పార్ట్-1
న్యూఢిల్లీ –
“ముస్లిమ్స్ ఇన్ ఇండియా – గ్రౌండ్
రియాలిటీస్ వర్సెస్ ఫేక్ నేరేటివ్స్ –
అచీవ్‌మెంట్స్ & అకాప్లిష్‌మెంట్స్ Muslims
in India – Ground Realities Versus Fake Narratives” అనే కొత్త పుస్తకం ప్రకారం 1990ల నుండి
దక్షిణ భారతదేశం లోని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు అయిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు
మరియు తెలంగాణా మరియు పుదుచ్చేరి, లక్షద్వీప్ లో ముస్లిం సమాజం పాలన మరియు ఇతర
సూచిక/డొమైన్‌లలో దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే తులనాత్మకంగా మెరుగ్గా ఉంది
దక్షణాది రాష్ట్రాలు విద్య, ఆరోగ్యం
మరియు ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యతనిస్తూ,
అధిక అక్షరాస్యత రేట్లు, మెరుగైన
ఆరోగ్య సంరక్షణ ఫలితాలు కలిగి ఉన్నవి
ఐదు దక్షిణాది రాష్ట్రాలు దేశ జనాభాలో
దాదాపు 20 శాతం మరియు దేశ GDPలో 30 శాతం
వాటా కలిగి ఉన్నాయి. దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్న రాష్ట్రాల జాబితాలో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రా, కేరళ, తెలంగాణా
అగ్రస్థానంలో ఉన్నాయి. ఆరోగ్యం, విద్య,
మానవాభివృద్ధి మరియు ఆర్థిక అవకాశాలలో
దక్షిణాది రాష్ట్రాలు దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే మెరుగైన పనితీరును
కొనసాగిస్తున్నాయని డేటా చూపుతోంది
దక్షినాది రాష్ట్రాలలో ముస్లిం జనాభా
లో దాదాపు 90 శాతం మంది ముస్లింలు వెనుకబడిన సమాజంగా
పరిగణించబడ్డారు మరియు కర్ణాటక, కేరళ మరియు తమిళనాడులో వీరికి ఇతర
వెనుకబడిన తరగతుల (OBC)లో భాగంగా రిజర్వేషన్లు మంజూరు చేశారు
.
·
2024 మధ్యలో కేరళ శాసనసభలో సమర్పించిన డేటా
ప్రకారం, కేరళలో మొత్తం 545,423 ప్రభుత్వ
ఉద్యోగులు ఉన్నారు, వీరిలో 73,774
మంది ముస్లింలు 13.5
శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
·
తెలంగాణలో
ముస్లింల సామాజిక-ఆర్థిక మరియు విద్యా స్థితిగతులపై విచారణ కమిషన్ ప్రకారం
తెలంగాణలో ముస్లిం ఉద్యోగుల వాటా 7.36 శాతం గా ఉంది కాని తెలంగాణ రాష్ట్ర జనాభాలో
ముస్లిముల శాతం 12.68 కి పైగా ఉంది.
చట్టసభలలో ముస్లిముల ప్రాతినిద్యం:
దక్షిణాది రాష్ట్రాలు/కేంద్రపాలిత
ప్రాంతాల(UT)
నుండి పార్లమెంట్-లోక్ సభకు ఎన్నికైన ముస్లింలు:
·
1951లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో
ఆంధ్రతో కూడిన మద్రాసు రాష్ట్రంలో ముస్లిం ఎంపీలు లేరు.
·
హైదరాబాద్
రాష్ట్రంలో ముగ్గురు ముస్లింలు ఉండేవారు.
·
మైసూర్
మరియు ట్రావెన్‌కోర్ మరియు కూర్గ్‌లలో కూడా ముస్లిం సభ్యులు లేరు.
·
1957లో,
పార్లమెంటు దిగువసభలో మొత్తం ఐదుగురు
ముస్లిం సభ్యులు ఉన్నారు.
·
1962 ఎన్నికలలో నలుగురు ముస్లింలు
ఎన్నికయ్యారు.
·
1967ఎన్నికలలో,
ఏడుగురు ముస్లిం ఎంపీలు ఎన్నికైనారు.
చూసింది. 1971లో ఐదుగురు ముస్లింలు లోక్‌సభకు
ఎన్నికయ్యారు.
·
1977లో ఎనిమిది మంది ముస్లింలు ఎన్నికయ్యారు.
·
1980లో ఆరుగురు ఎంపీలు ఎన్నికయ్యారు.
·
1984లో ఏడుగురు ఎంపీలు ఎన్నికైనారు,
·
1989లో ఎనిమిది మంది ఎంపీలు ఎన్నికైనారు,
·
. 1994
సంవత్సరంలో 11 మంది ముస్లింలు ఎన్నికయ్యారు.
·
1999లో ఎనిమిది మంది ముస్లింలు ఎన్నికయ్యారు.
·
2004లో తొమ్మిది మంది ముస్లింలు
ఎన్నికయ్యారు.
·
2009లో ఏడుగురు ముస్లింలు ఎన్నికయ్యారు.
·
2014లో ఏడుగురు ముస్లింలు లోక్‌సభకు
ఎన్నికయ్యారు.
·
2019లో,
ఎన్నికైన ముస్లిం సబ్యుల సంఖ్య ఆరుకు
తగ్గింది.
·
18వ లోక్‌సభ ఎన్నికలలో మరియు 2024లో
ఎన్నికైన ముస్లిం సబ్యుల సంఖ్య ఆరుకు తగ్గింది
·
ఐదు
దక్షిణాది రాష్ట్రాలు మరియు రెండు యుటిలలో 2024లో ఎన్నికైన 24 మంది
లోక్‌సభ ఎంపీల్లో ముగ్గురు ముస్లింలు - ఉన్నారు.
దక్షినాది రాష్ట్రాలు/కేంద్రపాలిత
ప్రాంతాల(UT)
నుండి రాజ్యసభకు ఎన్నిక అయిన muslim ముస్లిం సబ్యుల సంఖ్య:
·
ప్రస్తుతం, రాజ్యసభలో
ఐదుగురు ముస్లిం సభ్యులు ఉన్నారు
·
1952 మరియు 1958 మధ్య,
మద్రాస్,
ట్రావెన్‌కోర్ మరియు కొచ్చిన్ నుండి
రాజ్యసభలో నలుగురు ముస్లింలు ఉన్నారు.
