20 December 2024

గ్రూప్ A & B సివిల్ సర్వీసెస్ అధికారులలో ముస్లింలు తగినంతగా లేకపోవడం Inadequate Presence of Muslims Among Group A & B Civil Services Officials

 



 

న్యూఢిల్లీ:

భారతదేశంలోని ముస్లింల విద్యా, సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులపై సచార్ కమిటీ నివేదిక అనేక సామాజిక మరియు ఆర్థిక అంశాలలో ముస్లింలు షెడ్యూల్ కులాలు (ఎస్‌సిలు) మరియు షెడ్యూల్డ్ తెగలు (ఎస్‌టిలు) దిగువన ఉన్నారని కనుగొన్నది. ఇతర మతపరమైన మైనారిటీలతో పోలిస్తే IAS, IPS మరియు IFSలలో ముస్లిముల వాటా చాలా తక్కువగా ఉంది.

ప్రస్తుతం, దేశంలో ప్రతి 5.73 లక్షల మంది ముస్లింలలో ఒక IAS లేదా IPS అధికారి ఉన్నారు, ప్రతి 1.08 లక్షల మంది ముస్లిమేతరులలో ఒకరు ఉన్నారు.

2024 నాటికి, దేశవ్యాప్తంగా IAS, IPS మరియు IFS అధికారుల సంఖ్య 11,959గా ఉంది, వీరిలో IASలో ముస్లింలు 180 మంది; ఐపీఎస్‌లో 151 మంది, ఐఎఫ్‌ఎస్‌లో 35 మంది ఉన్నారు. మొత్తం  366. మహిళా IAS అధికారులలో ముస్లిం శాతం దాదాపు శూన్యం

28 రాష్ట్రాలు మరియు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల (UTలు)గా ఉన్న భారత దేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాకు నిలయం. భారతదేశంలోని ముస్లింలు. - గ్రౌండ్ రియాలిటీస్ వర్సెస్ ఫేక్ నేరేటివ్స్. Muslims in India – Ground Realities versus Fake Narratives అనే కొత్త పుస్తకం ప్రకారం  ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లో మాత్రమే కాదు డేటా ప్రకారం, కేంద్ర గ్రూప్ A మరియు B సర్వీస్‌లలో కూడా ముస్లిముల శాతం చాలా దారుణంగా ఉన్నది.

కేంద్ర 28 గ్రూప్ A సర్వీసులలో  కూడా ముస్లిం అధికారులు తక్కువ సంఖ్య లో ఉన్నారు.

కేంద్ర గ్రూప్ A యొక్క 28 సర్వీసుల్లో మొత్తం 23,606 మంది అధికారులలో 581 మంది ముస్లింలు ఉన్నారు.

·       2018లో ఏర్పాటు చేసిన ఇండియన్ పెట్రోలియం & ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ సర్వీస్ (IPESS)లో 101 మంది అధికారులలో నలుగురు ముస్లింలు ఉన్నారు.

·       60 ఏళ్ల ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీస్ (IOFS)లో 1,270 మంది అధికారుల్లో 30 మంది ముస్లింలు ఉన్నారు.

·       1976లో ఏర్పాటైన ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్ (ICAS)లోని 181 మంది అధికారులలో ముగ్గురు ముస్లింలు ఉన్నారు.

·       1982లో ఉనికిలోకి వచ్చిన ఇండియన్ కాస్ట్ అకౌంట్స్ సర్వీస్ (ICoAS)లో 118 మంది అధికారులలో ముగ్గురు ముస్లింలు ఉన్నారు.

·       1960లో స్థాపించబడిన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (IIS)  మొత్తం 1,107 మందిలో 69 మంది ముస్లిం అధికారులు ఉన్నారు.

·       1967లో ఏర్పాటైన ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ (ICLS)లో 267 మంది అధికారుల్లో ఆరుగురు ముస్లింలు ఉన్నారు.

·       పరోక్ష పన్నులను (కస్టమ్స్ మరియు GST) పర్యవేక్షించడానికి 1953లో ఏర్పాటైన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS)లో 3,500 మంది అధికారుల్లో 89 మంది ముస్లింలు ఉన్నారు.

·       1944లో ఏర్పాటైన IRS (ఆదాయపు పన్ను)లో మొత్తం 4,286 మంది అధికారుల్లో 70 మంది ముస్లింలు ఉన్నారు.  

·       1947లో ఉనికిలోకి వచ్చిన ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ (IDAS)లో 544 మంది అధికారులు ఉన్నారు, వీరిలో ఆరుగురు ముస్లింలు.

·       స్వాతంత్ర్యం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత ఏర్పడిన, ఇండియన్ పోస్టల్ సర్వీస్ (IPoS) దాని 394 మంది అధికారులలో 23 మందిముస్లిములు ఉన్నారు..

·       1971లో ఏర్పాటైన ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ (IAAS)లో 758 మంది అధికారుల్లో 19 మంది ముస్లింలు ఉన్నారు.

