ఆల్ ఇండియా సర్వే
ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) నివేదిక 2021-22 (ప్రోవిజనల్) డేటా వెల్లడించించబడినది.. ఇది ముస్లిం
విద్యార్థుల ప్రాతినిధ్యంలో విస్తృతమైన వ్యత్యాసాన్ని సూచిస్తుంది, ఉన్నత విద్యను పొందడంలో ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న
సవాళ్లను హైలైట్ చేస్తుంది.
భారతదేశంలో 2021-22లో 43,268,181 మంది విద్యార్థులు ఉన్నత విద్యలో
చేరారు, అందులో 2,108,033 మంది ముస్లిం విద్యార్థులు. ముస్లిం విద్యార్థులు మొత్తం నమోదులో 4.87 శాతం ఉన్నారు.
భారత దేశ ఉన్నత
విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థుల నమోదు 2019లో 5.24 శాత౦ మరియు 2020లో 5.5 శాత౦ గా ఉండి అది 2021లో 4.6 శాతానికి పడిపోయింది. భారతదేశం యొక్క
మొత్తం స్థూల నమోదు నిష్పత్తి (GER)
సగటున 24.1 గా
ఉంది మరియు 43,268,181 మంది
. విద్యార్థులు
నమోదు చేసుకున్నారు.
· ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం గా ఉన్న జమ్మూ
మరియు కాశ్మీర్,
ఉన్నత విద్యా స్థాయిలో మెరుగైన భాగస్వామ్యంతో జాబితాలో అగ్రస్థానంలో ఉంది, జమ్మూ మరియు కాశ్మీర్‌లో మొత్తం 400,423 మంది విద్యార్థులలో 138,142 మంది ముస్లిం విద్యార్ధులు 34.5 శాతం మంది ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ యొక్క GER 24.8 వద్ద ఉంది..
· లడఖ్ రెండవ స్థానంలో ఉంది. లడఖ్‌లో మొత్తం
4,440 మంది విద్యార్ధులు కలరు అందులో 1,148 మంది ముస్లింలు. మొత్తం నమోదులో ముస్లిం విద్యార్ధులు
25.8 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
లడఖ్ 11.5 వద్ద అత్యల్ప GERని కలిగి ఉంది.
· అండమాన్ మరియు నికోబార్ దీవులలోUT, మొత్తం 11,427 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు, వారిలో 609 మంది ముస్లిం సమాజానికి చెందినవారు. ఇది మొత్తం ఎన్‌రోల్‌మెంట్‌లో 0.05% ను సూచిస్తుంది. అండమాన్ మరియు నికోబార్ దీవులలోUT ఉన్నత విద్యలో ముస్లిం విద్యార్థుల పరిమిత ప్రాప్యతను సూచిస్తుంది. అండమాన్ మరియు నికోబార్ దీవులలోUT GER 22.6గా ఉంది..
· ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1,929,159 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా వారిలో 56,444 మంది ముస్లింలు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం విద్యార్ధులలో ముస్లిములు దాదాపు 2.92 శాతం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ 36.5 GER కలిగి
ఉంది.
· అరుణాచల్ ప్రదేశ్‌లో నమోదు చేసుకున్న మొత్తం
విద్యార్థులు 64,890 మంది కాగా వారిలో 107 మంది ముస్లింలు ఉన్నారు. ఇది చాలా తక్కువ గా 0.16 శాతంగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్GER కూడా 36.5 వద్ద ఉంది.
· అస్సాంలో నమోదు అయిన మొత్తం విద్యార్థులు 678,012 మంది. వారిలో 84,808 మంది ముస్లింలు అనగా మొత్తం నమోదులో 12.5 శాతం ఉన్నారు. అస్సాం రాష్ట్ర GER 16.9.
· బీహార్‌లో నమోదు చెసుఒన్న మొత్తం
విద్యార్ధులు 2,622,946 మంది వారిలో 172,681 మంది ముస్లింలు,
అనగా మొత్తం నమోదులో 6.58 శాతం ఉన్నారు. బీహార్ GER 17.1.
· చండీగఢ్‌లో మొత్తం నమోదు చేసుకున్న విద్యార్థులు 111,003 మంది, అందులో 692 మంది ముస్లింలు, మొత్తం నమోదులో 0.62 శాతం మంది ఉన్నారు. చండీగఢ్. 64.8 GER కలిగి ఉంది. ఇది అధిక నమోదు రేటును ప్రతిబింబిస్తుంది.
· చత్తీస్‌గఢ్‌లో మొత్తం నమోదు చేసుకున్న విద్యార్ధులు 656,341 మంది వారిలో 5,113 మంది ముస్లింలు అనగా మొత్తం నమోదులో కేవలం 0.78 శాతం మాత్రమే ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 19.6 GER ఉంది.
· ఢిల్లీలో 1,145,390 మంది మొత్తం విద్యార్థులు కలరు. వారిలో 28,282 మంది ముస్లింలు అనగా మొత్తం నమోదులో 2.47 శాతం గా ఉన్నారు. ఢిల్లీ, 49 GER కలిగి ఉంది.