·
1952 మరియు 1968 మధ్య మద్రాసు రాష్ట్రంలో ఏడుగురు
ముస్లింలు రాజ్యసభకు ఎన్నికయ్యారు,
వారిలో ఇద్దరు మళ్లీ నామినేట్ అయ్యారు.
·
ఆంధ్ర
ప్రదేశ్ 1972 నుండి 16 మంది ముస్లింలు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు
·
కర్ణాటక
చరిత్రలో రాజ్యసభకు ఎనిమిది మంది ముస్లిం ఎంపీలు ఎన్నికయ్యారు
·
ఒక మహిళతో
సహా 12 మంది ముస్లింలు తమిళనాడు నుండి రాజ్యసభకు
ఎన్నికయ్యారు.
·
2010 నుండి మొత్తం 27 మందిలో
తెలంగాణ నుండి ఏ ముస్లిం రాజ్యసభ సభ్యుడు కాలేదు.
·
1963 నుండి పుదుచ్చేరిలో ఉన్న 10 మంది
సభ్యులలో ఎవరూ ముస్లింలు కాదు.
దక్షిణాది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల(UT) నుండి అసెంబ్లీ స్థానాలలో muslim సబ్యుల సంఖ్య.
తమిళనాడులో ముస్లింల అసెంబ్లీ స్థానాల
వాటా మూడు నుంచి నాలుగు శాతం మధ్య ఉంది.. ఇది ఎన్నడూ ఐదు శాతానికి మించి దాటలేదు.
ఇది 2000 సంవత్సరంలో రెండు శాతానికి తగ్గింది.
·
2001 నుంచి డీఎంకే నుంచి వచ్చిన 372 మంది
ఎమ్మెల్యేల్లో 14 మంది ముస్లింలు ఎన్నికయ్యారు.
·
2001 నుంచి ఎనిమిది మంది ముస్లింలతో సహా
ఏఐఏడీఎంకే 543 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది.
·
1952 మరియు 2021 మధ్య తమిళనాడు ఎమ్మెల్యేల సంఖ్య 3,829, వీరిలో 93 మంది
ముస్లింలు
కర్ణాటక రాష్ట్రంలో ముస్లింలు మొత్తం జనాభాలో 13 శాతం
ఉన్నారు.
·
కర్ణాటకలో 2013లో 11మంది ముస్లిములు - కాంగ్రెస్‌కు తొమ్మిది మరియు జనతాదళ్
(సెక్యులర్) రెండు ఎన్నికైనారు.
·
2018 ఎన్నికలలో ఏడుగురు ముస్లిములు
ఎన్నికైనారు.
·
2023లో జరిగిన 224 సీట్ల
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది మంది ముస్లింలు (సీట్ల సంఖ్యలో ఇప్పుడు వారి
వాటా 4.01%) కాంగ్రెస్ తరుపున గెలుపొందారు.
·
1957 మరియు 2023 మధ్య కర్ణాటకలో 3,283 మంది
ఎమ్మెల్యేలు ఉన్నారు, వారిలో 141 మంది ముస్లింలు ఉన్నారు
హైదరాబాద్ రాష్ట్రంలో
·
1952లో,
హైదరాబాద్ శాసనసభ ఎన్నికలలో పదకొండు మంది
ముస్లింలు ఎన్నికయ్యారు - ఎనిమిది మంది కాంగ్రెస్ టిక్కెట్లు, ఇద్దరు
పిడిఎఫ్ నుండి మరియు ఒక స్వతంత్రుడు ఆ
సమయంలో హైదరాబాద్ రాష్ట్రంలో ముస్లింల జనాభా 7.75 శాతం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
·
ఆంధ్రప్రదేశ్
శాసనసభలో, 1955 మరియు 2024 మధ్య 3,896 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వీరిలో
ముస్లింలు 112 మంది (గత ఎన్నికల్లో ఎన్నికైన ముగ్గురుతో
కలిపి) ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రము లో:
·
2014 మరియు 2023 మధ్య,
తెలంగాణలో 357 మంది
ఎమ్మెల్యేలు ఉన్నారు, వారిలో 23 మంది ముస్లింలు ఉన్నారు - ప్రస్తుతం
మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు AIMIMకి చెందినవారు
కేరళ రాష్ట్రంలో
·
1957 మరియు 2021 మధ్య,
కేరళలో మొత్తం 2,034 మంది
ఎమ్మెల్యేలు ఉన్నారు, వారిలో 338 మంది ముస్లింలు
..
పుదుచ్చేరిUT లో ..
·
పుదుచ్చేరిలో 1964 నుండి మొత్తం 420 మంది
ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో 25 మంది ముస్లింలు ఉన్నారు.
గవర్నర్స్ Governors /నిర్వాహకులుగాAdministrators :
ఐదు దక్షిణాది రాష్ట్రాలకు (కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రా, కేరళ, తెలంగాణా) ఇప్పటి
వరకు ఉన్న 83 మంది గవర్నర్‌లలో తొమ్మిది మంది
ముస్లింలు,.
·
కేరళ మరియు
తమిళనాడులో నలుగురు గవర్నర్లుగా ఉన్నారు.
·
తెలంగాణలోని
ముగ్గురు గవర్నర్లలో ఎవరూ ముస్లింలు కాదు.
·
కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లకు
ఒక్కొక్క ముస్లిం గవర్నర్‌గా నియమించబడినాడు..
యూటీలలో గవర్నర్లు/నిర్వాహకులుగా . 35 మంది గవర్నర్లు/నిర్వాహకులు. ఉన్నారు
·
లక్షద్వీప్
యూటీలో కేవలం ఇద్దరు ముస్లింలు మాత్రమే నిర్వాహకులుగా ఉన్నారు.
·
పుదుచ్చేరిలో, 1981 నుండి ఉన్న 24 మంది నిర్వాహకులలో ఒక ముస్లిం మాత్రమే
ఉన్నారు.
