23 May 2023

దాతృత్వం ఇంట్లోనే ప్రారంభమవుతుంది Charity begins at home

 

ఇతరుల పట్ల దయ చూపేవారు ఉన్నారు, కానీ వారు సొంత కుటుంబo లోని  సబ్యుల  పట్ల దయ చూపరు. కాని నిజానికి దాతృత్వం ఇంట్లో ప్రారంభమవుతుంది.

దివ్య ఖురాన్‌ను చదివితే, దివ్య ఖురాన్ కుటుంభం లోని సబ్యుల పట్ల దయచూపమని చెబుతుంది.

"తామేo ఖర్చుపెట్టాలి? అని ప్రజలు అడుగుతున్నారు. వారికి చెప్పు: మీరేం ఖర్చు  పెట్టినా అందులో మీ తల్లితండ్రులకు, మీ సమీప బంధువులకు, అనాధలకు, అగత్యపరులకు, బాటసారులకు హక్కు ఉంటుంది. మీరేమి ఖర్చు చేసినా, నిశ్చయంగా అది అల్లాహ్ కు తెలుస్తుంది.” (2:215).

దివ్యఖురాన్ లో దాతృత్వ గ్రహీతలు ప్రాధాన్యత క్రమంలో పేర్కొనబడ్డారు. తల్లిదండ్రులు మొదటివారు.. తరువాత "సమీప బంధువులు". అనగా తల్లిదండ్రులతో నివసిస్తున్న తోబుట్టువులు, తర్వాత, అత్తలు, మామలు, కజిన్‌లు మరియు గ్రాండ్ పేరెంట్స్ కూడిన కుటుంబ సబ్యులు. ఆ తరువాత "అనాథలు," "పేదలు" మరియు "బాటసారులు" (పాద యాత్రికులు) వస్తారు.

 అదేవిధంగా ప్రేమ మరియు దయ love and kindness కు సంబంధించి, దివ్య ఖురాన్ లోని 4:36 ఆయత్ దయను స్వీకరించేవారిని ప్రాధాన్యత క్రమంలో పేర్కొంది.

సమీప రక్త సంబంధం మొదట వస్తుంది.

"మరియు అల్లాహ్‌ను ఆరాధించండి.. దేనిని ఆయనకు భాగస్వామoగా ఎంచకండి.. తల్లిదండ్రుల పట్ల ఉత్తమ రీతిలో వ్యవరించండి.  సమీప బంధువుల పట్ల, అనాథల పట్ల, పేదవారి పట్ల, బంధుమిత్రుల పట్ల మరియు పొరుగువారి పట్ల, మీ అధీనం లోని బానిసల పట్ల  దయ చూపండి.అల్లాహ్ గర్వంగా మరియు గొప్పగా చెప్పుకునే వారిని ప్రేమించడు." దివ్య ఖురాన్  4:36

పై రెండు దివ్య ఖురాన్ ఆయతులు  2:215 అలాగే 4:36, దాతృత్వం మరియు దయ మాత్రమే కాకుండా వాటి గ్రహీతలను కూడా ప్రాధాన్యత క్రమంలో వివరిస్తాయి.

సమాజంలోని నిరుపేద మరియు వికలాంగ సభ్యుల అవసరాల పట్ల ఇస్లాం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. సమాజంలోని అణగారిన వర్గాల అవసరాలను తీర్చడానికి తమ  ఆస్తులలో కొంత భాగాన్ని ఇవ్వడం ధనవంతుల విధి అని దివ్య ఖురాన్  పేర్కొన్నది.

సమాజం లోని సభ్యులు తమ సంపదనంతా తమ కోరికల తృప్తి కోసం ఖర్చు చేయకుండా తల్లిదండ్రులు, బంధువులు, పొరుగువారు, పేదలు మరియు వికాలంగుల కోసం తమ సంపదలో కొంత భాగాన్ని కేటాయించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది.

దాతృత్వం ఇంట్లో ప్రారంభమవుతుంది.

ఒక నిజమైన విశ్వాసి తన కుటుంబం యొక్క అవసరాలను తీర్చిన తర్వాత, అవసరమైన ఇతర వ్యక్తులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు.

దివ్య ఖురాన్ తరచుగా విశ్వాసులను 'ఆరాధనలు నిర్వహించి, జకాత్ చెల్లించమని' ఆజ్ఞాపిస్తుంది. మీరు అమితంగా ఇష్టపడే వస్తువులలో నుండి (దైవమార్గంలో)  ఖర్చుపెట్టనంత వరకు మీరు పుణ్యస్థాయికి చేరుకోలేరు. మీరేమి ఖర్చు చేసినా అది దేవునికి తెలుస్తుంది." (3:92)

కాబట్టి, దాతృత్వo అనేది మనం గొప్పగా విలువైన, మనం ఇష్టపడే వాటిని ఇవ్వడంలో ఉంటుంది. భగవంతుడు కోరేది నిస్వార్థం. ఇది ఏ రూపంలోనైనా ఉండవచ్చు-ఒకరి వ్యక్తిగత ప్రయత్నాలు, ప్రతిభ, నైపుణ్యాలు, అభ్యాసం, ఆస్తి లేదా ఆస్తులు.

దివ్య ఖురాన్‌లో అనేక ఆయతులు  మరియు ప్రవక్త(స) యొక్క అనేక హదీసులు జకాత్‌ చెల్లించవలసి ఉందని మరియు దానికన్నా అధికం గా చెల్లించవలసి ఉందని,  కేవలం జకాత్ చెల్లించినంత మాత్రాన సంపన్నులు తమ విధుల నుండి విముక్తి పొందరని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 

దివ్య ఖురాన్ 'హక్' అనే పదాన్ని ఉపయోగిస్తుంది, హక్ అనగా  పేదల హక్కు. నిజానికి ధనవంతుడు ఇచ్చేది  దాతృత్వం కాదు అది పేదల హక్కు. దాత లబ్ధిదారుని నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకూడదు, ఎందుకంటే దాత భగవంతుని నుండి సమృద్ధిగా బహుమానం కోసం వేచి ఉన్నాడు.  దేవుడు తన సేవకుడికి - భౌతిక, నైతిక మరియు ఆధ్యాత్మికంగా  ఉత్తమం అయిన దానిని అందిస్తాడు. 

No comments:

Post a Comment