న్యూఢిల్లీ:
ఢిల్లీకి చెందిన ప్రసిద్ద చరిత్రకారుడు
మరియు రచయిత, 48 ఏళ్ల సయ్యద్
ఉబైదుర్ రెహమాన్, భారతీయ ముస్లిం చరిత్రను పునరుజ్జీవింపజేయడానికి
గత దశాబ్ద కాలంగా ఒంటరిగా
ప్రయత్నిస్తున్నారు. ఉబైదుర్ రెహమాన్ భారతీయ ముస్లిం చరిత్రను కాపాడటం అనే లక్ష్యం
తో పనిచేస్తున్నారు
గత పదేళ్లలో, సయ్యద్ ఉబైదుర్
రెహమాన్ మధ్యయుగ భారతీయ చరిత్రపై కనీసం ఆరు పుస్తకాలను రచించాడు. సయ్యద్ ఉబైదుర్
రెహమాన్ రచించిన పుస్తకాలలో, ‘భారతీయ ముస్లిం
స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్ర’, ‘ఫర్గాటెన్ ముస్లిం ఎంపైర్స్ ఆఫ్ సౌత్ ఇండియా’, ‘భారత స్వాతంత్య్ర
ఉద్యమంలో ఉలేమా పాత్ర’ మరియు
ఇటీవల ప్రచురించిన ‘భారతదేశంలో
ఇస్లాం యొక్క శాంతియుత విస్తరణ, ‘Biographical Encyclopedia of
Indian Muslim Freedom Fighters’, ‘Forgotten Muslim Empires of South India’,
‘Ulema’s Role in India’s Freedom Movement’ and his recently published book
‘Peaceful Expansion of Islam in India’’ అనే పుస్తకం ఉన్నాయి.
సయ్యద్ ఉబైదుర్ రెహమాన్ రచించిన తాజా పుస్తకం‘‘భారతదేశంలో ఇస్లాం
యొక్క శాంతియుత విస్తరణ Peaceful Expansion of Islam in
India’. భారతదేశం అంతటా
మరియు వెలుపల చర్చనీయాంశంగా మారింది, ఎందుకంటే ఇది స్థానిక జనాభాను బలవంతంగా ఇస్లాంలోకి
మార్చారు అనే తప్పుడు భావనను
తొలగిస్తుంది.
ఇస్లాం ఉత్తరాదికి రాకముందే దక్షిణ భారతదేశానికి వచ్చిందని, అరబ్ మరియు పర్షియన్ వ్యాపారుల వలన మరియు భారతదేశం లోని వివిధ ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో స్థిరపడిన సూఫీల కృషి వలన భారతదేశం లో ఇస్లాం విస్తరించినది అని సయ్యద్ ఉబైదుర్ రెహమాన్ తన పరిశోధన ద్వారా నిరూపించాడు.
భారతదేశం యొక్క ముస్లిం చరిత్ర
గురించి అవగాహన కల్పించడానికి, సయ్యద్ ఉబైదుర్ రెహమాన్ భారతదేశం యొక్క మధ్యయుగ మరియు చివరి
మధ్యయుగ చరిత్ర యొక్క విభిన్న అంశాలపై ముఖ్యంగా ఢిల్లీ మరియు దేశంలోని వివిధ
ప్రాంతాలలో ముస్లిం పాలన కాలం పై మూడు కోర్సులను అందిస్తున్నారు.
సయ్యద్ ఉబైదుర్ రెహమాన్ 'భారతీయ ముస్లిం
చరిత్రపై 3-నెలల
కోర్సు' ఇస్లాం
రాక మరియు ముహమ్మద్ బిన్ ఖాసిమ్ సింధ్‌ను జయించడంతో ప్రారంభమవుతుంది, తర్వాత ఘజనీ మహమూద్
మరియు అతని విజయాలు, గోరి ముహమ్మద్ Muhammad of Ghur మరియు ఢిల్లీ సుల్తానేట్ స్థాపన, ఢిల్లీ సుల్తానేట్ యొక్క
వివిధ రాజవంశాలు మరియు అలావుద్దీన్ ఖాల్జీ మరియు ముహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో
దక్షిణ భారతదేశ౦లో ఇస్లామిక్ పాలన
వ్యాప్తికి సంబంధించిన వివిధ అంశాలు కవర్
చేయబడినవి.