ముఖ్యమంత్రులు/ఉప-ముఖ్యమంత్రులు:
·
ఐదు
రాష్ట్రాలు(కర్ణాటక, తమిళనాడు,
ఆంధ్రా,
కేరళ,
తెలంగాణా) మరియు పుదుచ్చేరికి చెందిన 129 మంది
ముఖ్యమంత్రులలో ఇద్దరు ముస్లింలు - 1979లో కేరళలో CH మహ్మద్
కోయా, మరియు 1967లో పుదుచ్చేరిలో MOH ఫరూక్.
·
ఐదు
రాష్ట్రాలు(కర్ణాటక, తమిళనాడు,
ఆంధ్రా,
కేరళ,
తెలంగాణా)
చెందిన ఇరవై ముగ్గురు ఉపముఖ్యమంత్రులలో ముగ్గురు ముస్లింలు ఉన్నారు -
ఇద్దరు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో ఒకరు.
శాసనసభ స్పీకర్‌లు మరియు డిప్యూటీ
స్పీకర్:
శాసనసభ స్పీకర్‌లు మరియు డిప్యూటీ
స్పీకర్‌లలో ముస్లిం ప్రాతినిధ్యం అత్యల్పంగా ఉంది.
·
ఆంధ్రప్రదేశ్‌లో
20 మంది స్పికర్లలో ముస్లింలు ఎవరు లేరు.
·
11 మంది డిప్యూటీ స్పీకర్‌లలో ఇద్దరు
ముస్లింలు - 1974లో ఎస్ రహమత్ అలీ మరియు 1995లో ఎన్‌ఎం
ఫరూక్.
·
కర్ణాటకలో
23 మంది స్పికర్లలో ఒక్క ముస్లిం (మే 2023 నుండి
యుటి ఖాదర్ ఫరీద్) మాత్రమే ఉన్నారు.
·
తొమ్మిది
మంది డిప్యూటీ స్పీకర్లలో ముస్లిములు లేరు.
·
.కేరళలో 1960 మరియు 1978 మధ్య 23 మంది స్పికర్లలో
నలుగురు ముస్లింలు ఉన్నారు.
·
1957 మరియు 1987 మధ్య 17 మంది డిప్యూటీ స్పీకర్లలో ఆరుగురు
ముస్లింలు ఉన్నారు.
·
తమిళనాడులో
20 మంది స్పికర్లలో మరియు 18 మంది
డిప్యూటీ స్పీకర్లలో ముస్లింలు లేరు.
·
పుదుచ్చేరిలో
ఒక ముస్లింతో సహా మొత్తం 19 మంది స్పికర్లు ఉన్నారు - MOH
ఫరూక్ 1964 మరియు 1980లో రెండుసార్లు పనిచేశారు.
·
21 మంది డిప్యూటీ స్పీకర్లలో ముస్లింలు
ఎవరూ లేరు.
రాష్ట్ర ప్రధాన
న్యాయమూర్తులు .
·
ఐదు
రాష్ట్రాల్లోని(కర్ణాటక, తమిళనాడు,
ఆంధ్రా,
కేరళ,
తెలంగాణా)
142 మంది ప్రధాన న్యాయమూర్తులలో అందులో రెండు
రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులు రెండు
యుటిల అధికార పరిధిని కూడా కలిగి ఉన్నారు. 142 మంది
ప్రధాన న్యాయమూర్తులలో ముస్లిములు కేవలం ఆరుగురు వీరిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్
మరియు తమిళనాడులలో ఉన్నారు.
·
1947 మరియు 2024 మధ్య,
ఐదు హైకోర్టుల్లో (కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రా, కేరళ, తెలంగాణా)
మొత్తం 718 మంది న్యాయమూర్తులు ఉన్నారు, వీరిలో 42 మంది
ముస్లింలు ఉన్నారు, అత్యధికంగా 19 మంది
మద్రాసు హైకోర్టులో ఉన్నారు మరియు అత్యల్పంగా తెలంగాణలో ఒకరు ఉన్నారు.
రాష్ట్ర చీఫ్
సెక్రటరీ/ UTనిర్వాహకులు
·
ఐదు
దక్షిణాది రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన
మొత్తం 221 మంది ప్రధాన కార్యదర్శులలో ముగ్గురు
ముస్లింలు.
·
కేరళలో 2006లో
మహమ్మద్ రియాజ్ ఉద్దీన్ ఉండగా, ఇద్దరు ముస్లింలు లక్షద్వీప్‌కు
నిర్వాహకులుగా పనిచేశారు - వజాహత్ హబీబుల్లా (1987-1990)
మరియు ఫరూక్ ఖాన్ (2016-2019).
పార్ట్-2
న్యూఢిల్లీ –
“ముస్లిమ్స్ ఇన్ ఇండియా – గ్రౌండ్
రియాలిటీస్ వర్సెస్ ఫేక్ నేరేటివ్స్ –
అచీవ్‌మెంట్స్ & అకాప్లిష్‌మెంట్స్ Muslims
in India – Ground Realities Versus Fake Narratives” అనే కొత్త పుస్తకం ప్రకారం 1990ల నుండి
దక్షిణ భారతదేశం లోని రాష్ట్రాలు/కేంద్ర
పాలిత ప్రాంతాలు అయిన ఆంధ్రప్రదేశ్,
కర్ణాటక,
కేరళ,
తమిళనాడు మరియు తెలంగాణా మరియు
పుదుచ్చేరి, లక్షద్వీప్ లో ముస్లిం సమాజం పాలన మరియు ఇతర సూచిక/డొమైన్‌లలో దేశంలోని
ఇతర ప్రాంతాలతో పోలిస్తే తులనాత్మకంగా మెరుగ్గా ఉంది
ఐదు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు
మరియు తెలంగాణా),
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్:
·
ఐదు
రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,
కేరళ,
తమిళనాడు మరియు తెలంగాణా), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ల సంఖ్య 153గా ఉంది, వీరిలో
నలుగురు ముస్లింలు ఉన్నారు, వీరిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు -
1973లో ఎ సలాం ఖాన్ మరియు 2007లో ఎం
అబ్దుల్ బాసిత్. కర్ణాటకకు లో AR నిజాముద్దీన్ 1986 నుండి 1990 వరకు పనిచేశారు
·
కేరళకు
చెందిన మహమ్మద్ అబ్దుల్ సత్తార్ కుంజు 1997లో పనిచేశారు.
·
లక్షద్వీప్‌లో
24 మంది పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు, వారిలో
ఇద్దరు ఉన్నారు. ముస్లింలు - MA సయ్యద్ మరియు కమర్ అహ్మద్.
