఉన్నారు.

·       భారత దేశం లో 15 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్లింలు ఉన్నత విద్యానమోదులో 4.6 శాతం కలిగి అన్ని వర్గాల కన్నా అట్టడుగున ఉన్నారు.

2006లో సమర్పించిన సచార్ కమిటీ నివేదిక (SCR) విద్యారంగంలో ముస్లింల పరిస్థితి దేశంలోని అత్యంత వెనుకబడిన వర్గాలకన్నా  అధ్వాన్నంగా ఉందని చూపింది.

·       2017-18లో విద్యలో దళితులు, ముస్లింలను అధిగమించారు మరియు 2020-21లో ఆదివాసీలు కూడా ముస్లిములను  అధిగమించారు.

18-23 సంవత్సరాల వయస్సుగలవారిలో ఉన్నత విద్యా స్థితిలో దళితులు, ఆదివాసీల కంటే ముస్లింలు అధ్వాన్నంగా ఉన్నారు.

·       ఉన్నత విద్యా సంస్థల్లో ముస్లిములు ప్రస్తుతం 19 శాతం మంది మాత్రమే చదువుతున్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో ఆదివాసీలు  21 శాతం, దళితులు  26 శాతం, హిందూ ఓబీసీలు 34 శాతం, హిందూ అగ్రవర్ణాలు  45 శాతం మంది చదువుతున్నారు.


ఇక రాష్ట్రాల విషయానికి వస్తే

  ప్రధాన రాష్ట్రాల్లో, 2020-21లో తమిళనాడు, తెలంగాణ మరియు ఢిల్లీ మినహా ఏ రాష్ట్రంలోనూ ముస్లింలు దళితుల కంటే ఉన్నత విద్య లో మెరుగ్గా లేరు.

·       రాజస్థాన్, అస్సాం, గుజరాత్, మహారాష్ట్ర మరియు జార్ఖండ్ వంటి అనేక రాష్ట్రాల్లో ముస్లింల కంటే ఆదివాసీలు  మెరుగ్గా ఉన్నారు.

·       అత్యధిక జనాభా కలిగిన UP రాష్ట్రము లో జనాభాలో దాదాపు 20 శాతం ఉన్న ముస్లింలు మొత్తం ఉన్నత విద్యా నమోదులో కేవలం 4.5 శాతం మాత్రమే ఉన్నారు.

·       యూపీలోనే 2019-20 నుంచి 58,365 మంది ముస్లిం విద్యార్థులు డ్రాపవుట్ అయ్యారు - ఇది 16 శాతం క్షీణత.

·       కేరళ ముస్లిం ఉన్నత విద్యా నమోదులో సానుకూల వృద్ధిని సాధించడమే కాకుండా, ప్రస్తుతం ఉన్నత విద్యకు హాజరవుతున్న ముస్లిం యువత (43 శాతం) శాతంలో కూడా అగ్రస్థానంలో ఉంది.

·       కేరళలోని ముస్లింలు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం, విద్యాసంస్థల్లో 12 శాతం రిజర్వేషన్లు పొందుతున్నారు. ఈజావాల తర్వాత (14 శాతం), ముస్లింలు రాష్ట్రంలోని OBC జాబితాలో కోటాలో ఎక్కువ వాటాను పొందుతున్నారు.

ఉద్యోగాల విషయానికి వస్తే:

·       మొదటిది, ముస్లింలకు ఉద్యోగావకాశాలు ఇతరులకన్నా ఎక్కువగా తగ్గిపోతున్నందున భవిష్యత్తు అంధకారంగా ఉంది - వారు సామాజిక-మత సమూహాలలో అత్యధిక నిరుద్యోగ రేటును ఎదుర్కొంటున్నారు.

·       CVని బ్రాహ్మణ పేర్లు, దళితుల పేర్లు మరియు ముస్లిం పేర్లతో పంపితే  ఇంటర్వ్యూకి ఆహ్వానించబడిన వారి శాతం ముస్లిముల విషయంలో అతి తక్కువగా ఉంది.

·       రెండవది, నేయడం మరియు కార్ల మరమ్మత్తు వంటి మాన్యువల్ పని మరియు తక్కువ-వేతనంతో కూడిన స్వయం ఉపాధిని కొనసాగించే ముస్లిం యువతలో అధిక డ్రాపౌట్ రేటు ఉంది.

·       మూడవది, ముస్లింలపై పెరిగిన హింస వారి ప్రాదేశిక చైతన్యాన్ని పరిమితం చేసింది మరియు వారు తమ ఘెట్టోల లోకి పరిమితం అవుతున్నారు. దాదాపు అన్ని భారతీయ నగరాల్లో కొనసాగుతున్న ఘెట్టోలైజేషన్ ప్రక్రియ నుండి ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ సందర్భంలో, సచార్ కమిటీ నివేదిక మరియు (ఇంకా ఎక్కువ) మిశ్రా నివేదిక సిఫారసు చేసినట్లుగా, ప్రభుత్వానికి ఉన్న ఏకైక సహేతుకమైన విధానం ముస్లింలకు అనుకూలంగా సానుకూల వివక్షను initiate positive discrimination ప్రారంభించడమే - కొన్ని దక్షిణాది రాష్ట్రాలు ముస్లిములకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా విజయవంతంగా చేశాయి.

అయితే దీనికి విరుద్ధంగా, ముస్లింలకు ప్రభుత్వ మద్దతు తగ్గింది. ముస్లింలకు సబ్-కోటా కల్పిస్తున్న కర్ణాటక - ఓబీసీ కోటాలో 4 శాతం - ఇటీవలే బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది.

మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2022-23 నుండి మైనారిటీ విద్యార్థుల కోసం ఉన్నత విద్యను అభ్యసించడానికి అంకితమైన మౌలానా ఆజాద్ ఫెలోషిప్‌ను నిలిపివేసింది.

దుర్బలమైన మైనారిటీలు  ఉన్నత విద్యను పొందాలనే లక్ష్యం నెరవేరాలంటే  ప్రభుత్వం రిజర్వేషన్స్ ఏర్పాటుచేయాలి  మరియు ఉన్నత విద్యలో ముస్లిము యువత  ప్రాతినిద్యం బాగా పెరగాలి. 

No comments:

Post a Comment