·       1978లో ఏర్పాటైన ఇండియన్ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ (ITS) 1,437 మంది అధికారులలో 27 మంది ముస్లింలను కలిగి ఉంది.

·       1948 నుండి ఉనికిలో ఉన్న ఇండియన్ ఫారిన్ సర్వీస్ 850 మంది అధికారులను కలిగి ఉంది, అందులో 12 మంది ముస్లింలు మాత్రమే ఉన్నారు.

·       1967 నుండి అమలులో ఉన్న ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (IES), 451 మంది అధికారులను కలిగి ఉంది, అందులో 14 మంది ముస్లింలు మాత్రమే ఉన్నారు.

·       1986లో ఏర్పాటైన ఇండియన్ ట్రేడ్ సర్వీస్ (ITS)లో 134 మంది అధికారుల్లో నలుగురు ముస్లింలు మాత్రమే ఉన్నారు.

·       1985లో ఏర్పాటైన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ (ఐడీఈఎస్)లోని 156 మంది అధికారుల్లో కేవలం ఏడుగురు ముస్లింలు మాత్రమే.

·       1922లో ఏర్పాటైన ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ (IDAS)లో 528 మంది ముస్లింలలో ఇద్దరు తక్కువ. 

·       IDES దాని 189 మంది అధికారులలో ఎనిమిది మంది ముస్లింలు ఉన్నారు.

·       1973లో ఏర్పడిన ఇండియన్ కమ్యూనికేషన్ ఫైనాన్స్ సర్వీసెస్ (ICFS) - గతంలో IP&TAFS - 227 మంది అధికారులలో కేవలం ఏడుగురు మాత్రమే ముస్లింలు ఉన్నారు.

·       1973లో ఏర్పడిన ఇండియన్ P&T అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్‌లో 285 మంది అధికారులు ఉన్నారు, వీరిలో 11 మంది ముస్లింలు ఉన్నారు.

·       ఎనిమిది భారతీయ రైల్వేలకు సంబంధించిన సేవలలో ముస్లిం అధికారులు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. వాటిలో అత్యంత పురాతనమైనది, 1967లో ఏర్పడిన ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీస్, రోల్స్‌లో ఉన్న 886 మంది అధికారులలో 19 మంది ముస్లింలను కలిగి ఉంది.

·       ఎనిమిదేళ్ల తర్వాత 1975 లో ఏర్పడిన ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్ (IRSE)లో 1,265 మంది అధికారులు ఉన్నారు, వీరిలో 25 మంది ముస్లింలు ఉన్నారు.

·       1979లో ఏర్పాటైన ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (IRAS) మరియు ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్‌లో 783 మరియు 966 మంది అధికారులలో వరుసగా 21 మరియు 23 మంది ముస్లింలు ఉన్నారు.

·       1980లో ఏర్పాటైన ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ (IRPS) 356 మంది అధికారులలో 11 మంది ముస్లింలను కలిగి ఉంది.

·       రెండు సంవత్సరాల తర్వాత 1982 ఏర్పడిన ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ (IRSS) వచ్చింది, దాని రోల్స్‌లో 542 మంది అధికారులలో 12 మంది ముస్లింలు ఉన్నారు.

·       ఆరేళ్ల తర్వాత 1988ఏర్పడిన  ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ (IRSME)లో 34 మంది ముస్లింలతో సహా 1,773 మంది అధికారులు ఉన్నారు.

·       2019లో ఏర్పడిన రైల్వే సర్వీస్‌లో చివరిది, ఇండియన్ రైల్వేస్ ప్రొటెక్షన్ ఫోర్సెస్ సర్వీస్ (IRPFS) దాని 252 మంది అధికారులలో 19 మంది ముస్లింలను కలిగి ఉంది.

 

కేంద్ర గ్రూప్ B యొక్క ఆరు సర్వీసుల్లో 1,322 మంది అధికారులలో 41 మంది ముస్లింలు మాత్రమే ఉన్నారు

·       ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ISS)మొత్తం  814 మంది లో 32 మంది ఉన్నారు.

·       అండమాన్ & నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ & డయ్యూ, మరియు దాద్రా & నగర్ హవేలీ సివిల్ సర్వీస్ (DANICS)లోని మొత్తం183లో 3ముస్లిములు కలరు. .

·       ఢిల్లీ, అండమాన్ & నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ & డయ్యూ, దాద్రా & నగర్ హవేలీ పోలీస్ సర్వీస్ (DANIPS)లో 248 మంది ముస్లిం అధికారులలో 3ముస్లిములు ఉన్నారు.

·       పాండిచ్చేరి సివిల్ సర్వీస్ మరియు పాండిచ్చేరి పోలీస్ సర్వీస్‌లలో 20 మరియు 47 మంది ముస్లిం అధికారులు వరుసగా ఇద్దరు మరియు ఒకరు మాత్రమే ఉన్నారు.

·       ఇండియన్ సాల్ట్ సర్వీస్, 10 మంది అధికారులలో ముస్లిం ఎవరూ లేరు. 

 

మూలం: Clarion India, Date:December 18, 2024

 

 

 

 






No comments:

Post a Comment