ప్రధాన ఎన్నికల అధికారులు (The Chief Electoral Officers (CEOs)
·
ఐదు
రాష్ట్రాలు మరియు రెండు యుటిలలో (ఆంధ్రప్రదేశ్,
కర్ణాటక,
కేరళ,
తమిళనాడు మరియు తెలంగాణా మరియు
పుదుచ్చేరి, లక్షద్వీప్) ప్రధాన ఎన్నికల అధికారులు (CEOలు), అదనపు CEOలు మరియు
డిప్యూటీ CEOలు ప్రస్తుతం 48 మంది
ఉన్నారు, వీరిలో ముగ్గురు ముస్లింలు ఉన్నారు.
·
494 ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లలో
(ఈఆర్‌ఓ) ఇరవై ఒక్క మంది ముస్లింలు.
DEOలు మరియు డిప్యూటీ DEOలు:
·
ఐదు
రాష్ట్రాలు మరియు రెండు యుటిలలో (ఆంధ్రప్రదేశ్,
కర్ణాటక,
కేరళ,
తమిళనాడు మరియు తెలంగాణా మరియు
పుదుచ్చేరి, లక్షద్వీప్) DEOలు మరియు డిప్యూటీ DEOల సంఖ్య 253, వీరిలో 12 మంది మాత్రమె
ముస్లింలు.
మంత్రులు:
·
ఐదు
రాష్ట్రాలు మరియు ఒక యుటిలో, 132 మంది మంత్రులు కలరు వారిలో ఐదుగురు మాత్రమే
ముస్లింలు.
·
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
మరియు కేరళలో ఒక్కొక్కరు. కర్ణాటకలో ఇద్దరు ముస్లిం మంత్రులు ఉన్నారు.
·
తెలంగాణ, పుదుచ్చేరి
మంత్రివర్గాల్లో ముస్లింలు లేరు.
ముఖ్యమంత్రి కార్యాలయాల్లో:
·
ముఖ్యమంత్రి
కార్యాలయాల్లో (CMOs) మొత్తం 46 మంది అధికారుల్లో, తెలంగాణా
రాష్ట్రంలో మాత్రమే ముస్లిం అధికారి ఉన్నారు - షానవాజ్ ఖాసీం, IPS అధికారి, ముఖ్యమంత్రి
కార్యదర్శిగా ఉన్నారు.
జిల్లా కలెక్టర్లు:
·
ఆంధ్రప్రదేశ్
మొత్తం 952 జిల్లాల కలెక్టర్లు ఉన్నారు వీరిలో 42 మంది
ముస్లింలు ఉన్నారు.
·
కర్ణాటకలోని
961 కలెక్టర్లలో 13 మంది
ముస్లింలు ఉన్నారు.
·
కేరళలో
మొత్తం 525 మంది కలెక్టర్లు ఉన్నారు, వారిలో 28 మంది
ముస్లింలు.
·
తమిళనాడులో
మొత్తం కలెక్టర్ల సంఖ్య 1,836 అందులో 38 మంది
ముస్లిములు.
·
పుదుచ్చేరిలో
81 మంది కలెక్టర్లలో ఒకరు మాత్రమే
·
ముస్లిం.
తెలంగాణలో 2024 మధ్య నాటికి 477
కలెక్టర్లలో 51 మంది ముస్లింలు ఉన్నారు.
·
లక్షద్వీప్‌లోని
మొత్తం 35 కలెక్టర్లలో ముగ్గురు ముస్లింలు
ఉన్నారు.
జిల్లా మరియు సెషన్ జడ్జిల సంఖ్య
·
ఆంధ్రప్రదేశ్
లో, మొత్తం జిల్లా మరియు సెషన్ జడ్జిల సంఖ్య 919 మంది
ఉన్నారు, వీరిలో 43 మంది ముస్లింలు.
·
కర్ణాటకలో, మొత్తం
జిల్లా మరియు సెషన్ జడ్జిల సంఖ్య 983 మంది వారిలో 40 మంది
ముస్లింలు.
·
కేరళలో మొత్తం
జిల్లా మరియు సెషన్ జడ్జిల సంఖ్య 392 మంది వారిలో 46 మంది
ముస్లింలు.
·
తమిళనాడులో
మొత్తం జిల్లా మరియు సెషన్ జడ్జిల సంఖ్య 909 మంది వారి లో 68 మంది
ముస్లింలు
·
తెలంగాణలో, మొత్తం
జిల్లా మరియు సెషన్ జడ్జిల సంఖ్య
593 మంది వారిలో 59 మంది
ముస్లింలు.
ఐఎఎస్., ఐపిఎస్, మరియు IFS అధికారులలో ముస్లిం ప్రాతినిధ్యం ఐదు దక్షిణాది
రాష్ట్రాలలో(ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,
కేరళ,
తమిళనాడు మరియు తెలంగాణా) చాలా తక్కువగా
ఉంది
·
ఐదు
దక్షిణాది రాష్ట్రాలలో(ఆంధ్రప్రదేశ్,
కర్ణాటక,
కేరళ,
తమిళనాడు మరియు తెలంగాణా) 1,104 మంది IAS
అధికారులలో, 40 మంది
ముస్లింలు ఉన్నారు,
·
కర్ణాటక
మరియు కేరళలో అత్యధికంగా 15 మంది IAS
అధికారులు కలరు..
స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో:
·
ఐదు
రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,
కేరళ,
తమిళనాడు మరియు తెలంగాణా) మరియు
పుదుచ్చేరిలోని స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో మొత్తం 2,215 మంది
అధికారులలో 105 మంది ముస్లింలు.
·
కేరళలోని స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో అత్యధికంగా
33 మంది ఉన్నారు.
·
ప్రస్తుత 20 మంది
పాండిచ్చేరి సివిల్ సర్వీస్ అధికారుల్లో ఇద్దరు మాత్రమే ముస్లింలు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల
సంఖ్య:
ఐదు దక్షిణాది రాష్ట్రాలలో(ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు
మరియు తెలంగాణా) మొత్తం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల
సంఖ్య 318, అందులో ఆరుగురు ముస్లిములు వారిలో ముగ్గురు
అత్యధికంగా తమిళనాడులో ఉన్నారు.
