భారతదేశంలో
శతాబ్దాల ముస్లిం పాలన గురించి వివేకానంద ఏమనుకున్నారు?
వివేకానంద రచనలు
మరియు ప్రసంగాలు మరియు వివేకానందను గురించి తెలిసిన వ్యక్తుల అభిప్రాయాలను పరిశీలిస్తే, భారతదేశంలో "ది ఫ్యూచర్ ఆఫ్
ఇండియా" అనే పేరుతో వివేకానంద ఇచ్చిన ఉపన్యాసంలో, ముస్లిం పాలన యొక్క ప్రభావం గురించి మాట్లాడారు.
“భారత దేశం లో మహమ్మదీయ పాలన, పాలక వర్గాలకు గల ప్రత్యేక అధికారాన్ని
నాశనం చేసింది. భారతదేశo పై మహమ్మదీయుల ఆక్రమణ, అణగారిన వర్గాల వారికి, పేదలకు మోక్షంగా వచ్చింది. పలితంగా ప్రజలలో ఐదో వంతు మహమ్మదీయులయ్యారు. ఇదంతా
కత్తి(బలం) తో అని అనుకోవడం పిచ్చితనం అవుతుంది” అని వివేకానంద అన్నారు.
ప్రారంభ అరబ్ దండయాత్రలు
బలవంతపు మతమార్పిడులను చూశాయని వివేకానంద విశ్వసించినప్పటికీ, ఇస్లాం ఆయుధ బలంతో భారత ఉపఖండం అంతటా
వ్యాపించిందని నమ్మలేదు.
ఇస్లాం తన సమానత్వ సామాజిక క్రమంతో, కుల వ్యవస్థ యొక్క దౌర్జన్యం నుండి
స్వేచ్ఛ నిరాకరించబడిన అణగారిన కులాల
వారికి స్వాగతo పలికింది. ముస్లిం విజేతలు, ముఖ్యంగా మొఘల్ రాజవంశం, భారతదేశాన్ని వలసవాదులుగా కాకుండా, దేశం మరియు దాని ప్రజలతో గుర్తింపు
పొందిన పాలకులుగా, ఇతర స్థానిక రాజవంశం వలె పరిపాలన
సాగించారు.
భారతదేశం యొక్క
ఇస్లామిక్ గతం పట్ల వివేకానంద వైఖరి సహనంతో కూడినది. ముస్లిం సహకారాన్ని భారతీయ జాతీయ జీవన నిర్మాణంలో ముఖ్యమైన భాగం అని వివేకానంద
పేర్కొన్నారు. వివేకానంద మొఘలులు, మొఘల్ వాస్తుశిల్పం, దాని కళ మరియు కవిత్వం పట్ల ఆకర్షితుడయ్యారు.మొఘలుల గొప్పతనం అనేది వివేకానందా
లో ఎన్నటికీ అలసిపోని ఇతివృత్తమని వివేకానంద
శిష్యురాలు సిస్టర్ నివేదిత చెప్పారు.
నమ్మకంతో హేతువాది
అయినప్పటికీ, వివేకానంద హృదయంలో భావుకత కలిగినవారు. మొఘల్ కాలం నాటి పురాతన శిధిలాలు, రాజభవనాలు, పెయింటింగ్‌లు మరియు శిల్పకళలు అతనిని
ఆకర్షించినవి.
భారతదేశ
చరిత్రలోని అన్ని దశలు వివేకానందను ఆకర్షించినవి. అక్బర్ ప్యాలెస్ మరియు అజ్మీర్‌లోని
ముస్లిం సెయింట్ మొయినుద్దీన్ చిస్తీ దర్గా, సికంద్రాలోని అక్బర్ సమాధి,
ఆగ్రాలోని తాజ్
మహల్ మరియు ఢిల్లీలోని మొఘల్ స్మారక చిహ్నాలు మరియు శిధిలాలను వివేకానంద సందర్శించినాడు.
వివేకానంద
మొదటిసారిగా 1892లో తాజ్ మహల్‌ను సందర్శించారు.తాజ్ మహల్
చేత మంత్రముగ్ధులై, వివేకానంద తన ఒక సహచరుడితో ఇలా అన్నాడు, "ఈ అద్భుత కట్టడంలోని ప్రతి చదరపు అంగుళం
ఒక రోజంతా ఓపికగా పరిశీలించదగినది మరియు దాని గురించి నిజమైన అధ్యయనం చేయడానికి
కనీసం ఆరు నెలల సమయం పడుతుంది."
సిస్టర్ నివేదిత
ప్రకారం వివేకానంద 1898లో తన పాశ్చాత్య స్నేహితులు, శిష్యులు మరియు సోదర సన్యాసులతో కలసి ఆగ్రా
చేరుకోవడానికి ముందు, వివేకానంద లక్నోలో ఉన్నాడు,
అక్కడ ఔద్ నవాబ్
నిర్మించిన రాజభవనాలు, స్మారక చిహ్నాలు మరియు తోటలను
సందర్శించాడు. నవాబ్ ఆస్థాన వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
వివేకానందతో కలిసి
ప్రయాణించడం మరియు తన పాశ్చాత్య శిష్యుల కోసం “భారతదేశం యొక్క గతాన్ని, వర్తమాన జీవితానికి
తీసుకురావడం” గురించి సిస్టర్ నివేదిత
రాసింది. వివేకానందుని దృష్టిలో అక్బర్ భారతదేశంలో పరిపాలించిన గొప్ప చక్రవర్తి.