· గోవాలో మొత్తం 65,415 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు, వారిలో
3,084 మంది ముస్లింలు, అనగా
మొత్తం నమోదులో ముస్లిములు
4.72 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గోవారాష్ట్ర GER 35.8.
· గుజరాత్ ఉన్నత విద్య లో మొత్తం 1,797,662 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు, వారిలో
35,993 మంది ముస్లింలు, అనగా
మొత్తం నమోదులో 2 శాతం ఉన్నారు.. గుజరాత్ GER 24.
· హర్యానా ఉన్నత విద్యా లో 1,104,532 మంది విద్యార్థులు ఉన్నారు, వారిలో 10,961 మంది ముస్లింలు అనగా మొత్తం నమోదులో కేవలం 0.99 శాతం మాత్రమే ముస్లిములు ఉన్నారు.. హర్యానాలో 33.3 GER ఉంది.
· హిమాచల్ ప్రదేశ్, మొత్తం
319,651 మంది విద్యార్థులు ఉన్నత విద్య లో నమోదు చేసుకున్నారు వారిలో 1,314 మంది ముస్లింలు ఉన్నారు. అనగా ముస్లిం విద్యార్థుల నమోదు రేట్ 0.41 శాతం మాత్రమె. హిమాచల్ ప్రదేశ్ GER 43.1 వద్ద ఉంది.
· జార్ఖండ్‌లో ఉన్నత విద్య లో మొత్తం విద్యార్ధల నమోదు 879,965 మంది. వారిలో 38,200 మంది ముస్లింలు,అనగా మొత్తం ఎన్‌రోల్‌మెంట్‌లో ముస్లిములు 4.34 శాతం గా ఉన్నారు. జార్ఖండ్ 18.6 GERని కలిగి ఉంది.
· కర్ణాటకలో ఉన్నత విద్య లో మొత్తం 2,436,540 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వారిలో 147,249 మంది ముస్లింలు అనగా ముస్లిం విద్యార్ధుల నమోదు రేట్ 6.05 శాతం గా ఉంది. ఇది సాపేక్షంగా పెద్ద ముస్లిం విద్యార్థుల జనాభాను సూచిస్తుంది,. కర్ణాటకGER జీఈఆర్ 36.2.
· కేరళలో ఉన్నత విద్య లో మొత్తం 1,304,445 మంది నమోదు చేసుకున్నారు, వారిలో
187,358 మంది ముస్లింలు, అనగా
ముస్లిం
విద్యార్ధుల నమోదు రేట్ 14.36 శాతం ఉన్నారు. ఇది కేరళలోని ఉన్నత
విద్యా సంస్థలలో ముస్లింల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. కేరళ అత్యధిక
GER 41.3ని కలిగి ఉంది.
· లక్షద్వీప్‌లో ఉన్నత విద్య లో మొత్తం 88 మంది విద్యార్థులు మాత్రమే నమోదు
చేసుకున్నారు. వారిలో 88 మంది ముస్లింలు గా ఉన్నారు. లక్షద్వీప్
కేంద్రపాలిత
ప్రాంతంలో ఉన్నత విద్యలో ముస్లిం సమాజం పూర్తి భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. లక్షద్వీప్
GER 1.1.
· మధ్యప్రదేశ్‌లో ఉన్నత విద్య లో మొత్తం 2,800,165 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు, వారిలో
39,205 మంది ముస్లింలు. మధ్యప్రదేశ్‌లో ముస్లిములు మొత్తం నమోదులో 1.4 శాతం గా ఉన్నారు. మధ్యప్రదేశ్ 28.9 శాతం GER
ఉంది.
· మహారాష్ట్రలో ఉన్నత విద్య లో మొత్తం 4,577,843 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వారిలో మొత్తం 154,515 మంది ముస్లింలు ఉన్నారు అనగా ముస్లిం విద్యార్ధులు 3.38 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహారాష్ట్ర జీఈఆర్ 35.3.
· మణిపూర్‌లో ఉన్నత విద్య లో మొత్తం 130,388 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు వారిలో
1,964 మంది ముస్లింలు, మొత్తం నమోదులో కేవలం 1.5 శాతం మాత్రమే ముస్లిములు ఉన్నారు. మణిపూర్
GER 35.4.
· మేఘాలయలో ఉన్నత విద్య లో మొత్తం 96,453 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు
వారిలో 2,119 మంది ముస్లింలు అనగా ముస్లిములు ఉన్నత
విద్య లో కేవలం 2.2 శాతం ఉన్నారు. మేఘాలయ యొక్క GER 25.4.
· మిజోరంలో ఉన్నత విద్య లో మొత్తం 46,771 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు, వారిలో
130 మంది ముస్లింలు అనగా మొత్తం నమోదులో కేవలం 0.28 శాతం మాత్రమే ముస్లిములు ఉన్నారు. మిజోరాం
యొక్క GER 32.3.