ఐదు దక్షిణాది రాష్ట్రాలలో(ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు
మరియు తెలంగాణా) మొత్తం IPS
అధికారుల సంఖ్య 734, వీరిలో 24 మంది
ముస్లింలు
·
కేరళలో
అత్యధికంగా IPS అధికారులు ఎనిమిది మంది ఉన్నారు.
పోలీసు
బలగాల అమరవీరులు:
· నాలుగు రాష్ట్రాలు - ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు
మరియు తెలంగాణ - మరియు ఒక యుటి - పుదుచ్చేరిలో రాష్ట్ర పోలీసు బలగాల అమరవీరుల
సంఖ్య 654గా ఉంది,
వీరిలో 73 మంది ముస్లింలు, అత్యధికంగా
తెలంగాణలో 60 మంది ఉన్నారు.
పోలీసు పరిపాలన గణాంకాలు:.
·
ఐదు
రాష్ట్రాలు మరియు రెండు యుటిలలో (ఆంధ్రప్రదేశ్,
కర్ణాటక,
కేరళ,
తమిళనాడు మరియు తెలంగాణా మరియు
పుదుచ్చేరి, లక్షద్వీప్) 305 మంది ఎస్పీలు మరియు ఎఎస్‌పిలలో తొమ్మిది
మంది ముస్లింలు, వారిలో ఆంధ్రప్రదేశ్‌లో
అత్యధికంగా నలుగురు ఉన్నారు.
·
ఐదు
రాష్ట్రాలు మరియు రెండు యుటిలలో 1546 మంది SDPOలు మరియు DSPలలో 25 మంది ముస్లింలు (పుదుచ్చేరి మరియు
లక్షద్వీప్‌లలో మినహా)
·
ఐదు
రాష్ట్రాలు మరియు రెండు యుటిలలో ఇన్‌స్పెక్టర్లు మరియు సబ్-ఇన్‌స్పెక్టర్ల సంఖ్య
(లా & ఆర్డర్ మరియు క్రైమ్స్) 4,474, వీరిలో 156 మంది
ముస్లింలు ఉన్నారు.వీరిలో అత్యధికంగా తెలంగాణలో 36 మంది
మరియు లక్షద్వీప్‌లో అత్యల్పంగా ఏడుగురు ఉన్నారు.
ఎస్పీలు:
·
పుదుచ్చేరి
లో 35 మంది ఎస్పీలలో ఐదుగురు ముస్లిములు.
·
తెలంగాణలో
ఇప్పటి వరకు 77 మంది ఎస్పీల్లో 11 మంది
ముస్లిములు..
·
తమిళనాడులో
మొత్తం 377 మంది ఎస్పీలు ఉండగా, వారిలో 10 మంది
ముస్లింలు ఉన్నారు.
·
కేరళలో
మొత్తం 684 ఎస్పీలలో అత్యధికంగా 48 మంది
ముస్లింలు ఉన్నారు.
·
కర్ణాటకలో
మొత్తం 561 మందిలో 12 మంది ముస్లింలు ఎస్పీలుగా ఉన్నారు.
·
ఆంధ్రప్రదేశ్
లో మొత్తం 482 మంది ఎస్పీఅధికారుల్లో నలుగురు ముస్లిం ఎస్పీలు..
పోలిస్ కమీషనర్‌లు
:
·
1989 మరియు 1983లో పోస్టులు సృష్టించినప్పటి నుండి
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం మరియు విజయవాడలోని 52 పోలీసు కమీషనర్‌లలో ఒక్కరు కూడా
ముస్లింలు కాదు.
·
కర్ణాటకలో, బెంగళూరు 1966 మరియు 1980లలో
ఇద్దరు ముస్లిం ఖాదర్ అలీ మరియు AR నిజాముద్దీన్ లతో సహా 33 మంది
పోలీసు కమీషనర్ కలరు.
·
కర్ణాటకలోని
మరో ఐదు నగరాల్లో - బెలగావి, హుబ్బలి-ధార్వాడ్, కలబురగి, మంగళూరు
మరియు మైసూరు, 2015లో మైసూరులో - MA సలీమ్‌తో
సహా 43 పోలీసు కమీషనర్‌లలో ఒకరు మాత్రమే
ముస్లింగా ఉన్నారు.
·
కేరళలోని , ఆరు
నగరాల్లో మొత్తం పోలీసు కమీషనర్లు 228 మంది ఉన్నారు. వీరిలో 11 మంది
ముస్లింలు ఉన్నారు. వీరిలో
అత్యధికంగా కన్నూర్‌లో నలుగురు, కోజికోడ్‌లో ముగ్గురు ఉన్నారు
·
తమిళనాడులో, తొమ్మిది
నగరాల్లోని పోలీసు కమీషనర్‌లు మొత్తం 74 మంది
ఉన్నారు, వీరిలో సేలంలోని నజ్ముల్ హోడా మాత్రమే
ముస్లిం.
·
. తెలంగాణ
రాష్ట్రంలో హైదరాబాద్‌లో మొత్తం 59 పోలీసు కమీషనర్‌లను చూసింది, అందులో 18 మంది
ముస్లింలు, చివరిగా 2010లో ఎకె ఖాన్ ఉన్నారు.
·
సైబరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, రాచకొండ, రామగుండం, సిద్దిపేట
మరియు వరంగల్‌లలోని 26 పోలీసు కమీషనర్‌లలో ఒక్కరు మాత్రమే
ముస్లిం. (2017లో ఖమ్మంలో ఐదేళ్లుగా ముస్లిం - తఫ్సీర్
ఇక్బాల్).
స్టేట్ పోలీస్ సర్వీస్‌లో:
ఐదు రాష్ట్రాలు మరియు (ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు
మరియు తెలంగాణా) పుదుచ్చేరి స్టేట్ పోలీస్ సర్వీస్‌లో మొత్తం 1,268 మంది
అధికారులలో 44 మంది ముస్లింలు అందులో తమిళనాడులో అత్యధికంగా 21 మంది
ఉన్నారు.
·
పాండిచ్చేరి
పోలీస్ సర్వీస్‌లో 47 మందిలో ఒక ముస్లిం మాత్రమే ఉన్నారు.