ఇంకా 'భారతీయ ముస్లిం
చరిత్రపై 3-నెలల
కోర్సు' లో మొఘల్
పాలనతో పాటు కాశ్మీర్, బెంగాల్, మాల్వా, ఖాందేష్, గుజరాత్, జౌన్‌పూర్‌లోని
షర్కిస్, గుల్బర్గా/బీదర్‌లోని
బహమనీలు, అహ్మద్‌నగర్, బీజాపూర్ మరియు
గోల్కొండ వారసులైన దక్కనీ సుల్తానేట్‌లు అలాగే హైదరాబాద్ నిజాంలోని వివిధ ముస్లిం
పాలక వంశాలు మరియు మైసూర్ సుల్తానేట్ ఆఫ్
హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ కూడా ఉన్నాయి.. ఈ కోర్సు, 24 సెషన్‌లలో కవర్
చేయబడింది మరియు జూమ్‌లో నిర్వహించబడుతుంది, ఇది ప్రపంచవ్యాప్తంగా పాల్గొనేవారిని ఆకర్షిస్తుంది.
సయ్యద్ ఉబైదుర్ రెహమాన్, దక్షిణ
భారత ముస్లిం చరిత్రపై మరో నెల (8 సెషన్) కోర్సును కూడా నడుపుతున్నారు. దక్షిణ భారత ముస్లింల
చరిత్రను చరిత్రకారులు మరియు ముస్లిం సమాజం పూర్తిగా విస్మరించారు.డెక్కన్ మరియు
దక్షిణ భారతదేశంలో బహమనీ సుల్తానేట్ దాదాపు రెండు వందల సంవత్సరాలు పాలించినారు. ఆ
తరువాత దక్కనీ ముస్లిం రాజ్యలు నిజాంలు, కర్ణాటక నవాబులు, మైసూర్
సుల్తానులతో సహా ముస్లిం రాజవంశాలు ఈ ప్రాంతాన్ని మరో 200 సంవత్సరాలు
పాలించాయి
సయ్యద్ ఉబైదుర్ రెహమాన్ భారతదేశం
యొక్క స్వాతంత్ర్య ఉద్యమం మరియు ముస్లిం పాత్ర గురించి వివరించే మరొక కోర్సును
ప్రవేశపెట్టారు. బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా 1857లో భారతదేశం యొక్క మొదటి స్వాతంత్ర్య
యుద్ధంలో ముస్లింలు నిర్వహించిన అత్యంత
ముఖ్యమైన పాత్రను కోర్సు కవర్ చేస్తుంది. భారతదేశం యొక్క మొదటి స్వాతంత్ర్య
యుద్ధంలో ముస్లింలు నాయకత్వ పాత్ర పోషించారు. ఇందులో మోప్లా తిరుగుబాటు, రేష్మీ రుమాల్
తెహ్రిక్, 1946 నాటి
నౌకాదళ తిరుగుబాటు మరియు అండమాన్ మరియు నికోబార్ సెల్యులార్ జైలు (కాలా పానీ)గా లో
ఖైదు చేయబడిన వేలాది మంది ముస్లిం ఖైదీలను గురించి కూడా కవర్ చేయబడినది.
సయ్యద్ ఉబైదుర్ రెహమాన్ ను ఇలాంటి కోర్సులను
ఎందుకు ప్రారంభించారు అని అడిగినప్పుడు, సయ్యద్ ఉబైదుర్
రెహమాన్ ఇలా అన్నారు, “దేశంలో
చరిత్ర తిరిగి వ్రాయబడుతోంది మరియు ముస్లిం కాలంతో వ్యవహరించే మధ్యయుగ చరిత్ర
నెమ్మదిగా పుస్తకాలలో నుండి తొలగించబడుతోంది. ఈలాంటి పరిస్థితులలో మన చరిత్ర మరియు
వారసత్వం మరియు మన గొప్ప గతం గురించి మన యువ తరానికి నేర్పించడం అత్యవసరం.
సయ్యద్ ఉబైదుర్ రెహమాన్ నిర్వహించే కోర్సులలో
ప్రఖ్యాత పండితులు, ప్రొఫెసర్లు, పర్షియన్ మరియు
చగటై భాషల నిపుణులు నమోదు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా
మరియు వెలుపల ఉన్న వ్యక్తులతో సయ్యద్ ఉబైదుర్ రెహమాన్ నిర్వహించే కోర్సులు భారీ
విజయాన్ని సాధించాయి..
కోర్సుల కోసం సంప్రదించండి.
సయ్యద్ ఉబైదుర్ రెహ్మాన్ phone
No.91-9818327757.
ఇమెయిల్: syedurahman@gmail.com.
X account: https://x.com/syedurahman
మూలం: source: ముస్లీం
మిర్రర్, ఆగస్ట్07, 2024
muslimmirror.com, August 07th, 2024
No comments:
Post a Comment