ఢిల్లీలోని మొఘల్
స్మారక చిహ్నాలను దర్శిస్తూ వివేకానంద బృందం ఒక రోజు గడిపారు. వివేకానంద మొఘల్ రాజవంశ
వైభవానికి పరవశించిపోయి,
తనతో పాటు వచ్చిన
వారితో ఇలా అన్నాడు “ అక్బర్ మన ముందు గతాన్ని సజీవం చేశాడు. నిజానికి, మనము గతంలోని వర్తమానాన్ని మరచిపోయాము
మరియు చనిపోయిన చక్రవర్తులు మరియు పురాతన రాజులతో జీవించాము”.
వివేకానందుడు, అక్బర్‌లో తాత్కాలిక temporal శక్తి,ఆధ్యాత్మికత, శౌర్యం,భక్తి, మరియు సహనం యొక్క అద్భుతమైన కలయికను చూశాడు. మతపరమైన బహుళత్వం మరియు
సార్వత్రిక మతం గురించి అక్బర్ చక్రవర్తి ఆలోచన ముఖ్యంగా వివేకానందను ఆకట్టుకుంది, ఇది వివేకానంద సొంత తత్వశాస్త్రంలో
ప్రతిధ్వనిoచినది.
వివేకానంద, తరచుగా
అక్బర్ గురించి చెప్పేవారు
అని సిస్టర్ నివేదిత
రాసింది. అక్బర్ ను వివేకానంద, ఎంతగానో మెచ్చుకొన్నారు. అక్బర్, తన గత జన్మలో
జ్ఞానోదయం కోసం ఆకాంక్షించే ఆత్మ అని,
కానీ లక్ష్యాన్ని
తప్పిపోయిన వ్యక్తి అని వివేకానంద వ్యాఖ్యానించాడు. వివేకానంద అభిమానం కేవలం
అక్బర్ కే పరిమితం కాలేదు.వివేకానందుని అభిమానం మొఘలులలో అత్యంత ప్రసిద్ధులకు మాత్రమే
పరిమితం కాలేదు. బాబర్, హుమాయున్, జహంగీర్, నూర్జహాన్,
షాజహాన్, అందరూ వివేకానందుని ప్రశంసలను పొందారు.
జర్మనీలో జన్మించిన
అమెరికన్ శిష్యురాలు క్రిస్టీన్ గ్రీన్‌ఫీల్డ్ వద్ద మొఘల్‌లపై వివేకానంద
ఉద్వేగభరితమైన భావనల ప్రత్యక్ష కథనం ఉంది.
క్రిస్టీన్ గ్రీన్‌ఫీల్డ్ కలకత్తా నుండి హిమాలయాలకు ప్రయాణంలో వివేకానందతో, నివేదిత మరియు
ఇతరులతో కలిసి వెళ్ళింది. ప్రయాణంలో, వివేకానంద తన పాశ్చాత్య స్నేహితులను మొఘల్
చరిత్ర యొక్క కథనలాతో అలరించాడు. మొఘలులపై వివేకానందకున్న మోహం గురించి క్రిస్టీన్
మాటల్లో చదవడం విలువైనదే.
“మొగల్స్ స్వామి వివేకానంద ను మంత్రముగ్ధులను చేసినట్లు అనిపించింది. వివేకానంద
భారతీయ చరిత్ర యొక్క మొఘల్ కాలాన్ని చాలా తీవ్రతతో చిత్రించాడు. దీనితో వివేకానంద తన స్వంత గతం యొక్క కథను
చెబుతున్నాడనే ఆలోచన తరచుగా మాకు వచ్చేది
వివేకానంద ఇస్లాం పట్ల గౌరవం కలదు మరియు భారతదేశానికి ఇస్లాం చేసిన సేవలను
ప్రశంసించడం జరిగింది. హిందువుల వలె ముస్లింలు
కూడా భారతదేశ జాతీయ జీవితంలో భాగo అనే ఆలోచన కలవాడు వివేకానందుడు. భారతదేశం యొక్క
నాగరికత క్షీణతకు విదేశీయుల ఆక్రమణలు
కాకుండా వివేకానంద భారతీయులనే నిందించాడు.
వివేకానంద అభిప్రాయం లో భారతదేశం యొక్క పతనం
ఇస్లామిక్ ఆక్రమణకు ముందు ప్రారంభమైంది. కుల వ్యవస్థ యొక్క దుష్పరిణామాలు,తరుగుతున్న మేదాతనం, నిరంతర సనాతనత్వం
మరియు సామాజిక స్వేచ్ఛలపై పరిమితులు
ఇందుకు దోహదపడినవి. వివేకానంద ముస్లింల కృషిని అర్థం చేసుకున్నాడు మరియు ప్రశంసించాడు. భారతీయ నాగరికత యొక్క ఫాబ్రిక్‌లో వారిని అంతర్భాగంగా చూశాడు.
No comments:
Post a Comment