రాష్ట్ర పోలీసు అకాడమీ చీఫ్:
· ఐదు రాష్ట్రాల్లో, (ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు
మరియు తెలంగాణా) రాష్ట్ర పోలీసు అకాడమీ చీఫ్‌ల సంఖ్య 53గా ఉంది,
వీరిలో తమిళనాడులో ఒక్కరు మాత్రమే
ముస్లిం - MS జాఫర్ సతీ 2017లో
ఉన్నారు.
రాష్ట్ర పోలీసు హౌసింగ్ మరియు సంక్షేమ
కార్పొరేషన్
· ఐదు రాష్ట్రాల్లో, (ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు
మరియు తెలంగాణా) రాష్ట్ర పోలీసు హౌసింగ్ మరియు సంక్షేమ కార్పొరేషన్‌లకు మొత్తం 99 మంది
చీఫ్‌లు ఉన్నారు, వీరిలో ఐదుగురు మాత్రమే ముస్లింలు
ఉన్నారు - ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులో ఇద్దరు చొప్పున ఉన్నారు.
మానవ హక్కుల కమీషన్‌లు:
·
ఐదు
రాష్ట్రాల్లోని మానవ హక్కుల కమీషన్‌ల అధ్యక్షులలో ఎవరు ముస్లిం కాదు.
·
ఐదు
రాష్ట్రాల్లోని మానవ హక్కుల కమీషన్ సభ్యులు,
కార్యదర్శులు మరియు రిజిస్ట్రార్‌లతో సహా
56 మంది అధికారులలో తెలంగాణలో ఒకరు
ముస్లిం.
రాష్ట్ర మహిళా కమిషన్:
·
ఐదు
రాష్ట్రాల్లోని రాష్ట్ర మహిళా కమిషన్‌లో ఛైర్‌పర్సన్‌లు మరియు సెక్రటరీలతో సహా
మొత్తం 70 మంది అధికారులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ
మరియు తెలంగాణల్లో ముగ్గురు ముస్లింలు మాత్రమే సభ్యులుగా ఉన్నారు.
·
తమిళనాడులోని
రాష్ట్ర మహిళా కమిషన్ 39 మంది అధికారుల్లో ఇద్దరు ముస్లింలు.
స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ:
·
ఐదు
రాష్ట్రాలు(ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,
కేరళ,
తమిళనాడు మరియు తెలంగాణా) మరియు పుదుచ్చేరిలో, స్టేట్
లీగల్ సర్వీసెస్ అథారిటీలో కార్యనిర్వాహక అధ్యక్షులు, కార్యదర్శులు
మరియు సభ్యులతో సహా మొత్తం 192 మంది అధికారులు ఉన్నారు, వీరిలో 11 మంది
ముస్లింలు - కేరళలో ఆరుగురు, కర్ణాటకలో నలుగురు మరియు తమిళనాడులో
ఒకరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,
పుదుచ్చేరిలో ముస్లింలెవరూ ఈ జాబితాలో
చోటు దక్కించుకోలేదు.
·
న్యాయవాదుల
ప్యానెల్ (గౌరవ మరియు ప్రో బోనో
(pro bono) తో సహా) 7,887 మంది
ఉన్నారు, వీరిలో 375 మంది ముస్లింలు.
లోక్ అయుక్త:
·
ఐదు
రాష్ట్రాల్లోని లోక్ అయుక్తల సంఖ్య మొత్తం 24,
అందులో కర్ణాటకలో మాత్రమే ఒక ముస్లిం
ఉన్నారు – (జస్టిస్ SA హకీం 1996 నుండి 2001 వరకు).
·
ఉప
లోకాయుక్తలు మొత్తం 24 మంది ఉన్నారు, వీరిలో
ఇద్దరు ముస్లింలు (కేరళలోని - జస్టిస్ KA
మహమ్మద్ షఫీ మరియు జస్టిస్ AK బషీర్).
పార్ట్-3
న్యూఢిల్లీ –
“ముస్లిమ్స్ ఇన్ ఇండియా – గ్రౌండ్
రియాలిటీస్ వర్సెస్ ఫేక్ నేరేటివ్స్ –
అచీవ్‌మెంట్స్ & అకాప్లిష్‌మెంట్స్ Muslims
in India – Ground Realities Versus Fake Narratives” అనే కొత్త పుస్తకం ప్రకారం 1990ల నుండి
దక్షిణ భారతదేశం లోని రాష్ట్రాలు/కేంద్ర
పాలిత ప్రాంతాలు అయిన ఆంధ్రప్రదేశ్,
కర్ణాటక,
కేరళ,
తమిళనాడు మరియు తెలంగాణా మరియు
పుదుచ్చేరి, లక్షద్వీప్ లో ముస్లిం సమాజం పాలన మరియు ఇతర సూచిక/డొమైన్‌లలో దేశంలోని
ఇతర ప్రాంతాలతో పోలిస్తే తులనాత్మకంగా మెరుగ్గా ఉంది
తులనాత్మకంగా, దేశంలోని
ఇతర మూడు భౌగోళిక ప్రాంతాల కంటే ఐదు దక్షిణాది రాష్ట్రాలు మరియు రెండు UTలలోని
ప్రభుత్వ శాఖలలో ముస్లిం ప్రాతినిధ్యాలు మెరుగ్గా ఉన్నాయి.
డ్రగ్ కంట్రోల్ అండ్ ఇన్‌స్పెక్షన్ టీమ్:
·
:డ్రగ్
కంట్రోల్ అండ్ ఇన్‌స్పెక్షన్ టీమ్‌లలో మొత్తం 473 మంది అధికారుల్లో 29 మంది
ముస్లింలు, తమిళనాడులో అత్యధికంగా తొమ్మిది మంది
ఉన్నారు.
లేబర్ డిపార్ట్‌మెంట్స్
·
ప్రధాన
కార్యదర్శులు, డైరెక్టర్లు మరియు డిప్యూటీ డైరెక్టర్లతో
సహా మొత్తం 820 మంది అధికారులలో ఐదు రాష్ట్రాలు మరియు
పుదుచ్చేరిలోని లేబర్ డిపార్ట్‌మెంట్లలో ముస్లింలు 57 మంది ఉన్నారు.
