బద్రుద్దీన్
తయ్యబ్జీ అక్టోబర్ 10, 1844న బొంబాయి లో
జన్మించాడు. బద్రుద్దీన్ తయ్యబ్జీ, బ్రిటిష్ పరిపాలన సమయంలో భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త. భారత జాతీయ కాంగ్రెస్‌కు మూడవ అధ్యక్షుడిగా, బొంబాయి ఉన్నత
న్యాయస్థానం న్యాయవాదిగా పనిచేసిన మొదటి భారతీయుడు బద్రుద్దీన్ తయ్యబ్జీ. భారత జాతీయ
కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులలో బద్రుద్దీన్ తయ్యబ్జీ ఒకడు. బద్రుద్దీన్
తయ్యబ్జీ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు.
బద్రుద్దీన్ తయ్యబ్జీ ప్రధాన స్రవంతితో ఏకీకరణ అనే భావనను సమర్ధించాడు. . బద్రుద్దీన్ తయ్యబ్జీతో కలసి 'జాతీయ ముస్లింలు' అని పిలవబడే మౌలానా అబుల్ కలాం ఆజాద్, మౌలానా హుస్సేన్ అహ్మద్ మదానీ, సైఫుద్దీన్ కిచ్లూ మొదలైనవారు కూడా భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ముస్లింలు చురుకుగా పాల్గొనాలని గట్టిగా వాదించారు.
బద్రుద్దీన్ తయ్యబ్జీ "రాజకీయ సమస్యలకు సంబంధించి, ముస్సల్మాన్‌లు ఇతర మతాలకు చెందిన తోటి దేశస్థులతో ఉమ్మడి కారణాన్ని ఏర్పరచుకోవాలని ఎప్పుడూ అభిప్రాయపడుతున్నాను” అని అన్నారు. దురదృష్టవశాత్తు, ముస్లిం ఉన్నతవర్గంలో ఎక్కువ భాగం బద్రుద్దీన్ తయ్యబ్జీ యొక్క ఆచరణాత్మకమైన దృక్పథాన్ని విస్మరించింది.
న్యాయవాదిగా, సంఘ సంస్కర్తగా, విద్యావేత్తగా, బొంబాయి హైకోర్టు
న్యాయమూర్తిగా మరియు భారత జాతీయ కాంగ్రెస్ మూడవ అధ్యక్షుడిగా బద్రుద్దీన్ తయ్యబ్జీ
తన సామర్థ్యాలతో దేశానికి సేవలందించారు.
దేశం యొక్క ఉమ్మడి కారణాన్ని(స్వాతంత్ర్య సాధన) ముందుకు తీసుకెళ్లే ఐక్య
కార్యాచరణకు సాంస్కృతిక మరియు మతపరమైన వైవిధ్యాలు అడ్డంకి కాదని బద్రుద్దీన్
తయ్యబ్జీ విశ్వసించారు. బద్రుద్దీన్ తయ్యబ్జీ లౌకికవాదం మరియు బహుత్వ భావనను
వ్యాప్తి చేశాడు.
బద్రుద్దీన్
తయ్యబ్జీ బొంబాయి రాజకీయాల్లో విశేషమైన పాత్రను పోషించారు. బద్రుద్దీన్ తయ్యబ్జీ 1885లో ‘బాంబే
ప్రెసిడెన్సీ అసోసియేషన్’ ఏర్పాటుకు ఎక్కువ బాధ్యత వహించాడు.
బద్రుద్దీన్
తయ్యబ్జీ భారత జాతీయ కాంగ్రెస్‌తో(భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు) దాని ప్రారంభం నుండి
అనుబంధం కలిగి ఉన్నాడు. సర్ సయ్యద్ వేర్పాటువాద వైఖరికి భిన్నంగా భారత జాతీయ
కాంగ్రెస్‌లో చేరాలని బద్రుద్దీన్ తయ్యబ్జీ భారతీయ ముస్లింలను ఉద్బోధించారు. బద్రుద్దీన్
తయ్యబ్జీ దృష్టిలో కాంగ్రెస్ అంటే.. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి
విద్యావంతులు మరియు అన్ని జాతులు మరియు మతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారి
సమ్మేళనం
బద్రుద్దీన్
తయ్యబ్జీ భారతీయ ముస్లిం సమాజాన్ని అభివృద్ధి చెందుతున్న సమకాలిన రాజకీయాలతో సంతులించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. బద్రుద్దీన్
తయ్యబ్జీ రాజకీయ రంగంలో నూతన భారత జాతీయ ఉద్యమంతో ముస్లిముల ఏకీకరణ మరియు
సాంస్కృతిక రంగంలో భారతీయ పునరుజ్జీవనోద్యమ విలువలను నింపడం కోసం కృషి చేసారు.
బద్రుద్దీన్ తయ్యబ్జీ భారత జాతీయ కాంగ్రెస్ కార్యకాలాపాలలో చురుకుగా పాల్గొనారు) భారత జాతీయ కాంగ్రెస్‌కు మూడవ అధ్యక్షుడు మరియు ముస్లిముల కొరకు ఆధునిక విద్యను ప్రచారం చేసారు. (ముస్లింలలో ఆధునిక విద్యను ప్రచారం చేయడానికి బద్రుద్దీన్ తయ్యబ్జీ 1874లో అంజుమన్-ఇ-ఇస్లాంను స్థాపించాడు).
బద్రుద్దీన్
తయ్యబ్జీ యొక్క ఆదర్శాలు -- బహుళత్వం, లౌకికవాదం మరియు మత సహజీవనం -- నేటి భారతదేశం
మరియు భారతీయ ముస్లింలకు మరింత సందర్భోచితంగా ఉన్నాయి. అందువల్ల 19వ శతాబ్దంలో బద్రుద్దీన్
తయ్యబ్జీ సమర్థించిన లౌకికవాదం చుట్టూ చేరడం మరియు ప్రధాన స్రవంతితో కలిసిపోవడమే
నేడు భారతీయ
ముస్లింల సముచిత ఎంపిక.
No comments:
Post a Comment