· నాగాలాండ్‌లో ఉన్నత విద్య లో మొత్తం 51,223 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు, వారిలో
253 మంది ముస్లింలు, మొత్తం నమోదులో ముస్లిం విద్యార్ధులు కనిష్టంగా 0.49 శాతంగా ఉన్నారు.. నాగాలాండ్ యొక్క GER 18.8.
· ఒడిశాలో ఉన్నత విద్య లో మొత్తం 1,073,879 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు వారిలో
8,509 మంది ముస్లింవిద్యార్ధులు అనగా మొత్తం
నమోదులో కేవలం 0.79 శాతం మాత్రమే కలిగి ఉన్నారు. ఒడిశా GER 22.1.
· పుదుచ్చేరిలో ఉన్నత విద్య లో మొత్తం 94,643 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు వారిలో 3,270 మంది ముస్లింలు, అనగా ముస్లిములు మొత్తం నమోదులో 3.45 శాతం ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి యొక్క GER 61.5 అధిక నమోదు రేటును సూచిస్తుంది.
· పంజాబ్‌లో ఉన్నత విద్య లో మొత్తం 858,744 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు వారిలో
19,917 మంది ముస్లింలు అనగా మొత్తం నమోదులో ముస్లిము విద్యార్ధులు 2.32 శాతం ఉన్నారు. పంజాబ్ GER 27.4.
·
రాజస్థాన్‌లో ఉన్నత విద్య లో మొత్తం 2,689,340 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు
వారిలో 46,411 మంది ముస్లిం విద్యార్ధులు ఉన్నారు, మొత్తం నమోదులో ముస్లిములు
1.73 శాతం
ఉన్నారు. ఇది ముస్లిం విద్యార్ధుల తక్కువ
వాటాను సూచిస్తుంది.రాజస్థాన్
GER 28.6.
·
సిక్కింలో ఉన్నత విద్య లో మొత్తం 33,761 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు
వారిలో 162 మంది ముస్లింలు ఉన్నారు, ఇది మొత్తం
నమోదులో కేవలం 0.48 శాతం
మాత్రమే. సిక్కిం రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థులకు తగిన ఉన్నత విద్యావకాశాలను
కల్పించాలి. సిక్కిం యొక్క GER 38.6 గా ఉంది.
·
తమిళనాడులో ఉన్నత విద్య లో మొత్తం 3,309,327 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు, వారిలో 115,690 మంది ముస్లింలు ఉన్నారు అనగా మొత్తం
నమోదులో ముస్లిములు 3.5 శాతం
ఉన్నారు. తమిళనాడు GER
47.
· తెలంగాణలో ఉన్నత విద్య లో మొత్తం 1,596,680 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు వారిలో 121,318 మంది ముస్లింలు అనగా మొత్తం మొత్తం నమోదులో ముస్లిములు 7.6 శాతం ఉన్నారు. తెలంగాణలో ముస్లిం విద్యార్థుల నిష్పత్తి ఉన్నత విద్యలో గణనీయమైన ప్రాతినిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. తెలంగాణ జీఈఆర్ 40.
·
త్రిపురలో ఉన్నత విద్య లో మొత్తం 100,551 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు, వారిలో 3,002 మంది ముస్లింలు అనగా మొత్తం నమోదులో 2.98 శాతం ముస్లిములుగా
ఉన్నారు. త్రిపుర GER
20.7.
·
ఉత్తరప్రదేశ్‌లో ఉన్నత విద్య లో మొత్తం 6,973,424 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు
వారిలో 326,819 మంది ముస్లింలు ఉన్నారు, అనగా మొత్తం నమోదులో ముస్లిములు 4.68 శాతం ఉన్నారు. ఈ
గణనీయమైన సంఖ్య ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా రంగంలో ముస్లిం విద్యార్థుల
ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. ఉత్తరప్రదేశ్ GER 24.1.
·
ఉత్తరాఖండ్‌లో ఉన్నత విద్య లో మొత్తం 567,704 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు వారిలో 16,836 మంది ముస్లింలుఅనగా ముస్లిములు మొత్తం నమోదులో 2.96 శాతంగా ఉన్నారు.. ఉత్తరాఖండ్ GER 41.8 ని కలిగి ఉంది.
·
పశ్చిమ బెంగాల్, ఉన్నత విద్య లో మొత్తం 2,722,151 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు వారిలో 335,412 మంది ముస్లింలు
ఉన్నారు అనగా మొత్తం
విద్యార్థుల జనాభాలో ముస్లిం విద్యార్ధులు 12.33 శాతంగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉన్నత విద్యా
సంస్థల్లో ముస్లింల అధిక ప్రాతినిధ్యాన్ని ఈ గణనీయమైన నిష్పత్తి నొక్కి చెబుతుంది.
పశ్చిమ బెంగాల్‌లో 26 GER
ఉంది.
No comments:
Post a Comment