టూరిజం డిపార్ట్‌మెంట్‌లు మరియు టూరిజం
డెవలప్‌మెంట్ కార్పొరేషన్
·
2022 మధ్య నాటికి ఐదు రాష్ట్రాల్లోని టూరిజం
డిపార్ట్‌మెంట్‌లు మరియు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ల నిర్వహణ బృందాల్లో
ముస్లింలు చాలా తక్కువ.
·
ఆంధ్రప్రదేశ్‌లోని
12 మంది టూరిజం డైరెక్టర్లలో ఇద్దరు
ముస్లింలు. 26 మంది సీనియర్ అధికారుల్లో ఒక్క ముస్లిం
మాత్రమే ఉన్నారు.
·
కేరళలో 14 మంది
టూరిజం అధికారుల్లో ఒక ముస్లిం ఉన్నాడు.
·
కర్ణాటకలోని
12 మంది డైరెక్టర్లలో ఒక ముస్లిం ఉన్నారు.
·
తమిళనాడు
టూరిజంలో, దాని డైరెక్టర్ల బోర్డులో ముస్లింలు లేరు, 38 పర్యాటక
కార్యాలయాల అధిపతులలో ఒకరు ముస్లిం.
·
తెలంగాణా
తన ముగ్గురు టూరిజం మేనేజ్‌మెంట్ టీమ్ సభ్యులలో ముస్లింలు లేరు.
వాణిజ్య పన్నుల శాఖ:
·
ఐదు
రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,
కేరళ,
తమిళనాడు మరియు తెలంగాణా మరియు
పుదుచ్చేరిలోని వాణిజ్య పన్నుల శాఖల నిర్వహణ బృందాల్లోని మొత్తం 2,486 మంది అధికారుల్లో ఒక కమిషనర్
(పుదుచ్చేరి)తో సహా ముస్లిములు 113 మంది ఉన్నారు.
రెవెన్యూ శాఖ:
·
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి
రెవెన్యూ శాఖల్లో మొత్తం 104 మంది అధికారుల్లో ఒక కమిషనర్
(తమిళనాడు)తో సహా ఆరుగురు మాత్రమే ముస్లింలు.
ఎక్సైజ్/ప్రొహిబిషన్ శాఖ:
·
ఐదు
రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,
కేరళ,
తమిళనాడు మరియు తెలంగాణా మరియు
పుదుచ్చేరిలోని ఎక్సైజ్/నిషేధ శాఖల నిర్వహణ మరియు తనిఖీ బృందాలలో మొత్తం 1,352 మంది
అధికారులు కలరు అందులో ముస్లిం అధికారుల
సంఖ్య 126గా ఉంది,
ఇందులో కేరళలో అత్యధికంగా 18 మంది
ఉన్నారు.
అవినీతి నిరోధక శాఖలు/బ్యూరో:
·
మూడు
రాష్ట్రాలు - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ - మరియు
పుదుచ్చేరి స్టాండ్‌లలోని అవినీతి నిరోధక శాఖలు/బ్యూరోలలో మొత్తం 66 మంది
అధికారులలో నలుగురు ముస్లింలు కలరు.
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో
·
ఐదు
రాష్ట్రాలు మరియు పుదుచ్చేరి వారి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో మొత్తం 1,288 మంది
అధికారులను కలిగి ఉన్నారు, వారిలో 64 మంది ముస్లింలు ఉన్నారు, వీరిలో ఒక
సూపరింటెండింగ్ ఇంజనీర్ (తెలంగాణ) ఉన్నారు.
·
పుదుచ్చేరి
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో అధికారుల్లో ముస్లిం ఎవరూ లేరు.
అటవీ శాఖల సీనియర్ మేనేజ్‌మెంట్ బృందఅధికారుల్లో:
· ఐదు రాష్ట్రాలు మరియు రెండు యుటిలలోని
అటవీ శాఖల సీనియర్ మేనేజ్‌మెంట్ అధికారుల మొత్తం సంఖ్య 3,128 మందిలో 147 మంది ముస్లిం అధికారుల ఉన్నారు.
ప్రాసిక్యూషన్, అడ్వకేట్ జనరల్ మరియు జిల్లా
ప్రాసిక్యూటింగ్ అధికారులు :
· ఐదు రాష్ట్రాలు మరియు పుదుచ్చేరిలో ఏ
ముస్లిం కూడా ప్రాసిక్యూషన్‌కు నాయకత్వం వహించలేదు.
·
అడ్వకేట్
జనరల్ విషయంలో కూడా అలాగే ఉంది.
·
అయితే, ప్రస్తుత
అదనపు AGలు,
ప్రభుత్వ ప్లీడర్లు మరియు స్టాండింగ్
కౌన్సెల్‌లలో మొత్తం 691 మందిలో 86 మంది ముస్లింలు ఉన్నారు.
·
మొత్తం 873 జిల్లా
ప్రాసిక్యూటింగ్ అధికారులలో (DPOలు) 44 మంది మాత్రమే ముస్లింలు, ఆంధ్రప్రదేశ్
మరియు పుదుచ్చేరిలో ఎవరు లేరు.
రోడ్డు రవాణా సంస్థలు:
·
ఐదు
రాష్ట్రాలు మరియు పుదుచ్చేరి యుటిలోని రోడ్డు రవాణా సంస్థల (ఆర్‌టిసి) నిర్వహణ
మరియు పరిపాలన బృందాలలో మొత్తం అధికారుల సంఖ్య 1,837 మంది వీరిలో 88 మంది
ముస్లింలు.
·
పుదుచ్చేరిలో
ఎనిమిది మంది సభ్యుల నిర్వహణ బృందంలో ముస్లింలు ఎవరూ లేరు.
·
APSTRCలోని 413 మంది అధికారులలో పద్దెనిమిది మంది
ముస్లింలు.
·
కర్ణాటకలోని
మూడు ఆర్టీసీల్లో 661 మంది అధికారుల్లో 31 మంది
ముస్లింలు.
·
కేరళలో 159 మంది
అధికారుల్లో ముస్లింలు 14 మంది ఉన్నారు.
·
తమిళనాడులోని
మూడు ఆర్టీసీల్లో 227 మంది అధికారుల్లో 16 మంది
ముస్లింలు ఉన్నారు.
·
తెలంగాణలోని
240 మంది ఆర్టీసీ అధికారుల్లో ఎనిమిది మంది
ముస్లింలు.
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ల
అధ్యక్షులు:
·
ఐదు
రాష్ట్రాల్లో మొత్తం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ల అధ్యక్షులు 80 మందిలో
ముస్లింలు ఐదుగురు మాత్రమే ఉన్నారు - కేరళలో ఇద్దరు మరియు తమిళనాడులో ముగ్గురు.
·
ఐదు
రాష్ట్రాల్లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో మొత్తం 279 మంది
సభ్యులు ఉన్నారు, వీరిలో ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ముస్లింలు
మరియు కర్ణాటక మరియు తెలంగాణలో ఒక్కొక్కరు ఉన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్‌లు :
·
ఐదు
రాష్ట్రాలు మరియు పుదుచ్చేరిలో రాష్ట్ర మహిళా కమిషన్‌లు మొత్తం 39 మంది
చైర్‌పర్సన్‌లు కలరు అందులో
ఎవరూ ముస్లింలు కాదు.
·
ఐదు
రాష్ట్రాలు మరియు పుదుచ్చేరిలో రాష్ట్ర మహిళా కమిషన్‌ల 130 మంది
సభ్యులలో ఎనిమిది మంది ముస్లింలు ఉన్నారు,
ఇందులో కేరళలో నలుగురు ముస్లిములు మాత్రమే
ఉన్నారు.
·
కర్నాటక
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా లేదా సభ్యులుగా ముస్లిములు లేరు.
ఉర్దూ అకాడమీ
·
కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
మరియు తెలంగాణలలోని 34 మంది ఉర్దూ అకాడమీ చైర్మన్లలో ముప్పై
ఒక్కరు ముస్లింలు కాగా, కార్యదర్శులు/రిజిస్ట్రార్లు 54 మందిలో
ముస్లిములు 49 మంది ఉన్నారు.
విజిలెన్స్ మరియు అవినీతి నిరోధక శాఖ:
విజిలెన్స్ మరియు అవినీతి నిరోధక డొమైన్‌లలో, ఆంధ్ర
ప్రదేశ్‌లోని 48 కమీషనర్లు/డైరెక్టర్‌లలో ముగ్గురు
ముస్లింలు ఉన్నారు - 1969లో M
అబ్దుల్ అన్సారీ, 1982లో
అబ్దుస్ సమద్ ఖాన్ మరియు 2013లో AK
ఖాన్.
తమిళనాడు మరియు తెలంగాణలో మొత్తం 33 మంది
అధికారులలో ఏ ముస్లిం కూడా విజిలెన్స్ మరియు అవినీతి నిరోధక విభాగానికి నాయకత్వం
వహించలేదు. 2018లో మొత్తం 37 మంది
అధికారుల్లో BS మహమ్మద్ యాసన్ ఈ విభాగానికి నాయకత్వం
వహించారు.
వక్ఫ్ బోర్డులు
·
ఐదు రాష్ట్రాల్లోని
వక్ఫ్ బోర్డులు మరియు లక్షద్వీప్‌లోని యుటిలో ఇప్పటి వరకు 92 మంది
చైర్మన్‌లు ఉన్నారు - అందరూ ముస్లింలు.
·
ఐదు రాష్ట్రాల్లోని
వక్ఫ్ బోర్డుల కార్యదర్శులు/CEOలు136 మంది కలరు. కాని లక్షద్వీప్‌లో మాత్రం వక్ఫ్ బోర్డుల కార్యదర్శులు/CEOలుగా ముగ్గురు ముస్లిమేతరులు కలరు.
మునిసిపల్
కార్పొరేషన్:
·
ఆంధ్రప్రదేశ్‌లోని
17 మునిసిపల్ కార్పొరేషన్‌లలో మొత్తం 176 మంది
మేయర్లు ఉన్నారు, వీరిలో 36 మంది ముస్లింలు ఉన్నారు.
·
కర్ణాటకలో, 11 మునిసిపల్
కార్పొరేషన్‌లలో 173 మేయర్లు కలరు
అందులో 36 మంది ముస్లింలు.
·
కేరళలో ఆరు
పౌర సంస్థలలో మొత్తం 143 మంది మేయర్లు ఉన్నారు. అందులో 13 మంది
ముస్లింలు..
·
తమిళనాడులో, 21 పౌర
సంస్థలలో మేయర్ల సంఖ్య 112గా ఉంది,
వీరిలో 14 మంది ముస్లింలు ఉన్నారు.
·
దేశంలోని
పురాతన పౌర సంస్థ అయిన చెన్నైలోని 49 మంది మేయర్లలో ముగ్గురు ముస్లింలు.
·
తెలంగాణలో
13 కార్పొరేషన్లలో 43 మంది
మేయర్లు ఉన్నారు, వీరిలో ఆరుగురు ముస్లింలు (1966 నుండి 2014 మధ్య
హైదరాబాద్‌లో ఉన్నారు).
ఆసుపత్రులు:
·
ఉత్తరాది
రాష్ట్రాల్లో 1,825 ఉండగా,
దక్షిణ భారతదేశంలో 5,982
ఆసుపత్రులు ఉన్నాయి.
వైద్యులు:
·
1960 నుండి ఐదు రాష్ట్రాల తొమ్మిది మెడికల్
కౌన్సిల్‌లలో నమోదిత MBBS వైద్యుల సంఖ్య 4,64,136గా ఉంది, వీరిలో 43,838 మంది
ముస్లింలు.
·
కర్ణాటకలో
అత్యధికంగా 12,780 మరియు కేరళలో 10,458 మంది నమోదిత
MBBS వైద్యులు ఉన్నారు.
దంతవైద్యులు:
·
2023 మధ్య నాటికి ఐదు రాష్ట్రాల డెంటల్ కౌన్సిల్‌లు
మరియు పుదుచ్చేరి UTలో నమోదు చేసుకున్న దంతవైద్యుల విషయానికి
వస్తే, మొత్తం 1,27,836 మందిలో 14,770 మంది ముస్లింలు ఉన్నారు,
·
కేరళలో
అత్యధికంగా 4,788 మంది,
కర్ణాటకలో 4,401 మంది ముస్లిం
దంత వైద్యులు ఉన్నారు. . అత్యల్పంగా పుదుచ్చేరిలో – 70 మంది కలరు.
మూలం: క్లారియన్ ఇండియా, డిసెంబర్ 6, 2024
No comments:
Post a Comment